వేలూరు: అశ్లీల ఫొటోలు తీసి నగదు డిమాండ్ చేస్తున్న వేలూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ కారు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని ఒక మహిళ ఎస్పీ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. క్రిష్ణగిరి జిల్లా ఏలత్‌గిరి గ్రామానికి చెందిన కేత్రిన్ మేరి. వరప్పం గ్రామానికి చెందిన పార్తీబరాజ వేలూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ కారు డ్రైవర్. వీరి ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో కేత్రిన్‌మేరి, పార్తీబరాజ చనువుగా గడిపారు. ఈ దృశ్యాలను పార్తీబరాజ వీడియో తీసుకున్నాడు.
ఈ వీడియోను కేత్రిన్‌మేరీకి చూపించి బెదిరించి *25 సవర్ల బంగారం,*10 లక్షల నగ దు తీసుకున్నాడు. దీంతో అతనిపై చర్యలు తీసుకోవాలని కేత్రిన్‌మేరీ శుక్రవా రం ఉదయం వేలూరు ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా చేసింది. అనంతరం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. విషయం తెలుసుకున్న ఎస్పీ సెంథిల్‌కుమారి, కేత్రిన్‌మేరీని విచారించారు. రెండు రోజుల్లో అతనిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. కేత్రిన్ మేరీని ఆస్పత్రికి తరలించారు.
మహిళ ఆత్మహత్యాయత్నం
Published Sat, Nov 29 2014 2:29 AM | Last Updated on Tue, Sep 18 2018 8:00 PM
Advertisement
Advertisement