open house
-
ఉత్తరాంధ్ర నుంచే వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం
సాక్షి, విశాఖపట్నం: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తారని వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. గురువారం ఎండాడలోని పార్టీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పార్టీ సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులతో సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. అనంతరం డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25న సుమారు 3 లక్షల మందితో భీమిలిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. భీమిలిలో జరిగే బహిరంగ సభ ద్వారా పార్టీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో 175/175 లక్ష్యంతో ఎన్నికల ప్రచారం సాగుతుందని స్పష్టం చేశారు. గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో ఇచి్చన హామీలను అధికారం చేపట్టిన తరువాత పూర్తిగా అమలుచేసి చూపించారన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని భీమిలి బహిరంగ సభ ద్వారా ప్రజలకు వివరిస్తారని పేర్కొన్నారు. బహిరంగ సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్దఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరుకానున్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 5 ప్రాంతీయ సమావేశాలు నిర్వహించి పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో సీఎం వైఎస్ జగన్ సమావేశమవుతారని చెప్పారు. పార్టీ క్యాడర్లో అసంతృప్తిని తొలగించడంతోపాటు ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులకు గల కారణాలను నేరుగా సీఎం వైఎస్ జగన్ వివరిస్తారన్నారు. విశాఖ రాజధాని కావడం తథ్యం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. విశాఖ పరిపాలన రాజధాని కావడం తథ్యమని, దివంగత సీఎం వైఎస్, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే విశాఖ నగరం, ఉత్తరాంధ్ర అభివృద్ధి బాట పట్టిందని కొనియాడారు. కాదని చేప్పే దమ్ము ఎవరికైనా ఉందా అని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భీమిలి బహిరంగ సభకు ముందు ఈ నెల 21 నుంచి 23 వరకు ఉత్తరాంధ్రలో నియోజకవర్గస్థాయి పార్టీ సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దళారులు, మధ్యవర్తులు లేకుండా నేరుగా ప్రజల బ్యాంక్ ఖాతాలకు నేరుగా నగదు జమ చేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని, దీనిని ప్రజలు చూస్తూ ఊరుకోరని, వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతారని అన్నారు. తమ సంకల్పం ఉత్తరాంధ్ర అభివృద్ధి అని స్పష్టం చేశారు. మీడియా అడిగిన ప్రశ్నలకు మంత్రి బొత్స సమాధానమిస్తూ.. రాజకీయాల్లో మార్పులు, చేర్పులు సహజమన్నారు. జూనియర్ ఎనీ్టఆర్ ఫ్లెక్సీలు ఎందుకు తీసేశారనేది టీడీపీ ఇష్టమని.. తమకు సంబంధం లేని అంశంపై తాను మాట్లాడనన్నారు. -
ఈ నెలలోనే మోదీ సభలు
సాక్షి, హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ సన్నద్ధమవుతోంది. ఈ నెలలోనే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో రెండు బహిరంగసభల్లో పాల్గొనేలో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉత్తర తెలంగాణలో ఒకటి, దక్షిణ తెలంగాణలో మరో సభకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంతి కిషన్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్‌బన్సల్, సహ ఇన్చార్జ్ అరవింద్ మీనన్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించారు. ఓటర్ల దగ్గరకు వెళ్లాలని, వారికి కేంద్ర ప్రభుత్వ విధానాలు, చేసిన, చేస్తున్న అభివృద్ధిపై వివరించాలని నిర్ణయించారు. ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పది కమిటీలతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని సునీల్ బన్సల్ ఆశాభావం వ్యక్తం చేశారు. పది కమిటీలు కేంద్ర నాయకత్వం సూచించిన విధంగా పనిచేస్తే, రాష్ట్రంలో పది లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకోవడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. నవ యువ ఓటర్ల కమిటీ, వికసిత్ భారత్ కమిటీ, శ్రీరామ మందిర్ దర్శన కమిటీ, లాభార్తి(లబ్ధిదారుల)అభియాన్ కమిటీ, మహిళ, స్వచ్ఛంద సంస్థల కమిటీ, గావ్ చలో, బస్తీ చలో తదితర కమిటీలతో సమావేశమయ్యారు. నేడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం.. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీలు డాక్టర్ లక్ష్మణ్, బండి సంజయ్, సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఆఫీసు బేరర్స్ పాల్గొంటారు. -
అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సీఎం జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి అన్ని వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేశారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకు అగ్రస్థానమిచ్చి, ఆ వర్గా లకు రాజకీయ, సామాజిక సాధికారత సాధించిన సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్రలో భాగంగా గురు వారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతి రహిత, పారదర్శకమైన సుపరిపాలన అందిస్తోందని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పాలన సాగించామని చెప్పారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదా రుల్లో వైఎస్సార్సీపీ వారితో పాటు అన్ని పార్టీల వారూ ఉన్నారని తెలిపారు. పేదలకు ఇస్తున్న స్థలం దేనికీ పనికిరాదని చంద్రబాబు విమర్శించారని, కానీ తామిచ్చిన స్థలమే పేదలకు పెద్ద ఆస్తి అయిందని వివరించారు. అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు ప్రజాధనాన్ని కొల్లగొట్టారన్నారు. 2024కి వైజాగ్ రాజధానిగా నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. ఉద్దానంలో ఎంతో మంది యాక్టర్లు తిరిగినా ఏమీ చేయలేదని, వైఎస్ జగన్ మాత్రమే కిడ్నీ వ్యాధి బాధితులకు అండగా నిలి చారని చెప్పారు. మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు బీసీలను అవమానించారని తెలిపారు. పేదలకు మేలు చేస్తే టీడీపీ ఓర్చుకోలేదని మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ మేనిఫెస్టోలో 98 శాతం హామీలను అమలు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని అన్నారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, పాలవలస విక్రాంత్, నర్తు రామారావు, కుంభా రవిబాబు, లేళ్ల అప్పిరెడ్డి, వరు దు కల్యాణి, ఎమ్మె ల్యేలు విశ్వాసరాయి కళావతి, గొర్లె కిరణ్‌కుమార్, రెడ్డి శాంతి, కంబాల జోగులు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ పాల్గొన్నారు. సామాజిక సాధికారతతోనే సంక్షేమం సాధ్యం శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): సామాజిక సాధికారతతోనే సంక్షేమం సాధ్యమవుతుందని సీఎం జగన్ నిరూపించారని వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు చెప్పారు. గురువారం నుంచి చేపట్టనున్న ‘సామాజిక సాధికారత’ బస్సు యాత్రను జిల్లా ఇన్చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర మంత్రులు, పార్టీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి తదితరులు శ్రీకాకుళంలో జెండా ఊపి ప్రారంభించారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా మరి కొన్ని హామీలు కూడా నెరవేర్చారని జిల్లా ఇన్చార్జి మంత్రి బొత్స చెప్పారు. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2019 నాటికి పేదరికం 12 శాతం ఉండేదని, ఇప్పుడు 6 శాతానికి తగ్గించామని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ బీసీల సాధికారతే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ ఐదుగురు బీసీ ఉప ముఖ్యమంత్రులు, 56 కార్పొరేషన్ చైర్మన్లను నియమించారని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్‌కు ప్రజల దీవెనలు ఉండాలని పాలకొండ ఎమ్మెల్యే వి.కళావతి అన్నారు. ఈ సమావేశంలో పార్టీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గొర్లె కిరణ్ కుమార్, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, వరుదు కల్యాణి, కుంభా రవిబాబు, తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి తదితరులు పాల్గొన్నారు. -
3 గంటలు కావాలా?.. 24 గంటలు కావాలా?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/రామన్నపేట/తుంగతుర్తి: ‘మీ ఇంటి ముందున్న అభివృద్ధిని చూడండి.. మీ కళ్ల ముందుండే అభ్యర్థిని చూసి బీఆర్ఎస్కు ఓటు వేయండి’ అని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. నకిరేకల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి లింగయ్యను గెలిపించి సీఎం కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎంను చేయాలన్నారు. నకిరేకల్ పట్టణంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. హరీశ్‌రావు మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సిగ్గులేకుండా 3 గంటల కరెంట్ చాలని మాట్లాడారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటే ఉంటుందని, బీఆర్ఎస్ వస్తే 24 గంటలు వస్తుందని, ఏది కావాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు. 3 గంటల కరెంటు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, 24 గంటల కరెంటు కావాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలన్నారు. కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌రెడ్డిలు పేర్లుకే పెద్దమనుషులు నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, వారు పేరుకే పెద్దమనుషులని హరీశ్ వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్లు పెద్దవే తప్ప వాళ్లు చేసే పనులు చిన్నవన్నారు. వారు జిల్లాను ఏనాడైనా పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వారి పాలనలో శవాన్ని కాల్చేసి స్నానం చేద్దామంటే కరెంట్ లేని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు. ఆనాడు ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ పార్టీయేనని, నకిరేకల్ అభివృద్ధి కొనసాగాలంటే ఎమ్మెల్యేగా లింగయ్యను గెలిపించాలని పిలుపునిచ్చారు. వంద రకాలుగా తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్ః జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రజల ముఖాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీదేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ‹Ùరెడ్డి అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ వంద రకాలుగా ద్రోహం చేస్తే. బీఆర్ఎస్ ప్రభుత్వం వంద మంచి పనులు చేసిందన్నారు. ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే మేనిఫెస్టో వస్తుంది ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే విధంగా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రాబోతుందని హరీశ్‌రావు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి 35 నియోజకవర్గాల్లో అభ్యర్థులు కరువయ్యారని, మనం పనికిరారంటూ పక్కన పెట్టిన వారిని పార్టీలో చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ వాంరటీ అయినా గ్యారంటీ అయినా కేసీఆరే తెలంగాణ వాంరటీ అయినా గ్యారంటీ అయినా కేసీఆరే అని మంత్రి హరీష్‌రావు అన్నారు. తుంగతుర్తి సభలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌తో కలిసి మాట్లాడారు. అసెంబ్లీ టిక్కెట్లను కాంగ్రెస్ పార్టీ రూ.15కోట్లకు అమ్ముకుంటోందని ఆరోపించారు. రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటారని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటల, నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలో, నకిరేకల్‌లో, సూ ర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్ శంకుస్థాపనలు ప్రారంబోత్సవాలు చేశారు. -
‘ఇండియా’ కూటమి బహిరంగ సభ వాయిదా
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అక్టోబర్‌లో నిర్వహించ తలపెట్టిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తొలి బహిరంగ సభ వాయిదా పడింది. మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ శనివారం ఈ విషయం ప్రకటించారు. బహిరంగ సభ ఎప్పుడు నిర్వహించాలన్నది ఇంకా నిర్ణయించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా చెప్పారు. భోపాల్‌లో ఉమ్మడిగా భారీ సభ నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని ఇండియా కూటమి పక్షాలు ఇటీవలే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. -
భోపాల్‌లో ‘ఇండియా’ మొట్టమొదటి ర్యాలీ
న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి తమ మొట్టమొదటి బహిరంగసభను వచ్చే నెలలో భోపాల్‌లో నిర్వహించనుంది. అదేవిధంగా, భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపిణీకి సంబంధించిన చర్చలను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించనుంది. ఇండియా కూటమి సమన్వయ కమిటీ మొదటి సమావేశం బుధవారం ఢిల్లీలో జరిగింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో జరిగిన ఈ భేటీకి కమిటీలోని 14 మంది సభ్యులకు గాను 12 మంది హాజరయ్యారు. సనాతనధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. కమిటీ సభ్యుడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అనంతరం మాట్లాడుతూ, విచారణకు రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయడంతో టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ భేటీకి రాలేదని చెప్పారు. హాజరైన వారిలో..ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్, జార్ఖండ్ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సోరెన్, సీపీఐ నేత డి.రాజా, ఎస్పీ నుంచి జావెద్ అలీ ఖాన్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, జేడీయూకు చెందిన సంజయ్ ఝా, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, శివసేన(యూబీటీ)కి చెందిన సంజయ్ రౌత్ ఉన్నారు. ‘సీట్ల పంపకాల ప్రక్రియను ప్రారంభించాలని సమన్వయ కమిటీ నిర్ణయించింది. భాగస్వామ్య పక్షాలు చర్చలు జరిపి సాధ్యమైనంత త్వరగా సీట్ల పంపణీని ఖరారు చేయాలి.. కూటమి ఉమ్మడి సమావేశాలను దేశవ్యాప్తంగా చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మొట్టమొదటి సభను అక్టోబర్ మొదటి వారంలో భోపాల్‌లో చేపట్టాలని అంగీకారానికి వచ్చారు. బీజేపీ పాలనలో పెరిగిన అవినీతి, నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం ప్రధాన ఎజెండాగా ఈ సభలు జరుగుతాయి’అని కమిటీ ఉమ్మడి ప్రకటనను వేణుగోపాల్ చదివి వినిపించారు. మహారాష్ట్ర, తమిళనాడు, బిహార్‌ల్లో సీట్ల పంపకం సులువుగా కనిపిస్తుండగా, పంజాబ్, ఢిల్లీ, పశి్చమబెంగాల్ల్లో మాత్రం భాగస్వామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. -
‘‘సీపీఎస్ రద్దు– ఓపీఎస్ అమలు’’ ఇదే మా నినాదం.. పోరాటం
సాక్షి, హైదరాబాద్: ‘కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేయాలి... పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలి. ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ జరగాలి. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలి’అంటూ తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) గొంతెత్తింది. 2004 తర్వాత రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో నియమితులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం టీఎస్సీపీఎస్ఈయూ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 54 సంఘాల ఉద్యోగులు మద్దతు తెలుపుతూ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు సైతం ఈ సభకు హాజరై సీపీఎస్ రద్దుకు గొంతు కలిపారు. 2 లక్షల కుటుంబాల చిరకాల వాంఛ ఇది ఈ సందర్భంగా టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మాట్లాడారు. ‘ఐదేళ్ల క్రితం సీపీఎస్ రద్దు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమా? రాష్ట్ర ప్రభుత్వమా? అని అడిగిన సందర్భాలున్నాయి. ఆ ప్రశ్నలకు ఇప్పుడు సరైన సమాధానం దొరికింది. సీపీఎస్ పథకాన్ని రద్దు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. అదేవిధంగా ఈ పథకం కింద జమ అయిన నిధులను వెనక్కు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని దాదాపు 2 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాల చిరకాల వాంఛ సీపీఎస్ రద్దు– ఓపీఎస్ అమలు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల హామీ మాదిరి కాకుండా ఎన్నికలకు ముందే సీపీఎస్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి. వెనువెంటనే ఓపీఎస్‌ను అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడే వారే. ప్రభుత్వం ఆదేశాలను తూచ తప్పకుండా అనుసరించి అమలు చేసేవారు కావడంతో ప్రభుత్వం ఏమాత్రం సంకోచించకుండా సీపీఎస్‌ను రద్దు చేయాలి’అని కోరారు. సీపీఎస్ ఉద్యోగుల ప్రధాన సమస్యలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దృష్టికి పోవడం లేదని, ఆయనకు సుదీర్ఘంగా వివరిస్తే తప్పకుండా పరిష్కారం లభిస్తుందన్నారు. అందుకోసమే రాష్ట్ర రాజధానిలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు వివరించారు. జిల్లాలను చుట్టి.. రాజధానికి చేరి.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న సీపీఎస్ రద్దుపై విస్తృత అవగాహన కలి్పంచేందుకు టీఎస్సీపీఎస్ఈయూ జూలై 16 నుంచి 31వ తేదీ వరకు పాత పెన్షన్ సాధన సంకల్ప యాత్రను తలపెట్టింది. రాష్ట్రంలోని 33 జిల్లాల మీదుగా సాగిన ఈ యాత్ర ద్వారా ఉద్యోగులు, ఉపాధ్యాయులను చైతన్య పరిచి పాత పెన్షన్ ఆవశ్యకత, సీపీఎస్ రద్దుపై విపులంగా వివరించి అభిప్రాయ సేకరణ జరిపింది. పక్షం రోజుల పాటు సాగిన ఈ యాత్రలో వివిధ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని మద్దతు పలికారు. ఈ క్రమంలో ఈనెల 12న హైదరాబాద్‌లో సీపీఎస్ ఉద్యోగులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు స్థితప్రజ్ఞ ఇదివరకే ప్రకటించారు. ఇందులో భాగంగా శనివారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తలపెట్టిన భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరయ్యారు. పోటెత్తిన వివిధ రాష్ట్రాల నేతలు కార్యక్రమంలో నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్స్ స్కీం జాతీయ అధ్యక్షులు విజయకుమార్ బంధు, పంజాబ్ సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సుఖజిత్ సింగ్, కర్ణాటక సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శాంతారామ్, ప్రధాన కార్యదర్శి రంగనాథ్, ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ నాయకుడు పల్లెల రామాంజనేయులు, మహారాష్ట్ర నుంచి విటేష్ ఖండేల్కర్, ఝార్ఖండ్ నుంచి విక్రమ్ సింగ్, ఛత్తీస్‌గఢ్ నుంచి రాకేష్ సింగ్, తమిళనాడు నుంచి ఆరోగ్యదాస్, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్, తపస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుబ్బయ్య, సురేష్, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మధుసూదన్‌రెడ్డి, కటకం రమేశ్, ఎస్జీటీయూ రాష్ట్ర అధ్య క్షుడు మహిపాల్ రెడ్డి, టీఎస్‌టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ నాయక్, వెటర్నరీ ఫోరం అధ్యక్షుడు అభిషేక్ రెడ్డి, బ్లైండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అనిల్ పాల్గొన్నారు. ఇరువురు సీఎంలతో చర్చ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. తప్పకుండా ఇరువురు సీఎంలతో పాత పెన్షన్ పునరుద్ధరణపై చర్చిస్తాం. అదేవిధంగా జార్ఖండ్‌లో అమలు చేస్తున్న పాత పెన్షన్ స్టాండింగ్ ఆపరేటింగ్ గైడ్‌లైన్స్ వివరిస్తాం. –విక్రమ్ సింగ్, జార్ఖండ్ సీపీఎస్ యూనియన్ అధ్యక్షుడు మేమూ ఎదురుచూస్తున్నాం తెలంగాణలో సీపీఎస్ రద్దుకోసం మహారాష్ట్రలో సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. పాత పెన్షన్ కోసం పార్టీ పరమైన నిర్ణయాన్ని తీసుకుంటే మరింత స్పష్టత వస్తుంది. –విటేష్ ఖండేల్కర్, మహారాష్ట్ర సీపీఎస్ యూనియన్ అధ్యక్షుడు కేసీఆర్ దేశ్‌కీ నేతా అయ్యేందుకు ఇదే చాన్స్ తెలంగాణలోని రెండు లక్షల ఉద్యోగుల సీపీఎస్‌ను రద్దు చేస్తే దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా అనుకరిస్తాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ్‌కి నేతా అయ్యేందుకు ఇదే మంచి అవకాశం. – విజయ్‌కుమార్ బంధు, సీపీఎస్ జాతీయ అధ్యక్షుడు -
తెలంగాణలో అసెంబ్లీ రన్.. ‘160’ డేస్! బీజేపీ రోడ్ మ్యాప్ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. వచ్చే 160 రోజుల కార్యక్రమాలకు బీజేపీ జాతీయ నాయకత్వం రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. పోలింగ్ బూత్ స్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడం, ఎన్నికల సందర్భంగా ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనేలా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవడంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటినుంచి సెప్టెంబర్ చివరిదాకా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలతోపాటు కేంద్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ప్రచారం చేస్తూ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ నేతలకు సూచించింది. మే రెండో వారంలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 500 మంది ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని సూచించింది. ఇక ఎన్నికల మోడ్‌లోకి వచ్చేసినట్టేనని, ముందూ వెనకా చూడకుండా అంతా సమష్టిగా మెరుగైన సమన్వయంతో పార్టీ విజయానికి కృషి చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం జరిగిన రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ, ముఖ్యనేతల సమావేశంలో.. బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శులు, రాష్ట్ర ఇన్చార్జులు తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్, పార్టీ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, రాష్ట్రపార్టీ సహ ఇన్చార్జి అర్వింద్ మీనన్ దిశానిర్దేశం చేశారు. అమిత్‌షా సభను సక్సెస్ చేయాలి ఈ నెల 23న చేవెళ్లలో కేంద్రమంత్రి అమిత్‌షా బహిరంగ సభను విజయవంతం చేయాలని.. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకునే విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నిత్యం ప్రజల్లో ఉండే విధంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర, జిల్లా, మండల పార్టీ కమిటీల్లో ఖాళీగా ఉన్నస్థానాలను వెంటనే భర్తీ చేయాలని.. పార్టీ పదవుల్లో ఉండి కార్యక్రమాలు, ఆందోళనల్లో పాల్గొనని వారిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అర్వింద్, పార్టీనేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, పి.మురళీధర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఈటల రాజేందర్, ఏపీ జితేందర్‌రెడ్డి, విజయశాంతి, గరికపాటి మోహన్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు. పార్టీ నేతలు గురు, శుక్రవారాల్లోనూ సమావేశాలు నిర్వహించి, వివిధ అంశాలను సమీక్షించనున్నారు. కార్యక్రమాల తీరు ఇలా.. ♦ మోదీ నేతృత్వంలో ఎన్డీయే సర్కారు తొమ్మిదేళ్ల పాలన పూర్తిచేసుకుంటున్న సందర్భంగా మే 15 నుంచి జూన్ 15 వరకు ‘జన సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాలను నిర్వహిస్తారు. కేంద్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలను, వివిధ రంగాల్లో సాధించిన విజయాలను ప్రచారం చేస్తారు. ♦ జూన్, జూలై మాసాల్లో ‘సాలు దొర.. సెలవు దొర’ పేరుతో తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో అవినీతి, అక్రమాలు, స్కామ్‌లు, వివిధ రంగాల సమస్యలు, ప్రజల ఇబ్బందులపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. ♦ ఆగస్టు, సెప్టెంబర్లలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, యువత, విద్యార్థులు, రైతులు, కూలీలు తదితర వర్గాలను స్వయంగా కలుసుకుని.. బీజేపీ అధికారంలోకి వస్తే వారికి జరిగే ప్రయోజనాలను వివరిస్తారు. తాగేందుకు నీళ్లే లేవు.. అభివృద్ధి ఎక్కడ?: సంజయ్ బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తరుణ్‌చుగ్, బండి సంజయ్‌ల సమక్షంలో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎంలకు చెందిన నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. తాగడానికి మంచి నీళ్లు అందించలేని సీఎం కేసీఆర్.. అభివృద్ధి గురించి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ‘‘మంచి నీళ్లు అందక జనం అల్లాడుతున్నారు. ఎండలో కిలోమీటర్లు నడిచి వెళ్లి వ్యవసాయ బోర్ల వద్ద నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. దీనిని బట్టి మిషన్ భగీరథ ఎంత పెద్ద స్కామో తెలిసిపోతుంది..’’ అని వ్యాఖ్యానించారు. -
విజయవాడ : ఆయుధం.. అదరహో (ఫొటోలు)
-
రాజ్‌భవన్‌లో దీపావళి సంబురాలు రేపు
సాక్షి, హైదరాబాద్: దీపావళి పర్వదినం సందర్భంగా ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్ దర్బార్ హాల్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె సామాన్య ప్రజానీకంతో పాటు వివిధ రంగాల ప్రముఖులను కలుసుకుని దీపావళి పండుగను జరుపుకోనున్నారు. ఇదీ చదవండి: మునుగోడులో పోస్టర్ వార్ -
కువైట్‌లో ఓపెన్ హౌజ్
కువైట్‌లో నివసిస్తున్న భారతీయ ఇంజనీర్లు, నర్సుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబరు 22న ఓపెన్ హౌజ్‌ను కువైట్‌లో ఇండియన్ ఎంబసీ నిర్వహించింది కోవిడ్ సంక్షోభం తర్వాత కువైట్‌లో చోటు చేసుకున్న మార్పులు.. అక్కడ భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానంగా ఈ ఓపెన్ హౌజ్ కార్యక్రమం జరిగింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలైంది. గల్ఫ్ దేశాల్లో ఇంటి సహాయకులుగా పని చేస్తున్న వారి హక్కులు, జీత భత్యాలు అక్కడ వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలను తెలియజేస్తూ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇటీవల పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చింది. గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ఇంటి పని చేసే వారు జీవించేందుకు అనువైన అనేక అంశాలను ఈ పుస్తకంలో పొందు పరిచారు. -
జులై 29న దోహాలో ఓపెన్ హౌజ్
దోహా: ఖతార్ లో ఇండియన్ ఎంబసీలో 2021 జులై 29న ఓపెన్ హౌజ్ నిర్వహించనున్నారు. ఖతార్ లో నివసిస్తున్న భారతీయుల కార్మిక (లేబర్), కాన్సులర్ (దౌత్య) సంబంధమైన అత్యవసర సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి ఈ సమావేశం వేదిక కానుంది. జులై 29 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దోహాలోని ఇండియన్ ఎంబసీ ఆవరణలో ఈ సమావేశం జరుగుతుంది. భారత దౌత్య అధికారులు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. వర్చువల్‌గా ఈ సమావేశానికి నేరుగా రాలేకపోయిన వారు జులై 29వ తేది మధ్యాహ్నం 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 00974 50411241 ఫోన్ ద్వారా అయినా ఎంబసీ అధికారులను సంప్రదించవచ్చు. అదే విధంగా సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఆన్ లైన్ జూమ్ మీటింగ్ లో పాల్గొనవచ్చు. మీటింగ్ ఐడీ ID: 830 1392 4063 పాస్‌కోడ్‌లను 121700 ఉపయోగించి జూమ్ సమావేశంలో జాయిన్ కావొచ్చు. వీటితో పాటు labour.doha@mea.gov.in కు మెయిల్ ద్వారా కూడా సమస్యలను విన్నవించుకోవచ్చు. -
భారత్ వెళ్లొచ్చాక ఆ భయం పోయింది!
సౌత్ కరోలినా: భారత్ పర్యటన తర్వాత భారీ బహిరంగ సభలంటే ఉన్న బెరుకు తనకు లేకుండాపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ ప్రజలు ఎంతగానో ప్రేమించే గొప్ప వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అంటూ ప్రశంసలు కురిపించారు. సౌత్కరోలినాలో జరిగిన ఒక ర్యాలీలో ఆయన భారత్‌లో పర్యటనను ప్రస్తావిస్తూ..‘భారీగా జనం హాజరయ్యే సభలంటే ఉన్న భయం భారత్‌కు వెళ్లొచ్చాక పోయింది. మన జనాభా 35 కోట్లు. నా సభలకు మహా అయితే 60 వేల మంది వస్తారేమో. కానీ, భారత్‌లో జరిగిన సభకు లక్ష మందికిపైగా హాజరయ్యారు. ఆ దేశ జనాభా 150 కోట్లు. నాకు మీపై ఎంత అభిమానమో అక్కడి వారన్నా అంతే. భారతీయులకు అమెరికా అన్నా ఎంతో ప్రేమ. ప్రధాని మోదీ గొప్ప నేత. ఆ దేశ పర్యటన నాకు ఎంతో విలువైంది’ అని వ్యాఖ్యానించారు. -
31న బహ్రెయిన్‌లో ఓపెన్ హౌస్
గల్ఫ్ డెస్క్: బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఈ నెల 31న ఓపెన్ హౌస్ నిర్వహించనున్నారు. సీఫ్‌లోనిఇండియన్ కాంప్లెక్స్‌లో ఉన్న రాయబార కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. బహ్రెయిన్‌లో ఉపాధి పొందుతున్న ప్రవాస భారతీయులు తమకు ఇమిగ్రేషన్‌కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకుని హాజరుకావాలని రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. -
ఇస్లాం గడ్డపై కేథలిక్ల బహిరంగ సభ
అబుధాబీ: ఇస్లాం గడ్డపై తొలిసారి పర్యటిస్తున్న క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ చారిత్రాత్మక కేథలిక్ల బహిరంగ సభలో పాల్గొన్నారు. మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధానిలోని జాయేద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో జరిగిన ఈ సభకు సుమారు 1.70 లక్షల మంది కేథలిక్‌లు హాజరయ్యారు. ఓపెన్ టాప్ వాహనంలో వాటికన్ జెండాలను ఎగురవేస్తూ పోప్ స్టేడియంలోకి ప్రవేశించారు. స్టేడియంలో సుమారు 50 వేల మంది కేథలిక్‌లు ఉండగా.. స్టేడియం బయట ఏర్పాటుచేసిన పెద్ద పెద్ద స్క్రీన్ల ద్వారా పోప్ ప్రసంగాన్ని మరో 1.20 లక్షల మంది వీక్షించారు. సుమారు 4 వేల మంది ముస్లింలకు కూడా సభకు సంబంధించిన టికెట్లను విక్రయించినట్లు స్థానిక చర్చి అధికారులు తెలిపారు. సభకు భారీగా హాజరైన వలస కార్మికులు, శరణార్థులను ఉద్దేశించి పోప్ ప్రసంగించారు. ‘ఇంటిని విడిచిపెట్టి ఇంత దూరంలో జీవనం కొనసాగించడం చాలా కష్టతరమైంది. మిమ్మల్ని ప్రేమించే వారి ఆప్యాయతలను మీరు కోల్పోతున్నారు. అలాగే భవిష్యత్‌కు సంబంధించిన అనిశ్చితి కూడా మీలో నెలకొని ఉంటుంది. కానీ భగవంతుడు చాలా నమ్మదగినవాడు. తనను నమ్ముకున్న వాళ్లను ఎన్నటికీ విడిచిపెట్టడు’ అని పోప్ వలస కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. యూఏ ఈలో భారత్, ఫిలిప్పీన్స్‌కు చెందిన కేథలిక్ వలస కార్మికులు అధిక శాతంలో ఉన్నారు. దేశంలో సుమారు 10 లక్షల మంది కేథలిక్‌లు నివసిస్తున్నారు. అంటే యూఏఈలో ప్రతీ 10 మందిలో ఒకరు కేథలిక్ కావడం గమనార్హం. -
పట్నాలో 3న కాంగ్రెస్ భారీ సభ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నిర్వహించిన విపక్ష కూటమి సభ విజయవంతమైన నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ ఇతర కలసి వచ్చే విపక్షాలతో కలిసి బిహార్‌లో ‘జన ఆకాంక్ష’ పేరుతో ఓ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 3న పట్నాలోని గాంధీ మైదాన్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ సభ జరగబోతోంది. ఇప్పటికే విపక్ష పార్టీల నేతలను కాంగ్రెస్ ఈ సభకు ఆహ్వానించింది. బిహార్‌లో ఇప్పటికే ఆర్జేడీ కాంగ్రెస్‌కు బలమైన మిత్రపక్షం. హిందుస్తాన్ ఆవామీ మోర్చాకూడా కాంగ్రెస్ మద్దతుదారే. ఈ నేపథ్యంలోనే పట్నాలో సభ నిర్వహణకు కాంగ్రెస్ నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీలు పొత్తు పెట్టుకుని కాంగ్రెస్‌ను పక్కనపెట్టిన విషయం తెలిసిందే. మరో కీలక రాష్ట్రమైన బిహార్‌లోనూ కాంగ్రెస్ కోరుకున్నన్ని సీట్లు లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. -
మేడ్చల్ సభకు సోనియా, రాహుల్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార వ్యూహాన్ని మార్చింది. ఈ నెల 23న మేడ్చల్‌లో నిర్వహించనున్న బహిరంగసభకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీతో పాటు ఆమె తనయుడు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కూడా రప్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు మేడ్చల్ బహిరంగ సభనుంచి రాహుల్, సోనియాలిద్దరూ తెలంగాణ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అదేసభలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌తో పాటు కూట మి భాగస్వామ్య పక్షాల నేతలు కోదండరాం (టీజేఎస్), ఎల్.రమణ (టీడీపీ), చాడ వెంకట్‌రెడ్డి (సీపీఐ)లు కూడా తమ సందేశాన్ని ఇవ్వనున్నారు. అటు సోనియా, రాహుల్ ద్వారా ఒకే సభ నుంచి ఎన్నికల వాగ్దానాలను ఇప్పించడంతో పాటు కూటమి నేతలను కూడా ఆహ్వానించి, తద్వారా కూటమిలోని పక్షాలన్నీ ఐక్యంగా ఉన్నాయని చెప్పడం, కూటమి ఏర్పాటు అనివార్యతను వివరించడమే లక్ష్యంగా మేడ్చల్ సభను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. -
సీఎం కార్యక్రమంలో రైతు ఆత్మహత్యాయత్నం
అహ్మదాబాద్: గుజరాత్ సీఎం విజయ్ రూపానీ బహిరంగ సభలో ఓ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.ఈ సంఘటన గిర్ సోమ్‌నాథ్ జిల్లా ప్రాన్స్లీ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. మశ్రీ భాయ్ దోడియా అనే రైతు తన పొలం వద్ద ఉన్న పంచాయతీ భూమిని ఎవరో ఆక్రమించుకున్నారని, దీన్ని తొలగించడంలో స్థానిక అధికారులు విఫలం చెందడంతో కలత చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని గిర్ సోమ్‌నాథ్ ఎస్పీ రాహుల్ త్రిపాఠి వెల్లడించారు. ‘ఆ రైతు పొలం వద్ద ఉన్న పంచాయతీ భూమిని ఎవరో ఆక్రమించుకున్నారు. ఆక్రమణను తొలగించాలని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ స్థానిక అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని తెలిపారు. దోడియాను వెంటనే వెరవల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు అతని పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. -
ఆ పాపం కాంగ్రెస్ నేతలదే!
షాద్‌నగర్: ఎడారిగా మారిన భూములను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపడితే కాంగ్రెస్ నేతలు అడుగడుగున అడ్డు తగులుతున్నారని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కోర్టు కేసులతో పాలమూరు పథకాన్ని అడ్డుకున్న పాపం కాంగ్రెస్ నాయకులదేనని ఆరోపించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో మంత్రి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. షాద్‌నగర్ శివారులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే అంజయ్య ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. నిజాం కాలంలోనే అప్పర్ కృష్ణా ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు కూడా సర్వే చేయించారని చెప్పారు. అనంతరం కాంగ్రెస్ పాలకుల నిర్వాకంతో అప్పర్ కృష్ణా ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆగిపోయాయన్నారు. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టు నిర్మాణాలకు అడ్డు తగులుతూనే ఉన్నారని విమర్శించారు. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు పూర్తయి ఉంటే పాలమూరు జిల్లా ఇప్పటికే సస్యశ్యామలమయ్యేదని, వలసలన్న మాటే ఉండేది కాదన్నారు. ఇటు కేసులు.. అటు ప్రశ్నలు రూ.35వేల కోట్లతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణ పనులు చేపడితే పాలమూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు పవన్‌కుమార్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డిలు ప్రాజెక్టును అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులేశారని కేటీఆర్ ఆరోపించారు. ఓ వైపు కోర్టుల్లో కేసులు వేస్తూనే మరో వైపు ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రశ్నిస్తున్నారని.. ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు నీతిమాలిన చర్యలకు పాల్పడుతున్నారని, వారికి అందులో డాక్టరేట్, పీహెచ్‌డీలు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పూర్తిగా వెనకబాటుకు గురైందని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయన్నారు. వెలుగుల ఘనత కేసీఆర్‌దే.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే తెలంగాణలో చీకట్లు తప్పవని నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హెచ్చరిం చారని, ఆయన మాటలు తప్పని సీఎం కేసీఆర్ పాలన రుజువు చేసిందని కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో 24 గంటలు వెలుగులు విరజిమ్ముతున్నాయన్నారు. కేసీఆర్ నిర్ణయాలు, అభి వృద్ధి కార్యక్రమాలను చూసి మిగతా రాష్ట్రాల వారు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఏపీ ప్రజలు అక్కడ టీఆర్ఎస్ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారన్నారు. బహిరంగ సభకు హాజరైన మహిళలు -
నేడు ఒమన్‌లో ఓపెన్ హౌస్
సాక్షి : ఒమన్ దేశ రాజధాని మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయంలో నేడు (శుక్రవారం) మధ్యాహ్నం 2.30 గంటలకు ఓపెన్ హౌస్ నిర్వహిస్తారు. ఆ దేశంలో నివసించే ఎన్నారైలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా ఇండియన్ ఎంబసీ అధికారులతో నేరుగా తమ సమస్యలను చర్చించే అవకాశం లభిస్తుంది. ఒమన్‌లో ఇబ్బందుల్లో ఉన్న భారతీయులు ఎంబసీ హెల్పలైన్ నెంబర్ +968 2469 5981 టోల్‌ఫ్రీ నంబర్ 8007 1234కు సంప్రదించవచ్చు. ఎంబసీ ఇ-మెయిల్ cw.muscat@mea.gov.in మరియు inde mbassy.muscar@mea.gov.in ఇండియన్ ఎంబసీ వెబ్సైట్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. -
ఎస్పీ కార్యాలయంలో ఓపెన్ హౌజ్
నల్లగొండ క్రైం : పోలీల్ అమరువీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఓపెన్ హౌజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుధాల పనితీరును సిబ్బంది విద్యార్థులకు వివరించారు. పోలీసులు ఉపయోగించే బాంబ్ డిస్పోజల్ టీమ్, క్లూస్‌టీమ్, పింగర్ప్రింట్స్, కమ్యూనికేషన్, బ్రీత్ఎనలైజర్, డాగ్‌స్క్వాడ్, కమ్యూనికేషన్ టీమ్, వివిధ రకాల వెపన్లను ప్రదర్శించారు. ఎస్పీ శ్రీనివాసరావు గన్పట్టి గురిచూశారు. గన్ను గురిపెట్టే విధానాన్ని, డాగ్‌స్క్వాడ్ పనితీరును విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. పోలీసులంటే సమాజంలో గౌరవం పెంచేలా పెండ్లీ పోలీస్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలవద్దకు తీసుకెళ్తున్నామని అన్నారు. దేశ భద్రత కోసం 500లకు పైగా పోలీసులు ప్రాణత్యాగం చేశారని, ఉమ్మడి జిల్లాలో 29 మంది అసువులుభాశారని.. తెలిపారు. అమరులైన పోలీసులను స్మరించుకోవాల్సిన అవసరం ప్రజలందరికీ ఉందన్నారు. కార్యక్రమంలో ఏఆర్ఓఎస్డీ శ్రీనివాసరావు, ఏఆర్డీఎస్పీ సురేష్‌కుమార్, ఆర్ఐ శ్రీనివాస్, హోంగార్డు ఆర్ఐ శ్రీనివాసులు, సీఐ ఆదిరెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రవాసీల కోసం 15న ఓమాన్ లో ఓపెన్ హౌజ్
♦ ప్రతినెల మూడవ శుక్రవారం మస్కట్ లో ప్రవాసి ప్రజావాణి ఓమాన్: సుల్తానేట్ ఆఫ్ ఓమాన్ దేశ రాజధాని మస్కట్ లోని భారత రాయబార కార్యాలయంలో ఈనెల 15న మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపెన్ హౌజ్ బహిరంగ సామాజిక సమావేశం జరగనుంది. ఓమాన్ దేశంలో నివసించే ప్రవాస భారతీయ భవననిర్మాణ కార్మికులు, ఇంటిపనిచేసే మహిళలు, ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు మంద భీంరెడ్డి ఒక ప్రకటనలో కోరారు. ప్రతినెల మూడవ శుక్రవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ఇండియన్ ఎంబసీ అధికారులతో నేరుగా తమ సమస్యలను చర్చించే అవకాశం లభిస్తుంది. ఓమాన్ లో ఇబ్బందుల్లో ఉన్న భారతీయులు ఎంబసీ 24 గంటల హెల్ప్ లైన్ నెంబర్ +968 2469 5981 లేదా మొబైల్ నెంబర్ +968 9276 9735 కు కాల్ చేయవచ్చు. వివిధ దేశాల్లో కష్టాల్లో చిక్కుకున్న వలసకార్మికుల పక్షాన భారత్ లోని వారి బంధువులు ఢిల్లీ లోని టోల్ ఫ్రీ నెంబర్ 1800-11-3090, హాట్ లైన్ నెంబర్ +91-11-4050 3090, మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ హెల్ప్ లైన్ నెంబర్ +91 93944 22622 కు గాని కాల్ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ వారు ఏపీ ఎన్నారై విభాగం నెంబర్ +91 97059 06976 కు, తెలంగాణ వారు టీ-ఎన్నారై విభాగం నెం. +91 94408 54433 కు కాల్ చేయవచ్చు. -
ప్లీనరీ ఏర్పాట్లలో గులాబీ దళం!
⇒ ఏర్పాట్లను సమీక్షించిన నేతలు ⇒ 8 వేల మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ⇒ జిల్లా పర్యటనల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు బిజీ ⇒ 75 లక్షల సభ్యత్వ నమోదు టార్గెట్పైనే నజర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో సంస్థాగత హడావుడి ప్రారంభ మైంది. ఈ నెల 21వ తేదీన హైదరాబాద్‌లో పార్టీ 16వ ప్లీనరీ, 27న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేప థ్యంలో ఆ పార్టీ నాయకత్వం ఇప్పటి నుంచే ప్లీనరీ, సభ ఏర్పాట్లలో తలమునకలైంది. ఈసారి ప్లీనరీ, సభలను వేర్వేరు చోట్ల జరపనుండటంతో వేర్వేరుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను ఆ జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పర్యవేక్షిస్తున్నారు. ప్లీనరీ హైదరా బాద్‌లోని కొంపల్లిలో జరగనుండటంతో పార్టీ నేతలు ఇప్పటికే రెండుసార్లు ఏర్పాట్లను పరిశీలించారు. సోమవారం కూడా పార్టీ ఎమ్మెల్యేలు వివేకానంద, మాధవరపు కృష్ణారావు, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, మైనంపల్లి హన్మంతరావు, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ సుమారు రెండు గంటలపాటు సమీక్షించారు. ప్లీనరీ సభ జరిగే స్థలం, భోజన శాల, పార్కింగ్ తదితర అంశాలపై చర్చించారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బసకు సంబంధించిన ఏర్పాట్లనూ పరిశీలించారు. పార్టీ మండల అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ఆపై స్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలనే ప్లీనరీకి ఆహ్వానిస్తున్నారు. వీరంతా కలిపి దాదాపు ఎనిమిది వేల మంది వరకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లా పర్యటనల్లో మంత్రులు రెండేళ్ల కిందటి కన్నా ఈసారి రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదు చేయించా లన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్టీ యంత్రాంగం జిల్లాల్లో మోహరించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లా పర్యటనల్లో మునిగిపోయారు. ఇదివరకు 50 లక్షల సభ్యత్వం పూర్తి చేసిన టీఆర్ఎస్.. ఈసారి కనీసం 75 లక్షల మంది సభ్యులను చేర్పించా లని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీంతో ఎమ్మె ల్యేలు తమ నియోజకవర్గాల్లో టార్గెట్లను పూర్తి చేసే పనిలో పడ్డారు. అన్ని జిల్లాల్లో సభ్యత్వ నమోదు సభలు మరోవైపు దాదాపు అన్ని జిల్లాల్లో పార్టీ బహి రంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. సభలను విజయవంతం చేసేందుకు మంత్రులు సొంత జిల్లాల్లోనే మకాం వేస్తున్నారు. వరంగల్‌లో నిర్వహించ తలపెట్టిన పార్టీ బహిరంగ సభను సక్సెస్ చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా సభ్యత్వ టార్గెట్లు పూర్తి చేయడం, ప్లీనరీ నాటికి ప్రతినిధులను తయారు చేయడం, బహిరంగ సభకు జనసమీకరణకు ప్లాన్ చేసుకోవడం తదితరాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు బిజీ అయ్యారు. -
వీసా సమస్యలపై ఓపెన్ హౌస్
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో 15 రోజులకు ఒకసారి.. వాషింగ్టన్: వీసా, పాస్‌పోర్ట్, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు సమస్యలను పరిష్కరించేందుకు వచ్చే జనవరి నుంచి ఓపెన్ హౌస్ నిర్వహించనున్నట్లు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ‘భారత రాయబార కార్యాలయంలో, ఐదు కాన్సులేట్లలో వచ్చే జనవరి మొదటి వారంలో ఓపెన్ హౌస్ నిర్వహిస్తున్నాం’అని అమెరికాలో భారత రాయబారి నవతేజ్ సర్ణ వెల్లడించారు. ఇండియన్- అమెరికన్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స ఆదివారం వాషింగ్టన్లో నవతేజ్ సర్ణను సత్కరించారుు. ఇప్పటివరకూ అమెరికాలో భారత ఉప రాయబారిగా వ్యవహరించిన తరణ్‌జిత్ సింగ్ సంధు శ్రీలంకలో భారత హైకమిషనర్‌గా వెళ్తున్న నేపథ్యంలో ఏర్పాటుచేసిన వీడ్కోలు కార్యక్రమంలో సర్ణ మాట్లాడారు. వీసా, పాస్‌పోర్ట్, ఓసీఐ కార్డులపై సమస్యలుంటే ఓపెన్‌హౌస్‌లో వెంటనే పరిష్కరిస్తామన్నారు. ప్రతి పదిహేను రోజులకోసారి ఓపెన్ హౌస్ నిర్వహిస్తామని.. హౌస్ నిర్వహించే తేదీ, సమయాన్ని వెబ్సైట్లో ఉంచుతామని చెప్పారు. ఇలాంటి ఏర్పాట్లే అమెరికాలో ఉన్న తమ అన్ని కాన్సులేట్లలో చేస్తామన్నారు. ప్రస్తుత వ్యవస్థలన్నీ బాలారిష్టాలు ఎదుర్కొంటున్నాయని.. అందువల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందన్నారు. కొన్నేళ్లలో ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంధు మాట్లాడుతూ భారత్, అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ పాత్ర ప్రశంసనీయమని అన్నారు. -
‘ఓపెన్’ అయ్యారు
వ్యవస్థలో కీలకాంశాలపై అవగాహన కల్పించిన పోలీసు అధికారులు ఆకట్టుకున్న పోలీస్ ఓపెన్ హౌస్ ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు l ఆశ్చర్యపరిచిన జాగిలాల విన్యాసాలు ∙పోలీసులు వాడే తుపాకీలను మన సినిమాల్లోనే చూస్తుంటాం. అయితే అవి ఎలా పనిచేస్తాయి? ఎంత దూరంలో ఉన్న లక్ష్యాన్ని గురి చూసికొట్టొచ్చు? తుపాకీల సామర్థ్యం ఎంత? వాటిలో రకాలెన్ని? ఏయే సమయాల్లో ఏయే తుపాకీలను వాడతారు? ∙వైర్లెస్ సెట్లను పోలీసు యంత్రాంగం ఎప్పుడు, ఎలా ఉపయోగిస్తుంది. పోలీసు సమాచార వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ∙పోలీసు జాగిలాలు దొంగలను ఎలా పసిగడతాయి. నేర పరిశోధనలో వీటి పాత్ర ఏంటి? వీటికి ఏ విధంగా ట్రైనప్ చేస్తారు? ∙క్లూస్ టీం విధులు? చోరీల గుట్టు ఎలా రట్టు చేస్తుంది? వేలిముద్ర సేకరణలో ఈ టీం ఎలా వ్యవహరిస్తుంది? ∙డ్రోన్ పరికరం విశిష్టత, అది ఎలా పనిచేస్తుంది? వినియోగం ఎలా? ఇలాంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేసేందుకు కాకినాడలోని జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్’ వేదికైంది. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఇక్కడ జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ‘పోలీసుల విధులు –బాధ్యతలు’పై విద్యార్థులతో ఓపెన్ హౌస్ నిర్వహించారు. వేల సంఖ్యలో విద్యార్థులు హాజరై.. పోలీసుల ఆయుధాలు, సమాచార వ్యవస్థ, పోలీసు జాగిలాలు గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. స్వయంగా తుపాకీలను చేతపట్టి ఫొటోలకు ఫోజులిచ్చారు. వీరికి ఎస్పీ రవిప్రకాష్‌తోపాటు, ఏస్పీ దామోదర్, ఏఆర్ డీఎస్పీ వాసన్, పలువురు సీఐలు, ఎస్సైలు విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. – కాకినాడ క్రైం డ్రోన్.. అదిరేన్.. ఓపెన్‌హౌస్‌లో నిఘా, భద్రత కోసం వినియోగించే డ్రోన్ పరికరం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ డ్రోన్ పరికరాన్ని పోలీసులు రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేయగానే ఒక్కసారిగా ఆకాశంలోకి రివ్వున ఎగిరి పెరేడ్ గ్రౌండ్ అంతా చక్కర్లు కొట్టడంతో విద్యార్థులు సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. డ్రోన్ పరికరంతో అనేక ఫలితాలు సాధించామని, గోదావరి, కృష్ణ పుష్కరాల్లో డ్రోన్ పరికరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి మంచి ఫలితాలు సాధించినట్టు ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో పోలీసులదే కీలకపాత్ర ‘ఓపెన్ హౌస్’లో ముందుగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులదే కీలకపాత్రని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ అన్నారు. దేశ భద్రత కోసం త్రివిధ దళాలు, బోర్డర్ సెక్యూరిటీ కోసం బీఎస్ఎఫ్, ఇండో, టిబెట్, సెక్యూరిటీ కోసం సీఐఎస్ఎఫ్ లాంటి అనేక విభాగాలు పనిచేస్తున్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా అంతర్గత భద్రత కోసం ఏడాదిలో సుమారు 700 నుంచి 1200 మంది వరకు పోలీసులు ప్రాణత్యాగాలు చేస్తున్నారని చెప్పారు. పోలీసుల సేవలను గుర్తు చేసుకుంటూ ఏటా అక్టోబర్ 21ను పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకొంటున్నామన్నారు. జిల్లాలో విద్యార్థులకు పోలీసుల విధులు–బాధ్యతలు, సమాజంలో పోలీసుల పాత్ర వంటి వాటిపై వక్తృత్వ, వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులు సోషల్ మీడియా, వాట్సప్ వంటి వాటి కోసం వెంపర్లాడ వద్దని సూచించారు.