కొల్చారం, న్యూస్‌లైన్: డెంగ్యూ వ్యాధితో డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థి మృత్యువాత పడిన సంఘటన కొల్చారం మండలం సంగాయిపేటలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. లక్ష్మయ్య, పూలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు బీ రవి (20) జోగి పేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు. వారం రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు.
దీంతో రవికి మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయి ంచారు. అయినా పరిస్థితి మెరుగు పడకపోవడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డెంగ్యూ వ్యాధి సోకిందని వైద్యులు నిర్ధారించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడం వల్లే దోమలు వృద్ధి చెంది మా కుమారుడిని పొట్టన పెట్టుకున్నాయని బాధిత కుటుంబం బోరున విలపించింది. అధికారులు మరో కుటుంబానికి కడుపుకోత కలగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. స్పందించి తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
డెంగ్యూతో డిగ్రీ విద్యార్థి మృతి
Published Sun, Feb 9 2014 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM
Advertisement
Advertisement