![Massive Road Accident At Medak District](/styles/webp/s3/article_images/2024/11/2/Accident1.jpg.webp?itok=JBRhysuJ)
సాక్షి, మనోహరాబాద్: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు మృత్యువాతపడ్డారు.
వివరాల ప్రకారం.. మెదక్ జిల్లాలో శనివారం సాయంత్రం రోడ్డు ఘోర ప్రమాదం జరిగింది. మనోహరాబాద్ మండలం పోతారం వద్ద రోడ్డుపై స్థానిక రైతులు ధాన్యం ఆరబోశారు. ధాన్యం కుప్పలు ఉండడంతో రోడ్డుకు ఒకవైపు నుంచే వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్.. ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఆంజనేయులు, ఆయన మరదలు లత, ఆమె ఇద్దరు పిల్లలు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. దీంతో, వారి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment