రాంచీ: భారత నయాగరాగా పిలవబడే చిత్రకూట్ జలపాతంలోకి దూకి ఒక యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు సమాయానికి స్పందించబట్టి ఆ యువతి 90 అడుగుల ఎత్తు నుండి దూకినా కాపాడగలిగారు. ఎటొచ్చి ఆమే ఎందుకు చనిపోవాలనుకుందో కారణం తెలిసిన తర్వాత ఎవ్వరికీ నోట మాట రాలేదు.
తన కోపమే తనకి శత్రువు అంటారు. అలాంటి కోపమే ఓ యువతి ప్రాణాలను యమలోకం అంచు వరకు తీసుకెళ్ళింది. పిల్లలు తప్పు చేస్తే తల్లదండ్రులు మందలించడం సర్వసాధారణమే. పిల్లలు అందుకు బదులుగా కోపగించడం కూడా సహజమే. రెండు మూడు రోజులు ఈ పరిస్థితి ఉంటుంది. తర్వాత అంతా మామూలే.. ఎక్కడో కొంతమంది మాత్రమే తల్లదండ్రులు తిట్టారని అజ్ఞానంతో వ్యవహరిస్తూ ఉంటారు.
అచ్చంగా అలాంటి పిచ్చి పనే చేసింది చిత్రకూట్ కు చెందిన సరస్వతి మౌర్య(21). నిత్యం సెల్ ఫోన్లో ఎదో ఒకటి చూసుకుంటూ కాలక్షేపం చేస్తోందన్న కారణంతో ఆమె తండ్రి శాంటో మౌర్య ఆమెను పరుషమైన మాటాలతో దూషించారట. తప్పు చేస్తున్నానని గ్రహించకపోగా అంత మాత్రానికే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని చెబుతున్నారు పోలీసులు.
కోపంతో సరస్వతి చిత్రకూట్ జలపాతాల వద్దకు వెళ్లి చుట్టుపక్కల వారు వారిస్తున్నా వినకుండా 90 అడుగుల ఎత్తు నుండి అందులోకి దూకేసింది. క్షణాల్లో ఆమె నదీప్రవాహంలో కిందకు వెళ్ళిపోయింది. అక్కడి గ్రామస్థులు అప్రమత్తమై బోటు మీద వెళ్లి సరస్వతిని రక్షించారు. అక్కడున్న సందర్శకుల్లో ఒకరు ఈ దృశ్యాన్ని ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇది కూడా చదవండి: కుటుంబాన్ని చంపి తగులబెట్టి.. మృతుల్లో ఆరు నెలల పసికందు..
Comments
Please login to add a commentAdd a comment