‘జీవితాంతం రుణపడి వుంటాము’ | Ramanaidu Statue Unveiled At Film Chamber By Suresh Babu | Sakshi
Sakshi News home page

ఫిలింఛాంబర్‌లో మూవీ మొఘల్‌ విగ్రహావిష్కరణ

Jun 6 2019 1:23 PM | Updated on Aug 11 2019 12:52 PM

Ramanaidu Statue Unveiled At Film Chamber By Suresh Babu - Sakshi

మూవీ మొఘల్‌ డా.డి రామానాయుడు జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఫిలింఛాంబర్‌లో ఆవిష్కరించారు. సురేష్‌ బాబు రామానాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించగా.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, అల్లు అరవింద్‌, జి. ఆదిశేషగిరి రావు, పరుచూరి వెంకటేశ్వర రావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్‌, సురేష్‌ బాబు, రానా, నాగచైతన్య సోషల్‌ మీడియా ద్వారా అప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

తన కొడుకు, మనవడు కలిసి నటిస్తే చూడాలన్నది రామానాయుడు గారి కోరిక అని.. అది ‘వెంకీమామా’ సినిమాతో తీరుతుందని సురేష్‌ బాబు అన్నారు. కానీ ఈ సమయంలో ఆయనను చాలా మిస్‌ అవుతున్నామని సురేష్‌ బాబు తెలిపారు. ‘వెంకీ మామా చిత్రం నీకోసమే తాత’ అంటూ నాగచైతన్య ట్వీట్‌ చేశాడు. మై బిగ్గెస్ట్‌ హీరో అంటూ రానా.. ‘మీరు ఎప్పటికీ మాతోనే ఉంటారు నాన్న, మీ కలను నిజం చేస్తున్నాము. మిమ్మల్ని మిస్‌ అవుతున్నాం. హ్యాపీ బర్త్‌డే’ అంటూ వెంకటేష్‌ పోస్ట్‌ చేశారు.

‘ఎంతోమంది సినీ ప్రముఖులకు జీవితాన్నిచ్చిన రామానాయుడుగారి జన్మదినం నేడు. ఈ నాడు ఆయన శిలా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం లో పాల్గొని నివాళి అర్పించాను. నాయుడు గారూ మేము మీకు ముందడుగు సినిమారాస్తే , మమ్మల్ని మీరు పరిశ్రమలో ముందడుగు వేయించారు. జీవితాంతం రుణపడివుంటాము’ అని పరుచూరి గోపాలకృష్ణ భావోద్వేగంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement