కరీంనగర్‌లో ఒకరి మృతి
ఆదిలాబాద్‌లో నలుగురికి తీవ్రగాయాలు
కరీంనగర్/ఆదిలాబాద్
ఉరుములు-మెరుపులతో తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం కురిసిన వాన రాష్ట్ర ప్రజలను వణికించింది. రాష్ట్ర వ్యాప్తంగా పిడుగు పాటుకు ప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్రగాయాలైయ్యాయి.
కరీంనగర్ జిల్లా లోని కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం కురిసిన వానలో ప్రశాంత్(23) అనే యువకుడు మృతి చెందాడు. తన పొలంలో పనిచేస్తుండగా అతనిపై పిడుగుపడింది. వేములవాడ మండలం చెక్కపల్లిలో ఎద్దు మృతి చెందింది. ఈదుగాలులతో కూడిన వర్షాలకు పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. బెజ్జంకి, తిమ్మాపూర్ మండలాల్లో వడగండ్ల వానకు భారీగా పంట నష్టం జరిగింది.
అలాగే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవల్లి మండలంలోని నర్సాపూర్ గ్రామంలో పిడుగుపాటుకు నలుగురుగు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి.
తెలంగాణలో పిడుగుల బీభత్సం
Published Tue, May 3 2016 5:16 PM | Last Updated on Sun, Sep 3 2017 11:20 PM
Advertisement
Advertisement