ఎస్పీని ఆశ్రయించిన ప్రేమజంటలు | Love Couples Meet SP For Protect In Tamil Nadu | Sakshi
Sakshi News home page

ఎస్పీని ఆశ్రయించిన ప్రేమజంటలు

Published Fri, Aug 17 2018 11:48 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

Love Couples Meet SP For Protect In Tamil Nadu - Sakshi

ప్రేమ జంటలు

తమిళనాడు, వేలూరు: రక్షణ కల్పించాలని కోరుతూ ఒకేరోజు మూడు ప్రేమజంటలు గురువారం వేలూరు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నాయి. వివరాలు.. వేలూరు జిల్లా కేవీ కుప్పంకు చెందిన జ్యోతిక గుడియాత్తంలోని ప్రవేట్‌ కళాశాలలో బీఎస్సీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ సతీష్‌కుమార్‌తో పరిచయం ఏర్పడి మూడేళ్లుగా ప్రేమించకుంటున్నారు. వీరి పెళ్లికి ఇద్దరి కుటుంబ సభ్యులు అంగీకారం తెలపలేదు. దీంతో రెండు రోజుల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వచ్చి వివాహం చేసుకున్నారు. గురువారం ఉదయం ఇద్దరూ ఎస్పీ కార్యాలయానికి చేరుకొని రక్షణ కోరారు. అదే విధంగా నాట్రంబల్లి సమీపంలోని పచ్చూరు గ్రామానికి చెందిన జయశ్రీ ప్రవేట్‌ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతోంది.

ఈమె పాతపేటకు చెందిన మయిల్‌ వాణన్‌ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మయిల్‌వాణన్‌ ఒడిసా రాష్ట్రంలోని ప్రవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. వీరి వివాహానికి ఇద్దరి తల్లిదండ్రులు అంగీకరించలేదు. వారు 13వ తేదీన వివాహం చేసుకున్నారు. రక్షణ కల్పించాలని ఎస్పీ కార్యాలయంలో విన్నవించారు. అదే విధంగా ఆంబూరు బీకస్పా ప్రాంతానికి చెందిన దివ్యభారతి ల్యాబ్‌ టెక్నిషియన్‌గా పనిచేస్తోంది. అదే గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి పెద్దలు అంగీకరించకలేదు. దివ్య భారతికి వేరే వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. ఇద్దరూ 11వ తేదీన తిరువణ్ణామలైలోని ఆలయంలో వివాహం చేసుకున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement