=పోలీస్ సేవలను ప్రజలు గుర్తించాలి
=రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి లక్ష్మయ్య
= హన్మకొండలో ఆయుధాల ప్రదర్శనను పరిశీలించిన పొన్నాల
హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : సంఘ విద్రోహ కార్యకలాపాలపై ప్రజలను చైతన్యపరిచే క్రమంలో ఓపెన్ హౌస్ వంటి కార్యక్రమాలు దోహదపడతాయని రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. హన్మకొండ పబ్లిక్‌గార్డెన్‌లోని టౌన్ హాల్‌లో జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్‌ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీసులు, ప్రజలకు మధ్య సత్సంబంధాలు ఉన్నట్లయితే శాంతి భద్రతలు పరిరక్షింపబడతాయన్నారు.
ప్రజల క్షేమం కోసమే పోలీసులు పనిచేస్తున్నారని, వారి సేవలను గుర్తించాలన్నారు. విద్రోహుల కార్యకలాపాలను ఆధునిక పరిజ్ఞానంతో ఏ విధంగా ఎదుర్కొనవచ్చో ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రదర్శనలో వివరించడం అభినందనీయమన్నారు. డీఐజీ కాంతారావు, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.