రోమ్: ఎరుపు రంగులో వలయాకృతిలో కన్పిస్తున్న ఈ దృశ్యం ఇటలీలో ఇటీవల కలకలం రేపింది. విస్తుగొలిపే ఈ వింత వలయం సెంట్రల్ ఇటలీలో ఆల్ఫ్స్ పర్వతాల నుంచి అడ్రియాటిక్ సముద్రం దాకా ఆకాశంలో ఏకంగా 360 కిలోమీటర్ల పొడవున విస్తరించి కనువిందు చేసింది. అచ్చం హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా దృశ్యాన్ని తలపించిన ఈ వలయం గ్రహాంతరవాసుల అంతరిక్ష వాహనం అయ్యుండొచ్చని కొందరు భావించారు.
సైంటిస్టులు మాత్రం అదేమీ కాదని స్పష్టం చేశారు. కాంతి ఉద్గార క్రమంలో అతి తక్కువ ఫ్రీక్సెన్సీతో కూడిన అడ్డంకులు ఇందుకు కారణమని వారు వివరించారు. ఎల్‌్వగా పిలిచే ఈ దృగ్విషయం ఒక్కోసారి ఇలాంటి విచిత్రాకారపు వెలుతురు వలయాలకు దారి తీస్తుందని చెప్పుకొచ్చారు. ఈ ఎల్‌్వలు తుపాను మేఘాలకు పై భాగాల్లో విడుదలయ్యే అత్యంత హెచ్చు విద్యుదయస్కాంత శక్తి వల్ల పుట్టుకొస్తుంటాయట.
ఫొటోలోని ఎరుపు వలయం పుట్టుకకు సెంట్రల్ ఇటలీకి దాదాపు 285 కిలోమీటర్లు దక్షిణాన చెలరేగిన తుపాను సందర్భంగా చోటుచేసుకున్న శక్తిమంతమైన మెరుపు కారణమని వారు చెప్పారు. ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ వాల్తెయిర్ బినొటో దీన్ని కెమెరాలో బంధించారు. ఆకాశంలో ఇలాంటి ఆకృతులను ఆయన తొలిసారిగా 2017లో ఫొటో తీశారట. అప్పటి నుంచీ ఇదే పనిలో ఉన్నట్టు చెబుతున్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment