
'అంతమంది మరణం నన్ను కలిచి వేసింది'
న్యూఢిల్లీ : బిహార్‌ను కుదిపేసిన పిడుగుపాటు దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అంతమంది మరణం తనను కలచి వేసిందని ఆయన బుధవారం ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం ప్రకటించారు. బిహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో పిడుగుపాటుకు గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
కాగా బిహార్లో పిడుగుపాటుకు పదుల సంఖ్యలో మృతి చెందారు. ఒకే రోజు పిడుగుపాటుతో 57 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు స్పష్టం చేశారు. డజన్ల మందికి పైగా గాయాలపాలయినట్లు వెల్లడించారు. అయితే, మృతులసంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారాన్ని ప్రకటించింది.
మరోవైపు పిడుగుపాటు ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కాగా పిడుగుపాటుకు బిహార్ లో 57మంది మృతి చెందగా, ఉత్తరప్రదేశ్ లో 42మంది ప్రాణాలు కోల్పోయారు.
My thoughts & prayers are with those who lost their near & dear ones due to the lightning. May the injured recover quickly: PM @narendramodi
— PMO India (@PMOIndia) 22 June 2016
Deeply anguished by loss of lives due to lightning in parts of UP, Bihar, Jharkhand & other parts of the nation over the last few days: PM
— PMO India (@PMOIndia) 22 June 2016