మార్చి 26 న ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ విడుదల‌ | Ee Kathalo Patralu Kalpitam Pre Release Event | Sakshi
Sakshi News home page

చిరంజీవి చెప్పారు..అందుకే కష్టపడ్డా : పవన్‌ తేజ్‌

Published Wed, Mar 24 2021 5:12 PM | Last Updated on Wed, Mar 24 2021 6:32 PM

Ee Kathalo Patralu Kalpitam Pre Release Event - Sakshi

‘ఎంతో కష్టపడాలి అప్పుడే విజయం వరిస్తుందని చిరంజీవి చెప్పారు. అది చేయడానికి ఎంతో కష్టపడతాను. సినిమా ఇండస్ట్రీ లో చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ వచ్చాను.. ఇప్పుడు ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ ద్వారా హీరోగా వస్తున్నాను. నన్ను నమ్మి ఇంత మనీ ఇన్వెస్ట్ చేసిన నిర్మాత కి ప్రత్యేక కృతజ్ఞతలు’అన్నారు హీరో పవన్‌ తేజ్‌. పవన్‌ తేజ్‌ కొణిదెల, మేఘన జంటగా  అభిరామ్ ఎమ్‌. దర్శకత్వంలో మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాజేష్‌ నాయుడు నిర్మాతగా మార్చి 26 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా  'ఈ కథలో పాత్రలు కల్పితం'.

ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీ పోస్టర్స్‌‌కి, సాంగ్స్‌కి, టీజర్‌కి మంచి స్పందన రాగా సినిమా పై మంచి అంచనాలు పెరిగాయి. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.  ఈ కార్యక్రమానికి లిరిసిస్ట్ చంద్రబోస్, అంబర్ పేట్ శంకరన్న, బోరబండ సత్యం, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ర్యాప్ సింగర్ నోయెల్, హుషారు ఫేమ్ హీరో దినేష్ తేజ్, డాన్స్ మాస్టర్ యష్ తదితరులు ముఖ్య అతిధులుగా వచ్చారు.. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ చిత్ర విశేషాలను పంచుకున్నారు.. 

అంబర్ పేట్ శంకరన్న మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కృతజ్ఞతలు.. నా మిత్రుడు ఆహ్వానం మేరకు ఈ ఫంక్షన్ కి వచ్చాను..ఈ సినిమాకి, రాజేష్ నాయుడు కి  నా సపోర్ట్  ఎప్పటికీ ఉంటుంది. ఈ సినిమా ట్రైలర్ చూసి పెద్ద వాళ్ళు మెచ్చుకున్నారు. పూరి జగన్నాధ్ కి ట్రైలర్ చాలా బాగా నచ్చింది. ఈ సినిమా చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాను అన్నారు.. 

సంగీత దర్శకుడు కార్తీక్‌ కొడకండ్ల మాట్లాడుతూ.. ఈ సినిమా ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. చంద్రబోస్ గారితో కలిసి పనిచేయడం ఎంతో గొప్పగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు అభిరామ్ గారికి థాంక్స్.. నిర్మాత రాజెశ్నాయుడు గారికి స్పెషల్ థాంక్స్.. పాటలు అందరికి నచ్చాయని అనుకుంటున్నాను..  ఈ పాటలు ఇంత బాగా రావటానికి కారణం సినిమా విజువల్స్.. విజువల్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాని అందరు చూసి ఆశీర్వదించండి.. అన్నారు. 

సింగర్ నోయెల్ మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకు ధన్యవాదాలు.. చిన్న సినిమాలకు గుర్తింపు ఉంటుందంటే అందుకు కారణం మీడియా.. మీ సపోర్ట్ కు చాల థాంక్స్.. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిధులకు స్పెషల్ థాంక్స్.. ఈ సినిమా లో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇద్దరు మంచి ఫ్యాషన్ తో సినిమా చేశారు. హీరో పవన్ తేజ్ కొణిదెల డెడికేషన్ చాలా బాగుంది. హీరోయిన్ ఎంతో ఫ్యాషన్ తో ఇంతదూరం వచ్చింది. ఈ సినిమా ద్వారా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను.. అభిరామ్ మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్..  అందరు ఈ సినిమా ని చూసి పెద్ద హిట్ చేయాలి అని కోరుకున్నారు. 

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ..  చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయండి..మాలాంటి వాళ్ళను ప్రోత్సహించండి. మాకు ఇది ఎంకరేజ్ లాగా ఉంటుంది. ఈ సినిమా టీం కి అల్ ది బెస్ట్.. పాటలు బాగున్నాయి.. సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. నన్ను ఈ ఫంక్షన్ కి ఆహ్వానించినా అంబర్ పేట్ శంకర్ అన్నకి కృతజ్ఞతలు.. అన్నారు.. 

నిర్మాత రాజేష్ నాయుడు మాట్లాడుతూ..  ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు..  నేను సినిమా నేపథ్యం కలిగిన వాడిని కాదు.. కానీ పవన్ తేజ్ కొణిదెల ఓ డైరెక్టర్ ని తీసుకొచ్చి చెప్పిన కథ ఎంతో ఆకట్టుకుంది. అభిరామ్ పై   నమ్మకం అప్పుడే వచ్చింది. ఇప్పుడు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టాడు. లాక్ డౌన్ లో కష్ట సమయంలో అందరు నన్ను సపోర్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన బోరబండ సత్యమన్న కి, అంబర్ పేట్ శంకరన్న కి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు... 

దర్శకుడు అభిరామ్ మాట్లాడుతూ.. స్టేజి మీద ఉన్న ముఖ్య అతిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు.. ఈ సినిమా కోసం చాల కష్టపడ్డాను.. అందరు మంచి సపోర్ట్ ఇచ్చారు.. మెగా ఫ్యామిలీ లో ఓ హీరో మంచి సబ్జెక్టు కోసం చూస్తున్నారు అని విన్నాను.. వెళ్లి కథ చెప్పాను.. ఆయనకు కథ విపరీతంగా నచ్చేసింది. వెంటనే ప్రొడ్యూసర్ ని కలిస్తే సినిమా ఓకే అయ్యింది.అయన ఇప్పటికీ స్క్రిప్ట్ కూడా వినలేదు. నన్ను నమ్మిన ఆయనకు కృతజ్ఞతలు.. ఈ సినిమా టైటిల్ కూడా అయన ఇచ్చిందే..  ఈ సినిమా కి పనిచేసిన అందరికి థాంక్స్.. అన్నారు. ముఖ్యంగా మాటలరచయిత సయ్యద్ గారికి, డీఓపీ గారికి థాంక్స్.. మల్లేష్ గారి ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయి..మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ గారితో వర్క్ చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఈ సినిమా కి ఇంత కష్టపడ్డా ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు.. నటీనటులు అందరు మంచి సపోర్ట్ చేశారు.. పవన్ తేజ్ కొణిదెల గారితో ఎన్ని సినిమాలు చేసినా చేయాలనిపిస్తుంది. మేఘన గారిని చూడగానే హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయాను. మార్చి 26 న సినిమా రిలీజ్ అవుతుంది.. అందరు థియేటర్లలో ఈ సినిమా ను చూడండి..అన్నారు.

గీత రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ముఖ్య కారణం శంకరన్న.. అయన ద్వారా నిర్మాత రాజేష్ గారు నన్ను ఆహ్వానించారు. వేరే వాళ్ళు పాటలు రాసిన సినిమా కి నేను ముఖ్య అతిధిగా రావడం ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ఈ సినిమా టైటిల్ చాలా బాగుంది. రాహుల్ , నోయెల్ లు మంచి మిత్రులు.. ఈ ఇద్దరు పైకి రావాలని కోరుకుంటున్నారు. ఈ చిత్రంలోని పాటలు అందరికి నచ్చాలి. ప్రజాదరణ పొందాలి. మంచి ఛాన్స్ లు కార్తీక్ గారికి రావాలని కోరుకుంటున్నాను.  దర్శకుడుకి మంచి సక్సెస్ రావాలి. ఈ చిత్రంలో నటించిన అందరికి, సాంకేతిక నిపుణులు అందరికి ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలి అని కోరుకుంటున్నాను అన్నారు. 

హీరోయిన్ మేఘన మాట్లాడుతూ.. ఇక్కడకి వచ్చిన మెగా అభిమానులకు అందరికి స్వాగతం.. ముఖ్య అతిధులకు ప్రత్యేక ధన్యవాదాలు.. నా ఫ్యాషన్ ని సపోర్ట్ చేసిన ఇంత దూరం వచ్చేలా చేసిన నా తల్లిదండ్రులకు థాంక్స్.. నాకీ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అభిరామ్ గారికి, నిర్మాత రాజేష్ నాయుడు గారికి స్పెషల్ థాంక్స్.. నా ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఈ సినిమా జర్నీ చాలా స్పెషల్ గా ఉంది. ఈ ఈవెంట్ కి వచ్చి మా సినిమా ని ఆశీర్వదించడానికి వచ్చిన నా మిత్రులకి థాంక్స్.. పవన్ తేజ్ కొణిదెల గారితో నటించడం ఎంతో మంచి అనుభూతిని ఇచ్చింది. అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement