సేలం: ‘‘కురువృద్ధుడైన నా భర్త అక్రమ సంబంధాలకు అడ్డుకట్ట వేసి, మా ఆస్తిని మాకు అందించండి లేకుంటే కారుణ్య మరణానికైనా అమతివ్వండి’’ అంటూ 82 ఏళ్ల వృద్ధురాలు తన 90 ఏళ్ల భర్తపై కలెక్టర్‌కు మంగళవారం ఫిర్యాదు పేర్కొంది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. సేలం జిల్లా ఓమలూరు తాలూకా డేనిస్‌పేట పెరియవడాగపట్టికి చెందిన పళనియప్పన్ (90). ఇతని భార్య పొన్నమ్మాల్ (82). ఈమె తన కుమార్తె కమలా (65)తో మంగళవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఒక ఫిర్యాదు ఇచ్చింది. అందులో.. తనకు భర్త, కుమార్తె, కుమారుడు ఉన్నారన్నారు. అనారోగ్యంతో కుమారుడు 70 ఏళ్ల వయసులో మరణించాడని పేర్కొంది. అయితే తన భర్త పళనియప్పన్ కుప్పాయి (70) అనే మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని ఆరోపించింది. అక్రమ సంబంధాన్ని వదులుకోవాలని పలుమార్లు తాము చెప్పినా పళనియప్పన్ వినిపించుకోలేదని వాపోయింది.
పైగా ఇటీవల పళనియమ్మాల్ (70) అనే మరో మహిళతో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పేర్కొంది. తమకు సొంతమైన లక్షల విలువ చేసే 6.5 ఎకరాల భూమిని పళనియమ్మాల్ పేరుతో రాసేశాడని ఆరోపించింది. అదేమిటని ప్రశి్నస్తే తాము మనవడితో నివసిస్తున్న ఇంటిని కూడా కూల్చివేస్తానని బెదిరిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వయసులో కూలి పనికి వెళ్లి పని చేసుకుంటూ కష్ట పడుతున్నానని, భర్త అక్రమ సంబంధాలను అడ్డుకుని, తన ఆస్తిని తిరిగి ఇప్పించి భద్రత కలి్పంచాలని కోరుతున్నాను.. అలా వీలుకాని పక్షంలో కారుణ్య మరణానికైనా అనుమతివ్వాలని వేడుకున్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టి తగిన న్యాయం చేయాలని పోలీసు శాఖను కలెక్టర్ కార్యాలయం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment