'ఈకథలో పాత్రలు కల్పితం' సినిమా అందరికి నచ్చుతుంది | Producer Ramanaidu Says Every One Loves Ee Kathalo Paathralu Kalpitam Movie | Sakshi
Sakshi News home page

'ఈకథలో పాత్రలు కల్పితం' సినిమా అందరికి నచ్చుతుంది

Published Thu, Mar 25 2021 6:04 PM | Last Updated on Thu, Mar 25 2021 7:44 PM

Producer Ramanaidu Says Every One Loves Ee Kathalo Paathralu Kalpitam Movie - Sakshi

పవన్‌ తేజ్‌ కొణిదెల, మేఘన హీరో హీరోయిన్ లుగా అభిరామ్ ఎమ్‌. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఈకథలో పాత్రలు కల్పితం'. మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాజేష్‌ నాయుడు నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరుపుకున్న ఈ సినిమా ఈవెంట్ కు లిరిసిస్ట్ చంద్రబోస్, అంబర్ పేట్ శంకరన్న, బోరబండ సత్యం,  సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ర్యాప్ సింగర్ నోయెల్, హుషారు ఫేమ్ హీరో దినేష్ తేజ్, డాన్స్ మాస్టర్ యష్ తదితరులు  హాజరై సినిమా ను ఆశీర్వదించారు. మార్చి 26 న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రిలీజ్ కాబోతున్న సందర్భంగా నిర్మాత రాజేష్ నాయుడు తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.

నిర్మాత రాజేష్ నాయుడు మాట్లాడుతూ.. ‘మొదటి నుంచి ఈ సినిమా కి వస్తున్న సపోర్ట్ మర్చిపోలేనిది. పాటలకు , టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన వచ్చింది..  ఈ సినిమా కి కష్టపడి పనిచేసిన అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.  సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా ఈ సినిమా ని సపోర్ట్ చేస్తూ వచ్చిన అంబర్ పేట్ శంకరన్న, బోరబండ సత్యం అన్నలకు రుణపడి ఉంటాను. చిత్రం ఇంత బాగా రావడానికి వారిచ్చిన సహకారమే ముఖ్య కారణం.. సినిమాలోని పాట రిలీజ్ చేసిన శ్రీ వైఎస్ షర్మిల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు..  ట్రైలర్ లాంచ్ చేసి మా సినిమా కి హైప్ తీసుకొచ్చిన పూరీజగన్నాధ్ గారికి ధన్యవాదాలు..  ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసి సినిమా కు మంచి బూస్ట్ ఇచ్చిన లిరిసిస్ట్ చంద్రబోస్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ర్యాప్ సింగర్ నోయెల్, హుషారు ఫేమ్ హీరో దినేష్ తేజ్, డాన్స్ మాస్టర్ యష్ లకు ప్రత్యేక ధన్యవాదాలు. ఫైనల్ కాపీ సినిమా చూశాను.. సినిమా తప్పకుండ హిట్ అవుతుంది. మీరంతా ఓ రెండు గంటలు ఎంజాయ్ చేసే సినిమా ఇది.. అందరు తప్పకుండా సినిమా చూడండి..అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement