- మృతుల్లో బీటెక్ విద్యార్థి
- మరో ఐదుగురికి గాయాలు
మంచిర్యాల/నిర్మల్: పిడుగుపాటుకు శనివారం మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఒకరు బీటెక్ విద్యార్థి ఉన్నాడు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం లింగాల గ్రామానికి చెందిన కూలీలు చౌదరి చంద్రయ్య, చిడం బాపు, చౌదరి శంకర్, ఎల్కరి శంకర్, జిల్లెడ గ్రామానికి చెందిన గౌతూరి మదునయ్య శనివారం పెద్దచెరువు పనుల్లో కూలీలుగా వెళ్లారు. సాయంత్రం భారీ వర్షానికి వారంతా సమీపంలోని చెట్టు కిందికి వెళ్లారు. పిడుగుపడడంతో చౌదరి చంద్రయ్య(45), చిడం బాపు(65) అక్కడికక్కడే మరణించారు. చంద్రయ్య సోదరుడు చౌదరి శంకర్, ఎల్కరి శంకర్, గౌతూరి మదునయ్య పిడుగుపాటుకు కోమాలోకి వెళ్లారు. వీరిని బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
వీరి పరిస్థితి విషమంగా ఉంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం బెజ్జాలకి చెందిన బీటెక్ విద్యార్థి దర్శనాల రాజు శనివారం స్నేహి తులు సెగ్గం కృష్ణ, వేముల రాజశేఖర్‌లతో కలసి గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. పిడుగు పడడంతో రాజు (25) అక్కడికక్కడే చనిపోయాడు. కృష్ణ, రాజశేఖర్‌లు తీవ్రంగా గాయపడడంతో మంచి ర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండ లంలోని దార్‌కుభీర్ గ్రామంలో మేకల కాపరి సిందే దిగంబర్(35), ముథోల్ మండల కేంద్రంలోని ధన్గర్‌గల్లికి చెందిన పెద్దకర్రోల్ల శీను ఉరఫ్ చింటు(18) పిడుగుపాటుకు మృతిచెందారు.
పిడుగుపాటుకు ఐదుగురు మృతి
Published Sun, Jun 4 2017 3:16 AM | Last Updated on Thu, Apr 4 2019 5:24 PM
Advertisement