
పిడుగులు.. ఉరుములు
చెరువుకిందిపల్లె(వల్లూరు):
చెరువుకిందిపల్లెలో శుక్రవారం ఉదయం పిడుగు పడింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు గ్రామంలో ఉదయం ప్రారంభమైన వర్షం కొద్దిసేపటికి ఉరుములు, మెరుపులతో ఉద్ధృతంగా మారింది. ఆ సమయంలో గ్రామంలో పై భాగాన గల వీధిలో ఉన్న పుత్తా నారాయణరెడ్డి అనే వ్యక్తి నివాస గృహంపై పిడుగు పడింది. భవనం పైన గల పిట్ట గోడపై పడడంతో గోడ దెబ్బతినింది. ఈ ప్రభావంతో మంటలు రేగాయి. ఆ వీధిలో వున్న సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలో వున్న గృహాల్లోని టీవీలు, ఫ్రిజ్‌లు, ఫ్యాన్‌లు, మిక్సీలు పాడైపోయాయి.