లక్నో: ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గాలివానలు, పిడుగుపాటుతో రాష్ట్రవ్యాప్తంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కాన్పూర్ బిల్హార్ ప్రాంతంలో ఇద్దరు మృతి చెందారు. మావు జిల్లాలో ఒకరు మరణించారు. వారణాసిలోని శివపురి ప్రాంతంలో చెట్టు కూలి మీద పడడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రామగావ్ లో మట్టి ఇల్లు కూలిపోవడంతో మహిళ దుర్మరణం పాలయింది.
అజాంఘడ్ లోని అసండీహ్ గ్రామంలో పాఠశాల గేటు కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఫరుఖహాబాద్ లో పిడుగుపాటుకు నలుగురు చనిపోయారు. మాధురాలో ఒకరు కరెంట్ షాక్ కు గురై మృత్యువాత పడ్డారు. వచ్చ 48 గంటల్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
యూపీలో వర్షాలకు 12 మంది మృతి
Published Mon, May 30 2016 11:00 AM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM
Advertisement
Advertisement