డాడీ.. దూరం అవడమే బర్త్‌డే గిఫ్టా? | daughter doing funeral her father in medak district | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు నాడే తలకొరివి..

Published Sun, Feb 18 2018 10:40 AM | Last Updated on Tue, Oct 16 2018 3:15 PM

daughter doing funeral her father in medak district - Sakshi

తండ్రికి తలకొరివి పెడుతున్న తనయ హిమబిందు(ఇన్‌సెట్లో తండ్రి కుంట రమేష్)

సాక్షి, మెదక్‌: ‘బర్త్‌డేకు మంచి గిఫ్ట్‌ ఇస్తానన్నావు డాడీ. నువ్వు దూరం అవడమే నా బర్త్‌డే గిఫ్టా డాడీ.’ అంటూ ఓ తనయ కన్నీటిపర్యంతమైంది. ఈ సంఘటన శనివారం చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుంట రమేష్‌(42) పదిహేను రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో మృతిచెందాడు. రమేష్‌కు ఇద్దరు ఆడబిడ్డలు. 

ఇంటర్‌ చదువుతున్న పెద్ద కుమార్త హిమబిందు తండ్రికి తలకొరివి పెట్టింది. కాగా.. చికిత్స పొందుతున్న తన తండ్రి పుట్టినరోజున మంచి గిఫ్ట్‌ ఇస్తానని చెప్పిన మాటలు గుర్తుచేసుకొని హిమబిందు రోధిం చింది. కాగా, రమేష్‌ తండ్రి నారాయణ పదేళ్ల క్రితం మృతి చెందగా, సోదరుడు శేఖర్‌ మూడేళ్ల క్రితం మృతి చెందారు. అతనికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మగదిక్కు లేకపోవడంతో ఆ కుటుంబం దిక్కులేనిది అయ్యింది. 

కుటుంబం భారం రమేష్‌ తల్లి అనుసూయ(70)పై పడింది. శనివారం జరిగిన అంత్యక్రియలకు మెదక్‌ మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బట్టి జగపతి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఏకే గంగాధర్‌రావు, చిన్నశంకరంపేట మాజీ ఎంపీపీ అరుణ, మాజీ జెట్పీటీసీ రమణ, చేగుంట జెట్పీటీసీ పాండు, టీజేఏసీ జిల్లా చైర్మన్‌ సడిమెల యాదగిరి, ఎస్‌ఐ ప్రశాంత్, సర్పంచ్‌లు, నాయకులు హాజరయ్యారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement