శ్రీకాకుళం జిల్లా వంగర్ మండలం మద్దివలస గ్రామం సమీపంలో పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు.
శ్రీకాకుళం జిల్లా వంగర్ మండలం మద్దివలస గ్రామం సమీపంలో పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన రామానాయుడు (50) శుక్రవారం ఉదయం చెరువు దగ్గర కాలకృత్యాలు తీర్చుకుని ఇంటికి తిరిగి వెళుతున్నాడు. ఈ సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. రామానాయుడు సమీపంలోనే పిడుగుపడడంతో అతడు మృతి చెందాడు.