కొడుకులు కూడు పెట్టట్లే సార్‌.. ఓ వృద్ధురాలి దీనగాథ | Old Woman Complaint Against Her Children Over Property Issues Tamil Nadu | Sakshi
Sakshi News home page

కొడుకులు కూడు పెట్టట్లే సార్‌.. ఓ వృద్ధురాలి దీనగాథ

Published Tue, May 24 2022 8:17 AM | Last Updated on Tue, May 24 2022 8:20 AM

Old Woman Complaint Against Her Children Over Property Issues Tamil Nadu - Sakshi

తిరువళ్లూరు(చెన్నై): ఐదుగురు సంతానం ఉన్నా ఎవరూ తనను పట్టించుకోవడం లేదని.. ఈ నేపథ్యంలో తన భర్తపై పేరుపై వున్న ఇంటిని తన పేరుపై మార్చాలని కోరుతూ ఓ వృద్ధురాలు సోమవారం కలెక్టర్‌ ఆల్బీజాన్‌వర్గీష్‌కు వినతి పత్రం సమర్పించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కాకలూరుకు చెందిన శివజ్ఞాన సంబంధం, విజయలక్ష్మి(74) దంపతులకు ఐదుగురు సంతానం.

వీరికి అదే ప్రాంతంలో కోటి రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. శివజ్ఞాన సంబంధం 2012లో మృతి చెందాడు. అయితే అప్పటి నుంచి కొడుకులు పట్టించుకోవడం లేదని, తిండి కూడా పెట్టడంలేదని తల్లి విజయలక్ష్మి వాపోయారు. తన భర్త పేరుపై ఉన్న ఆస్తిని కొడుకులకు ఇవ్వకుండా తన పేరుపై మార్చాలని కలెక్టర్‌ను కోరింది. స్పందించిన కలెక్టర్‌ బాధితురాలికి న్యాయం చేయాలని తిరువళ్లూరు తహసీల్దార్‌ను ఆదేశించారు.

చదవండి: నిర్మలా సీతారామన్‌కు కర్ణాటక మొండిచేయి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement