
ప్రతీకాత్మక చిత్రం
శ్రీనగర్: ఉగ్రవాదులు, గ్రెనేడ్‌తో దాడి చేయడంతో ముగ్గురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శుక్రవారం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. అవంతిపురా పట్టణంలోని సూపరిండెంట్ కార్యాలయం వద్ద ఉగ్రవాదులు గ్రెనేడ్‌ను విసిరినట్లు పోలీసులు తెలిపారు. కార్యాలయం బయట గ్రెనేడ్ పేలడంతో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతమంతా ఉగ్రవాదుల కోసం జల్లెడ పట్టారు. అనుమానం వచ్చిన ప్రతిఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేయడం మొదలుపెట్టారు.
గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు..మహిళ మృతి
తుపాకీతో గుర్తుతెలియని వ్యక్తి, షమీమా అనే మహిళపై కాల్పులకు దిగాడు. ఈ సంఘటన జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో డ్రాబ్గాం గ్రామంలో శుక్రవారం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన షమీమా(38)ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా..అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని షమీమా చూసేందుకు వచ్చినపుడు ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment