sp office
-
చాటుగా లేఖలు చదువుతూ..
కాకినాడ క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయం డిస్పాచ్ సెక్షన్‌లోని ఓ క్లర్క్ వ్యవహార శైలి వివాదాస్పదమైంది. కంచే చేను మేసిన చందంగా జి.శ్రీనివాస్ అనే క్లర్క్ వ్యవహరించాడు. డిస్పాచ్ సెక్షన్లో ఉంటూ వివిధ విభాగాలకు.. ముఖ్యంగా అధికారులకు వస్తున్న లేఖలను చాటుగా ఎన్వలప్‌లు తెరచి చదువుతూండటం అధికారులను, సిబ్బందిని విస్మయానికి గురి చేసింది. ఆ లేఖల ఫొటోలు తన సెల్ఫోన్లో తీసుకొని, మళ్లీ వాటిని అతికించి, ఏమీ ఎరుగనట్లు అధికారుల సెక్షన్లకు పంపిస్తున్నాడనే విషయం బట్టబయలైంది. అయితే కొత్తగా వచ్చిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ వద్ద శ్రీనివాస్ ఆటలు సాగలేదు. ఎస్పీకి స్వయానా ఆయన పేరుతో వచ్చిన ఓ లేఖను చదివి శ్రీనివాస్ నేరుగా పట్టుబడ్డాడు. తన టేబుల్ వద్దకు డిస్పాచ్ సెక్షన్ నుంచి సోమవారం సాయంత్రం వచ్చిన ఓ లేఖ కవర్ అతుకు అనుమానాస్పదంగా ఉండటాన్ని ఎస్పీ గమనించారు. లేఖ ఎప్పుడో పోస్ట్ చేసినా గమ్ ఆరకపోవడంతో అనుమానించారు. తన వద్దకు రావడానికి ముందే ఆ లేఖ తెరిచారని గుర్తించిన ఎస్పీ.. తక్షణమే డిస్పాచ్ సెక్షన్ క్లర్క్ శ్రీనివాస్‌ను తన చాంబర్కి పిలిపించారు. అదనపు ఎస్పీ, స్పెషల్ బ్రాంచి డీఎస్పీల ఎదుటే ఏం చేశావని ప్రశ్నించారు. ముందు నీళ్లు నమిలిన శ్రీనివాస్.. చేసిన తప్పును నిస్సిగ్గుగా అంగీకరించాడు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్పీ అధికారుల ఎదుటే చీవాట్లు పెట్టారు. శ్రీనివాస్‌కు తక్షణమే చార్జి మెమో ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా తమ తమ సెక్షన్లకు లేదా అధికారుల వ్యక్తిగత పేర్లతో వస్తున్న లేఖలు తెరిచి చదివినట్లు అనుమానాలుంటే అధికారులు, సిబ్బంది ఫిర్యాదు చేసేలా సెక్షన్లకు సూచనలివ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శ్రీనివాస్ పదేళ్లుగా ఒకే సెక్షన్లో కొనసాగుతున్నాడని ఎస్పీ దృష్టికి వచ్చింది. ఇదే తరహాలో ప్రజల పిటిషన్లు తెరచి చూస్తున్నాడనే అనుమానాలు తలెత్తడంతో అతడి వ్యవహార శైలిపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
భార్యను కత్తితో పొడిచిన కానిస్టేబుల్
దొడ్డబళ్లాపురం: ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఓ పోలీస్ కానిస్టేబుల్ భార్యను హత్య చేసిన ఘోర సంఘటన హాసన్‌లో చోటుచేసుకుంది. హాసన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసే లోకనాథ్ తన భార్య మమతను కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు. దంపతుల మధ్య గత నాలుగైదు రోజులుగా గొడవలు జరుగుతుండగా ఆదివారం ఉదయం మమత ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి ఎస్పీ కార్యాలయానికి వచ్చింది. దీంతో ఆగ్రహం పట్టలేని లోకనాథ్ భార్యపై కత్తితో దాడిచేసి ప్రాణాలు తీశాడు. 17 ఏళ్ల క్రితం హాసన్ శివారులోని చెన్నపట్టణ కాలసీ నివాసి అయిన మమతను కేఆర్‌పుర నివాసి లోకనాథ్ ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కట్నం కింద అరకేజీ బంగారం, రూ.50 లక్షలు నగదు ఇచ్చినా లోకనాథ్ తరచూ అదనపు కట్నం కోసం మమతను వేధించేవాడని, అయితే ఆమె కట్నం తీసుకురావడానికి నిరాకరించేదని అందుకే లోకనాథ్ ఈ హత్యకు పాల్పడ్డాడని మమత తల్లిదండ్రులు ఆరోపించారు. హాసన్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎస్పీ ఆఫీసులోనే, పోలీసు హత్య చేయడంపై విమర్శలు వెల్లువత్తాయి. -
ప్రేమికులపై పోలీస్‌స్టేషన్‌లోనే దాడి.. ఎస్పీ కార్యాలయానికి పరుగులు
సాక్షి, గద్వాల: పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసు కున్న ఓ జంటపై యువతి కుటుంబీకులు పోలీస్ స్టేషన్లోనే దాడికి పాల్పడ్డ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. గద్వాలకు చెందిన ప్రశాంత్, మండలంలోని పూడూరుకు చెందిన శిరీష ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురి ఇళ్లలో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ తల్లిదండ్రులు రెండు నెలల క్రితం ఇద్దరికీ వివాహం చేద్దామని యువతి తల్లిదండ్రులతో మాట్లాడగా.. ఇద్దరి కులాలు వేరు కావడంతో అభ్యంతరం చెప్పారు. దాంతో మేజర్లయిన ప్రేమికులు ఈ నెల 8న ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. 9న కర్నూలు జిల్లా పాలబుగ్గ సమీపంలోని ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఇంటికి వచ్చేందుకు, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ గద్వాల రూరల్ పోలీస్‌స్టేషన్‌కు మంగళవారం చేరుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఫర్నిచర్ ధ్వంసం పోలీసులు ఇరువురి కుటుంబసభ్యులను స్టేషన్‌కు పిలిపించి నచ్చజెప్పారు. అయితే యువతి కుటుంబసభ్యులు బలవంతంగా ఆమెను లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోపులాట జరగ్గా.. ఆమె కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌లోని ఫర్నిచర్ ధ్వంసం చేసి యువకుడి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. పోలీసు సిబ్బంది అడ్డుకోగా.. వెంటనే రక్షణ కోసం సమీపంలోని ఎస్పీ కార్యాలయానికి రోడ్డు వెంట ఆ ప్రేమజంట పరుగులు తీసింది. ఎస్పీ సృజన వద్దకు వెళ్లి జరిగిన విషయం వివరించారు. వెంటనే ఎస్పీ ఆ ఇద్దరూ మేజర్లు కావడంతో వారికి రక్షణ కల్పించే బాధ్యత పోలీస్‌శాఖపై ఉందన్నారు. భవిష్యత్‌లో వారిపై దాడి చేయడం, అవమానపర్చడం, విడదీసే ప్రయత్నం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఇరువురి కుటుంబ సభ్యులను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించారు. ఘటనపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. -
మీడియాతో ఎస్పీ మాట్లాడుతుండగా... ఒక్కసారిగా నాగుపాము ప్రత్యక్షం
సాక్షి, బరంపురం : ఒడిశా రాష్ట్రంలోని బరంపురం ఎస్పీ కార్యాలయంలో 12 అడుగుల నాగుపాము హల్చల్ చేసింది. విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతుండగా అక్కడే ఉన్న విలేకరి స్వధీన్ పండా పామును గుర్తించి అప్రమత్తమయ్యారు. చాకచక్యంగా సర్పాన్ని పట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో బంధించారు. అనంతరం కిరండమల్ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. -
రగ్బీ టీం కోసం దొంగయ్యాడు!
అడ్డగుట్ట: రైల్వే ప్రయాణికులను టార్గెట్ చేసుకొని వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ తాత్కాలిక హోంగార్డును నిజామాబాద్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం సికింద్రాబాద్‌లోని రైల్వే ఎస్పీ కార్యాలయంలో దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ అనురాధ మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన మోహన్‌దేవ్‌రావు చావన్ (28) నాందేడ్ జిల్లాలో హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఒక టీంను తయారు చేసి రగ్బీ ఆడిపించాలనే ఉద్దేశంతో పలువురికి ఉచితంగా కోచింగ్ ఇచ్చేవాడు. ఈ క్రమంలో గేమ్‌కు సంబంధించి బాల్స్, డ్రెస్‌లు, ఇతర మెటీరియల్స్‌కు డబ్బులు లేకపోవడంతో ఈజీ మనీకి అలవాటుపడ్డాడు. నాందేడ్ జిల్లాలోని చిక్కల తండాకు చెందిన ప్రదీప్‌తో కలసి చైన్ స్నాచింగ్‌లు ప్రారంభించాడు. ఒకే ట్రైన్లో 8 స్నాచింగ్‌లు 2019 నుంచి మోహన్‌దేవ్‌రావు, ప్రదీప్‌లు ఒకే ఏడాదిలో 8 చోరీలు చేశారు. బాసర రైల్వే స్టేషన్లో నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులోనే ఈ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఆభరణాలను ముంబైలో విక్రయించి సొమ్ము చేసుకున్నారు. మిగతా వాటిని విక్రయించేందుకు మోహన్ దేవ్‌రావు నిజామాబాద్ వచ్చాడు. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు స్టేషన్లో అతన్ని పట్టుకున్నారు. విచారణ జరుపగా నేరాలను ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి 116 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.50 లక్షలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు ప్రదీప్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. -
పోలీసుల చేతిలో డ్రోన్ కెమెరా
సాక్షి, మహబూబాబాద్: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్న పోలీసుల చేతికి డ్రోన్ కెమెరాలు అందాయి. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లాకు మంజూరైన డ్రోన్ కెమెరాను ఎస్పీ కోటిరెడ్డి శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, ధూమమానం చేసే వారు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించడంతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ఈ కెమెరాను ఉపయోగిస్తామని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఈ కెమెరా ద్వారా పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. -
తంగళ్లపల్లి ఎస్సైపై వేటు
సాక్షి, సిరిసిల్ల : తంగళపల్లి ఎస్సై వొల్లొజుల శేఖర్‌పై గురువారం వేటు పడింది. ఆయనను జిల్లా ఎస్పీ జిల్లా హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలో జరుగుతున్న ఇసుక మామూళ్లతోపాటు వాటాల పంపకంపై వచ్చిన ఆరోపణలతో పోలీసు నిఘా వర్గాలు నివేదిక అందించినట్లు తెలుస్తోంది. దీనికితోడు ఇసుక అక్రమ రవాణాతోపాటు మామూళ్ల వసూళ్లపై జిల్లాలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. సిరిసిల్ల మానేరు నుంచి ఇసుక తరలింపు వాహనాల నుంచి పైసల వసూల్ తీరును బహిర్గతం చేస్తూ ’దసరా హు‘సార్’ శీర్షికన ఈ నెల 5న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై నిఘా వర్గాలు సమగ్ర నివేదికను తయారు చేసేందుకు ఆరా తీస్తున్నట్లు మరో కథనం ఈ నెల 6న ప్రచురితమైన విషయం విదితమే. ఈ క్రమంలోనే తంగళ్లపల్లి ఎస్సైగా పని చేస్తున్న శేఖర్‌పై పోలీసు అధికారులు వేటు వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్సై శేఖర్‌ను పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. బుధవారం నలుగురు సీఐలు ఒకేసారి బదిలీ కావడంతో అసలేం జరుగుతోంది. అన్న ఆందోళనలో ఉన్న పోలీస్ అధికారులకు మరో ఎస్సైని బదిలీ చేశారంటూ ఉత్తర్వులు అందడంతో అందరిలో అంతర్మథనం ప్రారంభమైంది. తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేసిన దాదాపు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఇసుక అక్రమ రవాణా వివాదాలతోనే వేటును ఎదుర్కొన్నట్లు చర్చ జరుగుతోంది. మానేరు వాగు నుంచి జరుగుతున్న ఇసుక దందాలో మామూళ్ల వాటాలు, కేసులు నమోదు జాప్యాన్ని ‘సాక్షి’ కథనాలు ప్రచురించడంతో అధికారులు ఆ వైపుగా దర్యాప్తు చేసి క్రమశిక్షణ చర్యలకు వెళ్లినట్లు తెలుస్తోంది. -
ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం
-
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
తిరువళ్లూరు: పెద్దల నుంచి బెదిరింపులు వస్తున్నాయని తమకు భద్రత కల్పించాలని బుధవారం ప్రేమజంట తిరువళ్లూరు ఎస్పీని ఆశ్రయించింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా అమ్మయార్‌కుప్పం గ్రామానికి చెందిన తిలకవతి(21), పుణ్యం గ్రామానికి చెందిన చిన్నరాసు(24) పొదటూరుపేటలోని ఓ ప్రవేట్ కళాశాలలో బీఎడ్ చదువుతున్నారు. వీరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం పెద్దలకు తెలియడంతో తిలకవతికి వివాహ సంబంధాలు చూడడం ప్రారంభించారు. దీంతో ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి గత 7వ తేదీన చెన్నైలో వివాహం చేసుకున్నారు. ఈ సమాచారంతో యువతి తల్లిదండ్రులు బెదిరింపులకు దిగడంతో వారు మంగళవారం చెన్నై కమిషనర్‌ను కలిసి తమకు భద్రత కల్పించాలని కోరారు. కమిషనర్ సూచన మేరకు తిరువళ్లూరు ఎస్పీ పొన్నిని బుధవారం రాత్రి కలిసి భద్రత కల్పించాలని విన్నవించారు. ఎస్పీ తిరువళ్లూరు మహిళ పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. దీంతో ప్రేమజంట మహిళా పోలీస్‌స్టేషన్ సీఐకు ఫిర్యాదు చేశారు. సీఐ ఇరు కుటుంబాల బంధువులను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడానికి చర్యలు చేపట్టారు. -
మహిళలపై పోలీసుల దాష్టీకం
చిత్తూరు, సాక్షి: అక్రమ అరెస్టులను నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మహిళల పట్ల పోలీసులు పైశాచికంగా ప్రవర్తించారు. జుట్టు లాగి, చీర కొంగు చింపి రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. దుర్భాషలాడారు. బూటు కాళ్లతో తన్నారు. ఇష్టం వచ్చినట్లు తోయడంతో కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. పాకాలలో అక్రమంగా అరెస్టు చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విడుదల చేయాలని ఆయన సతీమణి లక్ష్మి ఆధ్వర్యంలో చిత్తూరులోని పాత ఎస్పీ కార్యాలయం ఎదుట వందల సంఖ్యలో మహిళలు సోమవారం ధర్నా చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు మండుటెండను లెక్క చేయకుండా నిరసన తెలియజేశారు. చెవిరెడ్డి లక్ష్మి మాట్లాడుతూ చంద్రగిరి, ఎర్రావారిపాళ్యం, పాకాలలో టీడీపీ నాయకులు సర్వేలు నిర్వహించి 14వేల ఓట్లు తొలగించడానికి పన్నాగం పన్నారన్నారు. దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను అరెస్టు చేసి, కేసులు నమోదు చేసి హింసిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి అండగా ఉన్న ఎమ్మెల్యే చెవిరెడ్డిని అక్రమంగా నిర్బంధించారన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. టీడీపీ నేతల డైరెక్షన్లోనే.. వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసుల దాడి ఆద్యంతం అధికార పార్టీ కనుసన్నల్లోనే జరిగింది. వెంటనే అరెస్టులు చేయాలని పోలీసులను ఫోన్లలో బెదిరించడం మొదలు పెట్టారు. వారి ధర్నాను భగ్నం చేయకుంటే మేం కూడా వచ్చి కూర్చుంటామని హెచ్చరించారు. దీంతో ఏఎస్పీ సుప్రజ రంగంలో దిగారు. ఆమె వచ్చీ రావడంతోనే ధర్నా చేస్తున్న మహిళలపై విరుచుకుపడ్డారు. వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. పోలీసుల పైశాచికం.. 5 గంటల పాటు శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కార్యకర్తలను విడుదల చేస్తే వెంటనే ధర్నా విరమిస్తామని చెప్పినా వినకుండా కర్కశంగా ప్రవర్తించారు. జుట్టు లాగి, చీర కొంగు చింపి రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. కొంతమంది మహిళలను చిత్తూరు వన్‌టౌన్ సీఐ శ్రీధర్, డీఎస్పీ రామకృష్ణ దుర్భాషలాడారు. మహిళా కానిస్టేబుళ్లు చేయిచేసుకున్నారు. బూటు కాళ్లతో తన్నారు. ఇష్టం వచ్చినట్లు తోయడంతో పలువురు గాయపడ్డారు. శోభ అనే మహిళ సొమ్మసిల్లిపడిపోయింది. ఈడ్చుకుంటూ పోలీసు వ్యాన్‌లో పడేశారు. ఎమ్మెల్యే భార్య అని కూడా చూడకుండా చెవిరెడ్డి సతీమణి లక్ష్మిని ఏకవచనంతో సంబోధించారు. మహిళలతో పాటు చెవి రెడ్డి తనయులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డిలను కూడా అరెస్టు చేసి యాదమర్రికి తరలించారు. అనంతరం వదిలిపెట్టారు. మూడు వ్యాన్లలో మహిళలను తిరుచానూరు తదితర ప్రాం తాలకు తరలించారు. రాయలసీమ రేంజ్ డీఐజీ ఉన్నా.. చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న çఘటనలపై విచారణ చేయాలని రాయలసీమ రేంజ్ డీఐజీ క్రాంతిరాణా టాటాను ఈసీ ఆదేశించింది. ఆయన సోమవారం చిత్తూరుకు వచ్చారు. ఆయన అక్కడే ఉన్నా మహిళలపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. కలెక్టర్‌పై ఈసీ సీరియస్? చిన్నపాటి శాంతియుత ధర్నాకు కడప, అనంతపురం నుంచి బలగాలను ఎందుకు పిలిపించాల్సి వచ్చిందని కలెక్టర్ ప్రద్యుమ్నను ఎన్నికల కమిషన్ ప్రశ్నించింది. ఓట్ల తొలగింపు ఫాంలు ఎక్కువ నమోదవుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని అక్షింతలు వేసింది. చంద్రగిరి, ఎర్రావారిపాళ్యం, పాకాల సంబంధి పూర్తి వివరణ ఇవ్వాలని కోరింది. అక్రమ అరెస్టులతో ప్రజాభిమానాన్ని దూరం చేయలేరు పోలీసులను అడ్డం పెట్టుకుని అధికార పార్టీ నేతలు చేయిస్తున్న అక్రమ అరెస్టులతో ప్రజాభిమానాన్ని దూరం చేయలేరు. టీడీపీ ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారు. అరెస్టులకు నేను బెదరను. ఎంతకాడికైనా పోరాడుతా. నాకు అండగా ఉన్న ప్రజలను, పార్టీ శ్రేణులను కాపాడుకుంటా. కుటుంబ సభ్యులకు సమాచారం లేకుండా నన్ను అప్రజాస్వామికంగా అరెస్టు చేసి రాత్రంతా ఇతర రాష్ట్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా తిప్పిన పోలీసులపై చర్యలు తీసుకునే విధంగా పోరాడతా. – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యే, చంద్రగిరి పోలీసులా..అధికార పార్టీ కార్యకర్తలా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ప్రభుత్వంలో పోలీసులు పార్టీ కార్యకర్తల కన్నా రెట్టింపు ఉత్సాహంతో వ్యవహరిస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యేలను అక్రమ అరెస్టులు, కేసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధానికి గురైన ఎమ్మెల్యే చెవిరెడ్డిని పరామర్శించేందుకు వెళ్లిన నన్ను చిత్తూరు డీఎస్పీ అడ్డుకోవడమే కాక నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం.– నారాయణస్వామి, ఎమ్మెల్యే, జీడీనెల్లూరు నీతిమాలిన చర్య పోలీసుల అత్యుత్సాహంతో ప్రశాంత వాతావరణంలో ఉన్న సత్యవేడులో శాంతిభద్రతల సమస్య తలెత్తింది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డిని నిబంధనలకు విరుద్ధంగా నిర్బంధించడం అప్రజాస్వామికం. పైగా ఆయన్ను ఇతర రాష్ట్రాల్లో తిప్పడం అన్యాయం. ఆయనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చే వైఎస్సార్ సీపీ శ్రేణులను ఎక్కడికక్కడ అడ్డుకోవడం పోలీసుల నీతిమాలిన చర్యకు నిదర్శనం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాల్సిన పోలీసులు రెచ్చగొట్టే విధానాన్ని అవలంబించడం సరికాదు.– ఆదిమూలం,వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, సత్యవేడు నియోజకవర్గం -
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కాపురం చేయనని
పెదవాల్తేరు(విశాఖతూర్పు): ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఐదు నెలలు కాపురం చేశాడు. ఇప్పుడేమో ఇంట్లో పెద్దవాళ్లకు ఇష్టం లేదు కాపురం చేయనని కరాఖండిగా చెప్పేశాడో ప్రబుద్ధుడు. దీంతో బాధితురాలు శుక్రవారం పెదవాల్తేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని రావికమతం మండలం గర్నికం గ్రామానికి చెందిన ఆర్లె శివ(23), తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దూదిమాతాండ గ్రామానికి చెందిన బాణోయ అనసూయ(20) 2016 సంవత్సరంలో ప్రేమించుకున్నారు. ఆమె బి.ఫార్మసీ చదువుకుని హైదరాబాద్‌లోని ఒక కంపెనీలో ఉద్యోగం చేసేవారు. శివ రాజమండ్రి ఆదిత్య కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసేవాడు. వీరిద్దరూ 2017 డిసెంబర్ 23న స్నేహితుల సాయంతో సూర్యాపేటలో పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. ఐదు నెలల పాటు కాపురం చేసిన శివ అర్ధంతరంగా ముఖం చాటేశాడు. అదేమంటే తన ఇంట్లో తల్లిదండ్రులకు పెళ్లి ఇష్టం లేదని చెప్పడం గమనార్హం. దీంతో బాధితురాలు రావికమతం పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఫలితం లేకపోయింది. పైగా రావికమతం ఎస్ఐ రామకృష్ణ, కానిస్టేబుల్ భవాని, సీడీపీవో మంగతాయారు.. శివకు వత్తాసు పలుకుతున్నారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన తనపై పోలీసులు దౌర్జన్యం చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు. -
గ్రెనేడ్ దాడి.. ముగ్గురికి తీవ్రగాయాలు
శ్రీనగర్: ఉగ్రవాదులు, గ్రెనేడ్‌తో దాడి చేయడంతో ముగ్గురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శుక్రవారం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. అవంతిపురా పట్టణంలోని సూపరిండెంట్ కార్యాలయం వద్ద ఉగ్రవాదులు గ్రెనేడ్‌ను విసిరినట్లు పోలీసులు తెలిపారు. కార్యాలయం బయట గ్రెనేడ్ పేలడంతో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతమంతా ఉగ్రవాదుల కోసం జల్లెడ పట్టారు. అనుమానం వచ్చిన ప్రతిఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేయడం మొదలుపెట్టారు. గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు..మహిళ మృతి తుపాకీతో గుర్తుతెలియని వ్యక్తి, షమీమా అనే మహిళపై కాల్పులకు దిగాడు. ఈ సంఘటన జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో డ్రాబ్గాం గ్రామంలో శుక్రవారం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన షమీమా(38)ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా..అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని షమీమా చూసేందుకు వచ్చినపుడు ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు పేర్కొన్నారు. -
ఎస్పీని ఆశ్రయించిన ప్రేమజంటలు
తమిళనాడు, వేలూరు: రక్షణ కల్పించాలని కోరుతూ ఒకేరోజు మూడు ప్రేమజంటలు గురువారం వేలూరు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నాయి. వివరాలు.. వేలూరు జిల్లా కేవీ కుప్పంకు చెందిన జ్యోతిక గుడియాత్తంలోని ప్రవేట్ కళాశాలలో బీఎస్సీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సతీష్‌కుమార్‌తో పరిచయం ఏర్పడి మూడేళ్లుగా ప్రేమించకుంటున్నారు. వీరి పెళ్లికి ఇద్దరి కుటుంబ సభ్యులు అంగీకారం తెలపలేదు. దీంతో రెండు రోజుల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వచ్చి వివాహం చేసుకున్నారు. గురువారం ఉదయం ఇద్దరూ ఎస్పీ కార్యాలయానికి చేరుకొని రక్షణ కోరారు. అదే విధంగా నాట్రంబల్లి సమీపంలోని పచ్చూరు గ్రామానికి చెందిన జయశ్రీ ప్రవేట్ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈమె పాతపేటకు చెందిన మయిల్ వాణన్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మయిల్‌వాణన్ ఒడిసా రాష్ట్రంలోని ప్రవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వీరి వివాహానికి ఇద్దరి తల్లిదండ్రులు అంగీకరించలేదు. వారు 13వ తేదీన వివాహం చేసుకున్నారు. రక్షణ కల్పించాలని ఎస్పీ కార్యాలయంలో విన్నవించారు. అదే విధంగా ఆంబూరు బీకస్పా ప్రాంతానికి చెందిన దివ్యభారతి ల్యాబ్ టెక్నిషియన్‌గా పనిచేస్తోంది. అదే గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి పెద్దలు అంగీకరించకలేదు. దివ్య భారతికి వేరే వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. ఇద్దరూ 11వ తేదీన తిరువణ్ణామలైలోని ఆలయంలో వివాహం చేసుకున్నట్లు తెలిపారు. -
భద్రత కట్టుదిట్టం..!
ఇకపై కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాల లోపలికి వెళ్లాలంటే అర్జీదారులు కాస్త ఇబ్బంది పడాల్సిందే. దరఖాస్తుదారులు ఎవరైనా సరే తమ వెంట తెచ్చుకున్న వస్తువులు, పత్రాలను ఆయా కార్యాలయాల బయట పోలీస్ సిబ్బందికి చూపించాకే లోపలికి వెళ్లాల్సిన పరిస్థితులొచ్చాయి. వివిధ సమస్యలతో జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతున్న బాధితులు ఇటీవల ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు ఆయా కార్యాలయాల వద్ద భద్రతను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. సాక్షి, జగిత్యాల : సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్, ఎస్పీలను కలిసేందుకు వచ్చి పురుగుల మందు తాగడం.. ఒంటిపై కిరోసిన్ పోసుకోవడం వంటి అఘాయిత్యాలకు చెక్ పెట్టడానికి పోలీస్ బాస్ భద్రత చర్యలను కట్టుదిట్టం చేశారు. ఈక్రమంలో ఇప్పటికే ఆయన తన క్యాంప్ కార్యాలయం వద్ద ప్రత్యేకంగా ఓ క్యాబిన్ ఏర్పాటుచేశారు. ఇందులో ఓ ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు.. ఓ హోంగార్డుకు విధులు కేటాయించారు. వీరు ఎస్పీ కార్యాలయానికి వచ్చే ఆర్జీదారులు క్షేమంగా తిరిగి వెళ్లేవరకు వారిపై దృష్టిపెట్టనున్నారు. ఎవరైన పురుగుల మందు డబ్బాలు.. కిరోసిన్‌తో వస్తే వారిని బయటే అడ్డుకుని వెంట తీసుకొచ్చిన వాటిని స్వాధీనం చేసుకుంటారు. కేవలం ఫిర్యాదుదారుడిని లోపలికి అనుమతి ఇవ్వనున్నారు. మరోపక్క.. ఇప్పటికే ప్రతి సోమవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) భవనంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి నలుగురైదుగురు పోలీసులకు విధులు కేటాయిస్తున్నారు. అయితే.. ఇకపై ప్రతి సోమవారం వారి సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రస్తుతం ఒక హోంగార్డు విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇకపై కనీసం ఇద్దరైనా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయం వద్ద నలుగురు.. కలెక్టరేట్లో మరో నలుగురు.. మొత్తం ఎనిమిది మంది హోంగార్డులను నియమించి వారికి అవసరమైన శిక్షణ ఇవ్వాలనే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. ‘నిఘా’ ఏదీ..? ప్రభుత్వ కార్యాలయాల ముందు ప్రజల ఆత్మహత్యాయత్నాల వెనక దళారులు ఉన్నట్లు కలెక్టర్ శరత్ ఇప్పటికే గుర్తించారు. ప్రభుత్వ కార్యక్రమాలు.. పథకాల్లో పెరుగుతున్న దళారుల ప్రమేయంపై సీరియస్ అయ్యారు. అనర్హులకూ లబ్ధి చేకూరుస్తామని మాయమాటలు చెప్పి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్న వారిపై కొరడా ఝుళిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ నెల 8న ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించే ఐఎంఏ భవనం, పరిసర ప్రాంతాల్లోనూ బాధితులు, వారి వెంట వచ్చి వెళ్లే వారిని గుర్తించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటికీ సీసీ కెమెరాలు ఏర్పాటు కాలేదు. ఇప్పటికైనా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ విషయమై జిల్లా రెవెన్యూ అధికారి శ్యాం ప్రకాశ్ వివరణ ఇస్తూ.. ‘ ఐఎంఏ భవనంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే సాంకేతిక సిబ్బంది వచ్చి కెమెరాల ఏర్పాటుపై పరిశీలన చేశారు. త్వరలోనే కెమెరాలు ఏర్పాటు చేస్తాం’ అన్నారు. -
హారిక ఆత్మహత్యాయత్నం
తిరుపతి క్రైం: తనను ప్రేమించి మోసం చేసిన యువకుడిపై, అతడికి సహకరిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థ యజమానిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఓ యువతి ఆత్మహత్యకు యత్నిం చింది. మంగళవారం అర్బన్ ఎస్పీ కార్యాలయం ముందు ఈ ఘటన జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు పద్మావతి పురంలోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో వి. హారిక పనిచేస్తోంది. అక్కడే పనిచేస్తున్న విజయ్‌కుమార్ అనే యువకుడిని ప్రేమించింది. ఈక్రమంలో యువతి తనను వివాహం చేసుకోవాలని యువకుడిని కోరడంతో అతను పెళ్లికి నిరాకరించాడు. దీంతో బాధిత యువతి తిరుచానూరు పోలీసులు ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుడు విజయ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. తనకు అక్కడ న్యాయం జరగలేదని ఎస్పీని కలసి తన పెళ్లికి అడ్డుపడుతున్న రియల్ ఎస్టేట్ యజమానిపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఎస్పీ ఈస్ట్ సబ్ డివిజినల్ డీఎస్పీ మునిరామయ్యను విచారణ చేపట్టాలని ఎస్పీ సూచిం చారు. డీఎస్పీ విచారించిన అనంతరం చట్టప్రకారం యువకుడితో మాట్లా డి వివాహం చేసేందుకు యత్నిస్తామన్నారు. ఇదిలా ఉంటే రియల్ ఎస్టేట్ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తనకు రాష్ట్ర హోంశాఖ మంత్రి న్యాయం చేయాలని కోరుతూ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. యువతిని స్థానికులు ప్రభుత్వ రుయాస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రస్తుతం ఆమెకు వైద్యచికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉంది. దీనిపై పోలీసులు స్పందిస్తూ యువతికి చట్టపరంగా న్యా యం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే యువకుడిపై కేసు నమో దు చేసి రిమాండ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. -
హోంగార్డుల వెట్టి చాకిరి
-
ఎస్పీ కార్యాలయంలో ఓపెన్ హౌజ్
నల్లగొండ క్రైం : పోలీల్ అమరువీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఓపెన్ హౌజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుధాల పనితీరును సిబ్బంది విద్యార్థులకు వివరించారు. పోలీసులు ఉపయోగించే బాంబ్ డిస్పోజల్ టీమ్, క్లూస్‌టీమ్, పింగర్ప్రింట్స్, కమ్యూనికేషన్, బ్రీత్ఎనలైజర్, డాగ్‌స్క్వాడ్, కమ్యూనికేషన్ టీమ్, వివిధ రకాల వెపన్లను ప్రదర్శించారు. ఎస్పీ శ్రీనివాసరావు గన్పట్టి గురిచూశారు. గన్ను గురిపెట్టే విధానాన్ని, డాగ్‌స్క్వాడ్ పనితీరును విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. పోలీసులంటే సమాజంలో గౌరవం పెంచేలా పెండ్లీ పోలీస్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలవద్దకు తీసుకెళ్తున్నామని అన్నారు. దేశ భద్రత కోసం 500లకు పైగా పోలీసులు ప్రాణత్యాగం చేశారని, ఉమ్మడి జిల్లాలో 29 మంది అసువులుభాశారని.. తెలిపారు. అమరులైన పోలీసులను స్మరించుకోవాల్సిన అవసరం ప్రజలందరికీ ఉందన్నారు. కార్యక్రమంలో ఏఆర్ఓఎస్డీ శ్రీనివాసరావు, ఏఆర్డీఎస్పీ సురేష్‌కుమార్, ఆర్ఐ శ్రీనివాస్, హోంగార్డు ఆర్ఐ శ్రీనివాసులు, సీఐ ఆదిరెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ దొంగా
► మెడికల్ రీయింబర్స్‌మెంట్‌లో చేతివాటం ► రూ.25 లక్షలకు పైగా నగదు కాజేసిన వైనం ► కేసు నమోదు.. అదుపులో డీపీవో చిత్తూరు (అర్బన్): సాక్షాత్తు ఎస్పీ కార్యాలయంలో పనిచేసే వ్యక్తి చేతివాటం ప్రదర్శించాడు. మెడికల్ రీయింబర్స్మెంట్ పేరుతో తప్పుడు బిల్లులు సృష్టించి ఏకంగా రూ.25 లక్షలకు పైనే నొక్కేశాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై పోలీసులు శనివారం కేసు నమోదు చేసుకుని వెంకటేష్(26) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎలా జరిగిందంటే? చిత్తూరు నగరంలోని ప్రశాంత్‌నగర్ కాలనీ సమీపంలో ఉన్న జిల్లా పోలీసు కార్యాలయంలో వెంకటేష్ అనే అధికారి ఉన్నారు. ఇతను మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల చెల్లింపులు చేస్తుంటాడు. ఒక ఉద్యోగి రూ.70 వేలు రీయింబర్స్మెంట్ చెల్లించాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఇందులో రెండు సెట్ల బిల్లులను ఎస్పీకి అందజేశాడు. పరిశీలించిన ఎస్పీ ఆ ఫైలును వెంకటేష్‌కు పంపారు. రెండు సెట్ల దరఖాస్తుల్లో ఒక దానికి రూ.70 వేలు బిల్లు చెసిన వెంకటేష్ ఆ మొత్తాన్ని సంబంధిత ఉద్యోగికి బ్యాంకు ఖాతాలోకి వేశాడు. పది రోజుల తరువాత మళ్లీ రూ.70 వేల నగదు ఖాతాలో జమ అయింది. వెంటనే వెంకటేష్ ఆ ఉద్యోగికి ఫోన్ చేసి ‘ఆ మొత్తం వేరే వాళ్ల ఖాతాలో పడాల్సిందిపోయి పొరపాటున నీ ఖాతాలో పడిందని, డబ్బును తెచ్చి ఇవ్వాలని చెప్పాడు. రూ.70 వేలను వెంకటేష్ తీసుకున్నాడు. ఇలా గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు రూ.25,18,050 కాజేశాడు. ఎలా బయటపడిందంటే? ఉద్యోగులు అనారోగ్యంతో ఇబ్బందులకు గురైనప్పుడు సొంతంగా నగదు ఖర్చు పెట్టుకుని తర్వాత రీయింబర్స్మెంట్ ద్వారా ఆ మొత్తాన్ని వెనక్కు తీసుకుంటారు. ఇటీవల ఓ కానిస్టేబుల్ బ్యాంక్ ఖాతాలోకి రూ.40 వేల వరకు నగదు జమ అయింది. దీన్ని గుర్తించిన కానిస్టేబుల్ తన బ్యాంకు ఖాతాలోకి వచ్చి పడ్డ నగదుపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. తాను రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోలేదని చెప్పాడు. విషయం ఎస్పీ శ్రీనివాస్ దృష్టికి వెళ్లింది. ఆయన ఏఎస్పీ అభిషేక్ మొహంతిని విచారణకు ఆదేశించారు. దీనిపై విచారించిన ఏఎస్పీ తమ శాఖలోని సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్టు గుర్తించారు. టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఇంకా ఎంతమంది ప్రమేయముందో? స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో చిత్తూరు టూటౌన్ పోలీసులు కేసు నమెదు చేశారు. వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దుర్గానగర్ కాలనీలో ఓ ఇల్లు కడుతున్నట్లు, డబ్బులు చాలకపోవడంతో ఇలా తప్పుడు బిల్లులు సృష్టించి నగదు కాజేసినట్లు అంగీకరించాడు. ఈ వ్యవహారంలో మరికొంత మంది పెద్దల ప్రమేయం ఉందని, పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అన్ని వివరాలు బయటకొస్తాయని సిబ్బంది చెబుతున్నారు. -
కదంతొక్కిన మహిళా లోకం
– జాస్నవిరెడ్డి హత్యకేసు నిందితులను శిక్షించాలని డిమాండ్ – ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా అనంతపురం సెంట్రల్ : వరకట్న వేధింపులకు బలైన జాస్నవిరెడ్డి ఆత్మహత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు కదంతొక్కారు. జాస్నవిరెడ్డి తల్లిదండ్రులు రేవతి, సూర్యప్రతాప్‌రెడ్డితో కలిసి ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం, ఆల్ ఇండియా డెమెక్రాటిక్ యూత్ ఆర్గనైజేషన్, ఆల్ ఇండియా డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నగరంలో టవర్‌క్లాక్ నుంచి ఎస్పీ క్యాంపు కార్యాలయం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లలిత మాట్లాడుతూ వరకట్న వేధిపులకు జాస్నవిరెడ్డి బలై పదిరోజులు గడిచినప్పటికీ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. నిందితులు సమాజంలో పెద్ద మనషులుగా చెలామణీ అవుతూ నేరం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అందరికీ శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం ఎస్పీని కలిసేందుకు అమ్మాయి తల్లిదండ్రులకు మాత్రమే అనుమతి ఇవ్వడంపై మహిళా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐడీవైఓ జిల్లా కార్యదర్శి తబ్రేజ్‌ఖాన్, ఏఐడీఎస్ఓ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, పలు కళాశాలల విద్యార్థినులు, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
మల్కాన్‌గిరి ఎస్పీ ఆఫీసు ఎదుట ఉద్రిక్తత
-
కారు దిగి కాలినడకన..
అరకిలోమీటరు దూరం నడిచిన డీఐజీ రైలు గేటు పడడంతో ఎస్పీ కార్యాలయం దారిలో వాకింగ్.. సాక్షి, కామారెడ్డి : డీఐజీ అకున్ సబర్వాల్.. కామారెడ్డిలో సుమారు అరకిలోమీటరు దూరం వాకింగ్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్పీ కార్యాలయాన్ని పరిశీలించడానికి మంగళవారం ఆయన జిల్లాకు వచ్చారు. ఆయన రాక నేపథ్యంలో పట్టణ శివారు నుంచే పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తూ వస్తున్నారు. ఎస్పీ కార్యాలయం దారిలో రైలు వస్తుండడంతో గేట్‌మన్ గేటు వేశారు. గేటు తీయడానికి పది నిమిషాల వరకు సమయం పట్టే అవకాశం ఉండడంతో డీఐజీ కారు దిగి నడవడం ప్రారంభించారు. పట్టాలు దాటిన తర్వాత అవతలి వైపు ఉన్న ఎస్సై ఒకరు తన బుల్లెట్ వాహనాన్ని ఇవ్వబోగా వారించి కాలినడకనే ముందుకు సాగారు. సుమారు అర కిలోమీటరు నడిచిన తర్వాత రైల్వేగేటు ఎత్తడంతో డీఐజీ కారు వచ్చింది. దానిలో ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. -
ముమ్మరంగా ఎస్పీ కార్యాలయ పనులు
పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్‌నాయక్ 11న ప్రారంభోత్సవానికి ‘తుమ్మల’ రాక మహబూబాబాద్ : మానుకోట జిల్లా ఎస్పీ కా ర్యాలయ ఏర్పాటు పనులు వేగవంతమయ్యా యి. ఎస్పీ కార్యాలయానికి పట్టణ శివారులోని ఐటీఐ భవనాన్ని కేటాయించగా పలు పనులు కొనసాగుతున్నాయి. ఆయా పనులను ఎమ్మె ల్యే బానోత్ శంకర్‌నాయక్ శుక్రవారం పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.15లక్షల వ్యయం తో ప్రహరీ, రూ. 25లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఐటీఐ భవనంలో షెడ్డు, జవాన్ల విశ్రాంతికి రూమ్ నిర్మాణ పను లు కూడా చేపడుతామని చెప్పారు. జిల్లా ఏర్పాటు పనుల విషయంలో అందరూ సహకరించాలని కోరారు. ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవం అక్టోబర్ 11న మంత్రి తుమ్మల నా గేశ్వర్‌రావు చేతులమీదుగా జరుగుతుందని తె లిపారు. ఈ కార్యక్రమంలో టౌ¯ŒS సీఐ నందిరామ్‌నాయక్, రూరల్ సీఐ కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మార్నేని వెంకన్న, పాల్వా యి రామ్మోహ¯ŒSరెడ్డి, డోలి లింగుబాబు, గడ్డం అశోక్, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, ఫరీద్, చిట్యాల జనార్ధ¯ŒS, ఆదిల్, పెద్దబోయిన కృష్ణ, దార వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఎస్పీ ఆఫీసులో ముగ్గురి ఆత్మహత్యాయత్నం
గుంటూరు అర్బన్: నగరంలోని ఎస్పీ ఆఫీసు గ్రీవెన్స్‌లో ముగ్గురు వ్యక్తులు సోమవారం ఎలకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో సిబ్బంది బాధితులను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివరాలు.. జిల్లా కేంద్రంలోని బొంగరాలబీడు- రెండవలైన్‌లో నెలపాటి నిర్మల అనే మహిళకు ఓ ఇల్లు ఉంది. దీనిని స్థానికుడైన అంబేద్కర్‌కు సంవత్సరం కింద లక్ష రూపాయలకు తాకట్టు పెట్టింది. నెల క్రితం ఇంటిని విడిపించుకోవడానికి వెళితే అంబేద్కర్ రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినా అక్కడ న్యాయం జరగక పోగా, పోలీసులు కూడా అంబేద్కర్‌కే సపోర్ట్ చేస్తున్నారు. దీంతో ఈరోజు జిల్లా ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేయడానికి నిర్మల, ఆమె కుమారుడు భాను ప్రకాశ్, ఆమె అక్క కుమార్తె కుమారీలు వచ్చారు. గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసిన అనంతరం తమకు న్యాయం చేయాలంటూ వెంట తెచ్చుకున్న ఎలకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అడ్డుకున్న సిబ్బంది వారిని హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు -
ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన
అనంతపురం: లాయర్ ఫక్రుద్దీన్ అరెస్ట్‌కు నిరసనగా న్యాయవాదులు రోడ్డెక్కారు. అకారణంగా అరెస్ట్ చేసిన ఫక్రుద్దీన్‌ను వెంటనే విడుదల చేయాలని న్యాయవాదులు గురువారం నిరసనకు దిగారు. న్యాయవాదులంతా కలిసి ఎస్పీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనంత కోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్న ఫక్రుద్దీన్ బుధవారం రాత్రి గుంతకల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ కు నిరిసనగా జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు నిరసనలు తెలుపుతున్నారు. -
ఎస్పీ ఆఫీసు ముందు మహిళ ధర్నా
కరీంనగర్ : జిల్లాలోని ఎస్పీ ఆఫీసు ముందు ప్రేమలత(35) అనే మహిళ మంగళవారం ధర్నాకు దిగింది. వరంగల్ జిల్లా మానకొండూరులో 6 నెలల ముందు ఎస్ఐగా పనిచేసిన రాజుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళన చేసింది. అక్కడికి చేరుకున్న ఎస్పీ.. చట్టప్రకారమే ఇంతకుముందు అతనిపై చర్యలు తీసుకున్నామని, చట్టానికి మించి తామేమీ చేయలేమని ఆమెకు తెలిపారు. ఆ తర్వాత ఆమెను అక్కడి నుంచి పంపించి వేశారు. 2014 లో ప్రేమలతను అప్పటి మానకొండూరు ఎస్ఐ రాజు వేధించటంతో ఎస్ఐను 6 నెలలు సస్పెండ్ చేశారు. ఆరు నెలల తర్వాత మళ్లీ రీపోస్టింగ్ ఇవ్వడంతో మళ్లీ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. ఎటువంటి చర్యలు తీసుకోలేమని ఎస్పీ ఆమెకు తెలిపారు. -
ఎంఆర్పీఎస్ ఆందోళన భగ్నం
జిల్లా వ్యాప్తంగా కట్టడి చేసిన పోలీసులు సంగారెడ్డి జోన్: ఎమ్మార్పీఎస్, కేవీపీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం సంగారెడ్డిలో తల పెట్టిన పాదయాత్ర, ఎస్పీ కార్యాలయం ముట్టడి కార్యక్రమాలను పోలీసులు భగ్నం చేశారు. సదాశివపేట మండలం ఎల్లారం గ్రామంలో దళితులు దేవాలయంలోకి రాకుం డా కంచె వేసిన సర్పంచ్, ఇతరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కేవీపీఎస్, ఎంఆర్పీఎస్ నాయకులు ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ శుక్రవారం ఉదయమే సంగారెడ్డి ఐబీకి చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు ఎస్పీ కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు వారిని ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. సంగారెడ్డిలో కేవీపీఎస్ నాయకుడు అడివయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు సడాకుల కృష్ణ, నవాజ్‌లను పోలీసులు ఉదయమే అదుపులోకి తీసుకున్నారు. సదాశివపేట మండలం ఎల్లారం గ్రామ దళితులు సంగారెడ్డికి వస్తున్న క్రమంలో పెద్దాపూర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. జోగిపేట, దుబ్బాక, నారాయణఖేడ్, మెదక్, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో కూడా పాదయాత్రకు వస్తున్న నాయకులను కట్టడిచేశారు. కాగా పోలీసుల అదుపులో ఉన్న నాయకులను సంగారెడ్డిలోని ఐబీకి తీసుకువచ్చారు. మందకృష్ణ మాదిగతో పాటు నేతలతో జిల్లా అదనపు ఎస్పీ వెంకన్న చర్చలు జరిపారు. ఎల్లారం గ్రామంలో దళితులకు న్యాయంచేయాలని, సర్పంచ్‌ను అరెస్ట్ చేయాలని మందకృష్ణ మాదిగ తదితరులు ఎఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. కేసు దర్యాప్తులో ఉన్న కారణంగా మరో వారం రోజుల్లో న్యాయం చేస్తామని ఎఎస్పీ హామీ ఇవ్వడంతో వారు తమ ఆందోళన విరమించారు. దోషుల్ని వదిలి మమ్మల్ని అరెస్టా! సంగారెడ్డి మున్సిపాలిటీ/క్రైం: దళితులను అవమానించిన వారిని అరెస్టు చేయకుండా... న్యాయం చేయాలని కోరిన దళిత నాయకులను ఎలా అరెస్ట్ చేస్తారని మంద కృష్ణమాదిగ పోలీసులను ప్రశ్నించారు. దళితులను అవమానించినందుకు నిరసనగా శుక్రవారం తలపెట్టిన ఎస్పీ కార్యాలయం ముట్టడిని పోలీసులు భగ్నం చేసి, ఆందోళన చేపట్టిన నాయకులను అరెస్టు చేయడంపై ఆయన ఆగ్రహించారు. మందకృష్ణ మాట్లాడుతూ... సంఘటన జరిగిన వెంటనే తాను ఎల్లారం వెళ్లి, ఎస్పీ, డీఎస్పీలకు ఫోన్ చేసినప్పుడు... నిందితులను వారంలో అరెస్టు చేస్తామని చెప్పారన్నారు. పది రోజులు దాటినా వారిని పట్టుకోలేదని... అందుకు నిరసనగానే కేవీపీఎస్, ఎంఆర్పీఎస్, సీపీఎం ఆధ్వర్యంలో శాంతియుత ప్రదర్శన చేపట్టామన్నారు. నిందితులను వదిలేసి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిని అరెస్టు చేయడంలో ఆంతర్యమేమిటన్నారు. కాగా, కేసు దర్యాప్తులో ఉందని, వారంలో నిందితులపై చర్యలు తీసుకొంటామని ఏఎస్పీ వెంకన్న హామీ ఇచ్చారు. దీంతో ఎస్పీ కార్యాలయ ముట్టడిని ఈ నెల 21కి వాయిదా వేసినట్టు మందకృష్ణ తెలిపారు. -
నల్గొండలో ఎబివిపి విద్యార్థుల ఆందోళన
-
ఎస్పీ ఆఫీసు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం
సంగారెడ్డి: తనకు న్యాయం జరగడంలేదంటూ ఓ వ్యక్తి జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేశాడు. పటాన్చెరువు మండలం పెద్దకంజర్ల గ్రామానికి చెందిన జొన్నాడ కృష్ణ(35).. సోమవారం మద్యాహ్నం సంగారెడ్డిలోని మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు అతణ్ని అడ్డుకుని టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాధితుడు కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. తనకు 4.15 ఎకరాల భూమి ఉంది. దానిని ఓ లాయర్ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి వేరొకరికి విక్రయించాడు. ఈ విషయమై గతంలో పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, కొనుగోలుదారు సదరు భూమిని ఇటీవల ఆధీనంలోకి తీసుకున్నాడు. ఈ వ్యవహారంపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకుగానూ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌డేకు హజరయ్యాడు. అధికారులు సరిగా స్పందిచకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
కొత్తపేట సీఐపై మహిళాగ్రహం
♦ సీఐ అసభ్యకరంగా మాట్లాడి, బూటుకాలితో తన్నారు ♦ సస్పెండ్ చేసి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి ♦ ఎస్పీ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల ధర్నా గుంటూరు క్రైం : మహిళా సంఘాల సభ్యులతో అసభ్యంగా, అవమానకరంగా వ్యవహరించిన గుంటూరు కొత్తపేట పోలీస్‌స్టేషన్ ఎస్హెచ్ఓ సీఐ వెంకన్న చౌదరిని విధుల నుంచి తొలగించి, ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని కోరుతూ పలు ప్రజా సంఘాల నాయకులు, మహిళలు ఎస్పీ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా చేపట్టారు. మహిళ అయి వుండీ అసభ్య పదజాలాన్ని వాడిన మహిళా హెడ్ కానిస్టేబుల్ భాగ్యలక్ష్మిని వెంటనే సస్పెండ్ చేసి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్.విష్ణు మాట్లాడుతూ సోమవారం మద్యం దుకాణాల లెసైన్స్‌లు కేటాయించే విధానాన్ని నిరసిస్తూ గుంటూరులో ప్రదర్శన చేస్తున్న మహిళలపై కొత్తపేట సీఐ వ్యవహరించిన తీరు అనుచితంగా ఉందని, దీనిపై ఉన్నతాధికారులు విచారించి, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ప్రధాన కార్యదర్శి పద్మ మాట్లాడుతూ తమను సీఐ బూటుకాలుతో తన్ని, అసభ్యకరంగా మాట్లాడుతూ, రక్తం కారేలా కొట్టారన్నారు. సామాజిక న్యాయం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వై.కోటేశ్వరరావు(వైకే) మాట్లాడుతూ సీఐ వెంకన్న చౌదరిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళతామని తెలిపారు. అనంతరం అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కలసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు పి.ప్రసాద్, ఎస్.సురేష్, భావన్నారాయణ, జంగాల అజయ్‌కుమార్, కె.వినయ్‌కుమార్, బి.కొండారెడ్డి, మహిళా సంఘాల నాయకులు శీలం ఏసమ్మ, ఎన్,సాంబ్రాజ్యం, దేవి,అరుణ,ఐద్వా సంఘం మహిళలు పాల్గొన్నారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం
వేలూరు: అశ్లీల ఫొటోలు తీసి నగదు డిమాండ్ చేస్తున్న వేలూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ కారు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని ఒక మహిళ ఎస్పీ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. క్రిష్ణగిరి జిల్లా ఏలత్గిరి గ్రామానికి చెందిన కేత్రిన్ మేరి. వరప్పం గ్రామానికి చెందిన పార్తీబరాజ వేలూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ కారు డ్రైవర్. వీరి ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో కేత్రిన్మేరి, పార్తీబరాజ చనువుగా గడిపారు. ఈ దృశ్యాలను పార్తీబరాజ వీడియో తీసుకున్నాడు. ఈ వీడియోను కేత్రిన్మేరీకి చూపించి బెదిరించి *25 సవర్ల బంగారం,*10 లక్షల నగ దు తీసుకున్నాడు. దీంతో అతనిపై చర్యలు తీసుకోవాలని కేత్రిన్మేరీ శుక్రవా రం ఉదయం వేలూరు ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా చేసింది. అనంతరం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. విషయం తెలుసుకున్న ఎస్పీ సెంథిల్‌కుమారి, కేత్రిన్మేరీని విచారించారు. రెండు రోజుల్లో అతనిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. కేత్రిన్ మేరీని ఆస్పత్రికి తరలించారు.