ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో శుక్రవారం పిడుగుపాటుకు గురై ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో శుక్రవారం పిడుగుపాటుకు గురై ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. అనంతారం గ్రామానికి చెందిన లక్ష్మయ్య పత్తిచేనులో విత్తనాలు నాటుతుండగా.. పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
మండలంలోని తనికెళ్ల గ్రామానికి చెందిన నాగరాజు(28) గొర్రెలు మేపుతుండగా.. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో గొర్రెల మందను తోలుకొని చెట్టు కిందకు పరుగుతీశాడు. ఆ సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో.. నాగారాజు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో 10 గొర్రెలు కూడా మృత్యువాత పడ్డాయి.