
బోగోలు ఘటనా స్థలం
సాక్షి, ఏలూరు: జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. చింతలపూడి నియోజకవర్గం లింగంపాలెం మండలం బోగోలులో పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతి చెందారు. జామాయిల్ తోటలో పనికి వచ్చారు ఆ కూలీలంతా.
ఈ క్రమంలో.. సుమారు 30 మంది కూలీలు.. అక్కడే టెంట్లు వేసుకుని ఉంటున్నారు. జామాయిల్ కర్రలు తొలగిస్తుండగా పిడుగుపడడంతో.. నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను 108లో ఏలూరు ప్రభుత్వాస్ప్రతికి తరలించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
క్లిక్: గుడ్ న్యూస్.. కాకినాడ సెజ్ భూములు.. రైతులకు రీ రిజిస్ట్రేషన్
Comments
Please login to add a commentAdd a comment