ప్రవాసీల కోసం 15న ఓమాన్ లో ఓపెన్ హౌజ్
Published Tue, Sep 12 2017 8:11 PM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM
♦ ప్రతినెల మూడవ శుక్రవారం మస్కట్ లో ప్రవాసి ప్రజావాణి
ఓమాన్: సుల్తానేట్ ఆఫ్ ఓమాన్ దేశ రాజధాని మస్కట్ లోని భారత రాయబార కార్యాలయంలో ఈనెల 15న మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపెన్ హౌజ్ బహిరంగ సామాజిక సమావేశం జరగనుంది. ఓమాన్ దేశంలో నివసించే ప్రవాస భారతీయ భవననిర్మాణ కార్మికులు, ఇంటిపనిచేసే మహిళలు, ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు మంద భీంరెడ్డి ఒక ప్రకటనలో కోరారు.
ప్రతినెల మూడవ శుక్రవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ఇండియన్ ఎంబసీ అధికారులతో నేరుగా తమ సమస్యలను చర్చించే అవకాశం లభిస్తుంది. ఓమాన్ లో ఇబ్బందుల్లో ఉన్న భారతీయులు ఎంబసీ 24 గంటల హెల్ప్ లైన్ నెంబర్ +968 2469 5981 లేదా మొబైల్ నెంబర్ +968 9276 9735 కు కాల్ చేయవచ్చు. వివిధ దేశాల్లో కష్టాల్లో చిక్కుకున్న వలసకార్మికుల పక్షాన భారత్ లోని వారి బంధువులు ఢిల్లీ లోని టోల్ ఫ్రీ నెంబర్ 1800-11-3090, హాట్ లైన్ నెంబర్ +91-11-4050 3090, మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ హెల్ప్ లైన్ నెంబర్ +91 93944 22622 కు గాని కాల్ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ వారు ఏపీ ఎన్నారై విభాగం నెంబర్ +91 97059 06976 కు, తెలంగాణ వారు టీ-ఎన్నారై విభాగం నెం. +91 94408 54433 కు కాల్ చేయవచ్చు.
Advertisement