పిడుగుపాటుకు ఐదుగురు మృతి | Five people dead with lightning | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు ఐదుగురు మృతి

Published Mon, May 15 2017 1:25 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Five people dead with lightning

రాయదుర్గం:  పిడుగుపాటు అయిదుగురు  బడుగుజీవులు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం గుమ్మఘట్ట మండలం కలుగోడులో ఆదివారం జరిగింది.గ్రామానికి చెందిన గొల్లపల్లి ఓబన్న (40), జయణ్ణ (55), కరీం(32)  గొర్రెలు మేపడానికి పొలంలోకి వెళ్లారు. రైతు శివప్ప (25) పొలంలో పని చేసేందుకు వెళ్లాడు.

ఇక గిరిరెడ్డి (32) రాళ్ల కోసం చెరువులోకి వెళ్లాడు. మరో నలుగురు పొలం పనుల్లో ఉన్నారు. సాయంత్రం  వేళ వర్షం రావడంతో వారంతా అక్కడే వేపచెట్టు వద్దనున్న రేకుల షెడ్డులోకి వెళ్లారు. ఆ సమయంలో పిడుగు పడడంతో  అయిదుగురు మృతి చెందారు. నలుగురు  గాయపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement