property issues
-
లేటు వయసులో ఘాటు ప్రేమ.. లవర్‌కు ఆస్తి రాసిచ్చేశాడు.. తర్వాత ట్విస్ట్
సేలం: ‘‘కురువృద్ధుడైన నా భర్త అక్రమ సంబంధాలకు అడ్డుకట్ట వేసి, మా ఆస్తిని మాకు అందించండి లేకుంటే కారుణ్య మరణానికైనా అమతివ్వండి’’ అంటూ 82 ఏళ్ల వృద్ధురాలు తన 90 ఏళ్ల భర్తపై కలెక్టర్‌కు మంగళవారం ఫిర్యాదు పేర్కొంది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సేలం జిల్లా ఓమలూరు తాలూకా డేనిస్పేట పెరియవడాగపట్టికి చెందిన పళనియప్పన్ (90). ఇతని భార్య పొన్నమ్మాల్ (82). ఈమె తన కుమార్తె కమలా (65)తో మంగళవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఒక ఫిర్యాదు ఇచ్చింది. అందులో.. తనకు భర్త, కుమార్తె, కుమారుడు ఉన్నారన్నారు. అనారోగ్యంతో కుమారుడు 70 ఏళ్ల వయసులో మరణించాడని పేర్కొంది. అయితే తన భర్త పళనియప్పన్ కుప్పాయి (70) అనే మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని ఆరోపించింది. అక్రమ సంబంధాన్ని వదులుకోవాలని పలుమార్లు తాము చెప్పినా పళనియప్పన్ వినిపించుకోలేదని వాపోయింది. పైగా ఇటీవల పళనియమ్మాల్ (70) అనే మరో మహిళతో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పేర్కొంది. తమకు సొంతమైన లక్షల విలువ చేసే 6.5 ఎకరాల భూమిని పళనియమ్మాల్ పేరుతో రాసేశాడని ఆరోపించింది. అదేమిటని ప్రశి్నస్తే తాము మనవడితో నివసిస్తున్న ఇంటిని కూడా కూల్చివేస్తానని బెదిరిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వయసులో కూలి పనికి వెళ్లి పని చేసుకుంటూ కష్ట పడుతున్నానని, భర్త అక్రమ సంబంధాలను అడ్డుకుని, తన ఆస్తిని తిరిగి ఇప్పించి భద్రత కలి్పంచాలని కోరుతున్నాను.. అలా వీలుకాని పక్షంలో కారుణ్య మరణానికైనా అనుమతివ్వాలని వేడుకున్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టి తగిన న్యాయం చేయాలని పోలీసు శాఖను కలెక్టర్ కార్యాలయం ఆదేశించింది. -
కొడుకులు కూడు పెట్టట్లే సార్.. ఓ వృద్ధురాలి దీనగాథ
తిరువళ్లూరు(చెన్నై): ఐదుగురు సంతానం ఉన్నా ఎవరూ తనను పట్టించుకోవడం లేదని.. ఈ నేపథ్యంలో తన భర్తపై పేరుపై వున్న ఇంటిని తన పేరుపై మార్చాలని కోరుతూ ఓ వృద్ధురాలు సోమవారం కలెక్టర్ ఆల్బీజాన్‌వర్గీష్‌కు వినతి పత్రం సమర్పించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కాకలూరుకు చెందిన శివజ్ఞాన సంబంధం, విజయలక్ష్మి(74) దంపతులకు ఐదుగురు సంతానం. వీరికి అదే ప్రాంతంలో కోటి రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. శివజ్ఞాన సంబంధం 2012లో మృతి చెందాడు. అయితే అప్పటి నుంచి కొడుకులు పట్టించుకోవడం లేదని, తిండి కూడా పెట్టడంలేదని తల్లి విజయలక్ష్మి వాపోయారు. తన భర్త పేరుపై ఉన్న ఆస్తిని కొడుకులకు ఇవ్వకుండా తన పేరుపై మార్చాలని కలెక్టర్‌ను కోరింది. స్పందించిన కలెక్టర్ బాధితురాలికి న్యాయం చేయాలని తిరువళ్లూరు తహసీల్దార్‌ను ఆదేశించారు. చదవండి: నిర్మలా సీతారామన్‌కు కర్ణాటక మొండిచేయి? -
ఆస్తి తగాదా.. వారం రోజులుగా తల్లికొడుకులని ఇంట్లో బంధించి..
భువనేశ్వర్: ఆస్తి తగాదా నేపథ్యంలో తల్లీకొడుకులు గృహనిర్బంధానికి గురైన అరుదైన సంఘటన స్థానిక సిర్పి ఛక్ ప్రియదర్శిని మార్కెట్ దగ్గర సంచలనం రేకిత్తించింది. వారం రోజులుగా 76 ఏళ్ల వృద్ధురాలు అనసూయ మహంతి, ఆమె కొడుకు గృహ బంధీలుగా ఉండడం చూసి, చుట్టుపక్కల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారిని చూసేందుకు జనాలు పోటెత్తడంతో అక్కడ 144 సెక్షన్ విధించి, పోలీసులు చర్యలు చేపడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. కైలాస్ చంద్రమహంతి(లేటు) తొలి భార్య అనసూయ మహంతి. దాదాపు 20 ఏళ్ల నుంచి ఈమె భర్త నుంచి వేరుగా కొడుకుతో కలిసి నివాసముంటోంది. ఈ క్రమంలో కైలాస్ మహంతి రెండో భార్యతో కలిసి ఇంట్లో ఉంటూనే ఇటీవల ఆయన చినిపోయారు. భర్త తదనంతరం ఆస్తిపై హక్కు కోసం అనసూయ మహంతి కోర్టుని ఆశ్రయించింది. 2021 అక్టోబరులో స్థానిక దిగువ కోర్టుకు ఈమెకి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పుని సవాలు చేస్తూ రెండో భార్య ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది. ఇది విచారణ దశలో ఉండగా, తుది తీర్పు వెలువడేంతవరకు యథాతథ స్థితి(స్టేటస్–కో) కొనసాగుతుందని ఉన్నత న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించి మరీ కొడుకుతో కలిసి భర్త ఉంటున్న ఇంట్లోకి చొరబడడంతో కైలాస్ మహంతి రెండో భార్య ఇంటి గేటు తలుపులకు తాళం వేసింది. దీంతో వారం రోజులుగా వారు అదే ఇంట్లో బంధీలుగా ఉన్నారు. న్యాయస్థానం పరిధిలో వీరి వివాదం ఉన్నందున శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు తాళాలు తీసి, తమకు స్వేచ్ఛ కల్పించాలని బాధితులు అభ్యర్థిస్తున్నారు. -
న్యాయం చేస్తారా.. ఆత్మహత్య చేసుకోమంటారా?
తాండూరు(వికారాబాద్) : మండలంలోని కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్ ఎదుట అక్కాచెల్లెళ్లు హల్చల్ చేశారు. ఆస్తి తగదాల నేపథ్యంలో సొంత తమ్ముడు వేధిస్తున్నాడని ఆత్మహత్య చేసుకుంటామని పోలీసుల ఎదుట వాపోయారు. కోత్లాపూర్‌కు చెందిన జగ్గమ్మ, రేణుక అక్క, చెల్లెళ్లు. నరేష్‌గౌడ్ వారి సోదరుడు. జగ్గమ్మ, రేణుక వివాహమైనా కోత్లాపూర్లోనే నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలో వారి తమ్ముడు నరేష్‌గౌడ్ ఆస్తి విషయమై పలుమార్లు తమను కొట్టాడని అక్కాచెల్లెళ్లు ఆరోపిస్తున్నారు. శనివారం జగ్గమ్మపై తమ్ముడు నరేష్ చేయిచేసుకోవడంతో ఆదివారం అక్క, చెల్లెలు ఇరువురు కరన్‌కోట్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. తమ తమ్ముడు నరేష్ తరుచూ గొడవపెట్టుకొని మమ్మల్ని కొడుతున్నాడని పోలీస్‌స్టేషన్ ఎదుట వాపోయారు. పోలీసులు న్యాయం చేయకపోతే వెంటతెచ్చుకున్నపెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. రూరల్ సీఐ జలంధర్‌రెడ్డి, ఎస్ఐ ఏడుకొండలు కల్పించుకోని నరేష్‌పై గతంలో కేసు నమోదు చేశామని ప్రస్తుతం మళ్లీ కేసు నమోదుచేస్తామని చెప్పడంతో అక్క, చెల్లెలు శాంతించారు. చదవండి: ఏడుగురి స్నేహితుల మధ్య ‘లూడో గేమ్’ వివాదం -
ఆస్తి పంపకాల్లో అన్యాయం.. కిరాతకంగా తల్లి, కుమార్తెను..
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగిందని తల్లి, కుమార్తెను విచక్షణరహితంగా నరికి చంపిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు రూరల్ ఏఎస్పీ ఎన్వీఎస్ మూర్తి తెలిపారు. రూరల్ జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని సమావేశ మందిరంలో సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి, టౌన్ సీఐ శోభన్‌బాబు, ఎస్ఐ రఘపతితో కలిసి బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ సత్తెనపల్లి టౌన్ నాగార్జుననగర్‌లో ఉంటున్న కోనూరు పద్మావతి, మానప్రగఢ లక్ష్మీప్రత్యూష తల్లీ కుమార్తెలు. తాత కోనూరు లక్ష్మీనారాయణ ఆస్తిని పంచకుండా తల్లీ కుమార్తె అడ్డుపడుతున్నారని కోనూరు శ్రీనివాసచక్రవర్తి కక్ష పెంచుకున్నాడు. దీనికితోడు బెల్లంకొండ మండలం నందిరాజుపాలెం గ్రామంలో, రాజుపాలెం గ్రామంలో సుమారు 6.34 ఎకరాల వ్యవసాయ భూమిని పెద్ద బాబాయి అయిన శివప్రసాదరావు తన కుటుంబ సభ్యులకు రాసుకున్నాడని, తనకు రావాల్సిన వాటా చెల్లించకుండా ఉన్నారని శ్రీనివాసచక్రవర్తి భావించాడు. ఈ ఆస్తి పంపకాల్లో తల్లి, కుమార్తె అడ్డుపడుతున్నారని ఎలాగైనా వారిని హత్య చేయాలనే ఉద్దేశంతో గత నెల 28 రాత్రి సుమారు 7.26 గంటల సమయంలో వారు నివసించే ఇంటికి శ్రీనివాసచక్రవర్తి చేరుకున్నాడు. ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగిందనే కారణంతో తనవెంట తెచ్చుకున్న కత్తితో తల్లి, కుమార్తెను అతి కిరాతకంగా హత్య చేశాడు. కొనఊపిరితో ఉన్న తల్లిని ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే మృతి చెందింది. సత్తెనపల్లి టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సత్తెనపల్లిలోని హోలీ ఫ్యామిలీ స్కూల్ సమీపాన మంగళవారం సాయంత్రం శ్రీనివాసచక్రవర్తిని అరెస్ట్ చేసి కత్తిని సీజ్ చేసినట్లు ఏఎస్పీ చెప్పారు. నిందితుడి స్వస్థలం బెల్లంకొండ మండలం నందిరాజుపాలెం గ్రామమని, ప్రస్తుతం గుంటూరు జిన్నాటవర్ సెంటర్లోని ఓ డార్మెంటరీలో ఉంటున్నాడని చెప్పారు. అతను లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడని, గుంటూరులోని లాడ్జిలో మడత మంచాలు అద్దెకు తీసుకుని ఉండేవాడని తెలిపారు. చదవండి: ఏమైందో? ఏమో?..అనుమానాస్పద స్థితిలో యువతి మృతి -
ఎన్నాళ్లైనా ఆస్తిలో వాటా దక్కదని .. కొడుకులతో కలిసి
సాక్షి, తొగుట(దుబ్బాక): కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ మహిళ తన ఇద్దరు కుమారులకు విషం తాగించి, తానూ సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం తొగుట మండలం తుక్కాపురంలో జరిగింది. స్థాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముడికె కొమురయ్య, ఎల్లవ్వ దంపతులకు ఇద్దరు కొడుకులు కిష్టయ్య, దేవరాజు ఉన్నారు. కొమురయ్య వ్యవసాయ భూమి మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో 4 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుంది. దీంతో ప్రభుత్వం అందించిన నష్టపరిహారంతో మిరుదొడ్డి మండలంలోని ధర్మారంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. ఎకరం తన పేరున, ఎకరం చిన్న కొడుకు దేవరాజు పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. అలాగే సిద్దిపేట పట్టణంలోని ప్లాటు కూడా చిన్న కుమారునికి అప్పగించాడు. ఇద్దరు కుమారులకు ఆస్తి సమానంగా పంపకాలు చేయకుండా ఒక్కడికే ఇవ్వడం ఏంటని పెద్ద కుమారుడు కిష్టయ్య, అతని భార్య అనిత అత్తమామలను నిలదీశారు. ఈ విషయమై కుటుంబంలో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. కాగా ఆస్తి విషయాన్ని గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఇద్దరు కుమారులకు సమానంగా పంపిణీ చేయాలంటూ గ్రామ పెద్దలు తీర్మానించారు. అయినా తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రాలేదు. సాగు భూమి కోల్పోవడం తనకు రావాల్సిన వాటా ఇవ్వకపోవడంతో కిష్టయ్య అప్పు చేసి ఆటో కొనుక్కుని కుటుంబాన్ని నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం అత్తాకోడళ్లు మళ్లీ తగాదా పెట్టుకున్నారు. ఎన్నాళ్లైనా ఆస్తిలో వాటా దక్కదన్న మనోవేదనకు గురైన అనిత(28) భర్త ఆటో తీసుకుని ఇంటి నుంచి వెళ్లిన తర్వాత ఇద్దరు కుమారులను ఇంట్లోకి తీసుకెళ్లి గడ్డిమందు దీక్షిత్ (06)కు తాగించింది. చిన్న కుమారుడు ఆర్చి(03)కి తాగించే ప్రయత్నం చేయగా బయపడి బయటకు పరుగెత్తగా తాను తాగి అపస్మారక పరిస్థితిలో పడిపోయింది. గమనించిన ఇరుగు పొరుగు వారు చికిత్స కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనిత పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీక్షిత్ సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం బాబుకు ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. కాగా అనిత పరిస్థితి విషమంగానే ఉన్నట్లు బంధవులు తెలిపారు. -
అన్న కొడుకే సూత్రధారి
సాక్షి, నెల్లూరు (క్రైమ్): ఆస్తి విభేదాలే మహేంద్రసింగ్ రాజ్‌పురోహిత్ (40) హత్యకు దారి తీశాయి. సొంత అన్న కొడుకే కిరాయి హంతకులతో తుద ముట్టించాడని పోలీసులు నిగ్గుతేల్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సూత్రధారి విక్రమ్‌సింగ్‌ను పోలీసులు ఆదివారం రాత్రి తిరుపతిలో అరెస్ట్ చేశారు. హత్యకు పాల్పడిన కిరాయి హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం స్థానిక ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఐశ్వర్య రస్తోగి పవర్ టూల్స్ వ్యాపారి మహేంద్రసింగ్ హత్యకు దారి తీసిన పరిస్థితులను వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రం బార్మేర్ జిల్లా సంద్రి మండలం ఆర్తండి గ్రామానికి చెందిన మహేంద్రసింగ్ రాజ్‌పురోహిత్ తన భార్య ఉషాదేవితో కలిసి 15 ఏళ్ల కిందట ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికి వలస వచ్చారు. ఫత్తేఖాన్‌పేట రైతుబజారు ఎదురుగా అక్కనవారి వీధిలో నివాసం ఉంటూ అక్కడే కోమల్ పవర్ టూల్స్ దుకాణం నిర్వహిస్తున్నారు. ఆయన అన్న మంగిలాల్ కుమారుడు విక్రమ్‌సింగ్ చిన్నప్పటి నుంచే బాబాయి మహేంద్రసింగ్ వద్ద ఉంటూ వ్యాపారంలో మెళుకువలు నేర్చుకున్నాడు. విక్రమ్‌సింగ్‌కు బాబాయే వివాహం చేశాడు. ఈ క్రమంలో మహేంద్రసింగ్ సంతపేటలో పవర్ టూల్స్ దుకాణం ప్రారంభించి దాని బాధ్యతలను విక్రమసింగ్‌కు అప్పగించాడు. షాపులో మంచి లాభాలు వచ్చాయి. అయితే విక్రమసింగ్ డబ్బును కాజేసి నష్టాలను చూపించసాగాడు. దీంతో మహేంద్రసింగ్ అతన్ని తిరుపతికి పంపించేశాడు. ఈ క్రమంలో విక్రమ్‌సింగ్ ఆర్థికంగా చితికిపోయాడు ఆస్తి విషయమే విభేదాలకు కారణం గతంలో మహేంద్రసింగ్ తన స్వగ్రామంలో తనతో పాటు తన అన్నకు కూడా ఇల్లు కట్టిస్తానని విక్రమసింగ్‌కు మాటిచ్చాడు. అయితే మహేంద్రసింగ్ ఒక్కడే తన భార్య పేరిట ఇంటిని నిర్మించుకున్నాడు. తన తండ్రికి ఎందుకు ఇల్లు కట్టించి ఇవ్వలేదని అప్పట్లోనే మహేంద్రసింగ్‌తో విక్రమ్‌సింగ్ గొడవ పడ్డాడు. దీంతో విక్రమ్‌సింగ్ తన బాబాయిపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా బాబాయిని అడ్డు తొలగించుకుంటే ఆస్తి మొత్తం తనదే అవుతుందని ఏడాదిగా ఆయన హత్యకు పథక రచన చేశాడు. మూడో సారి.. గురి చూసి.. నిందితులు మహేంద్రసింగ్ కదలికలపై నిఘా ఉంచారు. ఈ ఏడాది వినాయకచవితి సందర్భంగా ఆయన తన స్వగ్రామానికి వెళ్లడంతో అక్కడ ఆయన్ను అంతమొందించేందుకు ప్రయత్నించారు. అయితే స్వగ్రామం కావడం అందరూ తెలిసిన వారే కావడంతో దొరికిపోతారని ఆ ప్రయత్నాని విరమించుకున్నారు. ఆ తర్వాత నిందితులు నెల్లూరుకు చేరుకుని రెండు సార్లు మహేంద్రసింగ్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించారు. అది వీలు పడలేదు. ఈ నెల 3వ తేదీ రాత్రి మహేంద్రసింగ్ ఇంటికి వెళ్తుండగా నిందితుల్లో ఇద్దరు మోటారు బైక్‌పై వచ్చి తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశారు. ఐదు బృందాలతో గాలింపు మహేంద్రసింగ్ హత్య నెల్లూరు జిల్లాలో సంచలనం రేకెత్తించింది. ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఈ ఘటనను సవాల్‌గా తీసుకున్నారు. ఐదు బృందాలను ఏర్పాటు చేసి విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు చేపట్టారు. హతుడి కాల్ డిటైల్స్, ఘటన జరిగిన సమయంలో నగరంలోని సీసీ ఫుటేజ్‌లు, మృతుడితో బంధువులకున్న విభేదాలు తదితర కోణాల్లో క్షుణ్ణంగా విచారణ చేపట్టారు. విచారణలో విక్రమ్‌సింగ్ ఈ దురాఘాతానికి ఒడిగట్టాడన్న సమాచారం అందడంతో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఆదివారం రాత్రి తిరుపతిలో విక్రమ్‌సింగ్‌ను అదుపులోకి తీసుకుని నెల్లూరుకు తరలించారు విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. హత్యకు పాల్పడిన కిరాయి హంతకుల కోసం బృందాలు మహారాష్ట్ర, రాజస్థాన్‌ల్లో విస్తృత గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని ఎస్పీ వెల్లడించారు. నిందితుడు విక్రమ్‌సింగ్ (ఫైల్) సిబ్బందికి అభినందన : మహేంద్రసింగ్ హత్య కేసులో చిన్నపాటి క్లూసైతం సిబ్బందికి దొరకలేదన్నారు. దీంతో అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేయడంతో కేసులోని చిక్కుముడి వీడిందని, నిందితుడిని అరెస్ట్ చేయగలిగారన్నారు. త్వరితగతిన కేసును ఛేదించిన నగర డీఎస్పీతో పాటు ప్రత్యేక బృందాల్లోని సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ పి. పరమేశ్వర్‌రెడ్డి, నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, చిన్నబజారు పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ సుభాన్ తదితరులు పాల్గొన్నారు. -
నడిరోడ్డుపై కన్నతండ్రిని హతమార్చారు!
సాక్షి, నల్గొండ : నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే కుమారులు కన్నతండ్రిపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేసి హత్య చేశారు. అనుముల మండలం హాలియలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదాలే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. అనుముల మండలం హాలియ గ్రామానికి చెందిన చందారెడ్డి గోవిందరెడ్డి తన అల్లుడు కూనిరెడ్డి సైదురెడ్డితో కలిసి ఏదో పని మీద బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా గోవింద రెడ్డి కుమారులు అంజిరెడ్డి, రమణారెడ్డిలు ఒక్కసారిగా తండ్రి, బావ సైదురెడ్డిలపై దాడికి పాల్పడ్డారు. కర్రలు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తండ్రి గోవిందరెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, వీరి బావ సైదురెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడిఉన్న గోవింద రెడ్డి మృతదేహం పక్కన ఆంధ్రా బ్యాంకు పాస్‌బుక్ ఉందని పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ సైదురెడ్డిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆస్తి గొడవలే హత్యకు దారితీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
కత్తులతో దాడి.. దంపతుల దారుణహత్య
మైదుకూరు(వైఎస్సార్): వైఎస్సార్ జిల్లా మైదుకూరు పట్టణంలో సోమవారం అర్థరాత్రి దారుణం జరిగింది. నిద్రిస్తున్న దంపతులను గుర్తు తెలియని దుండగులు నరికి చంపారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుందని భావిస్తున్నారు. సాయినాథపురంలోని ఎల్లమ్మ వీధిలో పాత దుస్తుల వ్యాపారం చేసుకునే అయ్యవారయ్య(41) కుటుంబం నివాసం ఉంటోంది. సోమవారం రాత్రి అయ్యవారయ్య, ఆయన భార్య నాగులు(35) భవనం పైఅంతస్తులో నిద్రించారు. రాత్రి 1.30 గంటల తర్వాత గుర్తుతెలియని దుండగులు వారిపై గొడ్డలి, కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన దంపతులు కేకలు వేయటంతో కుటుంబసభ్యులు పై అంతస్తుకు చేరుకున్నారు. వారు అక్కడికి రాగానే దుండగులు పరారయ్యారు. తీవ్రంగా రక్తస్రావం కావటంతో ఆస్పత్రికి తరలించేలోగానే ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. తమ బంధువులు నర్సింహులు, అతని కుమారుడు శ్రీను తమ అమ్మానాన్నలను చంపేసి, పారిపోతుండగా తాను చూశానని అయ్యవారయ్య కుమార్తె చెబుతోంది. కుటుంబ తగాదాల కారణంగానే మృతుని తండ్రి పెద్ద నర్సింహులు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ రామకృష్ణయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. -
మేనమామే.. కాల యముడయ్యాడు!