నల్లగొండ క్రైం : పోలీల్ అమరువీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఓపెన్ హౌజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుధాల పనితీరును సిబ్బంది విద్యార్థులకు వివరించారు. పోలీసులు ఉపయోగించే బాంబ్ డిస్పోజల్ టీమ్, క్లూస్‌టీమ్, పింగర్‌ప్రింట్స్, కమ్యూనికేషన్, బ్రీత్‌ఎనలైజర్, డాగ్‌స్క్వాడ్, కమ్యూనికేషన్ టీమ్, వివిధ రకాల వెపన్లను ప్రదర్శించారు. ఎస్పీ శ్రీనివాసరావు గన్‌పట్టి గురిచూశారు. గన్‌ను గురిపెట్టే విధానాన్ని, డాగ్‌స్క్వాడ్ పనితీరును విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. పోలీసులంటే సమాజంలో గౌరవం పెంచేలా పెండ్లీ పోలీస్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలవద్దకు తీసుకెళ్తున్నామని అన్నారు. దేశ భద్రత కోసం 500లకు పైగా పోలీసులు ప్రాణత్యాగం చేశారని, ఉమ్మడి జిల్లాలో 29 మంది అసువులుభాశారని.. తెలిపారు. అమరులైన పోలీసులను స్మరించుకోవాల్సిన అవసరం ప్రజలందరికీ ఉందన్నారు. కార్యక్రమంలో ఏఆర్‌ఓఎస్డీ శ్రీనివాసరావు, ఏఆర్‌డీఎస్పీ సురేష్‌కుమార్, ఆర్‌ఐ శ్రీనివాస్, హోంగార్డు ఆర్‌ఐ శ్రీనివాసులు, సీఐ ఆదిరెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment