ప్రేమోన్మాది చేతిలో యువతి దారుణ హత్య.. | Andhra Pradesh: Young Woman Brutally Murdered By Her Lover In Eluru | Sakshi
Sakshi News home page

ప్రేమోన్మాది చేతిలో యువతి దారుణ హత్య..

May 31 2024 8:16 AM | Updated on May 31 2024 5:41 PM

A Young Woman Was Brutally Murdered By A Lover Eluru Crime News

ఏలూరు: ప్రేమోన్మాది చేతిలో యువతి దా­రు­ణ హత్యకు గురైంది. ఆమెకు నిశ్చితార్థం కావ­డంతో ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్న యువ­కు­డే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆమె పనిచేస్తున్న కాలేజీకి సమీపంలోనే అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హతమార్చాడు. ఆపై తనూ గొంతు కోసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసు­లు యువకుడిని ఏలూరు సర్వజనాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విజయ­వాడకు తీసుకెళ్లారు. వివరాలివీ..

సర్టిఫికెట్ల కోసమని వచ్చి..
ఏలూరు ఎంఆర్‌సీ కాలనీకి చెందిన జక్కుల రత్న­గ్రేస్‌ (22) సత్రంపాడులోని ఆదిత్య డిగ్రీ కాలేజీ­లో బీఎస్సీ పూర్తిచేసింది. అక్కడే జూని­యర్‌ లెక్చరర్‌గా పనిచేస్తోంది. ముసు­నూరుకు చెందిన తొట్టిబోయిన ఏసురత్నం (23) కొంత­కాలంగా ఆమెను ప్రేమిస్తున్నా­నంటూ వెంటబడుతున్నట్లు సమాచారం. గురువారం మ.12.30 గంటల సమ­యంలో ఏసురత్నం తన డిగ్రీ సర్టిఫికెట్లు తెచ్చుకు­నేందుకు ఏలూరు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వచ్చినట్లు తెలిసింది. రత్నగ్రేస్‌ తను పనిచేస్తున్న కాలే­జీ సమీపంలోకి రాగానే.. ఆమెతో మాట్లాడేందుకు వచ్చానంటూ చెప్పి పక్కనే ఉన్న సందులోకి ఏసురత్నం ఆమెను తీసుకెళ్లాడు.

పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తేవడంతో ఆమె నిరాకరించింది. ఇద్దరం చనిపోదామని చెబుతూ కత్తి తీసి కోసుకో­వాలన్నాడు. కానీ, ఆమె వద్దని వారించడంతో  ఆమెపై కత్తితో దాడిచేశాడు. ఆమె జుట్టు పట్టుకుని గొంత వద్ద ఇష్టారాజ్యంగా పొడిచాడు. దీంతో ఆమె తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పడిపోయింది. అక్కడికక్కడే విగత జీవిగా మారిన రత్నగ్రేస్‌ను చూస్తూ నిందితుడు కూడా పీక కోసుకున్నాడు. రక్తపు మడుగులో ఆమె పక్కనే పడిపోయాడు.

ఏలూరు త్రీటౌన్‌ సీఐ కె. శ్రీనివాసరావు, ఎస్‌ఐ రామారావు çఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాలతో ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితు­డు విజయవాడలో వెంటిలేటర్‌పై ఉన్న­ట్లు సమా­చారం. యువతికి ఈ నెల 26న వివాహ నిశ్చితా­ర్థం జరిగినట్లు తెలిసింది. ఆమె పనిచే­స్తున్న విద్యాసంస్థలో తనతో పాటు ఫ్యాకల్టీగా పనిచేసే వ్యక్తితో వివాహం నిర్ణయించారని సమాచారం.

ఎన్నిసార్లు వారించినా.. 
నిందితుడు ఏసురత్నం గతంలో తన కుమార్తెను ప్రేమ పేరుతో వేధించేవాడని.. తన కుమార్తెను వేధించవద్దని ఆమె తండ్రి పలుమార్లు హెచ్చరించాడు. అయినా అతను లెక్కచేయకుండా తనను పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడి వేధించేవాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రత్నగ్రేస్, ఏసురత్నం ఇద్దరూ డిగ్రీలో కలిసి చదువుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవల ఆమెకు నిశ్చితార్థం కావడంతో నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని యువతి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరో 17 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉందని.. ఇంతలో తమ కుమార్తె హత్య­కు గురికావటంతో వారు భోరున విలపిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు ఘటన వివరాలు సేకరిస్తున్నట్లు ఏలూరు త్రీటౌన్‌ ఇన్‌చార్జి సీఐ శ్రీనివాసరావు చెప్పారు.

మా బిడ్డను అన్యాయంగా చంపేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement