ఉస్మానియా యూనివర్సిటీ కలర్‌ఫుల్‌గా మారింది. ఎటు చూసినా ఉత్సాహభరిత వాతావరణం కనిపించింది. వర్సిటీ అంతర్ కళాశాలల సాంస్కృతిక పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి.క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియం ఈ కళల సంబరానికి వేదికయింది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ పోటీలను ఓయూ స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ లక్ష్మయ్య ప్రారంభించారు.వర్సిటీలో ఉన్నత విద్యతో పాటు వివిధ కళల్లో కూడా విద్యార్థులు రాణించాలన్నారు. ఈ పోటీల్లో ఎంపికైన విద్యార్థులు అంతర్ విశ్వవిద్యాలయాల సాంస్కృతిక పోటీలకు అర్హత సాధిస్తారని ఆయన తెలిపారు.భరత నాట్యం, కూచిపూడి, జానపద, బంజార, ఆదివాసి నృత్యాల్ని విద్యార్థులు ప్రదర్శించారు.ముగ్గుల పోటీలు, పెయింటింగ్, స్పాట్ పెయింటింగ్, ఫొటోగ్రఫీ పోటీలు ఆడిటోరియం ఆవరణకు కొత్త అందాన్ని తెచ్చిపెట్టాయి.