- పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్‌నాయక్
- 11న ప్రారంభోత్సవానికి ‘తుమ్మల’ రాక
ముమ్మరంగా ఎస్పీ కార్యాలయ పనులు
Published Sat, Oct 1 2016 1:26 AM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM
మహబూబాబాద్ : మానుకోట జిల్లా ఎస్పీ కా ర్యాలయ ఏర్పాటు పనులు వేగవంతమయ్యా యి. ఎస్పీ కార్యాలయానికి పట్టణ శివారులోని ఐటీఐ భవనాన్ని కేటాయించగా పలు పనులు కొనసాగుతున్నాయి. ఆయా పనులను ఎమ్మె ల్యే బానోత్ శంకర్‌నాయక్ శుక్రవారం పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.15లక్షల వ్యయం తో ప్రహరీ, రూ. 25లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఐటీఐ భవనంలో షెడ్డు, జవాన్ల విశ్రాంతికి రూమ్ నిర్మాణ పను లు కూడా చేపడుతామని చెప్పారు. జిల్లా ఏర్పాటు పనుల విషయంలో అందరూ సహకరించాలని కోరారు.
ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవం అక్టోబర్ 11న మంత్రి తుమ్మల నా గేశ్వర్‌రావు చేతులమీదుగా జరుగుతుందని తె లిపారు. ఈ కార్యక్రమంలో టౌ¯ŒS సీఐ నందిరామ్‌నాయక్, రూరల్ సీఐ కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు మార్నేని వెంకన్న, పాల్వా యి రామ్మోహ¯ŒSరెడ్డి, డోలి లింగుబాబు, గడ్డం అశోక్, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, ఫరీద్, చిట్యాల జనార్ధ¯ŒS, ఆదిల్, పెద్దబోయిన కృష్ణ, దార వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement