lakshmaiah
-
ఒక చారిత్రక ప్రణాళిక
మానవ జాతి చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టం – ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’ వెలువడటం. ప్రపంచ నడకను ఈ సిద్ధాంతం సమూలంగా మార్చివేసింది. మానవ పురోభివృద్ధికి సరికొత్త దారులు వేసింది. ‘ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో’ మొట్టమొదటగా వచ్చిన జర్మన్ భాషా ప్రచురణకు ఈ సంవత్సరం ఫిబ్రవరి 24న 175 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సిద్ధాంత స్ఫూర్తితోనే రష్యా, చైనా విప్లవాలు మొదలుకొని ఎన్నో ప్రజాస్వామ్య విధానాలు అమలులోకి వచ్చాయి. భారత దేశంలో కూడా నేడు మనం అనుభవిస్తున్న జీవితాలు, అమలు జరుగుతున్న విధానాలు ఎన్నో కమ్యూనిస్టు భావజాల ప్రభావం నుంచి వచ్చాయంటే అతిశయోక్తి కాదు. దోపిడీ, అణచివేత ఉన్నంత వరకూ కమ్యూనిస్టు ప్రణాళిక సజీవ సిద్ధాంతంగానే ఉంటుంది. ‘‘చెల్లాచెదురుగా ఉండే ప్రజలను, ఉత్పత్తి సాధనాలను, ఆస్తులను బూర్జువా వర్గం నిర్మూలిస్తున్నది. దీని ఫలితంగా రాజకీయ కేంద్రీకరణ ఏర్పడుతున్నది. బూర్జువా వర్గం తన గుత్తాధిపత్యాన్ని పెంచుకుంటున్నది. వివిధ ప్రయోజనాలను కలిగిన ప్రాంతాలను, స్వంత శాసనాలను, ప్రభుత్వాలను, పన్నులను కలిగి ఉన్న రాష్ట్రాలను తన ఆధిపత్యంలో ఒకే శాసనం, ఒకే జాతీయత, ఒకే భూ సరిహద్దు, ఒకే పన్నుల వ్యవస్థను రూపొందించి ఒకే జాతి ముద్దగా చేస్తు న్నది.’’ 1848 ఫిబ్రవరి 24న ప్రకటించిన ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో పేర్కొన్న విషయమిది. అంతర్జాతీయ కార్మిక సమాఖ్య అయిన కమ్యూనిస్టు లీగు సంస్థ కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికా రచన బాధ్యతను తమకు అప్పగించిందని ఈ ప్రణాళిక రచయితలు ఫ్రెడరిక్ ఎంగెల్స్, కారల్ మార్క్స్ 1872 నాటి ప్రచురణకు రాసిన ముందుమాటలో పేర్కొన్నారు. మొదట ఈ ప్రణాళిక జర్మన్ భాషలో రాశారు. ఆ తర్వాత రచయిత మిస్ హెలెన్ మెక్ఫర్లేన్ జర్మన్ నుంచి ఇంగ్లిష్‌లోకి అనువదించారు (మేనిఫెస్టో ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ). ఇది 1850లో రెడ్ రిపబ్లికన్ పత్రికలో లండన్‌లో అచ్చయ్యింది. 1848 లోనే ఫ్రెంచిలో ఫ్రెంచి విప్లవానికి కొన్ని నెలల ముందు పారిస్‌లో అచ్చ యింది. రష్యా, డేనిష్, పోలిష్ భాషలన్నింటిలోకీ కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక అనువాదమైంది. మొదటిగా వచ్చిన జర్మన్ ప్రచురణకు ఈ సంవత్సరం ఫిబ్రవరి 24న 175 ఏళ్ళు పూర్తయ్యాయి. కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక ప్రభావం, పరిణామాల గురించి చెప్పాలంటే ఎన్ని పేజీలైనా సరిపోవు. ఇది మానవ జాతి చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టంగా, ప్రపంచ మార్గాన్ని నిర్దేశించిన సిద్ధాంత గ్రంథంగా నిలిచిపోయింది. అప్పటి వరకు ఉన్న ప్రపంచ నడకను ఈ సిద్ధాంతం సమూలంగా మార్చివేసింది. మానవ పురోభి వృద్ధికి సరికొత్త దారులు వేసింది. అది కేవలం విప్లవ పోరాటాల జయకేతనం మాత్రమే కాదు, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక రంగాలను సంపూర్ణంగా మలుపు తిప్పింది. ఈ రచన సాగించే నాటికి కారల్ మార్క్స్ వయసు 29 ఏళ్ళు, ఫ్రెడరిక్ ఎంగెల్స్కు 27 ఏళ్ళు మాత్రమే. ఇద్దరు నవ యువకులుగా ఉన్న సమయంలోనే పెట్టు బడిదారీ వ్యవస్థ పునాదులను పెకిలించే నవ సమాజ నిర్మాణానికి పునాదులు వేసే అద్భుతమైన సిద్ధాంత గ్రంథాన్ని ప్రపంచానికి అందించారు. కారల్ మార్క్స్ అప్పటికే తొమ్మిదికి పైగా సిద్ధాంత గ్రంథాలను రాశారు. 1841లో ‘ద డిఫరెన్స్ బిట్వీన్ డెమొక్రిటియన్ అండ్ ఎపిక్యురన్ ఫిలాసఫీ ఆఫ్ నేచర్’ పేరుతో మొదలైన మార్క్స్ రచన, పరిశోధనల ప్రయాణం 1848కి వచ్చేసరికి కమ్యూనిస్టు పార్టీ ప్రణా ళికను అందించింది. మార్క్స్ రచనలలో మరొక విశేషమైన రచన ‘దాస్ కాపిటల్’ మొదటిభాగం 1867లో వచ్చింది. మార్క్స్ తన జీవితం అంతా కార్మిక వర్గ ప్రయోజనాల కోసం మాత్రమే ఆలోచించినట్టు మనకు తెలుస్తున్నది. కమ్యూనిస్టు ప్రణాళిక ఒక రాజకీయ డాక్యుమెంటుగా కనిపించవచ్చు. కానీ అందులో తాత్విక సంవాదం ఎక్కువగా కనిపిస్తుంది. భూస్వామ్య సమాజంపై పెట్టుబడిదారీ విధానం విజయం సాధించి, సమాజంపై తన దుర్మార్గమైన దోపిడీ పంజాను విసురుతున్న తీరును కళ్ళకు కట్టినట్టుగా ఈ ప్రణాళిక చూపిస్తున్నది. దాదాపు డెబ్భై పేజీల రచనలో నాలుగు భాగాలు న్నాయి. మొదటి భాగం: బూర్జువాలు– కార్మికులు. రెండవ భాగం: కార్మికులు – కమ్యూనిస్టులు. మూడవ భాగం: సామ్యవాద – కమ్యూ నిస్టు సాహిత్యం. నాలుగవ భాగంలో వివిధ ప్రతిపక్ష పార్టీల పట్ల కమ్యూనిస్టుల వైఖరి ఉంటాయి. ఇందులో మొదటి భాగం ముఖ్యమైనది. బూర్జువాలు– కార్మికులు అధ్యాయంలో ఆ రోజున్న సామాజిక స్వరూపాన్ని, పెట్టు బడిదారీ వ్యవస్థ దుర్మార్గాన్ని సంక్షిప్తంగా ప్రపంచం ముందుంచారు. ఈ రోజు మనం చూస్తున్న కార్పొరేట్ వ్యవస్థ దారుణమైన చర్యలను అత్యంత సూక్ష్మంగా వివరించారు. మొదటి పేరాలో పేర్కొన్న అంశం ఈ రోజు మనం చూస్తున్న ఆర్థిక, రాజకీయ వ్యవస్థకు అద్దం పడుతున్నది. ‘‘ఆధునిక రాజ్యంలో ప్రభుత్వం బూర్జువా వర్గపు వ్యవహారాలను నిర్వహించే ఒక యంత్రాంగంగా, అంగంగా మారిపోయింది’’ అని పేర్కొన్నారు. ఇటీవల మన దేశపు కార్పొరేట్ కంపెనీలకు ప్రస్తుత ప్రభుత్వం ఒక సబార్డినేట్‌గా పనిచేస్తున్నదన డంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా, ‘‘గతంలో ప్రజల భక్తి, గౌరవాలకు పాత్రమైన వృత్తులన్నింటినీ బూర్జువా వర్గం దిగజార్చింది. వైద్యులు, న్యాయవాదులు, కవులు, శాస్త్రవేత్తలను తన కింద పనిచేసే కూలివాళ్ళుగా మార్చి వేసింది’’ అంటూ చేసిన వ్యాఖ్య మన కళ్ళ ముందు అత్యంత స్పష్టంగా అనుభవంలోకి వచ్చింది. ‘‘యంత్రాలు విస్తృతంగా ఉపయోగంలోకి రావడం వల్ల కార్మికుల శ్రమలో వ్యక్తిగత ప్రత్యేకత పూర్తిగా అంతరించింది. కార్మికుడికి ప్రాధాన్యత కరువైంది. కార్మికుడు యంత్రానికి తోకగా మారిపోయాడు. అతనికి ఉండవలసింది చాకచక్యం మాత్రమే. గానుగెద్దులాంటి యంత్రంలో తానో యంత్రంగా మారి పోయాడు’’ అంటూ చేసిన వివరణ ఈరోజు అత్యంత వాస్తవ దృశ్యంగా మనకు దర్శనమిస్తోంది. అది కార్మికుడికి కేవలం పొట్టపోసుకోవడానికి కావాల్సిన వసతులను మాత్రమే ఏర్పాటు చేస్తుందనీ, యంత్రాల వాడకమూ, శ్రమ విభజనా పెరిగే కొద్దీ కార్మికుడు తన ఉనికిని కోల్పోతాడనీ కమ్యూనిస్టు ప్రణాళిక ఆనాడే హెచ్చరించింది. దిగువ మధ్య తరగతివాళ్లు, చిన్న చిన్న వ్యాపారస్తులు, దుకాణదారులు, చేతి పనివాళ్ళు, రైతులు క్రమంగా తమ ఉపాధిని కోల్పోతారనీ, పెట్టుబడిదార్లతో పోటీ పడ లేక దివాళా తీస్తారనీ కూడా కారల్ మార్క్స్, ఎంగెల్స్ ఆనాడే ప్రకటించారు. ఇప్పుడు ఇది మరింత తీవ్రమైంది. దాదాపు అన్ని రంగాల్లో ఒకరిద్దరు పెట్టుబడిదార్లు మాత్రమే తమ గుత్తాధిపత్యాన్ని చలా యిస్తున్నారు. ఇది అప్పటికన్నా ఇప్పుడు మరింతగా అసమానతలను తీవ్రతరం చేస్తున్నది. కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ పరిస్థితులను వివరించి మాత్రమే ఊరుకోలేదు. ఆనాటి బూర్జువా దోపిడీని స్పష్టంగా విశ్లేషించి, దానికి పోరాటాలు మాత్రమే పరిష్కారంగా చూపారు. సంఘర్షణ, పోరాటాలు లేకుండా సమాజం ప్రగతిని సాధించలేదని ప్రకటించారు. ఇందులోనే కార్మికవర్గం నాయకత్వాన్ని ప్రతిపాదించిన వర్గపోరాటాల చరిత్రను ఉదహరించారు. కార్మిక వర్గానికి ఒక సందే శాన్ని కూడా ఈ ప్రణాళికలోనే అందించారు. ‘పోరాడితే పోయేది లేదు, బానిస సంకెళ్ళు తప్ప’, ‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి’ నినాదాలను ప్రపంచానికి ఆయుధాలుగా అందించారు. కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ అందించిన సిద్ధాంత స్ఫూర్తితో ప్రపంచంలో ఎన్నో గొప్ప మార్పులు వచ్చాయి. రష్యా, చైనా విప్లవాలు మొదలుకొని ఎన్నో ప్రజాస్వామ్య విధానాలు అమలులోకి వచ్చాయి. భారత దేశంలో కూడా ఈనాడు మనం అనుభవిస్తున్న జీవితాలు, అమలు జరుగుతున్న విధానాలు ఎన్నో కమ్యూనిస్టు భావజాల ప్రభావం నుంచి వచ్చాయంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో దోపిడీ, అణచివేత, అసమానత, వివక్షతలు ఉన్నంత వరకూ కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక సజీవ సిద్ధాంతంగానే ఉంటుంది. ఇది అక్షర సత్యం. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
కరుడుకట్టిన మిలిషియా కమాండర్ అరెస్టు
సాక్షి, కాకినాడ: తూర్పు మన్యంలో కరుడుకట్టిన మిలిషియా దళ కమాండర్ ముచ్చిక లక్ష్మయ్యను గురువారం తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. శబరి దళంలో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లక్ష్మయ్య.. నాలుగు హత్య కేసులతో పాటు 20 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. చింతూరు మండలానికి చెందిన 24 ఏళ్ల లక్ష్యయ్య నాలుగేళ్లుగా మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. మరో వైపు కొవ్వాసి దేవమ్మ అనే మావోయిస్టు దళ సభ్యురాలు జిల్లా పోలీసులకు లొంగిపోయింది. జిల్లా సరిహద్దులోని చత్తీస్ఘడ్ సుకుమా జిల్లాలో దేవమ్మ మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. -
గ్రూప్–2లో ‘డా.లక్ష్మయ్య’ విద్యార్థుల సత్తా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రూప్–2 ప్రిలిమినరీ పరీక్షలో తమ స్టడీ సర్కిల్‌కు చెందిన 415 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ పి.పద్మజారాణి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో తమ స్టడీ సర్కిల్ సహకారంతో విద్యార్థులను ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేసి, వారికి ఉచితంగా శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. వారిలో కూడా దాదాపు వెయ్యి మంది మెయిన్స్‌కు అర్హత సాధించారని, వీరందరికీ హైదరాబాద్‌లో మెయిన్స్‌కు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను సంస్థ చైర్మన్ డాక్టర్ లక్ష్మయ్య సన్మానించినట్లు తెలిపారు. -
గురజాడ పురస్కారానికి లక్ష్మయ్య
సిద్దిపేట రూరల్: గురజాడ ఫౌండేషన్ (అమెరికా) ఆధ్వర్యంలో రాష్ట్ట్రస్థాయి తెలుగు పురస్కారం-2016కు చిన్నకోడూరు మండలం గుర్రాలగొంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న తెలుగు ఉపాధ్యాయులు వరుకోలు లక్ష్మయ్య అవార్డుకు ఎంపికయ్యారు. తెలుగు సాహిత్యంలో రచయితగా, పద్యాలు రాయడంలో కవిగా తెలుగు భాషకు విషేశ కృషి గుర్తింపు లభించింది. 2016 జూన్ తెలం‘గానం’లో పద్యాలు వ్రాసి వినిపించినందుకు మామిడి హరికృష్ణ చేతుల మీదుగా సన్మానంతో పాటు శ్రీకాళహస్తిలో జాతీయ తెలుగు సమ్మెళనంలో ఆగస్టులో పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ చేతుల మీదుగా సన్మానం పొందారు. కాగా, గురజాడ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు సంటి అనిల్‌కుమార్ చేతుల మీదుగా ఈ నెల 18న హైదారాబాద్ ప్రెస్‌క్లబ్‌లో అందుకోనున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతుల మృతి
రామాయంపేట శివారులో రామాయంపేట - సిద్ధిపేట రహదారిపై గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు రైతులను ఓ లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బైరం లక్ష్మయ్య(55), గావు లింగం(60) అనే ఇద్దరు రైతులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా..మార్గమధ్యంలో మృతిచెందారు. -
భర్తకు అంత్యక్రియలు నిర్వహించిన భార్య
కుమారులు లేకపోవడంతో భర్త అంత్యక్రియలను భార్య నిర్వహించిన సంఘటన మెదక్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. పెద్దశంకరంపేటకు చెందిన కుమ్మరి లక్ష్మయ్య (65) మాజీ వార్డు సభ్యుడు, గుండెపోటుతో ఆదివారం రాత్రి మృతిచెందాడు. దీంతో భార్య లింగమ్మ భర్తకు అంత్యక్రియలను నిర్వహించింది. లక్ష్మయ్యకు ఐదుగురు కుమార్తెలున్నారు. వీరిలో నలుగురికి వివాహం జరిపించాడు. మరో కూతురు వివాహం చేయాల్సి ఉంది. -
పిడుగుపాటుకు ఇద్దరి మృతి
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో శుక్రవారం పిడుగుపాటుకు గురై ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. అనంతారం గ్రామానికి చెందిన లక్ష్మయ్య పత్తిచేనులో విత్తనాలు నాటుతుండగా.. పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మండలంలోని తనికెళ్ల గ్రామానికి చెందిన నాగరాజు(28) గొర్రెలు మేపుతుండగా.. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో గొర్రెల మందను తోలుకొని చెట్టు కిందకు పరుగుతీశాడు. ఆ సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో.. నాగారాజు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో 10 గొర్రెలు కూడా మృత్యువాత పడ్డాయి. -
విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి
మెదక్ జిల్లా కోహిర్ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు. గ్రామం శివారులో ఓ వ్యక్తి పొలంలో మోటార్ చెడిపోయింది. దాన్ని బాగు చేసే క్రమంలో రాములు (30), మంగలి లక్ష్మయ్య (25) బొరుబావి నుంచి పైపులను పైకి తీస్తున్నారు. ఆ పైపులు పైనుంచి వెళుతున్న విద్యుత్ తీగలను తాకడంతో విద్యుత్ ప్రసారమై షాక్‌తో మృతి చెందారు. -
ఇంజక్షన్ వికటించి వృద్ధుడు మృతి
