కుమారులు లేకపోవడంతో భర్త అంత్యక్రియలను భార్య నిర్వహించిన సంఘటన మెదక్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది.
కుమారులు లేకపోవడంతో భర్త అంత్యక్రియలను భార్య నిర్వహించిన సంఘటన మెదక్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. పెద్దశంకరంపేటకు చెందిన కుమ్మరి లక్ష్మయ్య (65) మాజీ వార్డు సభ్యుడు, గుండెపోటుతో ఆదివారం రాత్రి మృతిచెందాడు. దీంతో భార్య లింగమ్మ భర్తకు అంత్యక్రియలను నిర్వహించింది. లక్ష్మయ్యకు ఐదుగురు కుమార్తెలున్నారు. వీరిలో నలుగురికి వివాహం జరిపించాడు. మరో కూతురు వివాహం చేయాల్సి ఉంది.