
కొత్తగూడెంలో పిడుగు పాటుకు మృతి చెందిన పాడి గేదె
నగరంలోని రెండు వేర్వురు ప్రాంతాల్లో బుధవారం రాత్రి ఉరుములు మెరుపుతో కూడిన వర్షం ప్రభావంతో రెండు చోట్ల పిడుగులు పడ్డాయి.
గేదె మృతి, ధ్వంసం అయిన ఇంటిగోడ
ఖమ్మం అర్బన్: నగరంలోని రెండు వేర్వురు ప్రాంతాల్లో బుధవారం రాత్రి ఉరుములు మెరుపుతో కూడిన వర్షం ప్రభావంతో రెండు చోట్ల పిడుగులు పడ్డాయి. చైతన్యనగర్‌లో వెంకటేశ్వరరావు ఇంటిపై పిడుగుపడటంతో గోడకు రంధ్రం పడింది. ఇంట్లోని విద్యుత్ పరికాలు దగ్ధం అయినట్లు ఆయన తెలిపారు.తాము ఇంట్లోనే ఉన్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆ సమయంలో వచ్చిన మెరుపులతో భారీ శబ్ధం రావడంతో తమ ఇంటి సమీపంలోనే పిడుగు పడినట్లు భావించామన్నారు. గురువారం ఉదయం చూస్తే ఇంటి పైన గోడకు రంధ్రం పడి పగుళ్లు వచ్చాయన్నారు. ఆ ప్రాంతాన్ని కార్పొరేటర్ చావా నారాయణరావు పరిశీలించారు.
7వ డివిజన్‌లోని కొత్తగూడెంలో కె.హనుమంతురావుకు చెందిన ఇంట్లో పిడుగు పడింది.దాని ధాటికి రూ. 70 వేల విలువ చేసే పాడి గేదె అక్కడిక్కడే మృతి చెందినట్లు బాధిత రైతు తెలిపారు.