నల్గొండ : నల్గొండ జిల్లా హాలియాలో ఒక ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్ వికటించి వృద్ధుడు మృతి చెందాడు. హాలియా మండలం కొత్తపల్లెకు చెందిన లక్ష్మయ్య (60) కాలిలో మేకు గుచ్చుకుని.... గాయం తీవ్రమైంది. దీంతో వైద్యం కోసం అతడు 15 రోజుల క్రితం హాలియాలోని ఆర్ఎంపీ వైద్యుడు సూర్యనారాయణ వద్దకు వెళ్లాడు. నయం చేస్తానని చెప్పి రూ 25 వేలు తీసుకుని.. లక్ష్మయ్యను ఆస్పత్రిలో ఉంచి వైద్యం చేస్తున్నాడు. ఆ క్రమంలో శుక్రవారం రాత్రి 10 గంటలకు లక్ష్మయ్యకు సూర్యనారాయణ ఇంజక్షన్ ఇచ్చాడు. 11.00 గంటలకే లక్ష్మయ్య మృతి చెందాడు. సూర్యనారాయణ ఇచ్చిన ఇంజక్షన్ వికటించడం వల్లే లక్ష్మయ్య మృతి అతడి బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఆందోళనకు దిగారు. ఆ విషయం తెలిసి ఆర్ఎంపీ వైద్యుడు సూర్యనారాయణ పరారయ్యాడు. బంధువుల ఆందోళన శనివారం కూడా కొనసాగుతుంది. అయితే పట్టణానికి చెందిన పెద్దమనుషుల ద్వారా లక్ష్మయ్య బంధువులతో రాజీ ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అందుకు స్థానికంగా పెద్ద మనుషులు ఇప్పటికే రంగంలోకి దిగినట్లు తెలిసింది. -
గిరిజనుడి హత్య
గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌లైన్ : భూతగాదాలు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. సొంత పెదనాన్ననే ఓ యువకుడు బండరాయితో మోది దారుణంగా హతమార్చాడు. గుమ్మలక్ష్మీపురం మండలంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటికే చీకటిపడడంతో ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎల్విన్‌పేట పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వనకాబడి పంచాయతీ వండిడి గిరిజన గ్రామానికి చెందిన నిమ్మక లక్ష్మయ్య (50) అదే గ్రామానికి చెందిన తన తమ్ముడు(సీతయ్య) కొడుకు నిమ్మక పరశురాంతో కలసి దేరువాడ గ్రామంలోని చర్చిలో ప్రార్థనకు వెళ్లాడు. ప్రార్థన ముగిసిన అనంతరం సాయంత్రం ఐదు గంటల సమయంలో స్వగ్రామానికి ఇద్దరూ కాలినడకన బయల్దేరారు. దేరువాడ, వనకాబడిగ్రామాలకు మధ్య గల గెడ్డ వద్దకు చేరుకోగానే.. పరశురాం పెద్ద రాయిని తీసుకుని లక్ష్మయ్య ముఖంపై బలంగా మోదాడు. దీంతో లక్ష్మయ్య కుప్పకూలిపోయూడు. మళ్లీ అదే రాయితో లక్ష్మయ్య తలపైన, ముఖంపైన తీవ్రంగా గాయపరిచాడు. దీంతో సంఘటన స్థలంలోనే లక్ష్మయ్య ప్రాణాలు వదిలాడు. మృతదేహాన్ని అక్కడ నుంచి గెడ్డలో పడేయడానికి పరశురాం ప్రయత్నిస్తుండగా.. అదే సమయంలో అటుగా వెళ్తున్న వండిడి గ్రామానికి చెందిన మండంగి శంకరరావు చూశాడు. దీంతో మృతదేహాన్ని పరశురాం అక్కడే వదిలి వెళ్లిపోయూడు. శంకరరావు సమాచారంతో మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని భోరుమన్నారు. భూతగాదాలే కారణమా? లక్ష్మయ్య హత్యకు భూ తగాదాలే కారణమై ఉండొచ్చని ఎల్విన్‌పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్ అనుమానం వ్యక్తం చేశారు. తండ్రి వారసత్వంగా లక్ష్మయ్య, సీతయ్యలకు రెండున్నర ఎకరాల భూమి వచ్చింది. ఇందులో లక్ష్మయ్య ఎకరంన్నర, సీతయ్య ఎకరా భూమి సాగు చేస్తున్నారు. తనకంటే ఎక్కువ భూమి ఉందన్న అక్కసుతో సీతయ్య తన అన్నతో తరచూ గొడవలు పడుతుండేవాడని స్థానికులు చెబుతున్నారు. సుమారు ఏడాదికాలంగా ఇదే విషయమై ఇరు కుటుంబాల మ ద్య గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే బంధుత్వాన్ని మరచి, సొంత పెదనాన్ననే పరశురాం హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమా నం వ్యక్తం చేస్తున్నారు. ఎల్విన్‌పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్, ఎస్సై గోపి ఘటనా స్థలికి సోమవారం చేరుకుని పరిశీలించారు. హత్యకు ఉపయోగించిన రారుుని స్వాధీనంచేసుకున్నారు. అనంతరం గ్రామం లో ఉన్న నిందితుడు పరశురాంను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డెంగ్యూతో డిగ్రీ విద్యార్థి మృతి
కొల్చారం, న్యూస్‌లైన్: డెంగ్యూ వ్యాధితో డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థి మృత్యువాత పడిన సంఘటన కొల్చారం మండలం సంగాయిపేటలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. లక్ష్మయ్య, పూలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు బీ రవి (20) జోగి పేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు. వారం రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో రవికి మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయి ంచారు. అయినా పరిస్థితి మెరుగు పడకపోవడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డెంగ్యూ వ్యాధి సోకిందని వైద్యులు నిర్ధారించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడం వల్లే దోమలు వృద్ధి చెంది మా కుమారుడిని పొట్టన పెట్టుకున్నాయని బాధిత కుటుంబం బోరున విలపించింది. అధికారులు మరో కుటుంబానికి కడుపుకోత కలగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. స్పందించి తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
హమ్మ.. లక్ష్మయ్యా!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 29 ఏళ్లు ఓ వ్యక్తి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు చేసినా ఉన్నతాధికారులు గుర్తించకపోవడం ఆశ్చర్యమే. ఏడాది తేడాతో పదవీ విరమణ పొందిన ఆయన.. మొదటి ఉద్యోగానికి సంబంధించిన పింఛన్ కూడా తీసుకుంటున్నాడు. రెండో ఉద్యోగానికి సంబంధించిన పింఛన్ కోసం అకౌంటెంట్ జనరల్‌కు ప్రపోజల్ పంపగా మంజూరు చేసేశారు. సంబంధిత మొత్తం జిల్లా ట్రెజరీ కార్యాలయానికి చేరుకోగా.. అనుమానం వచ్చిన అధికారులు విచారణ చేపట్టారు. ఎట్టకేలకు ఆయన బాగోతం బట్టబయలైంది. అధికార యంత్రాంగం కళ్లుగప్పిన లక్ష్మయ్య ఉదంతం గుట్టురట్టు చేసిన కర్నూలు ఉప ఖజానా అధికారి బాపనపల్లి వెంకటేశ్వర్లుకు ప్రభుత్వం నగదు రివార్డును ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు విఠల్‌నగర్‌కు చెందిన బి.లక్ష్మయ్య తన 19వ యేట.. అంటే 1971లో విద్యుత్‌శాఖలో వైర్మన్గా ఉద్యోగంలో చేరారు. సరిగ్గా పదేళ్ల తర్వాత మరో శాఖలో ఉద్యోగం పొందారు. 1981లో వ్యవసాయ విస్తరణాధికారికిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి రెండు ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తూ ఎంచక్కా ప్రభుత్వ సొమ్ము కాజేశారు. ఏడాది కాలంలో రెండు శాఖల్లో పదవీ విరమణ లక్ష్మయ్య 2010లో వైర్మన్గా, 2011లో వ్యవసాయ విస్తరణాధికారిగా పదవీ విరమణ చేశారు. మొదట ఉద్యోగానికి పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ రూ.1,67,824లు పొందారు. ఈ మొత్తాన్ని 2010 మార్చి 3న చెక్నంబర్ 947108 ద్వారా బ్యాంక్ నుంచి డ్రాచేసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రతి నెలా రూ.5,283 పింఛన్ పొందుతున్నారు. రెండో ఉద్యోగం పదవీ విరమణ అనంతరం పింఛన్ కోసం డిపార్ట్మెంటల్ అకౌంటెంట్ జనరల్‌కు ధరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం లక్ష్మయ్యకు ప్రభుత్వం నెలకు రూ.6,062 బేసిక్ మంజూరు చేసింది. దాన్ని జిల్లా ఉపఖజానా కార్యాలయానికి పంపారు. లక్ష్మయ్యపై అనుమానం వచ్చి ఉన్నతాధికారులు జిల్లా ఉపఖజానా అధికారి బాపనపల్లి వెంకటేశ్వర్లుకు విచారణ జరిపి నిజానిజాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎట్టకేలకు లక్ష్మయ్య రెండు ప్రభుత్వ శాఖలో విధులు నిర్వహిస్తూ యథేచ్ఛగా నెలనెలా వేతనం పొందుతున్నట్లు గుర్తించారు. ఆ మేరకు వెంకటేశ్వర్లు ఉన్నతాధికారులకు పూర్తి వివరాలతో నివేదిక అందజేశారు. మోసాన్ని బట్టబయలు చేసిన జిల్లా ఉపఖజానా అధికారికి ప్రభుత్వం రూ.20వేల నగదు అవార్డు ప్రకటించింది. ఇదిలాఉండగా లక్ష్మయ్య రెండు శాఖల్లో ఒకే సమయంలో విధులు ఎలా నిర్వహించారనేది మిస్టరీగా మారింది. వ్యవసాయ విస్తరణాధికారి ఎక్కువగా ఫీల్డ్‌లో తిరగాల్సి ఉంటుంది. ఇదే లక్ష్మయ్య వైర్మన్గా విధులు నిర్వర్తించేందుకు కలిసొచ్చినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఒక వ్యక్తి 29 సంవత్సరాలు అంటే 348 నెలలు రెండు ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్నా పై అధికారులు గుర్తించలేకపోవడం సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. -
‘ఉస్మానియా’ వాకిట్లో కళల సంబరం
ఉస్మానియా యూనివర్సిటీ కలర్ఫుల్గా మారింది. ఎటు చూసినా ఉత్సాహభరిత వాతావరణం కనిపించింది. వర్సిటీ అంతర్ కళాశాలల సాంస్కృతిక పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి.క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియం ఈ కళల సంబరానికి వేదికయింది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ పోటీలను ఓయూ స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ లక్ష్మయ్య ప్రారంభించారు.వర్సిటీలో ఉన్నత విద్యతో పాటు వివిధ కళల్లో కూడా విద్యార్థులు రాణించాలన్నారు. ఈ పోటీల్లో ఎంపికైన విద్యార్థులు అంతర్ విశ్వవిద్యాలయాల సాంస్కృతిక పోటీలకు అర్హత సాధిస్తారని ఆయన తెలిపారు.భరత నాట్యం, కూచిపూడి, జానపద, బంజార, ఆదివాసి నృత్యాల్ని విద్యార్థులు ప్రదర్శించారు.ముగ్గుల పోటీలు, పెయింటింగ్, స్పాట్ పెయింటింగ్, ఫొటోగ్రఫీ పోటీలు ఆడిటోరియం ఆవరణకు కొత్త అందాన్ని తెచ్చిపెట్టాయి. -
మన్నవరమా ? వాల్మీకిపురమా ?
సాక్షి, చిత్తూరు: ఇన్ఫరమేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్(ఐటీఐఆర్) ఏర్పాటుకు చిత్తూరు జి ల్లాలో స్థల పరిశీలనకు హైదరాబాద్ నుంచి గురువారం ఉన్నతస్థాయి కమిటీ రానుంది. ఈ కమిటీ సీఎం నియోజకవర్గంలోని వాల్మీకిపురం-కలికిరి మధ్యలో ఉన్న ఇండస్ట్రియల్ పార్కు స్థలాన్ని పరిశీలించనుంది. అలాగే మన్నవరం వద్ద ఏర్పేడు సమీపంలో స్థల పరిశీలన చేయనుంది. ఇందుకోసం ఐటీ శాఖ నుంచి ఇద్దరు ఉన్నతాధికారులు, కన్సల్టెన్సీ ఎక్స్పర్టు ఒకరు తిరుపతికి గురువారం చేరుకోనున్నారు. కాగా, ప్రభుత్వం రాష్ట్రంలో తిరుపతి, విశాఖ వంటి నగరాల్లో ఐటీఐఆర్ పెట్టుబడులను విస్తరింపచేసే దిశగా చర్యలు చేపట్టిన క్రమంలో ఇందుకు అనువైన ప్రాంతాలను అధికారులు వెతకడం ప్రారంభించారు. రాయలసీమలో చిత్తూరు జి ల్లాతో పాటు అనంతపురం లేపాక్షి హబ్ స్థలా న్ని కూడా పరిశీలించాలని ఐటీ మంత్రి పొన్నా ల లక్ష్మయ్య అధికారులకు సూచించారు. ఈ క్రమంలో సీఎం సొంత జిల్లా చిత్తూరుకే తొలి ప్రాధాన్యం ఇచ్చి స్థల పరిశీలన చేయనున్నారు. కాగా ఐటీఐఆర్ ఏర్పాటుకు 4వేల ఎకరాల స్థలం అవసరమవుతుంది. వాల్మీకిపురం వైపే చూపు.. ఐటీఐఆర్ జోన్ ఏర్పాటుకు సీఎం నియోజకవర్గం వాల్మీకిపురం-కలికిరి ఇండస్ట్రియల్ పార్కు స్థలం వైపే అధికారుల చూపు ఉంది. ఇక్కడ ఇప్పటికే 12,000 ఎకరాలను ఇండస్ట్రియల్ పార్కు కోసం ఏపీఐఐసీ స్థల సేకరణ చే సి ఉం ది. ఈ క్రమంలో ఐటీఐఆర్‌లో సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు, హార్డువేర్ ఉత్పత్తుల కంపెనీలు ఉంటాయి కనుక ఇండస్ట్రీ కిందే వస్తుందని, ఈ రీత్యా ఇందులో ఐటీఐఆర్ ఏర్పాటుకు అవసరమైన 4వేల ఎకరాలు తీసుకుంటే ఎలా ఉం టుందనేది పరిశీలించనున్నారు. అయితే ఇక్కడ భూ సేకరణకు తప్పిస్తే తాగునీటి వసతి, హైవే కనెక్టివిటీ, రవాణా సదుపాయలు అంతగా అందుబాటులో లేవు. కేవలం సీఎం నియోజకవర్గం అనే ఒక్క కారణం మినహా ఇక్కడ ఐటీఐఆర్ జోన్‌కు అవసరమైన అనుకూల అంశాలు తక్కువ. మన్నవరం వద్ద.. శ్రీకాళహస్తి మండలం మన్నవరం వద్ద స్థలపరిశీలనకు కూడా ఈ కమిటీ వెళ్లనుంది. వెంకటగిరి మార్గంలో భెల్ పరిశ్రమకు దగ్గరలో 4వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటు లో ఉంది. ఇక్కడ ఐటీఐఆర్ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుకూలతలు ఎక్కువగా ఉన్నా యి. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. తాగునీటి వసతికి కండలేరు నుంచి వచ్చే పైపు లైన్ ద్వారా మళ్లించేందుకు వీలు కలుగుతుంది. చెన్నై కలకత్తా నేషనల్ హైవేతో పాటు, పూతల పట్టు-నాయుడుపేట హైవేకి అనుసంధానంగా రోడ్డు ఉంది. రైలు మార్గంలో తిరుపతి నుంచి శ్రీకాళహస్తి నుంచి చేరుకోవచ్చు. భౌగోళికంగా నెల్లూరు, చిత్తూరు జిల్లా సరిహద్దుల మధ్య ఉంది. ఈ రీత్యా కూడా ఐటీఐఆర్జోన్ ఏర్పాటుకు మన్నవరం ప్రాంతం అనుకూలంగా ఉం టుందనేది పారిశ్రామిక వర్గాల అభిప్రాయం. ఈ నేపథ్యంలో సహజంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి వాల్మీకిపురం వైపు నిపుణుల కమిటీ మొగ్గుచూపుతుందా లేదా, భౌగోళిక, రవాణా అనుకూలతల వల్ల మన్నవరానికి ప్రాధాన్యత ఇస్తుందా? అనేది చూడాల్సి ఉంది. అదే సమయంలో అనంతపురం రాజకీయనాయకులు లాబీయింగ్ చేస్తే లేపాక్షి హబ్ స్థలానికి ఐటీఐఆర్ తరలిపోయినా ఆశ్చర్యపడక్కరలేదు. జిల్లాకు ఐటీఐఆర్ వస్తే మాత్రం వేలాదిమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. -
ఓపెన్ హౌస్‌తో చైతన్యం
=పోలీస్ సేవలను ప్రజలు గుర్తించాలి =రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి లక్ష్మయ్య = హన్మకొండలో ఆయుధాల ప్రదర్శనను పరిశీలించిన పొన్నాల హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : సంఘ విద్రోహ కార్యకలాపాలపై ప్రజలను చైతన్యపరిచే క్రమంలో ఓపెన్ హౌస్ వంటి కార్యక్రమాలు దోహదపడతాయని రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. హన్మకొండ పబ్లిక్‌గార్డెన్‌లోని టౌన్ హాల్లో జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్‌ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీసులు, ప్రజలకు మధ్య సత్సంబంధాలు ఉన్నట్లయితే శాంతి భద్రతలు పరిరక్షింపబడతాయన్నారు. ప్రజల క్షేమం కోసమే పోలీసులు పనిచేస్తున్నారని, వారి సేవలను గుర్తించాలన్నారు. విద్రోహుల కార్యకలాపాలను ఆధునిక పరిజ్ఞానంతో ఏ విధంగా ఎదుర్కొనవచ్చో ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రదర్శనలో వివరించడం అభినందనీయమన్నారు. డీఐజీ కాంతారావు, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.