ఎస్పీ ఆఫీసు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం | man attempts sucide at suparintendent office | Sakshi
Sakshi News home page

ఎస్పీ ఆఫీసు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Published Mon, Aug 17 2015 6:14 PM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM

man attempts sucide at suparintendent office

సంగారెడ్డి: తనకు న్యాయం జరగడంలేదంటూ ఓ వ్యక్తి జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేశాడు. పటాన్‌చెరువు మండలం పెద్దకంజర్ల గ్రామానికి చెందిన జొన్నాడ కృష్ణ(35).. సోమవారం మద్యాహ్నం సంగారెడ్డిలోని మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు అతణ్ని అడ్డుకుని టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాధితుడు కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..

తనకు 4.15 ఎకరాల భూమి ఉంది. దానిని ఓ లాయర్ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి వేరొకరికి విక్రయించాడు. ఈ విషయమై గతంలో పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, కొనుగోలుదారు సదరు భూమిని ఇటీవల ఆధీనంలోకి తీసుకున్నాడు. ఈ వ్యవహారంపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకుగానూ సోమవారం నిర్వహించే  గ్రీవెన్స్‌డేకు హజరయ్యాడు. అధికారులు సరిగా స్పందిచకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement