
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అక్టోబర్‌లో నిర్వహించ తలపెట్టిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తొలి బహిరంగ సభ వాయిదా పడింది. మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ శనివారం ఈ విషయం ప్రకటించారు.
బహిరంగ సభ ఎప్పుడు నిర్వహించాలన్నది ఇంకా నిర్ణయించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా చెప్పారు. భోపాల్‌లో ఉమ్మడిగా భారీ సభ నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని ఇండియా కూటమి పక్షాలు ఇటీవలే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.