క్వీన్స్‌ల్యాండ్: అనుకోని విధంగా అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాల్లో చాలా మటుకు బయటపడటం కష్టం. ఒకవేళ బయటపడితే చాలా అదృష్టవంతులుగా భావింస్తాం జౌనా. అచ్చం అలాంటి భయంకరమైన ప్రమాదం ఆస్ట్రేలియాలో సంభవించింది. వివరాల్లోకెళ్లితే ఆస్ట్రేలియాకు చెందిన టాలిన్ రోస్ అనే బాలుడు తన తండ్రితో కలిసి కారులో సమీపంలోని తన పాఠశాలకు వస్తాడు.
(చదవండి: కోవిడ్ పేరు చెప్పి రుణం తీసుకున్నాడు...కటకటాల పాలయ్యాడు)
ఆ తర్వాత కారు దిగి నెమ్మదిగా తన పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తాడు. అంతే ఒక్కసారిగి ఆ యువకుడి పిడుగుపాటుకి గురవుతాడు. ఈ మేరకు శక్తివంతమైన మెరుపు ఒక మెటల్ స్తంభం నుండి ఆ యువకుడి శరీరంలోకి చొచ్చుకుపోయి కాల్చి అతని చేతి గుండా బయటకు వస్తుంది. దీంతో ఆ యువకుడు పాఠశాల వెలుపల నేలపైకి విసిరిపడతాడు. అంతేకాదు అతని కండరాలు బిగుసుకుపోయి, పూర్తిగా మొద్దుబారిపోతాయి.
అయితే అదృష్టవశాత్తు అతని తండ్రి కారులోంచి ఆ దృశ్యాన్ని చూసి వెంటనే అప్రమత్తమై అంబులెన్స్‌కి సమాచారం ఇస్తాడు. కానీ టాలిన్ మాత్రం షాక్‌కి గురై ఏమి వినలేని స్థితిలో ఉండిపోతాడు. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకుంటూ షాక్ నుంచి బయటకు వచ్చినప్పటికీ ఆసుపత్రికి తరలిస్తారు.
ఈ మేరకు డాక్టర్లు టాలిన్ ధరించిన రబ్బరు ష్యూస్ ఆ శక్తివంతమైన విద్యుదావేశాన్ని శోషించుకోవటంతో సులభంగా బయటపడగలిగాడని చెప్పారు. పిడుగుపాటు జరిగినపుడు ఇలా సజీవంగా ఉండటం జరగదని టాలిన్ చాలా అదృష్టవంతుడంటూ ఆస్ట్రేయిన్ న్యూస్ ఏజెన్సీ డైలీమెయిల్ పేర్కొంది. అంతేకాదు ఆ మెరుపు దాడి చేసినప్పుడు ఏర్పడిన కాలిన మచ్చలు పాదాలపై భుజాలపై ఉన్నాయి.
(చదవండి: 'గ్రీన్ పవర్ 'పేరుతో ఓలా, మహేంద్ర కంపెనీల్లో మొత్తం మహిళా బృందాలే)
Comments
Please login to add a commentAdd a comment