Rama Naidu
-
మహిళా సర్పంచ్ పై రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
-
‘అహా నా పెళ్ళంట’ మూవీలో కోట పాత్రకు ముందుగా ఎవరిని అనుకున్నారో తెలుసా!
రాజేంద్ర ప్రసాద్ తొలి కామెడీ చిత్రం ఆహా నా పెళ్లంట. ఆదివిష్ణు రాసిన సత్యం గారి ఇల్లు నవల ఆధారంగా 1987 వచ్చిన ఈ మూవీకి జంధ్యాల దర్శకత్వం వహించారు. తెలుగు సినీ చరిత్రలో కామెడీ సినిమాల ట్రెండ్‌కు రెడ్ కార్పెట్ పరిచిన ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో రాజేంద్రప్రసాద్ కామెడీ హీరోగా అన్నివర్గాల ప్రేక్షకుల అలరించాడు. అంతేగకా హాస్య బ్రహ్మ బ్రహ్మనందంను నటుడిగా పరిచయం చేసిన చిత్రం కూడా ఇదే. ఇందులో బ్రహ్మి నత్తివాడిగా.. అరగుండు పాత్రలో నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. ఇక ఈ మూవీలో ఇప్పటికి ప్రత్యేకంగా గుర్తు చేసుకునే పాత్ర పిసినారి లక్ష్మీపతి. ఈ పాత్రలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఒదిగిపోయారు. చెప్పాలంటే ఆహా నా పెళ్లంట మూవీ గుర్తు వస్తే చాలు ముందుగా గుర్తోచ్చే పాత్ర కోట శ్రీనివాస్‌దే. ఇంటి దూలానికి బతికి ఉన్న కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ చికెన్ కూరతో అన్నం తింటున్నట్టుగా ఆస్వాధించిన సన్నివేశం ఇప్పటికి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. ఇక చూట్టాలు ఇంటికి వస్తే ఇలా చేయాలంటూ ఆ సన్నివేశాన్నే ఉదహరణగా తీసుకుంటూ చమత్కరిస్తుంటారు. అంతేగాక బట్టలను పొదుపు చేసేందుకు పేపర్ చుట్టుకుని పడుకోవడం ఇలా ఎన్నో సీన్లలో పిసినారి లక్ష్మిపతిగా కోట తన నటనతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. ఇప్పటికీ ఆ సీన్లు గుర్తోస్తే నవ్వని వారుండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ పాత్రను తాను తప్ప ఇంకెవరూ చేయలేరేమో అన్నంతగా కోట పిసినారి లక్ష్మీపతి పాత్రలో ఒదిగిపోయాడు. అంతలా ఆ పాత్రను పండించిన కోట శ్రీనివాస్‌ను మొదట తీసుకునేందుకు నిర్మాత రామానాయుడు ఒప్పుకొలేదట. ఈ విషయాన్ని స్వయంగా కోట శ్రీనివాసరావు ఓ ఇంటర్య్వూలో చెప్పాడు. ఎందుకంటే ఈ మూవీకి పిసినారి లక్ష్మిపతి పాత్రే కీలకం. అది పండితేనే ఈ సినిమా హిట్ లేదంటే పరాజయం చూడాల్సిందే. అంతటి ఈ ప్రధాన పాత్రకు కోట శ్రీనివాస రావును తీసుకోవాలని డైరెక్టర్ జంధ్యాల రామానాయుడికి సూచించాడట. అయితే ఈ పాత్ర కోటతో వద్దని ప్రముఖ నటుడు రావుగోపాలరావుతో చేయించాలని ఆయన అనుకున్నట్లు కోట వివరించాడు. అయితే జంధ్యాల మాత్రం ఆయనను తప్ప ఇంకేవరిని లక్ష్మీపతి పాత్రకు ఒప్పుకోలేదట. ఈ విషయంపై రామానాయుడు, జంధ్యాల దాదాపు 20 రోజుల పాటు వాదించుకున్నారని ఆయన అన్నాడు. అయితే కోట నటించిన మండలాధీశుడు చిత్రం విడుదల తర్వాత జంధ్యాల ఈ పాత్రకు కోటను ఫిక్స్ అయ్యారట, దీంతో ఆ మూవీలో పిసినారి పాత్రకు కోటను తప్ప ఇంకేవరిని తీసుకున్న పరాజయం తప్పదని తెల్చి చెప్పాడట. దీంతో రామానాయుడు చివరకు ఈ పాత్రకు కోట శ్రీనివాసరావును ఓకే చేశారట. కాగా ఒక రోజు చెన్నై వెళ్లడానికి కోట శ్రీనివాసరావు ఎయిర్‌పోర్టుకు వెళ్తుండా అక్కడ ఆయనకు రామానాయుడు కనిపించారట. కోటను చూసిన ఆయన ఇక్కడకు రావయ్యా నీతో ఓ విషయం చెప్పాలని పిలిచాడట. జంధ్యాలతో ఓ సినిమా ప్లాన్ చేశా అని, అందులో లక్ష్మీపతి పాత్ర గురించి కోటకు చెప్పి. జంధ్యాలతో జరుగుతున్న వాదన గురించి కూడా వివరించాడట. వాదన ఎందుకండీ ఈ క్యారెక్టర్‌కు రావు గోపాలరావే న్యాయం చేస్తాడని ఆయన బదులిచ్చినట్లు తెలిపారు. కానీ రావుగోపాలరావుకు ఎంత మేకప్ వేసినా ఆయన ముఖంలో ప్యూర్‌నెస్ రాదని జంధ్యాల అంటున్నారని రామానాయుడు ఆయనతో అన్నారని, ఏం చెప్పాలో అర్థంకాక సందిగ్ధంలో ఉన్న కోటకు ఆ పాత్రను నువ్వే చేయాలని బంపర్ ఆఫర్ ఇచ్చేశాడట రామానాయుడు. -
'ఈకథలో పాత్రలు కల్పితం' సినిమా అందరికి నచ్చుతుంది
పవన్ తేజ్ కొణిదెల, మేఘన హీరో హీరోయిన్ లుగా అభిరామ్ ఎమ్. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఈకథలో పాత్రలు కల్పితం'. మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజేష్ నాయుడు నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరుపుకున్న ఈ సినిమా ఈవెంట్ కు లిరిసిస్ట్ చంద్రబోస్, అంబర్ పేట్ శంకరన్న, బోరబండ సత్యం, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ర్యాప్ సింగర్ నోయెల్, హుషారు ఫేమ్ హీరో దినేష్ తేజ్, డాన్స్ మాస్టర్ యష్ తదితరులు హాజరై సినిమా ను ఆశీర్వదించారు. మార్చి 26 న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రిలీజ్ కాబోతున్న సందర్భంగా నిర్మాత రాజేష్ నాయుడు తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. నిర్మాత రాజేష్ నాయుడు మాట్లాడుతూ.. ‘మొదటి నుంచి ఈ సినిమా కి వస్తున్న సపోర్ట్ మర్చిపోలేనిది. పాటలకు , టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన వచ్చింది.. ఈ సినిమా కి కష్టపడి పనిచేసిన అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా ఈ సినిమా ని సపోర్ట్ చేస్తూ వచ్చిన అంబర్ పేట్ శంకరన్న, బోరబండ సత్యం అన్నలకు రుణపడి ఉంటాను. చిత్రం ఇంత బాగా రావడానికి వారిచ్చిన సహకారమే ముఖ్య కారణం.. సినిమాలోని పాట రిలీజ్ చేసిన శ్రీ వైఎస్ షర్మిల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.. ట్రైలర్ లాంచ్ చేసి మా సినిమా కి హైప్ తీసుకొచ్చిన పూరీజగన్నాధ్ గారికి ధన్యవాదాలు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసి సినిమా కు మంచి బూస్ట్ ఇచ్చిన లిరిసిస్ట్ చంద్రబోస్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ర్యాప్ సింగర్ నోయెల్, హుషారు ఫేమ్ హీరో దినేష్ తేజ్, డాన్స్ మాస్టర్ యష్ లకు ప్రత్యేక ధన్యవాదాలు. ఫైనల్ కాపీ సినిమా చూశాను.. సినిమా తప్పకుండ హిట్ అవుతుంది. మీరంతా ఓ రెండు గంటలు ఎంజాయ్ చేసే సినిమా ఇది.. అందరు తప్పకుండా సినిమా చూడండి..అన్నారు. -
చిత్రపతుల చెట్టపట్టాల్
ఉత్తర దక్షిణ ధ్రువాలు కలవవు. ఉత్తరాదివాళ్లు, దక్షిణాదివాళ్లు కూడా కలవరు. ‘మాకు మేమే, మీకు మీరే’ అని ‘మిస్సమ్మ’ చిత్రంలో సావిత్రిగారు రాగం తీస్తారు కదా.. అలా! కానీ వెండి తెర ఎవర్నైనా కలిపేస్తుంది. అయస్కాంతం అది! విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. ఈ ఆకర్షణే ఇప్పుడు బాలీవుడ్‌ని టాలీవుడ్‌తో కలుపుతోంది. ‘ఛత్రపతి’ చిత్రంలో ‘ఎ’ వచ్చి ‘బి’ పై వాలినట్లు.. ‘బి’ వచ్చి ‘టీ’పై వాలుతోంది. ‘టీ’ వెళ్లి ‘బి’ పై వాలుతోంది. ‘చిత్రపతుల’ ఈ కొత్త కలయికతో రాబోతున్న సినిమాలపై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్.. ఈవారం ‘మూవీ స్టోరీ’. ఆ గట్టునుంటావా... ఈ గట్టునుంటావా... ‘రంగస్థలం’లోని పాట ఇది. సినిమాలో సీన్‌కి తగ్గ పాట ఇది. కానీ రియల్ సీన్‌కి వస్తే.. సినిమాకి గట్టు లేదు. ఆ గట్టున ఉంటా.. ఈ గట్టున ఉంటా అంటారు. అందుకే నార్త్ నుంచి సౌత్‌కి నటీనటులు వస్తారు. సౌత్ నుంచి నార్త్‌కి ఇక్కడివాళ్లు వెళతారు. ఇప్పుడు నటీనటులే కాదు.. డబ్బులు పెట్టే (చిత్రపతులు) నిర్మాతలు కూడా ఆ గట్టున ఉంటూనే ఈ గట్టుకొస్తున్నారు.. ఈ గట్టువారు అక్కడివారితో చేతులు కలుపుతున్నారు. ఇలా టీ (టాలీవుడ్), బీ (బాలీవుడ్) కలిస్తే ప్రేక్షకులకు ఇంకా భారీ సినిమాలు చూపించడానికి కుదురుతుంది. ఈ ఏడాది అలా చేతులు కలిపిన కాంబినేషన్లను చాలా చూడబోతున్నాం. రండి తెలుసుకుందాం.. ‘గజినీ’ తర్వాత రామాయణం వందకోట్లు, రెండొందల కోట్లు, మూడొందల కోట్లు... ఇలా కలెక్షన్స్ క్లబ్‌ల గురించి మాట్లాడుకోవడానికి ‘బాహుబలి’, ‘దంగల్’, ‘పీకే’... లాంటి భారతీయ సినిమాలు చాలా ఉన్నాయి. కానీ తొలి వందకోట్ల ఇండియన్ మూవీ అంటే ఎక్కువమంది ఆమిర్ ఖాన్ ‘గజినీ’ (2008) చిత్రం గురించే చెప్పుకుంటారు. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, బాలీవుడ్ నిర్మాత మధు మంతెనలు ఈ సినిమాకు ముఖ్య నిర్మాతలు. 11 ఏళ్ల క్రితం కలిసి హిందీ సినిమా నిర్మించిన ఈ నిర్మాతలిద్దరూ మరోసారి చేతులు కలిపారు. వీరికి మరో బాలీవుడ్ నిర్మాత నమిత్ మల్హోత్రా తోడయ్యారు. ఈ ముగ్గురూ కలిసి రామాయణం ఇతిహాసం ఆధారంగా ఓ భారీ చారిత్రాత్మక సినిమాను నిర్మించనున్నారు. మూడు భాగాలుగా తెరకెక్కన్న ఈ సినిమాకు ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి, ‘మామ్’ దర్శకుడు రవి ఉడయార్ సంయుక్తంగా దర్శకత్వం వహించనున్నారు. ఈ ఏడాది డిసెంబరులో చిత్రీకరణ ప్రారంభం కానుంది. 2021లో తొలి పార్ట్‌ను విడుదల చేయాలనుకుంటున్నారు. 20 ఏళ్ల తర్వాత... తెలుగు ఇండస్ట్రీలో సురేష్ ప్రొడక్షన్స్‌ది 55 ఏళ్ల సక్సెస్ఫుల్ జర్నీ. అన్ని భారతీయ భాషల్లో చిత్రాలు నిర్మించాలన్నది సంస్థ అధినేత డా. డి. రామానాయుడి కల. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, భోజ్‌పురి, పంజాబీ, బెంగాలీ.. ఇలా అన్ని భాషల్లో చిత్రాలను నిర్మించి తన కలను నెరవేర్చుకున్నారు రామానాయుడు. అయితే తమ సంస్థపై తీసిన ‘రాముడు భీముడు’ చిత్రాన్ని కలర్లో తీయాలనే కల నెరవేరకుండానే ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. తండ్రి సక్సెస్ఫుల్ సినీ జర్నీలో ఎక్కువ భాగం తనయుడు సురేశ్‌బాబుకి ఉంది. అలాగే సురేశ్‌బాబు తనయుడు నటుడు అయినప్పటికీ తాత, తండ్రిలా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు సురేశ్‌బాబు, రానా బాలీవుడ్ సంస్థ థార్ మోషన్ పిక్చర్స్‌తో కలిసి శ్రీలంక ప్రముఖ క్రికెటర్ ముత్తయ్య మరళీధరన్ బయోపిక్‌ను నిర్మించనున్నారు. మహేష్ బాబు,సూర్యదేవర నాగవంశీ, సందీప్ రెడ్డి, రానా, విష్ణు ఇందూరి, మధు మంతెన మురళీధరన్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తారు. ఎమ్ఎస్. శ్రీపతి దర్శకత్వం వహిస్తారు. అలాగే బాలీవుడ్ దర్శక–నిర్మాత లవ్ రంజన్‌తో ఓ జాయింట్ వెంచర్ ఆలోచన ఉందని ఓ సందర్భంలో డి. సురేష్‌బాబు పేర్కొన్నారు. అందుకు తగ్గట్లుగానే హిందీలో లవ్‌రంజన్ నిర్మించిన ‘దేదేప్యార్దే’, లవ్ రంజన్ దర్శకత్వం వహించిన ‘సోనూ కీ టిట్టుకీ స్వీటీ’ సినిమాల తెలుగు రీమేక్స్ను సురేశ్‌బాబు నిర్మించనున్నారన్న వార్తలు వస్తున్నాయి. అన్నట్లు.. గతంలో హిందీలో ‘తోఫా’, ‘దిల్వాలా’, ‘అనారీ’.. ఇలా దాదాపు పది చిత్రాలకు పైనే సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించింది. అయితే దాదాపు 20 ఏళ్లుగా హిందీ చిత్రాలు నిర్మించలేదు. ఈ ఏడాది నుంచి వరుసగా హిందీ చిత్రాలు కూడా ప్లాన్ చేస్తున్నారు. డబుల్ ధమాకా పంపిణీ రంగం నుంచి నిర్మాతగా రావడం వెనక ‘దిల్’ రాజు సక్సెస్ స్టోరీ చాలా ఉంది. టాలీవుడ్ ప్రముఖ సంస్థల్లో ఒకటైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో పలు విజయవంతమైన చిత్రాలు అందిస్తున్నారు ‘దిల్’ రాజు. ఈ ఏడాది ఈ సంస్థ నుంచి వచ్చిన విజయవంతమైన చిత్రాల్లో ‘ఎఫ్ 2’ ఒకటి. వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం 100 కోట్లు దాటింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని హిందీలో నిర్మించడానికి బాలీవుడ్ అగ్రనిర్మాత బోనీ కపూర్‌తో డీల్ కుదుర్చుకున్నారు ‘దిల్’ రాజు. తెలుగుకి అనిల్ రావిపూడి దర్శకుడనే సంగతి తెలిసిందే. హిందీ చిత్రాన్ని అనీజ్ బాజ్మీ దర్శకత్వంలో రూపొందించనున్నారు. మరోవైపు హిందీ హిట్ ‘బదాయి హో’ తెలుగు రీమేక్‌ను ‘దిల్’ రాజుతో కలిసి బోనీ కపూర్ నిర్మించనున్నారు. ఈ ఇద్దరు నిర్మాతలూ ఒకేసారి ఇటు తెలుగు అటు హిందీ రీమేక్‌కి ప్లాన్ చేయడం విశేషం. హీరోగా కాదు.. నిర్మాతగా ఎంట్రీ టాలీవుడ్లో హీరోగా సూపర్ స్టార్ ఇమేజ్ను మహేశ్‌బాబు ఎప్పుడో సొంతం చేసుకున్నారు. సూపర్ నిర్మాతగా మారేందుకు ‘శ్రీమంతుడు’ (2015), ‘బ్రహ్మోత్సవం’ (2016)... ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు మహేశ్. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ‘మేజర్’ సినిమాతో బాలీవుడ్లో నిర్మాతగా ప్రస్థానం మొదలు పెట్టబోతున్నారు. సోనీ పిక్చర్స్ రిలీజింగ్ ఇంటర్నేషనల్ సమర్పణలో జీఎమ్బీ (ఘట్టమనేని మహేశ్‌బాబు) ఎంటర్టైన్మెంట్ అండ్ ఎ ఫ్లస్ ఎస్ మూవీస్ ప్రొడక్షన్స్ సంస్థలు ‘మేజర్’ చిత్రాన్ని నిర్మిస్తాయి. సోనీ పిక్చర్స్ వంటి పెద్ద సంస్థ తెలుగు సినిమాకు అసోసియేట్ కావడం మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ముంబై 2008, 26/11 ఎటాక్స్‌లో ధైర్యంగా పోరాడిన ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డు) కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం ఇది. సందీప్ పాత్రలో అడివి శేష్ నటించనున్నారు. ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్వానీ, రాజ్ నిడుమోరు, డి. కృష్ణ, భూషణ్ కుమార్, కరణ్ జోహార్ తొలి చిత్రం ‘గూఢచారి’తో డైరెక్టర్‌గా బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చిన శశికిరణ్ తిక్క ‘మేజర్’ చిత్రానికి దర్శకుడు. నిజానికి మహేశ్‌బాబుకి హీరోగా హిందీ నుంచి అప్పుడప్పుడూ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. హీరోగా హిందీకి ఎంట్రీ ఇస్తారనుకుంటే నిర్మాతగా అడుగుపెడుతున్నారు. మరి.. భవిష్యత్‌లో హిందీకి వెళతారా? లేక తెలుగు, హిందీ ద్విభాషా చిత్రం చేస్తారా? చూడాలి. టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే నిర్మాతగా ఎదుగుతున్నారు విష్ణు ఇందూరి. ‘యన్.టీ.ఆర్: కథానాయకుడు, యన్.టీ.ఆర్: మహానాయకుడు’ సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరించారు విష్ణు ఇందూరి. ఇప్పుడు బాలీవుడ్ నిర్మాత శైలేష్ ఆర్. సింగ్‌తో కలిసి హిందీలో ‘జయ’ (తమిళ, తెలుగు టైటిల్ ‘తలైవి’) అనే సినిమా చేస్తున్నారు. ప్రముఖ నటి, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ఇది. కంగనా రనౌత్ ఇందులో కంగనా రనౌత్ కథానాయికగా నటిస్తున్నారు. అలాగే ప్రముఖ క్రికెటర్ కపిల్‌దేవ్ సారథ్యంలో క్రికెట్లో మన దేశం తొలి ప్రపంచకప్‌ను అందుకున్న నాటి సంఘటనల ఆధారంగా బాలీవుడ్లో ‘83’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నారు విష్ణు ఇందూరి. ఉత్తమ నూతన దర్శకులుగా సైమా అవార్డ్స్‌లో అవార్డులు పొందిన దక్షిణాది దర్శకులతో విష్ణు ఇందూరి, సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా సినిమాలు నిర్మించడానికి ప్లాన్ జరుగుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్లో ఫామ్‌లో ఉన్న తెలుగు దర్శక ద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే తాజాగా తెలుగులో ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరో అని కొన్ని వార్తలు ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. 2013లో రాజ్, డీకే ‘డీ ఫర్ దోపిడీ’ అనే సినిమా నిర్మించిన విషయం గుర్తుండే ఉంటుంది. భవిష్యత్‌లో భాగస్వామ్యం! దక్షిణాది నిర్మాతలు హిందీ చిత్రాలను పంపిణీ చేయడం, అక్కడివారు తెలుగు చిత్రాలను పంపిణీ చేయడం సహజంగా జరుగుతుంటుంది. ‘బాహబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్’ సినిమాలను బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహర్ (ధర్మప్రొడక్షన్స్ అధినేత) డిస్ట్రిబ్యూట్ చేశారు. చిరంజీవి ‘సైరా’ చిత్రాన్ని అక్కడి నిర్మాణ సంస్థలు ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ (ఫర్హాన్ అక్తర్, రితీష్ సిద్వానీ), ఏఏ ఫిల్మ్స్ (అనిల్ టాడానీ) సంస్థలు హిందీలో పంపిణీ చేస్తున్నాయి. 2018లో కన్నడ చిత్రం ‘కేజీఎఫ్: కోలార్ గోల్డ్ ఫీల్డ్స్’ను హిందీలో విడుదల చేసింది కూడా ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్, ఏఏ ఫిల్మ్స్ సంస్థలే. అలాగే మరో భారీ బడ్జెట్ చిత్రం ప్రభాస్ ‘సాహో’ను హిందీలో భూషణ్ కుమార్, అనిల్ టడానీ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇలా పంపిణీ చేయడంతోనే కాదు.. ‘కథ నచ్చితే స్క్రిప్ట్దశ నుంచే నిర్మాణంలో భాగస్వామ్యంగా కూడా ఉంటాం’ అని ముంబైలో జరిగిన ‘సైరా: నరసింహారెడ్డి’ టీజర్ ఆవిష్కరణ వేడుకలో బాలీవుడ్ నిర్మాత రితేష్ సిద్వానీ చెప్పారు. దీన్నిబట్టి ఉత్తరాది నుంచి మరింత మంది నిర్మాతలు తెలుగు చిత్రాల్లో భాగం పంచుకునే అవకాశం ఉందని ఊహించవచ్చు. చిరంజీవి బాలీవుడ్ నిర్మాణ సంస్థలు కొన్ని మన టాలీవుడ్లో పెట్టుబడులు పెడుతుంటే మన నిర్మాతలు కూడా బాలీవుడ్లో డైరెక్ట్ సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. టాలీవుడ్లో ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ‘దిల్’ రాజు, సూర్యదేవర నాగవంశీ కలిసి తెలుగు హిట్ ‘జెర్సీ’ హిందీ రీమేక్‌ను నిర్మించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో సమంత నటించిన ‘ఓ బేబి’ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన సునీత తాటి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ వంగా హిందీలో ఓ సినిమాకు నిర్మాతగా మారబోతున్నారనే వార్తలు బాలీవుడ్లో వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ ‘లాల్‌సింగ్ చద్దా’, విక్కీ కౌశల్ ‘సర్దార్ ఉద్దామ్ సింగ్’ వంటి సినిమాలను నిర్మిస్తున్న వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థ సౌత్ సినిమాల నిర్మాణంలో వేగం పెంచాలని చూస్తోంది. ఆల్రెడీ నాగార్జున నటించిన ‘మన్మథుడు 2’ సినిమాకు అన్నపూర్ణ స్టూడియోస్‌తో అసోసియేట్ అయ్యింది ఈ బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌస్. అలాగే ప్రముఖ నిర్మాణ వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ నిర్మాణంలో నాని, నాగార్జున నటించిన ‘దేవదాస్’ సినిమా విడుదలలో వయాకామ్18 పాత్ర కూడా ఉంది. డైరెక్ట్‌గా కొన్ని తెలుగు సినిమాలను నిర్మించాలనే ఆలోచన కూడా ఈ సంస్థ ఉందట. ఆల్రెడీ కొన్ని తమిళ సినిమాల్లో ఈ సంస్థ నిర్మాణ భాగస్వామిగా ఉంది. సమంత ఇన్పుట్స్: ముసిమి శివాంజనేయులు -
‘జీవితాంతం రుణపడి వుంటాము’
మూవీ మొఘల్ డా.డి రామానాయుడు జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఫిలింఛాంబర్లో ఆవిష్కరించారు. సురేష్ బాబు రామానాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించగా.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, జి. ఆదిశేషగిరి రావు, పరుచూరి వెంకటేశ్వర రావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్, సురేష్ బాబు, రానా, నాగచైతన్య సోషల్ మీడియా ద్వారా అప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు. తన కొడుకు, మనవడు కలిసి నటిస్తే చూడాలన్నది రామానాయుడు గారి కోరిక అని.. అది ‘వెంకీమామా’ సినిమాతో తీరుతుందని సురేష్ బాబు అన్నారు. కానీ ఈ సమయంలో ఆయనను చాలా మిస్ అవుతున్నామని సురేష్ బాబు తెలిపారు. ‘వెంకీ మామా చిత్రం నీకోసమే తాత’ అంటూ నాగచైతన్య ట్వీట్ చేశాడు. మై బిగ్గెస్ట్ హీరో అంటూ రానా.. ‘మీరు ఎప్పటికీ మాతోనే ఉంటారు నాన్న, మీ కలను నిజం చేస్తున్నాము. మిమ్మల్ని మిస్ అవుతున్నాం. హ్యాపీ బర్త్‌డే’ అంటూ వెంకటేష్ పోస్ట్ చేశారు. ‘ఎంతోమంది సినీ ప్రముఖులకు జీవితాన్నిచ్చిన రామానాయుడుగారి జన్మదినం నేడు. ఈ నాడు ఆయన శిలా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం లో పాల్గొని నివాళి అర్పించాను. నాయుడు గారూ మేము మీకు ముందడుగు సినిమారాస్తే , మమ్మల్ని మీరు పరిశ్రమలో ముందడుగు వేయించారు. జీవితాంతం రుణపడివుంటాము’ అని పరుచూరి గోపాలకృష్ణ భావోద్వేగంగా స్పందించారు. -
నాయుడు గారు
-
నాన్నగారి కలలు నెరవేరుస్తా
‘‘నాన్నగారు ఈ లోకాన్ని విడిచి అప్పుడే రెండేళ్లు అయ్యిందంటే నమ్మలేకపోతున్నా. ఈ రెండేళ్లల్లో నాన్నగారిని తలచుకోని రోజు లేదు. ఇంట్లో, ఆఫీసులో, స్నేహితులతో, చుట్టాలతో నాన్న గురించి మాట్లాడని రోజు లేదు. ఆయనెప్పుడూ మా మనసుల్లోనే ఉన్నారు’’ అని ప్రముఖ నిర్మాత, స్వర్గీయ డి. రామానాయుడి పెద్ద కుమారుడు డి. సురేశ్‌బాబు అన్నారు. నేడు రామానాయుడుగారి ద్వితీయ వర్ధంతి. ఈ సందర్భంగా డి. సురేశ్‌బాబు ‘సాక్షి’ సినిమాతో మాట్లాడారు. ‘‘నాన్నగారు చాలా మంచి మనిషి. జీవితంలో ఆయనకు ఒక్క శత్రువు కూడా లేరు. అందరూ స్నేహితులే. ప్రతి ఒక్కరితో బాగుండేవారు. ఒకవేళ ఎవరితోనైనా ఏదైనా ఉంటే... ‘ఫర్గివ్ అండ్ ఫర్గెట్’ అనేది ఆయన పాలసీ. ‘నేను వెళ్లిన తర్వాత నా గురించి తెలుస్తుంది రా’ అని అనేవారు. ఆయన మాటలు అక్షర సత్యాలు. ఇప్పుడు అచ్చంగా అలానే ఉందని చెప్పాలి. మంచి విషయం ఏంటంటే... గతేడాది నాన్నగారి జ్ఞాపకంగా మా రామానాయుడు స్టూడియోలో మెమోరియల్ నిర్మించాం. ఈ ఏడాది ఆ మెమోరియల్‌కి ఇండియాలో స్టోన్ ఆర్కిటెక్చర్ విభాగంలో స్పెషల్ అవార్డు వచ్చింది. మరణించిన తర్వాత కూడా నాన్నకు అవార్డులు వస్తూనే ఉన్నాయి’’ అన్నారు. ఈ ఏడాది నాన్నగారి జయంతి (జూన్ 6) లోపు మా మెదక్‌లో ‘డాక్టర్ డి. రామానాయుడు కృషి విజ్ఞాన కేంద్రం’ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని సురేశ్‌బాబు తెలిపారు. ‘‘ఆల్రెడీ ప్రభుత్వానికి అనుమతుల కోసం దరఖాస్తు చేశాం. రాగానే కృషి విజ్ఞాన కేంద్రం ప్రారంభిస్తాం’’ అన్నారు. సినిమాల విషయానికి వస్తే... ‘రాముడు–భీముడు’ చిత్రాన్ని రంగుల్లోకి మార్చాలనేది నాయుడి గారి కల. అలాగే, మీ ఫ్యామిలీ హీరోలు వెంకటేశ్, నాగచైతన్య, రానాలతో ఓ సినిమా తీయాలనుకున్నారు. ఆయన కలలను నిజం చేస్తారా? అని సురేశ్‌బాబును అడిగితే... ‘‘తప్పకుండా. సరైన సమయంలో వెంకటేశ్– చైతు–రానా సినిమా ప్రకటిస్తాం. త్వరలో ‘రాముడు– భీముడు’ని రంగుల్లోకి మార్చే ప్రక్రియ మొదలవుతుంది’’ అన్నారు. ‘‘రానా దగ్గర నాన్నగారు పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు – ‘త్వరలో చేసుకుంటా తాతా’ అనేవాడు. ‘ఘాజీ’ సినిమా ఆయన చూస్తే మనవణ్ణి చూసి గర్వపడేవారు’’ అన్నారు. -
మాలోనే.. మాతోనే.. నాన్న
ప్రతి సక్సెస్ఫుల్ లైఫ్ వెనుక గొప్ప కష్టాలు కూడా ఉంటాయి. రామానాయుడుగారి జీవనయానంలో ఎన్నో ఆటుపోట్లు. ఎన్నో ఓటములు. ప్రతి ఓటమీ.. ‘‘ఇంక చాల్లే, ఊరికి వెళ్లిపోతాం పద’’ అని గొణిగిన ఓటమే. ఆ ప్రతి ఓటమినీ ఒక అధ్యాయంగా మార్చుకొని.. ఒక సక్సెస్స్టోరీని రచించారు రామానాయుడు గారు. ఇది తప్పకుండా ఒక అందమైన స్టోరీ. కానీ, అంతకంటే అందమైన, లోతైన, ఉద్వేగభరితమైన కథ ఈ కథలో దాగి ఉంది. నాయుడుగారు ఈ కథను ఎవరికీ చెప్పలేదు. తన పిల్లలకు కూడా చెప్పలేదు. కథలో ఉన్నవన్నీ కష్టాలే. అవేవీ పిల్లలకు తెలియనివ్వలేదు. ఆనందాన్ని పంచుకుంటే రెండింతలవుతుందని మాత్రమే పిల్లలకు చెప్పారు. మరి ఇవాళ.. నాన్న లేని దుఃఖం పిల్లల్ని సగం చేసేసిందా? ‘‘కానే కాదు’’ అంటున్నారు సురేశ్, వెంకటేశ్.‘‘మానాన్న మాతోనే ఉన్నారు.ఇప్పుడు రెండింతలు ఉన్నారు’’ అంటున్నారు. నేడు ‘ఫాదర్స్ డే’. ఇది పిల్లల ఇంటర్వ్యూ. బయటివాళ్లు ‘ది గ్రేట్ రామానాయుడుగారు’ అంటారు.. సురేశ్‌బాబు: నేనూ అదే అంటాను. కారంచేడులో రైతు కుటుంబంలో పుట్టి, సినిమాల మీద ఇష్టంతో ఇక్కడికి వచ్చారు. ‘రాముడు-భీముడు’ నుంచి ‘ప్రేమ్‌నగర్’ విడుదలయ్యేంతవరకూ ‘డూ ఆర్ డై’ అనే పరిస్థితి. ఫెయిల్యూర్‌గా ఊరికి వెళ్లకూడదనుకున్నారు. ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా మాకు బెస్ట్ లైఫ్ ఇచ్చారు. బెస్ట్ స్కూల్లో చేర్చారు. అప్పట్లో మేం విదేశాల్లో చదువుకు నేంత డబ్బు మాకు లేదు. అయినా నేనిక్కడ ఇంజనీరింగ్ చేస్తూ, మధ్యలో మానేసి అమెరికాలో బ్యాచిలర్స్ చేస్తానంటే వద్దనలేదు. ఆర్థిక కష్టాలు ఉండేవి. కానీ, వాటి ప్రభావం మా మీద లేకుండా చూసుకునేవారు. మీ నాన్నగారి తర్వాత మీరే ఇంటి పెద్దలా వ్యవహరిస్తున్నారు. చిన్నతనం నుంచి మీరింతేనా? సురేశ్‌బాబు: మా ఊళ్లో కొంతమంది ఏవైనా కష్టాలొస్తే మా నాన్నగారికి చెప్పుకోవడానికి వచ్చేవాళ్లు. ఆయనతో చెప్పుకోలేకపోయినవాళ్లు నా ద్వారా చేరవేసేవాళ్లు. దాంతో ‘మనం కూడా ఇంటికి పెద్దే’ అని ఫీలైపోయేవాణ్ణి (నవ్వుతూ). అప్పట్నుంచే పెద్దరికం అలవాటైంది. అయితే నాకు నేనుగా వేటిలోనూ తలదూర్చేవాణ్ని కాదు. ఎవరైనా కష్టం అంటూ వస్తే మాత్రం వెళ్లేవాణ్ణి. మీతో కష్టసుఃఖాలు పంచుకునేవారా? సురేశ్‌బాబు: ఓసారి ఫైనాన్షియల్‌గా నాన్నగారు చాలా టైట్ పొజిషన్లో ఉన్నారు. మాతో చెబితే వెంకీ తన ఫ్రెండ్ ద్వారా ఎరేంజ్ చేశాడు. అది మినహా నాన్నగారు పెద్దగా కష్టాలు చెప్పుకున్నది లేదు. రాత్రి నిద్రపోయే ముందు ‘ఆస్తి ఎంత... అప్పు ఎంత’ అని లెక్కలు వేసుకునేవారు. ఇంజనీరింగ్ అయ్యాక, అప్పులు ఉన్నాయని తెలిసి కంగారుపడిపోయాను. నాన్నగారేమో ‘‘ఏంట్రా అంత కంగారు.. ఒక్క సినిమా హిట్ అయితే డబ్బులొచ్చేస్తాయ్’’ అన్నారు. అప్పుడు ‘దేవత’ సినిమా తీశాం. అన్ని ఏరియాలు అమ్మేసి, వచ్చిన లాభాలతో కొంత అప్పు తీర్చేయొచ్చన్నది నా ఆరాటం. నాన్నగారు ఒప్పుకోలేదు. మేమే రిలీజ్ చేశాం. పది లక్షలు ప్రాఫిట్ వచ్చింది. మొత్తం అప్పు తీరింది. నాన్నగారు అంత కాన్ఫిడెంట్‌గా ఉండేవారు. స్క్రిప్ట్ నుంచి సినిమా విడుదలయ్యేంత వరకూ ప్రతీదీ చూసుకునే నిర్మాతలు ఎక్కువ కాలం నిలుస్తారనీ, మందు, అమ్మాయిలు.. వంటి వ్యసనాలు ఉన్నవాళ్లు నిలవలేరని ఆయన అనుకునేవారు. సేవా కార్యక్రమాలు బాగా చేసేవారు కదా... సురేశ్‌బాబు: అప్పట్లో వినోదాభావే మా ఊరికి వస్తే, ఎవరూ ఏమీ ఇవ్వలేదు. కానీ, ఆయన చేస్తున్న ఉద్యమం కోసం మా నాన్నగారు పొలం రాసిచ్చేశారు. ఊళ్లో పెద్దవాళ్లు ‘ఏంట్రా అలా రాసిచ్చేశావ్.. మీ నాన్న ఒప్పుకోకపోతే? ’’ అని అడిగితే, ‘‘మా అమ్మ తెచ్చిన ఆస్తి కూడా ఉంది’’ అని మా నాన్నతో చెబుతా అన్నారట. నాన్నగారికి ఇవ్వడం ఇష్టం. బయటకు వెళ్తున్నప్పుడు మా అమ్మను చిల్లర అడిగి తీసుకుని, దానం చేసేవారు. చేతికి ఎంత వస్తే అంత.. లెక్క లేకుండా ఇచ్చేవారు. ఏం చేసినా మేం బాధపడే వాళ్లు కాదు. కానీ, ఆయన మంచితనాన్ని చాలా మంది తమ స్వార్థానికి ఉపయోగించుకునేవాళ్లు. ఆ విషయం మీరు చెప్పడానికి ప్రయత్నించేవాళ్లు కాదా? సురేశ్‌బాబు: మా నాన్న మాట ఇస్తే తప్పే మనిషి కాదు. కొంతమంది ఏదో కథ పట్టుకు వచ్చేవారు. నాన్నగారు కాదనలేక మాటిచ్చేసేవారు. అప్పుడు నేను వాళ్లతో ‘ఇలా మాటివ్వడం మా నాన్నకూ మంచిది కాదు. మీకూ మంచిది కాదు. కథ బాగోలేదు. మహా అయితే మాకు డబ్బులు మాత్రమే పోతాయి. కానీ, మీకు కెరీర్ పోతుంది’ అనేవాణ్ణి. కానీ, వాళ్లు సినిమా తీయడానికే డిసైడై ఫెయిల్యూర్ చూసేవాళ్లు. ఇలాంటి విషయాల్లోనే నాకూ, నాన్నకూ కొంచెం తేడా వచ్చేది. ‘పోన్లే రా..’ అనేవారు. ఒకసారి జనవరి 1న తమిళ నటుడు బాలాజీకి నాన్నగారు వంద రూపాయలిస్తే, ఆ ఏడాది మొత్తం ఆయనకు కలిసొచ్చిందట. ఆ విషయం కొంతమందికి తెలిసి, జనవరి 1న నాన్నగారి చేతుల మీద వంద రూపాయలు తీసుకోవడానికి వచ్చేవాళ్లు. ఒకళ్లతో మొదలుపెట్టినది వందల సంఖ్యలో అయిపోయింది. బ్యాగు నిండా వంద రూపాయల నోట్ల కట్టలు పెట్టుకుని, ఆఫీసులో కూర్చుని వచ్చిన ప్రతి ఒక్కరికీ ఇచ్చేవారు. మీ నాన్నగారి నిర్ణయాలు మిమ్మల్ని కంగారుపెట్టేవా? సురేశ్‌బాబు: నాన్నగారు చాలా ఫాస్ట్‌గా నిర్ణయాలు తీసుకునేవారు. దాంతో భయం వేసేది. మా నాన్నగారి ఫ్యామిలీ వాళ్లు చాలా ఫాస్ట్. మా అమ్మగారువాళ్లు జాగ్రత్తపరులన్నమట. మేం తీసిన సినిమా సూపర్‌హిట్ అయితే మా నాన్నగారి సైడ్ తాతగారైతే ‘మా వాళ్ల సినిమా సూపర్’ అని గొప్పగా చెప్పుకుంటే , అమ్మ తరఫు వాళ్లయితే ‘లెక్కలు చూశారా’ అని అడిగేవారు. నాకు మా అమ్మగారివైపు పోలికలు వచ్చాయి. ప్రతిదానికీ లెక్కలేస్తుంటాను. పిల్లలను కూడా కంట్రోల్ చేస్తుంటా. అందుకే ఇంట్లో నన్ను ‘కంట్రోల్ ఫ్రీక్’ అంటారు (నవ్వుతూ). పిల్లలు చెడిపోతారేమోనని భయపడేవారా? సురేశ్‌బాబు: నేను ‘రౌండ్‌టేబుల్’లో జాయిన్ అయ్యాక ఫ్రెండ్స్‌తో గడిపి లేట్ నైట్ ఇంటికి వెళ్లేవాణ్ణి ‘మావాణ్ణి ఫ్రెండ్స్ చెడగొట్టేస్తారేమో’’ అని అనుకునేవారాయన. విలేజ్‌లో చీకటి పడితే ఇంటికి వెళ్లిపోతారు కదా.. అది ఇక్కడ కూడా ఫాలో అయ్యేవారు. మేం చెడిపోతామేమోనని భయపడేవారు. ముందు నుంచీ ఆయనకు మందు తాగే అలవాటు లేదు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా నాన్నగార్ని చిన్న గ్లాస్ వైన్ తాగమని డాక్టర్లు సలహా ఇచ్చారు. నాన్న తాగడం చూసి మేమెక్కడ చెడిపోతామేమోనని మంచి నీళ్లు తాగుతున్నట్లు కలరింగ్ ఇచ్చి, వైన్‌ను స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్లో తాగేవారు. నాకు కూడా డాక్టర్లు ‘బాగా స్ట్రెస్ ఫీలవు తున్నావు... వైన్ తాగు’ అని సలహా ఇచ్చారు. నేను 50వ ఏట తాగుతానని పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చా. 50వ పుట్టినరోజున వైన్ గ్లాస్ పట్టు కుంటే నేను మందు తాగబోతున్నాననే ఊహను భరించ లేక, మా అబ్బాయిని పిలిచి ‘ఒరేయ్ మీ నాన్న చేతిలో ఆ గ్లాస్ చూడలేకపోతున్నా’ అని అన్నారట. నిజానికి నాక్కూడా మింగుడుపడలేదు. అందుకే గ్లాస్ పారేశాను. రానాకు మీ నాన్నగారి పేరు పెట్టాలన్నది ఎవరి ఆలోచన? సురేశ్‌బాబు: మా వైఫ్ సిద్థార్థ్ అని పెట్టాలనుకుంటుంటే నేనే రామానాయుడు పెట్టాలని ఫిక్సయ్యా! ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. బియ్యం మీద పేరు రాయిస్తున్నప్పుడు సడన్‌గా ‘రామానాయుడు’ అన్నా. నాన్నగారు చాలా సంబరపడ్డారు. మా నాన్నగారి ఫ్రెండ్ ఒకాయన నిన్ను ‘రామానాయుడు’ అని పిలవలేను అని చెప్పి ‘రానా’ అని షార్ట్ చేశారు. అదలా కంటిన్యూ అయిపోతోంది. క్యాన్సర్ అని తెలిశాక ప్రొఫెషనల్‌గా స్లో కావాలనుకున్నారా? సురేశ్‌బాబు: ఆయన స్లో అయితే బాగుంటుందేమో అని మాకనిపించింది. కానీ, వర్క్ చేయడానికే ఇష్టపడ్డారు. వెంకీ కూడా ఆయన ఇష్టప్రకారం చేయనిస్తే, హ్యాపీగా ఉంటారు కదా అనడంతో నేనేమీ అనలేదు. ఇక... తరుముకొచ్చేస్తోంది అనే అనుమానం కలిగాక ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఆయనతోనే ఉండటం మొదలుపెట్టాం. అందుకే ‘గోపాల గోపాల’ తర్వాత వెంకీ వేరే సినిమాలు కమిట్ కాలేదు. నాన్నగారి చివరి రోజులను మేం పూర్తిగా ఆయనకే కేటాయించేశాం. మా ఆనందం ఏంటంటే.. తుది శ్వాస వరకూ ఆయన ఇబ్బందిపడలేదు. ప్రశాంతంగానే కన్ను మూశారు. అంతకుముందు మా మధ్య ఏవీ భేదాభిప్రాయాలు లేకపోయినప్పటికీ, ఆ ఏడు నెలల కాలం మా అందర్నీ ఇంకా దగ్గర చేసింది. చివరి క్షణాల్లో అందరూ దగ్గరే ఉన్నారన్న మాట.. సురేశ్‌బాబు: ఆ క్షణాల్లో అందరూ ఆయన చుట్టూ ఉన్నారు. నేను మాత్రం నాన్నగార్ని ఆ పరిస్థితిలో చూడలేక బయట ఉండిపోయా (చెమర్చిన కళ్లతో). నాయుడుగారు మరణించాక మీ దగ్గర పని చేసే ఉద్యోగులు అభద్రతా భావానికి గురి కావడం సహజం.... సురేశ్‌బాబు: మొదట్లో వాళ్లకు ఆ ఫీలింగ్ ఉన్న మాట నిజమే. అది గ్రహించే జనవరి 1న మా నాన్నగారి ఆఫీసు రూమ్‌లో కూర్చుని, ఆయన ఇచ్చినట్టుగానే అందరికీ వంద రూపాయలు ఇచ్చాను. చాల మంది సంతృప్తిగా ఫీలయ్యారు. లెక్కలేసుకుని డబ్బులు ఖర్చు పెట్టే మనిషినే కానీ, సహాయం కూడా చేస్తుంటాను. ఎవరింట్లో అయినా ఫంక్షన్ అంటే వెళ్లడానికి బద్ధకిస్తాను. జరగకూడనిది జరిగిందని తెలిస్తే మాత్రం వెళ్లిపోతాను. ఆనంద సమయాల్లో ఎవరి అండా అవసరం లేదు. కష్ట సమయాల్లో మాత్రం కావాలి. లైఫ్ విత్ ఫాదర్.. వితౌట్ యువర్ ఫాదర్...? సురేశ్‌బాబు: తెలీకుండా బాగా ఎఫెక్ట్ అయ్యాం. నాకు ప్రేమ బయటకు చూపించడం తెలియదు. ఇప్పుడు కూడా ఏం చెప్పాలో తెలియడంలేదు. కానీ, నా మిసెస్ మాత్రం ‘మామయ్యగారు వెళ్లిపోయాక మీరు చాలా మారారు’ అంది. అదేంటో నాకు తెలియడంలేదు. ఇక రోజులు దగ్గరపడుతున్నాయని తెలిసిన తర్వాత నాన్నగారు అప్పుడప్పుడూ నన్ను ‘హగ్’ చేసుకునేవారు. ఆ స్పర్శలో ఏదో తెలియని ఫీలింగ్. అది అలా గుర్తుండిపోయింది. మీ నాన్నగారి గౌరవాన్ని నిలబట్టడానికి ఏం చేయాలనుకుంటున్నారు? సురేశ్‌బాబు: ఆయనను భావితరాలు స్మరించుకోవడానికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన నుంచి పుట్టిందే రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన మెమోరియల్. ఇక్కడికి ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్స్ వస్తారు. షూటింగ్స్ జరుగుతాయి. అలా అందరూ మా నాన్నగారిని గుర్తు చేసుకోవాలి. ఎప్పుడూ ఏది చేయాలన్నా లెక్క చూసుకునే నేను ఈ మెమోరియల్‌కి మాత్రం లెక్కలేసుకోకుండా ఖర్చుపెట్టా. టైమ్, దయ, కృషి, ఫ్యామిలీ.. అనే నాలుగు విషయాల గురించి నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు. అందుకే ఈ మెమోరియల్‌లో నాలుగు రాళ్ల మీద ఆ అక్షరాలు చెక్కించాం. అక్కడే కూర్చుని మాట్లాడేలా ఏర్పాటు చేశాం. ఇక్కడ కూర్చుని మాట్లాడుతుంటే మా నాన్నగారు ఇక్కడే ఉన్నారనే ఫీలింగ్ కలుగుతుంది. ఫార్మింగ్, ఫిలింస్ ఆయనకు బాగా ఇష్టమైన రంగాలు. వైజాగ్‌లో ఫిల్మ్ మ్యూజియం ప్రారంభించాం. ఇప్పటికే ఆయన పేరు మీద అగ్రికల్చరల్ రూరల్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఇక్కడే హైదరాబాద్‌లో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు ఉపయోగకరంగా ఉండేట్లు దీన్ని తీర్చిదిద్దడానికి ప్రణాళికలు వేస్తున్నాం. ఇంకా చాలా చాలా చేయాలని ఉంది. నాన్నగారు ‘మోర్ దేన్ రామానాయుడు’ మీ నాన్నగారి లేని మీ ప్రపంచం గురించి... వెంకటేశ్: టు బీ హానెస్ట్... మా మధ్య ఉన్నది ‘సోల్ టు సోల్’ కనెక్షన్. అందుకే ఆయన లేరనే ఫీలింగే లేదు. శారీరకంగా లేకపోవచ్చు.. ఆత్మ రూపంలో ఇక్కడే ఉన్నారు. మా నాన్నగార్ని ఒక మనిషిగా చూడలేదు. ఆయన అంతకు మించే అనుకున్నాను. నాన్నగారు తన గురించి మాత్రమే ఆలోచించలేదు. తన చుట్టూ ఉన్నవాళ్లందరూ ఆనందంగా ఉండాలనుకునేవారు. అంత మంచి సోల్ ఆయనది. నాయుడుగారి నుంచి మీరు ఆదర్శంగా తీసుకున్నవి? వెంకటేశ్: మా అమ్మ పట్ల ఆయన కనబర్చిన ప్రేమ, గౌరవం అద్భుతం అనాలి. ఇద్దరూ కలిసి కుటుంబాన్ని బాగా నడిపించారు. మా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేది. కుటుంబాన్ని ఎలా ప్రేమించాలి? అనే విషయంలో నాన్నగారే ఆదర్శం. ఏ పని చేసినా వంద శాతం ఎఫర్ట్ పెట్టాలని అనేవారు. టైమింగ్స్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉండేవారు. అదే మాకూ అలవాటైంది. నాయుడుగారి చివరి రోజుల్లో మీ ఫీలింగ్స్ గురించి? వెంకటేశ్: వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. నాన్నగారు శారీరకంగా మాత్రమే ఉండరన్నది నా ప్రగాఢ నమ్మకం కాబట్టి, చివరి రోజుల్లో ఆయనతో చీర్ఫుల్గానే ఉన్నాను. నాన్నగారు కూడా అలానే ఉండేవారు. శారీరకంగా ఎనర్జీ పెద్దగా లేకపోయినా మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు. చేయబోయే సినిమాల స్క్రిప్ట్స్ గురించి అడిగి తెలుసుకునేవారు. అప్పట్లో నా సినిమాలు ‘ప్రేమ,’, ‘ధర్మచక్రం’ వంటివి హిట్టయి నప్పుడు ఆయన చాలా హ్యాపీ ఫీలయ్యారు. ‘బాగా యాక్ట్ చేశావ్‌రా’ అని సంబరపడిపోతూ చెప్పేవారు. జీవితంలో ఆయనకు అసంతృప్తి అంటూ ఏదీ లేదు. అందుకే చివరి రోజులను ప్రశాంతంగానే గడిపేశారు. మీరు ఆధ్యాత్మికం గురించి మాట్లాడుతుంటారు కదా.. అప్పుడేమనేవారు? వెంకటేశ్: మొదట్లో కొంచెం బాధపడేవారు. ‘ఏంటిది సన్యాసిలా అయిపోతున్నాడు’ అని కంగారు పడేవారు. తర్వాత అర్థం చేసుకున్నారు. నాన్నగారి చివరి రోజుల్లో ఆధ్యాత్మికం గురించి ఆయనకు బోల్డన్ని విషయాలు చెప్పేవాణ్ణి. కొన్ని మంత్రాలు కూడా చెప్పాను. ఆయన చాలా ప్రశాంతంగా వినేవారు. ‘యు ఆర్ మోర్ దేన్ రామానాయుడు.. నాన్నా’ అనేవాణ్ణి. అలా ఎందుకు అనాలనిపించింది? వెంకటేశ్: మా నాన్నగారు ఈ ప్రపంచానికి పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేయడానికే వచ్చారని నా నమ్మకం. ఆ ఎనర్జీ కొందరికే ఉంటుంది. ఇప్పటికీ ఆ ఎనర్జీ నా చుట్టూనే ఉంది. మనం బాగుండాలి.. అందరూ బాగుండాలని అనుకునేవారు. అలాంటివాళ్లు చాలా రేర్. అందుకే ‘మోర్ దేన్ రామానాయుడు’ అన్నాను. ఒక కొడుకుగా మీ అమ్మగార్ని ఎలా ఓదార్చారు? వెంకటేశ్: మా అమ్మగారికి ఇది చాలా పెద్ద లాస్. నాన్నగారు లేరనే ఒక్క విషయం తప్ప ఆమెకు మేమంతా ఉన్నాం. నాన్నగారితో అమ్మ అద్భుతమైన జీవితాన్ని చూసింది. కానీ, వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఎప్పటికైనా ఎవరైనా ఫిజికల్‌గా దూరంగా వెళ్లాల్సిన వాళ్లమే. కానీ, సోల్ కనెక్షన్ అనేది ఎప్పటికీ దూరం కాదు. నాయుడిగారి గ్రాండ్ చిల్డ్రన్ మాటేంటి? వెంకటేశ్: నాన్నగారు మమ్మల్ని ఎంత బాగా ప్రేమించారో.. మా పిల్లల్నీ అంతే బాగా ప్రేమించారు. మా ఇంట్లో పిల్లలందరికీ ఆయన ‘వెరీ లవింగ్ అండ్ కేరింగ్ తాత’. నేనూ, మా అబ్బాయి అర్జున్ కలిసి నటిస్తే చూడాలన్నది నాన్నగారి కోరిక. అర్జున్‌ని హీరోగా పెట్టి సినిమా తీయాలనుకునేవారు. ఆ కోరిక నెరవేరలేదు. నెరవేర్చుకోవడానికి మళ్లీ వస్తారు... డెఫినెట్‌గా. - డి.జి. భవాని -
మా నాన్నగారు భావి తరాలకు స్ఫూర్తి
- సురేశ్‌బాబు ‘‘ఓ రైతుగా జీవితం మొదలు పెట్టిన మా నాన్న రామానాయుడుగారు ఎంతో కృషితో నిర్మాతగా మారి, హైదరాబాద్‌కొచ్చి స్టూడియోలు కట్టారు. మాతోపాటు ఎంతోమంది నటీనటులు, సాంకేతిక నిపుణులను పరిచయం చే సిన మహావ్యక్తి ఆయన. నాన్నగారు చేసిన పనులు, చూపిన మార్గాన్ని ‘ది నర్చరింగ్ హ్యాండ్స్’ స్మారక చిహ్నం ద్వారా భావితరాల వారికి గుర్తుండిపోయేలా చేస్తున్నాం’’ అని నిర్మాత డి. సురేశ్‌బాబు అన్నారు. నేడు పద్మభూషణ్ డా. డి. రామానాయుడు 80వ జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ‘డా.డి. రామానాయుడు మెమోరియల్ ది నర్చరింగ్ హ్యాండ్స్’ స్మారక చిహ్నాన్ని ఆదివారం సురేశ్‌బాబు, వెంకటేశ్, రానా ప్రారంభించారు. సురేశ్‌బాబు మాట్లాడుతూ- ‘‘నాన్నగారి జీవితానికి సంబంధించిన జనరల్ కొటేషన్స్‌ను ఫలకాలపై ముద్రించి ఈ స్మారక చిహ్నం వద్ద ఏర్పాటు చేస్తాం. నాన్నగారి పేరుతో వైజాగ్‌లో ‘మ్యూజియం ఆఫ్ సినిమా’ను ప్రారంభిస్తున్నాం. ఇందులో పాత చిత్రాల నెగటివ్స్, ఆయా చిత్రాల్లో వాడిన వస్తువులు, గుర్తులను భద్రపరుస్తాం. ప్రస్తుతం ఉన్నవారు, భవిష్యత్ తరాల వారు ఆ మ్యూజియంను సందర్శించి ఎన్నో విషయాలు తెలుసుకునేలా ఏర్పాటు చేశాం. మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో కృషి విజ్ఞానకేంద్రం ద్వారా రైతులకు వ్యవసాయంపై శిక్షణ ఇవ్వనున్నాం. ఇందుకు ఏక లవ్య ఫౌండేషన్ వారు సహకరిస్తారు. కొత్తవారిని ప్రోత్సహించేందుకు చిన్న సినిమాలు తీస్తా. నాన్నగారి పేరుతో ఓ అవార్డు కూడా ఏర్పాటు చేస్తాం’’ అన్నారు. ‘‘అందర్నీ ప్రేమించడం, ప్రేమించబడటం నాన్న గారి నేచర్. మానవీయ బంధాలు, విలువలను మాకు నేర్పారు’’ అని వెంకటేశ్ చెప్పారు. ‘‘తాతగారు విజన్, వేల్యూస్‌తో ముందుకెళ్లారు కాబట్టే, గొప్ప వ్యక్తిగా, నిర్మాతగా మారారు’’ అని రానా అన్నారు. -
పిడుగుపాటుకు వ్యక్తి మృతి
శ్రీకాకుళం జిల్లా వంగర్ మండలం మద్దివలస గ్రామం సమీపంలో పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన రామానాయుడు (50) శుక్రవారం ఉదయం చెరువు దగ్గర కాలకృత్యాలు తీర్చుకుని ఇంటికి తిరిగి వెళుతున్నాడు. ఈ సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. రామానాయుడు సమీపంలోనే పిడుగుపడడంతో అతడు మృతి చెందాడు. -
ఇసుక కోసం ఎమ్మెల్యేను అడ్డుకున్నారు
ఇసుక తరలింపుపై ఆంక్షల కారణంగా ఉపాధి కోల్పోతున్నామంటూ భవన నిర్మాణరంగ కార్మికులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం కట్టుపాలెం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి వస్తున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వాహనాన్ని పెద్ద సంఖ్యలో గుమికూడిన కార్మికులు అడ్డుకున్నారు. ఇసుక తరలింపుపై ఆంక్షల కారణంగా తాము వీధిన పడ్డామని తెలిపారు. ఇసుక కొరత కారణంగా నిర్మాణాలు నిలిచిపోయాయని తెలిపారు. అనంతరం వారు ఎమ్మెల్యేకి వినతిపత్రం అందజేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని వారికి ఆయన హామీ ఇచ్చారు. -
వరదనీటిలో బయటపడ్డ మృతదేహం
చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలోని లక్ష్మిపురం కూడలి వద్ద పెద్ద కాలువలో ఓ వృద్ధుడి మృతదేహం బయటపడింది. మృతుడు మూడు రోజుల నుంచి కనిపించకుండా పోయిన చిన్నగుత్తిగల్లు మండలం గుట్టదిండివారిపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రామానాయుడు(72)గా గుర్తించారు. రెండు రోజుల క్రితమే రామానాయుడు కనిపించటంలేదని కుమారుడు శేఖర్ తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశాడు. కుమారుడి ఇంటి నుంచి స్వగ్రామం గుట్టదిండివారిపల్లి వెళ్లే సమయంలో వరద నీటిలో కొట్టుకుపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చిరంజీవి కథ రాసే అవకాశం ఇచ్చారు!
‘‘ఈ సినిమా హిట్టయితే నీకు దర్శకుడిగా అవకాశం ఇస్తాను’’.. ఒకప్పుడు చంద్రమహేశ్‌కి డా. డి. రామానాయుడు ఇచ్చిన మాట ఇది. దానికి కారణం ‘శివయ్య’ చిత్రకథ. పోసాని కృష్ణమురళి రాసిన ఆ కథను రామానాయుడికి చెప్పింది చంద్రమహేశే. ఆ సినిమా వంద రోజులాడింది. దాంతో సురేష్ ప్రొడక్షన్స్‌లో ‘ప్రేయసి రావే’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం చంద్రమహేశ్‌కి ఇచ్చారు. ఆ సంస్థలో ‘సూపర్ పోలీస్’ చిత్రం ద్వారా సహాయ దర్శకునిగా కెరీర్ మొదలుపెట్టి, మళ్లీ అదే సంస్థ ద్వారా దర్శకుడైనందుకు ఆనందపడ్డారు చంద్రమహేశ్. ‘‘ఆ సినిమా చూసి, చిరంజీవిగారు అభినందించారు. కథలు రాయమని రెండు మూడు సార్లు అవకాశం కూడా ఇచ్చారు. కానీ, ఎందుకో సెట్ కాలేదు’’ అని గురువారం పాత్రికేయుల సమావేశంలో చంద్రమహేశ్ అన్నారు. హెచ్.హెచ్. మహదేవ్ హీరోగా ఆయన దర్శకత్వంలో పి.ఎన్. త్రిలోక్ రెడ్డి సమర్పణలో పీవీ శ్రీరాం రెడ్డి నిర్మించిన ‘రెడ్ అలర్ట్’ నేడు తెరకొస్తోంది. చంద్రమహేశ్ మరిన్ని విశేషాలు చెబుతూ - ‘‘శ్రీహరితో నేను చేసిన ‘అయోధ్య రామయ్య’, ‘ఒక్కడు’ మంచి పేరు తెచ్చాయి. ఆ తర్వాత జయాపజయాల సమాహారంతో కెరీర్ సాగుతోంది. నేను దర్శకత్వం వహించిన చిత్రాలు చూసి, శ్రీరాంరెడ్డిగారు సినిమా చేద్దాం అన్నారు. ‘రెడ్ అలర్ట్ ‘ కథ వినగానే తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో నిర్మిద్దామని ఆయన అన్నారు. గతేడాది మార్చిలో షూటింగ్ మొదలుపెట్టి, డిసెంబర్‌కల్లా పూర్తి చేశాం. అన్ని భాషల్లోనూ ఒకే రోజున విడుదల చేయాలనుకున్నాం. కానీ, శ్రీరాంరెడ్డిగారు ఆకస్మాత్తుగా మరణించడం, షాక్‌కి గురి చేసింది. కన్నడ, మలయాళంలో విడుదల చేశాం. అక్కడ కన్నా తెలుగులో మరింత విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది. మహదేవ్కి హీరోగా మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అన్నారు. -
నేటి తరానికి ఆయన దిక్సూచి : దాసరి నారాయణరావు
‘‘చనిపోయాక కూడా బతికేవాళ్లు కొంతమందే ఉంటారు. అలాంటివాళ్లల్లో రామానాయుడు ఒకరు. నిర్మాతకు నిర్వచనం ఆయన. సినిమా నిర్మాణానికి సంబంధించిన ప్రతి విభాగంలోనూ ఆయనకు మంచి పట్టు ఉంది. కథ విషయంలో ఆయన అంచనాలు ఎప్పుడూ తప్పు కాలేదు. నేటి తరానికి ఆయన దిక్సూచి ’’ అని దర్శక రత్న దాసరి నారాయణరావు అన్నారు. ప్రముఖ నిర్మాత స్వర్గీయ రామానాయుడు సంస్మరణ సభను టి. సుబ్బిరామిరెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ - ‘‘సినిమాల్లో చరిత్ర సృష్టించిన వ్యక్తి రామానాయుడు. సమాజం పది కాలాలపాటు గుర్తుంచుకునే చక్కని వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి’’ అన్నారు. దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ- ‘‘హిట్ దర్శకులతోనే కాకుండా ఫెయిల్యూర్ దర్శకులతో కూడా ఆయన సినిమాలు తీశారు. సురేష్‌బాబు తన ఫిలిం ఇన్స్టిట్యూట్లో తండ్రి చరిత్రను పాఠ్యాంశంగా చేర్చితే బాగుంటుంది’’ అని సూచించారు. ‘‘నాతో రెండో సారి సినిమా తీస్తే అది ఫ్లాప్ అన్న ముద్ర నా మీద అప్పట్లో ఉండేది. అయినా తన ‘రాముడు- భీముడు’ సినిమా తర్వాత రెండో సినిమా ‘శ్రీ కృష్ణ తులాభారం’లో కూడా రామానాయుడుగారు నన్ను హీరోయిన్గా తీసుకున్నారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. చివరి శ్వాస వరకూ సినిమాకే ఆయన జీవితాన్ని అంకితం చేశారు’’ అని జమున తెలిపారు. డి. సురేశ్‌బాబు మాట్లాడుతూ - ‘‘నాన్న చనిపోయిన తర్వాత మా కుటుంబానికి మద్దతుగా నిలిచిన అందరికీ నా కృత జ్ఞతలు’’ అన్నారు. ప్రతి ఏడాది తమ లలితాకళా పరిషత్ ఆధ్వర్యంలో రామానాయడు పేరుతో విశిష్ట పురస్కారాన్ని అందజేస్తానని టి. సుబ్బిరామిరెడ్డి ప్రకటించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, మాణిక్యాల రావు, పాటల రచయిత డా. సి. నారాయణరెడ్డి, బ్రహ్మానందం, మురళీమోహన్, వెంకటేశ్, రానా, నాగచైతన్య, జయసుధ, జీవితా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
సినిమా పుస్తకం మూవీ మొఘల్
రామానాయుడు జీవించి ఉండగా ఆయన నిర్మించిన సినిమాల గురించి సమగ్రంగా వివరిస్తూ వచ్చిన చివరి పుస్తకం ఇదే. రైతు కుటుంబంలో పుట్టి, సినిమా నిర్మాణంలో ప్రవేశించి, తెలుగువారు గర్వించదగ్గ స్థాయిలో నిర్మాతగా నిలబడటమే కాకుండా పరిశ్రమను కూడా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించడం రామానాయుడికే సాధ్యమైంది. ‘ది షో మస్ట్ గో ఆన్’ అని రాజ్‌కపూర్ అన్నట్టు రామానాయుడు జయాపజయాలతో నిమిత్తం లేకుండా సినిమాలను నిర్మిస్తూ వెళ్లారు. కొన్నిసార్లు స్టూడియో సిబ్బందిని పనిలో నిమగ్నం చేయడానికి కూడా అవి సరిగ్గా ఆడవని తెలిసినా సినిమాలు తీశారు. ఆయన కెరీర్లో ఎన్నో హిట్స్ ఉన్నాయి. మరెన్నో ఫ్లాప్స్ ఉన్నాయి. రాముడు- భీముడు, ప్రేమనగర్, జీవన తరంగాలు, సోగ్గాడు, మండే గుండెలు, దేవత, ముందడుగు, ప్రతిధ్వని, అహ నా పెళ్లంట, ఇంద్రుడు-చంధ్రుడు, బొబ్బిలిరాజా వంటి సినిమాలు తీసిన రామానాయుడే స్త్రీ జన్మ, బొమ్మలు చెప్పిన కథ, అగ్నిపూలు, మాంగల్యబలం, ప్రేమమందిరం, సూపర్ బ్రదర్స్ వంటి పరాజయాలు తీశారు. కాని ప్రేక్షకులు ఎప్పుడూ ఆయనను నిందించలేదు. ఎందుకంటే ఆయన తీసినవాటిల్లో ప్లాప్ మూవీస్ ఉండొచ్చు. బ్యాడ్ మూవీస్ లేవు. ఈ వివరాలన్నీ పాత్రికేయుడు వినాయకరావు ‘మూవీ మొఘల్’ పుస్తకంలో వివరించారు. రామానాయుడు తీసిన ప్రతి సినిమా వర్కింగ్ స్టిల్స్, ఆ సినిమాల నిర్మాణం వెనుక ఉన్న కథ, విడుదల తర్వాత ఫలితం, ఇతర విశేషాలు... సినీ అభిమానులు తెలుసుకో దగ్గవి. ఈ పుస్తకం చదువుతుంటే రామానాయుడి ప్రస్తావన తెలియడం మాత్రమే కాక ఆ సినిమాలతో మమేకమైన బాల్యమో, యవ్వనమో గుర్తుకు వచ్చి ఏవో జ్ఞాపకాలు కూడా తలుపు తడతాయి. ఏ4లో ఆర్ట్ పేపర్ మీద ముద్రణ అందంగా ఉంది. మూవీ మొఘల్- రచన: యు. వినాయకరావు, వెల: రూ. 300, ప్రతులకు: 93947 36301, 98851 79428. -
చిన్నబోయిన సినీ లోకం
రామానాయుడి మృతితో ఫిలింనగర్, సినీవిలేజ్‌లో విషాదం రాయదుర్గం: మూవీమొగల్ రామానాయుడు మృతితో నానక్‌రాంగూడలోని సినీ విలేజ్, జూబ్లీహిల్స్‌లోని ఫిలింనగర్ గురువారం మూగ బోయాయి. ఆయన మృతికి సంతాప సూచకంగా షూటింగ్‌లు నిలిపివేసి బంద్ పాటించడంతో సినీ విలేజ్ ప్రాంగణం బోసి పోయింది. 1994లో రామానాయుడు ఔట్ డోర్ షూటింగ్‌ల కోసం ప్రత్యేకంగా ఖాజాగూడ-నానక్‌రాంగూడ మధ్యన భగీరథ చెరువు సమీపంలో సినీ విలేజ్ ఏర్పాటు చేశారు. సినిమాలకు చెందిన ఔట్ డోర్ షూటింగ్‌లను ఇక్కడ నిర్వహిస్తుండడంతో ఎప్పుడు సినీ కళాకారులతో ఈ ప్రాంతం కిటకిటలాడుతుంటోంది. గత 20 ఏళ్లుగా ఆయున వారంలో కనీసం రెండు సార్లయినా ఇక్కడి వచ్చి పరిసరాలు, చెట్లు, మొక్కలు పరిశీలించి, సిబ్బందికి అవసరమైన సూచనలు చేసేవారని ఉద్యోగులు తెలిపారు. రామానాయుడి మృతికి సంతాపం... రామానాయుడు మృతితో నిశ్చేష్టులైన ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది ప్రధాన గేటు వద్ద రామానాయుడు చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. దీంతోపాటు స్టూడియో ముందున్న ఔటర్ రింగు రోడ్డు సర్కిల్ వద్ద ఉన్న రోడ్డు పక్కన నాగదేవత గుడి ముందు భారీ చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు వేశారు. కళతప్పిన కృష్ణానగర్ సినీ కార్మికుల ఆరాధ్య దైవంగా వెలుగుతున్న మూవీ మొఘల్ రామానాయుడు మృతితో కృష్ణానగర్, ఫిలింనగర్, ఇందిరానగర్ ప్రాంతాలు శోకసంద్రంలో మునిగిపోయూరుు. నిత్యం సినీ కార్మికులతో కిటకిటలాడే ఈ ప్రాంతాలు గురువారం నిర్మానుష్యంగా మారాయి. ప్రతి యూనియన్ కార్యాలయం ముందు రావూనాయుుడు చిత్రపటాలు ఏర్పాటు నివాళులర్పించారు. యూనియన్ కార్యాలయాలు మూసివేశారు. షూటింగ్లో నిలిపివేశారు. థియేటర్లను కూడా వుూసివేసి సినీ కార్మికులంతా రామానాయుడు స్టూడియో దారి పట్టారు. తమ అభిమాన నిర్మాత ఇకలేరన్న విషయాన్ని తలుచుకొని మహిళా కార్మికులు కంటతడిపెట్టారు. సంతాపం బహుభాషా సినీ నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు మృతికి తీవ్ర సంతాపాన్ని తెలుపుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు ఏపీ చిల్ట్రన్స్ ఫిల్మ్ సొసైటీ చైర్మన్ వేదకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రామానాయుడు మృతి తెలుగు సినీపరిశ్రమకు తీరనిలోటని పేర్కొన్నారు. పెద్ద సార్‌తో 18 ఏళ్ల అనుబంధం పెద్ద సార్‌తో 18 ఏళ్ల అనుబంధం ఉందని నానక్‌రాంగూడలోని రామానాయుడు సినీ విలేజ్ సెక్యూరిటీ గార్డు ఎస్ కె సింగ్ గద్గద స్వరంతో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి 18 ఏళ్ల క్రితం వలస వచ్చి సెక్యూరిటీ గార్డుగా చేరానన్నాడు. ఇక్కడ పనిచేసే అయిదుగురు సెక్యూరిటీ సిబ్బంది, ఇతర ఉద్యోగులను ఆప్యాయుంగా పలకరించేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. -ఎస్.కె.సింగ్, సెక్యూరిటీ గార్డు -
రామానాయుడు అంత్యక్రియలు పూర్తి
-
రామానాయుడి అంతిమయాత్ర!
-
కొత్త నిర్మాతలెందరికో.. దారిదీపం..
-
రామానాయుడికి సీఎం కేసీఆర్ నివాళి
-
ప్రభుత్వ లాంఛనాలతో రామానాయుడి అంత్యక్రియలు
-
సినీ దిగ్గజం.. నేల రాలింది..
-
స్టూడియోకు రామానాయుడు పార్థివ దేహం
-
సినీ పరిశ్రమకు ఎంత చేశాడో..
-
రామానాయుడు భౌతికకాయానికి వైఎస్ జగన్ నివాళి
-
సినిమాయే జీవితంగా బతికిన మనిషి..
-
నిర్మాతలెందరికో ఆదర్శం..
-
పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది
-
మనసున్న మహారాజు.. రామానాయుడు..
-
రేపు అంత్యక్రియలు: వెంకటేశ్
-
మూవీ మొఘల్.. ఇకలేరు..
-
ప్రముఖ నిర్మాత రామానాయుడు కన్నుమూత
-
ఇంటర్వూ డా.డి. రామానాయుడు
మా ఫ్యామిలీ అంతా కలిసి ఓ సినిమాలో నటిస్తాం! ‘సినిమాకు సంబంధించిన 24 శాఖల్లో దేన్నయినా ఎంచుకో... నిర్మాత మాత్రం కావద్దు’... పరిశ్రమలో కొంతమంది పెద్దలు చెప్పే సూక్తి ఇది. నేటి పరిస్థితుల్లో ఇది నిజమే కావచ్చు. కానీ ఇదే వాస్తవం కాదు. నిబద్ధత, పట్టుదల, అభిరుచి, క్రమశిక్షణ, కార్యదీక్ష ఈ అయిదింటినీ ఆభరణాలుగా చేసుకొని ముందుకెళితే... నిర్మాణ రంగంలో కూడా విజయం తథ్యం. అందుకు నిలువెత్తు సాక్ష్యమే డా.డి.రామానాయుడు. ఒక నిర్మాతగా దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్ పురస్కారాలను సాధించి ‘మూవీమొగల్’ అనే బిరుదుకి సార్థకతను తెచ్చారాయన. త్వరలో నాయుడుగారు నిర్మాతగా యాభై ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ అయిదు పదుల ప్రస్థానంలో వందకు పైచిలుకు చిత్రాలను నిర్మించడం ఓ రికార్డ్ అయితే, దేశంలో ఎన్ని భాషల్లో అయితే చిత్ర నిర్మాణాలు జరుగుతున్నాయో, వాటన్నింటిలోనూ సినిమాలు నిర్మించడం మరో రికార్డ్. పి.సునిల్‌కుమార్ రెడ్డి దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘నేనేం చిన్నపిల్లనా’ చిత్రం నవంబర్ 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాయుడుగారితో కాసేపు. ‘నేనేం చిన్నపిల్లనా’ ఎలా ఉంటుంది? కాసేపు నవ్విస్తుంది. ఇంకాసేపు భావోద్వేగాల్ని కలిగిస్తుంది. ముఖ్యంగా మహిళల్ని విపరీతంగా ఆకట్టుకునే సినిమా ఇది. ఇటీవలే శ్రేయోభిలాషులకు ఈ సినిమా వేశాం. మాకు తెలీకుండానే కన్నీరొచ్చేసిందండీ... అన్నారు. అంతటి ఉద్వేగం ఉంటుందీ సినిమాలో. ‘అందాలరాక్షసి’ ఫేం రాహుల్ ఇందులో బాగా చేశాడు. కొత్తమ్మాయి తన్వీవ్యాస్ని కథానాయికగా పరిచయం చేస్తున్నాం. సాంకేతికంగా కూడా గొప్పగా ఉంటుందీ సినిమా. సునిల్కుమార్రెడ్డితో పనిచేయడం చాలా సౌకర్యవంతంగా ఉంది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. మీరు కొత్తవాళ్లతో పనిచేయడానికి ఎక్కువగా ఆసక్తిచూపుతుంటారు. కారణమేంటి? ప్రతిభను ప్రోత్సహించడం నాకు తొలినాళ్లనుంచీ ఉన్న అలవాటు. అవకాశం ఇచ్చి వదిలేయడం కూడా కాదు. వారి అభ్యున్నతికి కూడా నేనే బాటలు వేసేవాణ్ణి. తెలుగులో నాకు వాళ్లు సక్సెస్ ఇస్తే... ఇతర భాషల్లో ఆ సినిమాను రీమేక్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా వారినే దర్శకులుగా ఎంచుకునేవాణ్ణి. మా సంస్థ ద్వారా ఇప్పటివరకూ 21 మంది కొత్త దర్శకులు పరిచయం అయ్యారు. 12 మంది హీరోయిన్లు, నలుగురు హీరోలు పరిచయం అయ్యారు. జేవీ రాఘవులు నుంచి ఎం.ఎం.శ్రీలేఖ వరకూ సంగీత దర్శకులు కూడా చాలామంది సురేష్ సంస్థ ద్వారానే వెలుగులోకొచ్చారు. ఒక నిర్మాతగా నాకెంతో సంతృప్తిని మిగిల్చే విషయం ఇది. ఎన్నో గొప్ప చిత్రాలు తీసిన మీ నుంచి ఇటీవలి కాలంలో ఆ స్థాయి సినిమాలు రావడం లేదనే అభిప్రాయం ఉంది? ఇప్పుడు పరిస్థితులు ఇదివరకులా లేవు. హీరోల దగర్గకెళ్లి డేట్లు అడగలేను. ఈ విషయం గురించి ప్రస్తుతానికి ఇంతకంటే మాట్లాడటం నాకిష్టం లేదు. సినిమాల నిర్మాణం కూడా తగ్గించినట్టున్నారు. ఎందుకని? అలాంటిదేం లేదే. ‘మసాలా’ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ‘దసరాబుల్లోడు’ చేస్తున్నాం. పంజాబీలో నేను నిర్మించిన ‘సింగ్ వర్సెస్ కౌర్’ చిత్రాన్ని నాగచైతన్యతో నిర్మించబోతున్నాను. అలాగే... రానా కథానాయకునిగా కూడా ఓ చిత్రం మొదలు కానుంది. ఇక వేగం ఎక్కడ తగ్గినట్టు? మీ ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఓ చిత్రం చేయబోతున్నారట కదా? అది నా జీవితాకాంక్ష. అక్కినేనివారి కుటుంబం అంతా ‘మనం’ చేస్తున్నట్లుగా, నా కుటుంబం అంతా కలిసి కూడా ఓ చిత్రం చేయాలని ఉంది. నేను, వెంకటేష్, రానా, నాగచైతన్య అందులో నటిస్తాం. నా చిన్నమనవడు అభిరామ్‌తో కూడా అందులో ఓ పాత్ర చేయించాలి. నా సినిమాల్లో చిన్ని చిన్న పాత్రలు చేసిన అనుభవం నాకుంది. అలాగే... ‘హోప్’ సినిమాలో పూర్తి స్థాయిలో నటించా. అన్నీ కుదిరితే మా ఫ్యామిలీ సినిమాలో కూడా పూర్తిస్థాయి పాత్ర చేస్తా. కథ దొరికితే వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సెట్స్‌కి వెళ్లిపోతాం. నిర్మాతగా 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు కదా... ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. 50 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా మా అబ్బాయిలు గెట్ టు గెదర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఆ కార్యక్రమంలో అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాను. చివరిగా ఓప్రశ్న. రాష్ట్రం రెండుగా విడిపోతోంది కదా. మరి వైజాగ్‌లో కూడా ఓ సినీ కేంద్రం ఏర్పాటవుతుందంటారా? సినిమా కేంద్రం మాత్రం హైదరాబాదే. -
Legends - Dr. D.Rama Naidu