Ee Kathalo Patralu Kalpitam Movie
-
‘ఈ కథలో పాత్రలు కల్పితం’ మూవీ రివ్యూ
టైటిల్ : ఈ కథలో పాత్రలు కల్పితం నటీనటులు : పవన్‌తేజ్, మేఘన, పృథ్వీ, రఘుబాబు, నవీన్, అభయ్ సింగ్, నోయెల్ తదితరులు నిర్మాణ సంస్థ : ఎంవీటీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత : రాజేష్ నాయుడు దర్శకత్వం : అభిరామ్ ఎమ్ సంగీతం : కార్తీక్ కొడకండ్ల సినిమాటోగ్రఫీ : సునీల్ కుమార్.ఎన్ ఎడిటింగ్ : శ్రీకాంత్ పట్నాయక్. ఆర్- తిరు విడుదల తేది : మార్చి 26, 2021 మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే పది మందికి పైగా హీరోలు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి, తమదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఆ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అతనే పవన్ తేజ్ కొణిదెల. ఆయన హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం ఈ కథలో పాత్రలు కల్పితం. అభిరామ్. ఎమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజేష్ నాయుడు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథ కృష్ణ (పవన్ తేజ్)కు సినిమాలు అంటే పిచ్చి. ఎప్పటికైనా హీరో కావాలనుకుంటాడు. ఇండస్ట్రీ వాళ్లతో టచ్‌లో ఉంటే సినిమా చాన్స్‌లు వస్తాయని తన స్నేహితుడు నిర్మాత రత్నం (రఘుబాబు) దగ్గర మేనేజర్‌గా వుంటాడు. అతనికి ఓ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న శృతి (మేఘన కుమార్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఇదిలా ఉంటే.. చాలా రోజుల తర్వాత కృష్ణకు ఓ సినిమాలో హీరోగా అవకాశం వస్తుంది. ఆ మూవీ ఓ పాపులర్ మోడల్ యదార్థ కథ నేపథ్యంలో రూపొందిస్తుంటారు. ఇంతకీ ఆ మెడల్ ఎవరు? ఆమె వెనకున్న కథేంటీ? హీరో కృష్ణకి మోడల్‌కు ఉన్న సంబంధం ఏంటి? అనేదే మిగతా కథ. నటీనటులు పవన్ తేజ్‌కి తొలి సినిమా ఇది. కానీ సగటు ప్రేక్షకులు పవన్ తేజ్‌కు ఇది తొలి సినిమా అని గుర్తుపట్టలేరు. అంతలా నటించాడు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ పలికిన తీరు బాగుంది. డ్యాన్స్, ఫైట్స్ కూడా ఇరగదీశాడు. హీరోయిన్ మేఘన అందం, అభినయం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. హీరోయిన్ శృతి పాత్రలో ఒదిగిపోయింది. ఇక ఈ సినిమాలో హీరో కృష్ణ తర్వాత బాగా పండిన పాత్ర ‘పెళ్లి’ ఫస్త్రమ్ పృథ్వీది. ఏసీపీ పాత్రలో తనదైన నటనను ప్రదర్శించి ఆకట్టుకున్నాడు.తన అనుభవం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. నిర్మాత రియల్ రత్నం పాత్రలో రఘుబాబు నవ్వించారు. సింగర్ నోయెల్ విలన్‌గా అలరించారు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. విశ్లేషణ థ్రిల్లర్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ఇది. ఇలాంటి చిత్రాలపై టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తారు. అందుకే ఈ మధ్య కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ నమ్మకంతోనే అరణ్య, రంగ్‌దే లాంటి పెద్ద సినిమాలో పోటీలో ఉన్నా.. తమ చిత్రాన్ని ధైర్యంగా విడుదల చేశారు ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ నిర్మాతలు. కథను నమ్ముకొని తీసిని సినిమా ఇది. అనుకున్న పాయింట్‌ను తెరపై చూపించడంలో సఫలం అయ్యాడు దర్శకుడు భిరామ్. ఎమ్. ఒకవైపు సస్పెన్స్ మరోవైపు ఎంటర్టైన్మెంట్ బేలన్స్ చేస్తూ ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా జాగ్రత్త పడ్డాడు. నేడు సమాజంలో జరుగుతున్నా విమెన్ ట్రాఫికింగ్ ను ఎంచుకుని దాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించిన విధానం బాగుంది. కథని అనేక మలుపులతో నడిపించిన తీరు ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. సెకండాఫ్‌లోని వచ్చే కొన్ని ట్వీస్టులు ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తాయి.. పవన్‌తేజ్, పృథ్వీల నటన సినిమాకు చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇక సినిమాకు మరో ప్రధాన బలం కార్తీక్ కొడకండ్ల సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతంతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాడు. కొన్ని కీలక సన్నివేశాలు తన బీజీఎంతో ప్రాణం పోశాడు. శ్రీకాంత్ పట్నాయక్. ఆర్- తిరు ఎడిటింగ్ పర్వాలేదు. సునీల్ కుమార్ సినిమాటోగ్రఫి బాగుంది. చాలా సీన్స్ చాలా అందంగా చూపించారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
‘ఈ కథలో పాత్రలు కల్పితం’కు ‘మెగా’ సపోర్ట్ ఉంది
పవన్ తేజ్ కొణిదెల, మేఘన హీరో హీరోయిన్ లుగా అభిరామ్ ఎమ్. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఈకథలో పాత్రలు కల్పితం'. మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజేష్ నాయుడు నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి ఓపెనింగ్స్ రాబట్టడంతో ఈ సినిమా టీమ్ శనివారం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో పవన్ తేజ్, హీరోయిన్ మేఘన, నిర్మాత రాజేష్ నాయుడు, దర్శకుడు అభిరామ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత రాజేష్ నాయుడు మాట్లాడుతూ...ఈ సినిమా విడుదలయిన అన్ని సెంటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతటా పాజిటివ్ టాక్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా విషయంలో కొణిదెల ఫ్యామిలీ హీరో పవన్ తేజ్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. మా సినిమాకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేదనీ అంటున్నారు..కానీ వాళ్ల సపోర్ట్ మొదటినుండి ఉంది. ఈ సినిమా దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు అన్నారు. దర్శకుడు అభిరాం మాట్లాడుతూ.. 'ఈకథలో పాత్రలు కల్పితం సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. ఫస్ట్ డే నుంచి మంచి టాక్ తో వెళ్తుంది సినిమా.. అందరం కొత్తవాళ్ళం కలిసి చేసిన ఈ సినిమాకి ఇంత మంచి టాక్ వస్తుందని అనుకోలేదు.. మమ్మల్ని ప్రోత్సహించిన ప్రేక్షక దేవుళ్ళకి ధన్యవాదాలు.. షో కూడా పెరుగుతున్నాయి. ధియేటర్స్ వైపు సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది.. ట్విస్ట్ లు బాగున్నాయని అన్ని వెబ్ సైట్స్ రాస్తున్నాయి. బుక్ మై షో లో కూడా మంచి రేటింగ్స్ ఉన్నాయి.. మా సినిమా కి మీడియా సపోర్ట్ కూడా ఉంటే సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందన్నారు. హీరో పవన్ తేజ్ కొణిదెల మాట్లాడుతూ.. పెద్ద సినిమా క్వాలిటీ మైంటైన్ చేశామని అందరు అంటున్నారు. మంచి సినిమా ఇది.. అందరికి బాగా రీచ్ అయితే ఇంకా పెద్ద హిట్ అవుతుంది సినిమా అంటున్నారు. ముందునుంచి నాకు సినిమాపై మంచి హోప్ ఉంది. కానీ ఇంత పెద్దగా రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు.. అందరం కొత్తవాళ్ళం.. మీ సపోర్ట్ ఉంటేనే పైకివస్తాం.. ఈ మూవీ ఇంతపెద్ద హిట్ అవడానికి కారణమైన అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు.. హీరోయిన్ మేఘన మాట్లాడుతూ.. నిన్న రిలీజ్ అయిన మా ఈ కథలో పాత్రలు కల్పితం సినిమా కి మంచి రెస్పాన్స్ వస్తుంది. రేటింగ్స్ కూడా బాగా ఉన్నాయి.. మాకు ఇచ్చిన సపోర్ట్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.. మీడియా సపోర్ట్ ఉంటే మా సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుంది.. సినిమా బాగుంది కాబట్టే ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం.. ఒక్క నెగెటివ్ రివ్యూ కూడా లేదు.. అది చాలా సంతోషంగా ఉంది.. అన్నారు. -
మీ డ్రీమ్ నెరవేరాలి : ‘దిల్’ రాజు
‘‘డ్రీమ్ బాయ్’ ఫస్ట్ లుక్, ట్రైలర్ చాలా బాగుంది. ప్రజెంట్ ట్రెండ్‌కి ఈ తరహా చిత్రాలు బాగా నచ్చుతాయి. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. చిత్ర యూనిట్‌కి నా అభినందనలు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. సాయితేజ, హరిణి రెడ్డి జంటగా రాజేష్ కనపర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డ్రీమ్ బాయ్’. సెవెన్ వండర్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రేణుక నరేంద్ర నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్‌ను ‘దిల్’ రాజు విడుదల చేశారు. రాజేష్ కనపర్తి మాట్లాడుతూ– ‘‘మా సినిమా అనుకున్న సమయంలో పూర్తి కావడానికి సహకరించిన వారికి ధన్యవాదాలు. రాజుగారి ఆశీర్వాద బలం, రేణుకా నరేంద్ర సంకల్ప బలంతో ఈ చిత్రం సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘నేటి ట్రెండ్‌కి అనుగుణంగా ‘డ్రీమ్ బాయ్’ని రాజేష్ కనపర్తి మలిచాడు’’ అన్నారు రేణుకా నరేంద్ర. ‘‘సినిమా విజయంపై మేమంతా నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వై.కె. నరేంద్ర. చిరంజీవి మాటలే స్ఫూర్తి ‘‘ఇప్పటి వరకూ చిన్న చిన్న పాత్రలు చేసిన నేను ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ ద్వారా హీరోగా వస్తున్నాను. ‘ఎంతో కష్టపడాలి.. అప్పుడే విజయం వరిస్తుంది’ అని చెప్పిన హీరో చిరంజీవి గారి మాటలే నాకు స్ఫూర్తి. ఎంతైనా కష్టపడతాను’’ అని పవణ్ తేజ్ కొణిదెల అన్నారు. అభిరామ్ ఎమ్. దర్శకత్వంలో పవణ్ తేజ్ కొణిదెల, మేఘన జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. మాధవి సమర్పణలో రాజేష్ నాయుడు నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో– ‘‘నా నమ్మకాన్ని అభిరామ్ నిలబెట్టాడు’’ అన్నారు రాజేష్ నాయుడు. ‘‘మెగా ఫ్యామిలీకి చెందిన పవణ్ మంచి సబ్జెక్టు కోసం చూస్తున్నారని తెలియడంతో వెళ్లి కథ చెప్పాను. ఆయనకు నచ్చడంతో నిర్మాతని కలవగానే ఈ సినిమా ఓకే అయ్యింది’’ అన్నారు అభిరామ్. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మేఘన, సంగీత దర్శకుడు కార్తీక్ కొడకండ్ల, రచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, నోయెల్, ‘హుషారు’ హీరో దినేష్ తేజ్ పాల్గొన్నారు. -
'ఈకథలో పాత్రలు కల్పితం' సినిమా అందరికి నచ్చుతుంది
పవన్ తేజ్ కొణిదెల, మేఘన హీరో హీరోయిన్ లుగా అభిరామ్ ఎమ్. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఈకథలో పాత్రలు కల్పితం'. మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజేష్ నాయుడు నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరుపుకున్న ఈ సినిమా ఈవెంట్ కు లిరిసిస్ట్ చంద్రబోస్, అంబర్ పేట్ శంకరన్న, బోరబండ సత్యం, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ర్యాప్ సింగర్ నోయెల్, హుషారు ఫేమ్ హీరో దినేష్ తేజ్, డాన్స్ మాస్టర్ యష్ తదితరులు హాజరై సినిమా ను ఆశీర్వదించారు. మార్చి 26 న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రిలీజ్ కాబోతున్న సందర్భంగా నిర్మాత రాజేష్ నాయుడు తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. నిర్మాత రాజేష్ నాయుడు మాట్లాడుతూ.. ‘మొదటి నుంచి ఈ సినిమా కి వస్తున్న సపోర్ట్ మర్చిపోలేనిది. పాటలకు , టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన వచ్చింది.. ఈ సినిమా కి కష్టపడి పనిచేసిన అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా ఈ సినిమా ని సపోర్ట్ చేస్తూ వచ్చిన అంబర్ పేట్ శంకరన్న, బోరబండ సత్యం అన్నలకు రుణపడి ఉంటాను. చిత్రం ఇంత బాగా రావడానికి వారిచ్చిన సహకారమే ముఖ్య కారణం.. సినిమాలోని పాట రిలీజ్ చేసిన శ్రీ వైఎస్ షర్మిల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.. ట్రైలర్ లాంచ్ చేసి మా సినిమా కి హైప్ తీసుకొచ్చిన పూరీజగన్నాధ్ గారికి ధన్యవాదాలు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసి సినిమా కు మంచి బూస్ట్ ఇచ్చిన లిరిసిస్ట్ చంద్రబోస్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ర్యాప్ సింగర్ నోయెల్, హుషారు ఫేమ్ హీరో దినేష్ తేజ్, డాన్స్ మాస్టర్ యష్ లకు ప్రత్యేక ధన్యవాదాలు. ఫైనల్ కాపీ సినిమా చూశాను.. సినిమా తప్పకుండ హిట్ అవుతుంది. మీరంతా ఓ రెండు గంటలు ఎంజాయ్ చేసే సినిమా ఇది.. అందరు తప్పకుండా సినిమా చూడండి..అన్నారు. -
మార్చి 26 న ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ విడుదల
‘ఎంతో కష్టపడాలి అప్పుడే విజయం వరిస్తుందని చిరంజీవి చెప్పారు. అది చేయడానికి ఎంతో కష్టపడతాను. సినిమా ఇండస్ట్రీ లో చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ వచ్చాను.. ఇప్పుడు ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ ద్వారా హీరోగా వస్తున్నాను. నన్ను నమ్మి ఇంత మనీ ఇన్వెస్ట్ చేసిన నిర్మాత కి ప్రత్యేక కృతజ్ఞతలు’అన్నారు హీరో పవన్ తేజ్. పవన్ తేజ్ కొణిదెల, మేఘన జంటగా అభిరామ్ ఎమ్. దర్శకత్వంలో మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజేష్ నాయుడు నిర్మాతగా మార్చి 26 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా 'ఈ కథలో పాత్రలు కల్పితం'. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్‌కి, సాంగ్స్‌కి, టీజర్‌కి మంచి స్పందన రాగా సినిమా పై మంచి అంచనాలు పెరిగాయి. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి లిరిసిస్ట్ చంద్రబోస్, అంబర్ పేట్ శంకరన్న, బోరబండ సత్యం, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ర్యాప్ సింగర్ నోయెల్, హుషారు ఫేమ్ హీరో దినేష్ తేజ్, డాన్స్ మాస్టర్ యష్ తదితరులు ముఖ్య అతిధులుగా వచ్చారు.. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ చిత్ర విశేషాలను పంచుకున్నారు.. అంబర్ పేట్ శంకరన్న మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కృతజ్ఞతలు.. నా మిత్రుడు ఆహ్వానం మేరకు ఈ ఫంక్షన్ కి వచ్చాను..ఈ సినిమాకి, రాజేష్ నాయుడు కి నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. ఈ సినిమా ట్రైలర్ చూసి పెద్ద వాళ్ళు మెచ్చుకున్నారు. పూరి జగన్నాధ్ కి ట్రైలర్ చాలా బాగా నచ్చింది. ఈ సినిమా చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాను అన్నారు.. సంగీత దర్శకుడు కార్తీక్ కొడకండ్ల మాట్లాడుతూ.. ఈ సినిమా ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. చంద్రబోస్ గారితో కలిసి పనిచేయడం ఎంతో గొప్పగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు అభిరామ్ గారికి థాంక్స్.. నిర్మాత రాజెశ్నాయుడు గారికి స్పెషల్ థాంక్స్.. పాటలు అందరికి నచ్చాయని అనుకుంటున్నాను.. ఈ పాటలు ఇంత బాగా రావటానికి కారణం సినిమా విజువల్స్.. విజువల్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాని అందరు చూసి ఆశీర్వదించండి.. అన్నారు. సింగర్ నోయెల్ మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకు ధన్యవాదాలు.. చిన్న సినిమాలకు గుర్తింపు ఉంటుందంటే అందుకు కారణం మీడియా.. మీ సపోర్ట్ కు చాల థాంక్స్.. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిధులకు స్పెషల్ థాంక్స్.. ఈ సినిమా లో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇద్దరు మంచి ఫ్యాషన్ తో సినిమా చేశారు. హీరో పవన్ తేజ్ కొణిదెల డెడికేషన్ చాలా బాగుంది. హీరోయిన్ ఎంతో ఫ్యాషన్ తో ఇంతదూరం వచ్చింది. ఈ సినిమా ద్వారా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను.. అభిరామ్ మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్.. అందరు ఈ సినిమా ని చూసి పెద్ద హిట్ చేయాలి అని కోరుకున్నారు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ.. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయండి..మాలాంటి వాళ్ళను ప్రోత్సహించండి. మాకు ఇది ఎంకరేజ్ లాగా ఉంటుంది. ఈ సినిమా టీం కి అల్ ది బెస్ట్.. పాటలు బాగున్నాయి.. సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. నన్ను ఈ ఫంక్షన్ కి ఆహ్వానించినా అంబర్ పేట్ శంకర్ అన్నకి కృతజ్ఞతలు.. అన్నారు.. నిర్మాత రాజేష్ నాయుడు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు.. నేను సినిమా నేపథ్యం కలిగిన వాడిని కాదు.. కానీ పవన్ తేజ్ కొణిదెల ఓ డైరెక్టర్ ని తీసుకొచ్చి చెప్పిన కథ ఎంతో ఆకట్టుకుంది. అభిరామ్ పై నమ్మకం అప్పుడే వచ్చింది. ఇప్పుడు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టాడు. లాక్ డౌన్ లో కష్ట సమయంలో అందరు నన్ను సపోర్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన బోరబండ సత్యమన్న కి, అంబర్ పేట్ శంకరన్న కి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు... దర్శకుడు అభిరామ్ మాట్లాడుతూ.. స్టేజి మీద ఉన్న ముఖ్య అతిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు.. ఈ సినిమా కోసం చాల కష్టపడ్డాను.. అందరు మంచి సపోర్ట్ ఇచ్చారు.. మెగా ఫ్యామిలీ లో ఓ హీరో మంచి సబ్జెక్టు కోసం చూస్తున్నారు అని విన్నాను.. వెళ్లి కథ చెప్పాను.. ఆయనకు కథ విపరీతంగా నచ్చేసింది. వెంటనే ప్రొడ్యూసర్ ని కలిస్తే సినిమా ఓకే అయ్యింది.అయన ఇప్పటికీ స్క్రిప్ట్ కూడా వినలేదు. నన్ను నమ్మిన ఆయనకు కృతజ్ఞతలు.. ఈ సినిమా టైటిల్ కూడా అయన ఇచ్చిందే.. ఈ సినిమా కి పనిచేసిన అందరికి థాంక్స్.. అన్నారు. ముఖ్యంగా మాటలరచయిత సయ్యద్ గారికి, డీఓపీ గారికి థాంక్స్.. మల్లేష్ గారి ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయి..మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ గారితో వర్క్ చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఈ సినిమా కి ఇంత కష్టపడ్డా ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు.. నటీనటులు అందరు మంచి సపోర్ట్ చేశారు.. పవన్ తేజ్ కొణిదెల గారితో ఎన్ని సినిమాలు చేసినా చేయాలనిపిస్తుంది. మేఘన గారిని చూడగానే హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయాను. మార్చి 26 న సినిమా రిలీజ్ అవుతుంది.. అందరు థియేటర్లలో ఈ సినిమా ను చూడండి..అన్నారు. గీత రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ముఖ్య కారణం శంకరన్న.. అయన ద్వారా నిర్మాత రాజేష్ గారు నన్ను ఆహ్వానించారు. వేరే వాళ్ళు పాటలు రాసిన సినిమా కి నేను ముఖ్య అతిధిగా రావడం ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ఈ సినిమా టైటిల్ చాలా బాగుంది. రాహుల్ , నోయెల్ లు మంచి మిత్రులు.. ఈ ఇద్దరు పైకి రావాలని కోరుకుంటున్నారు. ఈ చిత్రంలోని పాటలు అందరికి నచ్చాలి. ప్రజాదరణ పొందాలి. మంచి ఛాన్స్ లు కార్తీక్ గారికి రావాలని కోరుకుంటున్నాను. దర్శకుడుకి మంచి సక్సెస్ రావాలి. ఈ చిత్రంలో నటించిన అందరికి, సాంకేతిక నిపుణులు అందరికి ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలి అని కోరుకుంటున్నాను అన్నారు. హీరోయిన్ మేఘన మాట్లాడుతూ.. ఇక్కడకి వచ్చిన మెగా అభిమానులకు అందరికి స్వాగతం.. ముఖ్య అతిధులకు ప్రత్యేక ధన్యవాదాలు.. నా ఫ్యాషన్ ని సపోర్ట్ చేసిన ఇంత దూరం వచ్చేలా చేసిన నా తల్లిదండ్రులకు థాంక్స్.. నాకీ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అభిరామ్ గారికి, నిర్మాత రాజేష్ నాయుడు గారికి స్పెషల్ థాంక్స్.. నా ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఈ సినిమా జర్నీ చాలా స్పెషల్ గా ఉంది. ఈ ఈవెంట్ కి వచ్చి మా సినిమా ని ఆశీర్వదించడానికి వచ్చిన నా మిత్రులకి థాంక్స్.. పవన్ తేజ్ కొణిదెల గారితో నటించడం ఎంతో మంచి అనుభూతిని ఇచ్చింది. అన్నారు.