పిడుగుపాటుకు వరిగడ్డి వాములు దగ్ధం | Rick struck by lightning burned the grass | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు వరిగడ్డి వాములు దగ్ధం

Published Sat, May 30 2015 8:21 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM

Rick struck by lightning burned the grass

గుంతకల్లు (అనంతపురం): అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నక్కలదొడ్డి గ్రామంలో శుక్రవారం రాత్రి పిడుగుపాటుకు రూ.లక్ష విలువైన వరి గడ్డి వాములు కాలిపోయాయి. గ్రామానికి చెందిన రైతు సోదరులు శ్రీనివాసులు, మస్తానప్పలకు చెందిన నాలుగు గడ్డి వాములు పక్కపక్కనే ఉన్నాయి. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన ప్రారంభమైంది. ఈ సందర్భంగా వరిగడ్డి వాముపై పిడుగుపడి, మంటలు అంటుకుని నాలుగు వాములు కాలిపోయాయి. రూ. లక్ష మేర నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement