కువైట్‌లో నివసిస్తున్న భారతీయ ఇంజనీర్లు, నర్సుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబరు 22న ఓపెన్ హౌజ్‌ను కువైట్‌లో ఇండియన్ ఎంబసీ నిర్వహించింది కోవిడ్ సంక్షోభం తర్వాత కువైట్‌లో చోటు చేసుకున్న మార్పులు.. అక్కడ భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానంగా ఈ ఓపెన్ హౌజ్ కార్యక్రమం జరిగింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలైంది.
గల్ఫ్ దేశాల్లో ఇంటి సహాయకులుగా పని చేస్తున్న వారి హక్కులు, జీత భత్యాలు అక్కడ వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలను తెలియజేస్తూ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇటీవల పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చింది. గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ఇంటి పని చేసే వారు జీవించేందుకు అనువైన అనేక అంశాలను ఈ పుస్తకంలో పొందు పరిచారు.
Comments
Please login to add a commentAdd a comment