space craft
-
SLIM: జాబిల్లిపై మళ్లీ నిద్రలోకి జపాన్ ‘స్లిమ్’ ల్యాండర్
టోక్యో: చందమామ మీద రాత్రి వేళల్లో ఉండే అసాధారణ చలిని తట్టుకుని రెండు వారాల తర్వాత మేల్కొని చరిత్ర సృష్టించిన జపాన్ మూన్ ల్యాండర్ స్లిమ్(స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్) నిద్రలోకి జారకుంది. జపాన్ కాలమానం ప్రకారం శుక్రవారం(మార్చ్1)వ తేదీన ఉదయం మూడు గంటలకు స్లిమ్ నిద్రలోకి వెళ్లింది. ఈ విషయాన్ని జపాన్ ఎయిరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ(జాక్సా) ఎక్స్(ట్విటర్)లో వెల్లడించింది. రెండు వారాల తర్వాత చంద్రుని మీద మళ్లీ సూర్యుడు ఉదయించాక స్లిమ్‌ను పనిచేయించడానికి ప్రయత్నిస్తామని జాక్సా తెలిపింది. అయితే జాబిల్లి మీద ఉన్న అసాధారణ ఉష్ణోగ్రతల మార్పుల వల్ల స్లిమ్ మళ్లీ పనిచేసేందుకు అవకాశాలు తక్కువేనని పేర్కొంది. స్లిమ్‌ను కచ్చితమైన ల్యాండింగ్ జోన్ టార్గెట్ టెక్నాలజీతో డిజైన్ చేసినందున దీనిని మూన్ స్నైపర్‌గా కూడా పిలిచారు. చంద్రునిపై ల్యాండర్లను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశాల్లో భారత్ తర్వాత జపాన్ ఐదో దేశంగా చరిత్రకెక్కింది. కాగా, అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా, ప్రైవేట్ కంపెనీ ఐఎమ్ సంయుక్తంగా చంద్రునిపైకి పంపిన ఒడిస్సియస్ గురువారం(ఫిబ్రవరి 29) చంద్రుని నుంచి ఆఖరి చిత్రాన్ని పంపింది. పవర్ బ్యాంకుల్లోని ఇంధనం ఖాళీ అవడంతో ఒడిస్సియస్ ల్యాండ్ అయిన వారం రోజుల తర్వాత శాశ్వత నిద్రలోకి జారుకుంది. చంద్రుని మీద ఒక్క రాత్రి పూర్తవ్వాలంటే భూమి మీద రెండు వారాలు గడవాలి. 3/1午前3時過ぎ(日本標準時)にしおりクレータは日没を迎え、SLIMは再び休眠に入りました。厳しい温度サイクルを繰り返すことになるため故障確率は上がりますが、次回の日照(3月下旬)でもSLIMは再び運用を試行する予定です。#JAXA #SLIM #たのしむーん 2/29 23:00過ぎ 航法カメラによる周辺画像 pic.twitter.com/xutv56uSU9 — 小型月着陸実証機SLIM (@SLIM_JAXA) March 1, 2024 ఇదీ చదవండి.. టెక్సాస్‌లో విజృంభిస్తున్న కార్చిచ్చు.. భారీగా నష్టం -
America: ‘ఆస్ట్రోబోటిక్స్’ మూన్ మిషన్ ఫెయిల్.. కారణమిదే
పిట్స్బర్గ్: అమెరికాకు చెందిన ఆస్ట్రోబోటిక్స్ కంపెనీ పంపిన పెరిగ్రైన్ వ్యోమనౌక చంద్రునిపై సాధారణ ల్యాండింగ్(సాఫ్ట్ ల్యాండ్) అయ్యే అవకాశాలు దాదాపు లేనట్లేనని తేలిపోయింది. ఈ విషయాన్ని ఆస్ట్రోబోటిక్స్ కంపెనీ మంగళవారం ప్రకటించింది. నింగిలోకి ఎగిరిన కొద్ది గంటలకే వ్యోమనౌకకు చెందిన ప్రొపెల్లెంట్లోని ఇంధనం లీక్ అవడమే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. ఫ్లోరిడాలోని కేప్ కెనరావల్ అంతరిక్ష కేంద్రం నుంచి సోమవారం పెరిగ్రైన్ను నింగిలోకి పంపారు. నింగిలోకి పంపినపుడు తొలుత వ్యోమనౌక ప్రయాణం బాగానే జరిగినప్పటికీ తర్వాత దాని సోలార్ ప్యానెళ్లు సూర్యునికి సరైన కోణంలోకి రాకపోవడం వల్ల బ్యాటరీల్లోని ఇంధనం ఒక్కసారిగా ఖాళీ అయింది.దీంతో అది నియంత్రణను కోల్పోయింది.అయితే అందులో మరో 40 గంటల ఇంధనం మిగిలి ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. అన్నీ సజావుగా జరిగితే ఫిబ్రవరిలో పెరిగ్రైన్ చంద్రునిపై ల్యాండ్ అవ్వాల్సి ఉంది. ప్రఖ్యాత ఏవియేషన్ కంపెనీలు బోయింగ్, లాక్హిడ్ మార్టిన్లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన వల్కన్ రాకెట్ ద్వారా పెరిగ్రైన్ ల్యాండర్‌ను చంద్రునిపైకి పంపారు. మరోవైపు చంద్రునిపైకి నాసా తలబెట్టిన ఆర్టెమిస్ మిషన్ కూడా వాయిదా పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మిషన్‌కు అవసరమైన కొన్ని పరికరాల సరఫరా ఆలస్యమవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ఇదీచదవండి.. మాల్దీవుల వివాదం..భారత్‌పై చైనా మీడియా సంచలన కథనాలు -
నాసా వ్యోమనౌక నుంచి సిగ్నల్స్ కట్, వోయేజర్–2కు మళ్లీ జీవం!
ఇతర గ్రహాలపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పశోధనా సంస్థ 46 ఏళ్ల క్రితం ప్రయోగించిన వోయేజర్–2 వ్యోమనౌక మళ్లీ యథాతథంగా పనిచేయడం ప్రారంభించింది. ఒకరకంగా చెప్పాలంటే కీలకమైన ఈ స్పేస్‌క్రాఫ్ట్ మళ్లీ ప్రాణం పోసుకుంది. ఈ వ్యోమనౌక ప్రస్తుతం భూమికి దాదాపు 12 బిలియన్ల మైళ్ల (దాదాపు 2,000 కోట్ల కిలోమీటర్లు) దూరంలో ఉంది. కమ్యూనికేషన్ వ్యవస్థలో చోటుచేసుకున్న పొరపాటు వల్ల గత నెల 21 తేదీన వోయేజర్–2 నుంచి భూమికి సంకేతాలు ఆగిపోయాయి. కంట్రోలర్లు పొరపాటున తప్పుడు కమాండ్ పంపించడమే కారణమని సమాచారం. ఫలితంగా వోయేజర్–2 యాంటెనా స్వల్పంగా పక్కకు జరిగింది. దాంతో సంకేతాలు నిలిచిపోయాయి. నాసా సైంటిస్టులు వెంటనే రంగంలో దిగారు. సంకేతాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. భారీ రేడియో యాంటెనాలతో కూడిన డీస్ స్పేస్ నెట్వర్క్ ద్వారా కమాండ్ పంపించారు. దీనికి వోయేజర్–2 స్పందించి 18 గంటల తర్వాత భూమిపైకి సంకేతాలను పంపించింది. నాసా శాస్త్రవేత్తలు వోయేజర్–2 యాంటెనాను సరిచేసే పనిలో విజయం సాధించారు. ఇందుకోసం కమాండ్‌ను పంపించారు. స్పేస్‌క్రాఫ్ట్‌తో కమ్యూనికేషన్‌ను దాదాపు పూర్తిస్థాయిలో పునరుద్ధరించినట్లు ఇస్రో సైంటిస్టులు ప్రకటించారు. వోయేజర్–2 ఎప్పటిలాగే పనిచేస్తోందని, యధావిధిగా సేవలు అందిస్తోందని హర్షం వ్యక్తం చేసింది. ఏమిటీ వోయేజర్–2? అంతరిక్షంలో భూమికి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న శనిగ్రహం, కుజ గ్రహం, బృహస్పతి, గురుగ్రహంపై పరిశోధనల కోసం ‘నాసా’ 1977 సెప్టెంబర్ 5న వోయేజర్–1, 1977 ఆగస్టు 20న వోయేజర్–2 వ్యోమనౌకలను పంపించింది. కాలిఫోర్నియాలో నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబ్‌లో వీటిని రూపొందించారు. భూమికి సంబంధించిన శబ్ధాలు, చిత్రాలు, సందేశాలను ఇందులో చేర్చారు. గత 36 ఏళ్లుగా నిరి్వరామంగా పనిచేస్తున్నాయి. ఇతర గ్రహాల సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తున్నాయి. 2012 ఆగస్టులో వోయేజర్–1 ఇంటర్స్టెల్లార్ స్పేస్‌లోకి ప్రవేశించింది. అంటే అంతరిక్షంలో లక్షల కోట్ల ఏళ్ల క్రితం కొన్ని నక్షత్రాలు అంతరించిపోవడం వల్ల ఏర్పడిన ఖాళీ ప్రదేశంలోకి చేరుకుంది. ఆ తర్వాత వోయేజర్–2 కూడా ఈ స్పేస్‌లోకి ప్రవేశించింది. వోయేజర్–2 1986లో యురేనస్ గ్రహం సమీపానికి వచి్చంది. దాని ఉపగ్రహాలను గుర్తించింది. గురు, శనిగ్రహాలకి సంబంధించిన యూరోపా, ఎన్సిలాడస్ అనే ఉపగ్రహాలపై మంచు కింద సముద్రాల ఆనవాళ్లు ఉన్నట్లు కనిపెట్టింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆకాశంలో ఎరుపు రంగు వలయాకృతి.. గ్రహాంతరవాసుల వాహనమా?
రోమ్: ఎరుపు రంగులో వలయాకృతిలో కన్పిస్తున్న ఈ దృశ్యం ఇటలీలో ఇటీవల కలకలం రేపింది. విస్తుగొలిపే ఈ వింత వలయం సెంట్రల్ ఇటలీలో ఆల్ఫ్స్ పర్వతాల నుంచి అడ్రియాటిక్ సముద్రం దాకా ఆకాశంలో ఏకంగా 360 కిలోమీటర్ల పొడవున విస్తరించి కనువిందు చేసింది. అచ్చం హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా దృశ్యాన్ని తలపించిన ఈ వలయం గ్రహాంతరవాసుల అంతరిక్ష వాహనం అయ్యుండొచ్చని కొందరు భావించారు. సైంటిస్టులు మాత్రం అదేమీ కాదని స్పష్టం చేశారు. కాంతి ఉద్గార క్రమంలో అతి తక్కువ ఫ్రీక్సెన్సీతో కూడిన అడ్డంకులు ఇందుకు కారణమని వారు వివరించారు. ఎల్్వగా పిలిచే ఈ దృగ్విషయం ఒక్కోసారి ఇలాంటి విచిత్రాకారపు వెలుతురు వలయాలకు దారి తీస్తుందని చెప్పుకొచ్చారు. ఈ ఎల్్వలు తుపాను మేఘాలకు పై భాగాల్లో విడుదలయ్యే అత్యంత హెచ్చు విద్యుదయస్కాంత శక్తి వల్ల పుట్టుకొస్తుంటాయట. ఫొటోలోని ఎరుపు వలయం పుట్టుకకు సెంట్రల్ ఇటలీకి దాదాపు 285 కిలోమీటర్లు దక్షిణాన చెలరేగిన తుపాను సందర్భంగా చోటుచేసుకున్న శక్తిమంతమైన మెరుపు కారణమని వారు చెప్పారు. ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ వాల్తెయిర్ బినొటో దీన్ని కెమెరాలో బంధించారు. ఆకాశంలో ఇలాంటి ఆకృతులను ఆయన తొలిసారిగా 2017లో ఫొటో తీశారట. అప్పటి నుంచీ ఇదే పనిలో ఉన్నట్టు చెబుతున్నారాయన. -
రూ.6 కోట్లు ఉంటే.. అంతరిక్షంలోకి! నెరవేరనున్న భారతీయుల కల
అంతరిక్షంలో పర్యటించాలనుకునే భారతీయుల కల నెరవేరనుంది. ఈ కల సాకారానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయత్నాలు ప్రారంభించింది. 2030 నాటికి స్పేస్ టూరిజం ప్రాజెక్టును పట్టాలెక్కిస్తామని.. దీనికి సంబంధించిన పని జరుగుతోందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇటీవల ప్రకటించారు. ఇందుకోసం సొంతంగాఒక మాడ్యూల్ తయారు చేస్తున్నట్టు తెలిపారు.టికెట్ ధర రూ.6 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సబ్ ఆర్బిటలా.. ఆర్బిటలా... అంతరిక్ష పర్యటన ఆర్బిటల్గా ఉంటుందా లేక సబ్ ఆర్బిటల్గా ఉంటుందా అనే దానిపై స్పష్టత లేదు. టికెట్ ధర రూ.6 కోట్లు అంటున్నారు కాబట్టి.. ఇది సబ్ ఆర్బిటల్ పర్యటనే అయి ఉండవచ్చని భావిస్తున్నారు. స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణించే వేగాన్ని బట్టి ఆర్బిటల్ పర్యటనా.. సబ్ ఆర్బిటల్ పర్యటనా అనేది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఆర్బిటల్ స్పేస్ క్రాఫ్ట్.. ఆర్బిటల్ వెలాసిటీ (కక్ష్య వేగం)తో ప్రయాణిస్తుంది. సబ్ ఆర్బిటల్ రాకెట్ దాని కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. సబ్ ఆర్బిటల్ ట్రిప్ అయితే స్పేస్ క్రాఫ్ట్‌లో తిరిగి భూమ్మీదకు వచ్చేప్పుడు అంతరిక్షం అంచుల్లో కొద్ది నిమిషాలు తక్కువ గ్రావిటీ వాతావరణంలో (గాల్లో తేలియాడేలా) ఉన్న అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బ్లూ ఆరిజిన్ కంపెనీ సబ్ ఆర్బిటల్ రాకెట్ టూర్‌ను విజయవంతంగా నిర్వహించింది. 2021లో బ్లూ ఆరిజిన్ అధినేత (అమెజాన్ వ్యవస్థాపకుడు) జెఫ్ బెజోస్ మరో ముగ్గురితో కలిసి అంతరిక్షంలో పర్యటించి వచ్చారు. సబ్ ఆర్బిటల్ రాకెట్లు ఆర్థికంగా అందుబాటులో ఉండటంతోపాటు వాటిని రెండోసారి కూడా వినియోగించే అవకాశం ఉంటుంది. పర్యాటక మాడ్యూల్ కోసం ప్రయత్నాలు సబ్ ఆర్బిటల్ స్పేస్ టూరిజం మిషన్ సాధ్యాసాధ్యాలపై ఇస్రో అధ్యయనం చేస్తోందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్ మంత్రి జితేంద్రప్రసాద్ రాజ్యసభలో ఇటీవల వెల్లడించారు. అంతరిక్ష పర్యాటక మాడ్యూల్‌ను తయారు చేసేందుకు నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఐఎన్–స్పేస్) ద్వారా ఇస్రో ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ ఘనత టిటోదే అంతరిక్ష పర్యాటకం చాలాకాలం క్రితమే మొదలైంది. ఆర్బిటల్ స్పేస్ టూరిజాన్ని రష్యన్ స్పేస్ ఏజెన్సీ గతంలోనే ప్రారంభించింది. 2001లో అమెరికన్ మిలియనీర్ డెన్నిస్ టిటో రష్యన్ స్పేస్ ఏజెన్సీకి రూ.165 కోట్లు చెల్లించి స్పేస్ టూరిస్ట్‌గా అంతరిక్షంలో 8 రోజులు గడిపి తిరిగి వచ్చారు. ప్రపంచంలో మొట్టమొదటి స్పేస్ టూరిస్ట్ ఆయనే. కానీ.. 2010లో రష్యన్ స్పేస్ ఏజెన్సీ స్పేస్ టూరిజం కార్యకలాపాలను నిలిపివేయడంతో అంతరిక్ష పర్యాటకం అక్కడితోనే ఆగిపోయింది. అంతరిక్ష పర్యాటకానికి ఎంతో క్రేజ్ అంతరిక్ష పర్యాటకానికి ఎంతో క్రేజ్ ఉంది. అందుకే అంతర్జాతీయంగా వర్జిన్ గెలాక్టిక్, స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్, ఆరిజిన్ స్పాన్, బోయింగ్, స్పేస్ అడ్వెంచర్స్, జీరో టు ఇన్ఫినిటీ వంటి ప్రైవేట్ స్పేస్ టూరిజం కంపెనీలు వాణిజ్యపరంగా స్పేస్ ఫ్లైట్స్‌ను నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాయి. రష్యన్ స్పేస్ ఏజెన్సీ నిలిపివేసిన స్పేస్ టూ రిజం కాన్సెప్ట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్ని స్తున్నాయి. ఆ ప్రయత్నంలో జెఫ్ బెజోస్ విజయం సాధించారు కూడా. వర్జిన్ గెలాక్టిక్ తన స్పేస్ ఫ్లైట్ వీఎస్ఎస్ యూనిటీని 2018లో పరీక్షించడం మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ కంపెనీ స్పేస్ టూరిస్టులు వెయిటింగ్ లిస్ట్ చాలా ఉంది. వాళ్లంతా డిపాజిట్లు కట్టి పర్యటన కోసం ఎదురుచూస్తున్నారు. రాబోయే కాలంలో వాటి సరసన మన ఇస్రో స్పేస్ రాకెట్లు కూడా ఉండే అవకాశం ఉంది. - సాక్షి, అమరావతి -
చైనా కార్గో వ్యోమనౌక ప్రయోగం విజయవంతం
బీజింగ్: చైనా తాను సొంతంగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రానికి అవసరమయ్యే సామాగ్రిని పంపడం కోసం ప్రయోగించిన కార్గో వ్యోమనౌక టియాన్జూ–5 విజయవంతంగా నింగిలోకి దూసుకుపోయింది. హైనన్ దీవుల్లోని వెన్చాంగ్ స్పేస్‌క్రాఫ్ట్ లాంచ్ సైట్ నుంచి ప్రయోగించిన ఈ వ్యోహనౌక నిర్దేశిత కక్ష్యలో ప్రవేశించిందని జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. అంతరిక్ష కేంద్రంలోని డాకింగ్, ఫాస్ట్ ఆటోమేటెడ్ రెండెజవస్ నిర్వహించనుంది. ఈ ఏడాది చివరి నాటికి అంతరిక్ష కేంద్రం నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో చైనా ముందడుగు వేస్తోంది. -
అంతరిక్షంపై పట్టుకు చైనా యత్నాలు
బీజింగ్: ఈ సంవత్సరం 50కి పైగా స్పేస్ లాంచ్‌లు జరపాలని చైనా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతోపాటు తన స్పేస్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేసేందుకు ఆరు సార్లు మానవ సహిత అంతరిక్ష యాత్రలు సైతం ఈ ఏడాది చైనా చేపట్టనుంది. నూతన సంవత్సరం అంతరిక్షంపై పట్టుకు రూపొందించుకున్న విధానాలను చైనా గురువారం ప్రకటించింది. ఈ సంవత్సరం 50కిపైగా స్పేస్ లాంచ్‌లతో 140 స్పేస్‌క్రాఫ్ట్‌లను అంతరిక్షంలోకి పంపుతామని చైనా ఏరోస్పేస్ కార్పొరేషన్ డిప్యుటీ చీఫ్ మాతో చెప్పారు. 2021లో ప్రపంచమంతా కలిసి 146 స్పేస్ లాంచింగ్‌లు జరిగాయి. వీటిలో 48 లాంచింగ్‌లు చైనా చేపట్టినవే కావడం విశేషం. గతేడాది 51 లాంచింగ్‌లతో యూఎస్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం చైనా స్పేస్ స్టేషన్ నిర్మాణంలో ముగ్గురు వ్యోమోగాములు పాలుపంచుకుంటున్నారు. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు పోటీగా చైనా ఈ సీఎస్ఎస్ (చైనా అంతరిక్ష కేంద్రం)ను నిర్మిస్తోంది. -
ఉల్కాపాతంతో పెనువిధ్వంసం.. రష్యాలో జరిగింది గుర్తుందిగా? రిపీట్ కాకూడదనే..
Nasa Dart Launch: అది ఫిబ్రవరి 15, 2013. రష్యాలో చలికావడంతో జనాలు దాదాపుగా ఇళ్లకు పరిమితం అయ్యారు. పూర్తి సూర్యోదయం తర్వాత కొన్ని నిమిషాలకు సుమారు 9గంటల 20 నిమిషాల సమయంలో ఆకాశంలో ఒక అద్భుతం. ఫైర్‌బాల్ లాంటి ఓ భారీ రూపం.. సూర్యుడి కంటే రెట్టింపు కాంతితో యూరల్ రీజియన్ వైపు దూసుకొస్తోంది. చెల్యాబిన్స్క్, కుర్గన్తో పాటు మరికొన్ని రీజియన్లలో ఈ దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. అదేంటో అనుకునేలోపే భారీ శబ్దంతో విధ్వంసం. అయితే.. అదృష్టవశాత్తూ అది నివాస ప్రాంతాల్లో పడలేదు. కానీ, దాని ప్రభావం వందల కిలోమీటర్ల పరిధిలో చూపించింది. భారీ పేలుడు, దట్టమైన దుమ్ము, ధూళి అలుముకోవడంతో పాటు గన్ పౌడర్ వాసనతో ఆ రేంజ్ మొత్తం కొన్ని రోజులపాటు గుప్పుమంటూనే ఉంది. ప్రజల హాహాకారాలతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు హోరెత్తాయి. ఈ బీభత్సం సృష్టించిన ఉల్కకి ఉన్న శక్తి.. షిరోషిమా అణుబాంబు కంటే 30 రెట్లు కలిగి ఉందని తర్వాత నాసా గుర్తించింది. 54 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఆ ఉల్క.. 60 అడుగుల వెడల్పు, పదివేల టన్నుల బరువు ఉంది. 1908 టుంగుష్క ఈవెంట్ తర్వాత నమోదైన అతిపెద్ద ఘటన ఇదే. 1986లో గ్రేట్ మాడ్రిడ్ ఉల్కాపాతం ఘటనలో గాయపడిన వాళ్ల సంఖ్యతో పోలిస్తే.. చెల్యాబ్నిస్క్ ఘటనలో గాయపడిన వాళ్లే ఎక్కువ. ప్రాణ నష్టం లేకపోయినా.. సుమారు 1600 మంది గాయపడ్డారు. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. విధ్వంసం తాలుకా ఆనవాలు ప్రస్తుతం ఆ ప్రాంతం కోలుకున్నా, ఏళ్లు గడుస్తున్నా.. ప్రాణ భయం ఇప్పటికీ అక్కడి ప్రజలను వెంటాడుతూనే ఉంది. అంతరిక్షం నుంచి ఎప్పుడు ఎటు నుంచి ఇలాంటి ముప్పు పొంచి ఉందో అనే ఆందోళన ప్రపంచం మొత్తం నెలకొంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ఇలాంటి ఘటనలు తప్పించేందుకే నాసా ఇప్పుడు డార్ట్‌ను లాంఛ్ చేసింది. Asteroid Dimorphos: we're coming for you! Riding a @SpaceX Falcon 9 rocket, our #DARTMission blasted off at 1:21am EST (06:21 UTC), launching the world's first mission to test asteroid-deflecting technology. pic.twitter.com/FRj1hMyzgH — NASA (@NASA) November 24, 2021 గ్రహశకలాలు, ఉల్కలు.. ఎప్పటికైనా భూమికి ప్రమాదకరమైనవే. అంతరిక్షంలో వాటిని స్పేస్ క్రాఫ్ట్‌ల ద్వారా ఢీకొట్టే ఆలోచనే డార్ట్. డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ మిషన్. నాసా ఆధ్వర్యంలో Double Asteroid Redirection Test missionను(DART) నవంబర్ 24న(ఇవాళ) ప్రయోగించారు. భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో కాలిఫోర్నియాలోని స్పేస్ స్టేషన్ నుంచి డార్ట్‌ను లాంఛ్ చేశారు. ఇందుకోసం ఎలన్ మస్క్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఫాల్కన్ 9 రాకెట్‌ను ఉపయోగించారు. Launch of the @SpaceX Falcon 9 carrying the DART spacecraft - starting a nearly one-year journey to crash into a distant asteroid as a test! Keep checking back for more images! #DARTMission #PlanetaryDefense More: https://t.co/SNUSFf9Ukq pic.twitter.com/qJmffF2wIo — NASA HQ PHOTO (@nasahqphoto) November 24, 2021 సాధారణంగా తక్కువ పరిమాణంలో ఉండే గ్రహశకలాల్ని, ఉల్కలను నాశనం చేసేందుకు న్యూక్లియర్ వెపన్స్‌ను ఉపయోగిస్తుంటారు. అప్పుడు అవి ఆకాశంలోనే నాశనం అవుతాయి. ఒక్కోసారి అవి సముద్రంలో పడిపోతుంటాయి. లేదంటే ఏదైనా ప్రాంతంలో పడి తక్కువ మోతాదులో డ్యామేజ్ చేస్తుంటాయి. కానీ, ఈ పరిస్థితులకు వీలులేని గ్రహశకలాలు, ఉల్కల సంగతి ఏంటి?.. అవి గమనం మార్చుకోవాలనే ప్రార్థిస్తుంటారు అంతా. కానీ, వాటిని స్పేస్‌క్రాఫ్ట్‌తో ఢీ కొట్టించి నాశనం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది అమెరికన్ స్పేస్ ఏజెన్సీ NASA. డిడైమోస్(నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్) ఆస్టరాయిడ్.. దాని చుట్టూరా తిరిగే డైమోర్ఫోస్(బుల్లి చందమామగా అభివర్ణిస్తుంటారు).. ఈ రెండింటిని నాశనం చేయడమే డార్ట్ మిషన్ లక్ష్యం. NASA's First Planetary Defense Mission 2022 లేదంటే 2023 మధ్యకల్లా పూర్తవ్వొచ్చని నాసా సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఇది గనుక సక్సెస్ అయితే భవిష్యత్తులో ప్రమాదకరమైన గ్రహశకలాలు, ఉల్కాపాతాల నుంచి భూమికి జరిగే డ్యామేజ్‌ను తప్పించొచ్చనేది నాసా ఆలోచన. అయితే asteroid deflection technology ద్వారా భూమిని కాపాడాలనే నాసా ప్రయత్నం గురించి పలువురికి అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ స్పేస్ క్రాఫ్ట్ టార్గెట్ రీచ్ కాకపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే స్పేస్‌క్రాఫ్ట్ గురితప్పదని, గ్రహశకలాన్ని ఢీకొట్టిన తర్వాత అది నాశనం కాకపోయినా.. కనీసం గమనాన్నైనా మళ్లిస్తుందని నాసా సైంటిస్టులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. - సాక్షి, వెబ్‌స్పెషల్ -
ఆస్టరాయిడ్ ముప్పు.. నాసా స్కెచ్ వర్కవుట్ అయ్యేనా?
ఆస్టరాయిడ్ ఢీ కొడితే ఏం జరుగుతుంది?.. సర్వం నాశనం అవుతుంది. ఈ భూమ్మీద డైనోసార్ల అంతానికి కారణం ఇదేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మానవాళి ఎలాంటి విపత్తునైనా(సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకుని) ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో భూమి వైపు దూసుకొస్తున్న ఓ భారీ గ్రహశకలాన్ని నాశనం చేసేందుకు నాసా అదిరిపోయే స్కెచ్ అమలు చేయబోతోంది. సాధారణంగా తక్కువ పరిమాణంలో ఉండే గ్రహశకలాల్ని నాశనం చేసేందుకు న్యూక్లియర్ వెపన్స్‌ను ఉపయోగిస్తుంటారు. అప్పుడు అవి ఆకాశంలోనే నాశనం అవుతాయి. ఒక్కోసారి అవి సముద్రంలో పడిపోతుంటాయి. లేదంటే ఏదైనా ప్రాంతంలో పడి తక్కువ మోతాదులో డ్యామేజ్ చేస్తుంటాయి. కానీ, ఈ పరిస్థితులకు వీలులేని ఆస్టరాయిడ్ల సంగతి ఏంటి?.. అవి గమనం మార్చుకోవాలనే ప్రార్థిస్తుంటారు అంతా. అయితే ఓ భారీ గ్రహశకలం ఇప్పుడు భూమి దిశగా దూసుకువస్తోంది. అందుకే స్పేస్‌క్రాఫ్ట్‌తో ఢీ కొట్టించి నాశనం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది అమెరికన్ స్పేస్ ఏజెన్సీ NASA. డిడైమోస్(నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్) చుట్టూరా తిరిగే డైమోర్ఫోస్(బుల్లి చందమామగా అభివర్ణిస్తుంటారు)ను నాశనం చేయడమే ఈ మిషన్ లక్ష్యం. ఈ మిషన్‌కు నాసా పెట్టిన పేరు డార్ట్(Double Asteroid Redirection Test mission). నవంబర్ 24న స్పేస్ఎక్స్ రాకెట్ ఫాల్కన్ 9 ద్వారా ఓ స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబోతున్నారు. తద్వారా ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను గ్రహశకలం మీదకు ప్రయోగించి నాశనం చేయాలన్నది నాసా ప్లాన్. NASA's First Planetary Defense Mission 2022 లేదంటే 2023 మధ్యకల్లా పూర్తవ్వొచ్చని నాసా సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. asteroid deflection technology ద్వారా భూమిని కాపాడాలనే నాసా ప్రయత్నం గురించి పలువురికి అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ స్పేస్ క్రాఫ్ట్ టార్గెట్ రీచ్ కాకపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే స్పేస్‌క్రాఫ్ట్ గురితప్పదని, గ్రహశకలాన్ని ఢీకొట్టిన తర్వాత అది నాశనం కాకపోయినా.. కనీసం గమనాన్నైనా మళ్లిస్తుందనేది నాసా సైంటిస్టులు చెబుతున్న మాట. ఈ ‘ఆస్టరాయిడ్ మూన్’ను స్పేస్వాచ్ ప్రాజెక్టులో భాగంగా 1996లో ఆరిజోనా యూనివర్సిటీకి చెందిన జోయ్ మోంటనీ మొదటగా గుర్తించారు. ☄️ #PlanetaryDefense at @NASA entails finding, tracking, and characterizing near-Earth #asteroids and objects. Here’s what we've found thus far. Our #DARTMission, launching this November, will also be our first test for planetary defense. Learn more at https://t.co/1wL4ifObpp pic.twitter.com/8JryeeWQjG — NASA Asteroid Watch (@AsteroidWatch) October 1, 2021 ఇది భూమిని కచ్చితంగా ఎప్పుడు ఢీ కొడుతుందో తెలియనప్పటికీ.. అది చేసే డ్యామేజ్ మాత్రం భారీ స్థాయిలో ఉంటుందనే సైంటిస్టులు భావిస్తున్నారు. అందుకే దాన్ని అంతరిక్షంలోనే నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇక సౌర వ్యవస్థలో గ్రహ శకలాల వయసును 4.6 బిలియన్ సంవత్సరాలుగా భావిస్తుంటారు. మొత్తం 26 వేల ఆస్టరాయిడ్స్‌ను గుర్తించిన నాసా.. ఇందులో వెయ్యి గ్రహశకలాలను మాత్రం భూమికి ప్రమాదకరమైన వాటిగా ప్రకటించింది. ఇది చదవండి: ఎనిమిదేళ్లకే పరిశోధన.. రికార్డుల్లోకి ఎక్కిన బుల్లి సైంటిస్ట్ -
రోదసిలో తెలుగు ఖ్యాతి
హ్యూస్టన్: వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్వేస్, వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ టూరిజం కంపెనీ వ్యవస్థాపకుడు, బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ లేటు వయసులో అపూర్వమైన సాహస యాత్ర విజయవంతంగా పూర్తిచేశారు. అంతరిక్ష పర్యాటకానికి బాటలు వేస్తూ సొంత స్పేస్‌షిప్‌లో రోదసిలోకి ప్రయాణించి క్షేమంగా తిరిగి వచ్చారు. ఈ యాత్రలో 71 ఏళ్ల బ్రాస్నన్‌తోపాటు తెలుగు బిడ్డ శిరీష బండ్లతో సహా ఐదుగురు పాలుపంచుకున్నారు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన స్పేస్‌షిప్ ‘వీఎస్ఎస్ యూనిటీ–22’తో కూడిన ట్విన్ ఫ్యూజ్‌లేజ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆదివారం అమెరికాలోని న్యూమెక్సికో రాష్ట్రంలో ఎడారిలో ఏర్పాటు చేసిన ‘స్పేస్‌పోర్టు అమెరికా’ నుంచి ఆదివారం ఉదయం 10.40 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. వాతావరణం అనుకూలించకపోవడంతో 90 నిమిషాలు ఆలస్యంగా ఈ యాత్ర ప్రారంభమయ్యింది. బ్రాన్సన్ భార్య, కుటుంబ సభ్యులతో సహా 500 మందికిపైగా జనం ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. 8.5 కిలోమీటర్లు(13 కిలోమీటర్లు) ప్రయాణించాక ఫ్యూజ్‌లేజ్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి ‘వీఎస్ఎస్ యూనిటీ–22’ విడిపోయింది. వెంటనే అందులోని రాకెట్ ఇంజన్ ప్రజ్వరిల్లింది. బ్రాన్సన్తోపాటు మరో ఐదుగురు ప్రయాణిస్తున్న ఈ సబ్ ఆర్బిటాల్ టెస్టుఫ్టైట్ భూమి నుంచి 55 మైళ్లు (88 కిలోమీటర్లు) నింగిలో ప్రయాణించి, రోదసిలోకి ప్రవేశించింది. అందులోని ఆరుగురు (ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు) కొన్ని నిమిషాలపాటు భారరహిత స్థితిని అనుభూతి చెందారు. అనంతరం స్పేస్‌షిప్ తిరుగుప్రయాణం మొదలుపెట్టింది. భూవాతావరణంలోకి ప్రవేశించి, తన చుక్కానులను గ్లైడింగ్‌లుగా మార్చుకొని భూమిపైకి అడుగుపెట్టింది. రన్‌వేపై సురక్షితంగా ల్యాండయ్యింది. మొత్తం గంటన్నరలో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. బెజోస్ కంటే ముందే.. రోదసిలోకి వెళ్లడానికి ఇదొక అందమైన రోజు అంటూ ఆదివారం ఉదయం బ్రాన్సన్ ట్వీట్ చేశారు. స్పేస్ టూరిజంలో తన ప్రత్యర్థి అయిన ఎలాన్ మస్క్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్టు చేశారు. వచ్చే ఏడాది నుంచి రోదసి పర్యాటక యాత్రలకు శ్రీకారం చుట్టాలని వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఔత్సాహికుల నుంచి తగిన రుసుము వసూలు చేసి, రోదసిలోకి తీసుకెళ్లి, క్షేమంగా వెనక్కి తీసుకొస్తారు. ఇందులో భాగంగా ‘వీఎస్ఎస్ యూనిటీ–22’లో యాత్ర చేపట్టారు. కేవలం గంటన్నరలో రోదసిలోకి వెళ్లి రావొచ్చని వర్జిన్ గెలాక్టిక్ సంస్థ నిరూపించింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సైతం స్పేస్ టూరిజం దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన ఈ నెల 20న సొంత రాకెట్ షిప్లో రోదసి యాత్ర చేపట్టనున్నారు. బెజోస్ కంటే ముందే రోదసిలోకి వెళ్లాలన్న సంకల్పమే బ్రాన్సన్ను ఈ యాత్రకు పురికొల్పినట్లు సమాచారం. బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ కంపెనీని 2004 నెలకొల్పారు. రోదసి యాత్ర కోసం ఇప్పటికే 600 మందికిపైగా ఔత్సాహికులు ఈ కంపెనీ వద్ద రిజర్వేషన్లు చేసుకోవడం గమనార్హం. ఒక్కొక్కరు 2,50,000 డాలర్ల (రూ.1.86 కోట్లు) చొప్పున చెల్లించారు. మొదట టిక్కెట్ బుక్ చేసుకున్నవారిని వచ్చే ఏడాది ప్రారంభంలో రోదసిలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. 17 సంవత్సరాల కఠోర శ్రమ తమను ఇంతదూరం తీసుకొచ్చిందని బ్రాన్సన్ పేర్కొన్నారు. యాత్ర అనంతరం ఆయన తన బృంద సభ్యులకు అభినందనలు తెలిపారు. సొంత స్పేస్‌షిప్‌లో రోదసి యాత్ర చేసిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. 70 ఏళ్లు దాటిన తర్వాత రోదసిలోకి వెళ్లిన రెండో వ్యక్తిగా మరో రికార్డు నెలకొల్పారు. 1998లో 77 ఏళ్లు జాన్ గ్లెన్ రోదసి యాత్ర చేశారు.. శిరీష అంతరిక్షయాత్ర రాష్ట్రానికి గర్వకారణం ఏపీ గవర్నర్, ఏపీ సీఎం ప్రశంసలు సాక్షి, అమరావతి: గుంటూరులో జన్మించిన బండ్ల శిరీష అంతరిక్షయాత్రను విజయవంతంగా పూర్తిచేసుకోవడంపై ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు. ఆమె అంతరిక్షయాత్ర రాష్ట్రానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. ఆమె భవిష్యత్‌లో మరింత ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. మన శిరీష రికార్డు ఏరోనాటికల్ ఇంజనీర్ శిరీష బండ్ల(34) రోదసిలో ప్రయాణించిన మూడో భారత సంతతి మహిళగా రికార్డు సృష్టించారు. ఈ యాత్రలో తాను భాగస్వామి కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆమె జూలై 6న ట్వీట్ చేశారు. రోదసి యాత్రను ప్రజలకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న వర్జిన్ గెలాక్టిక్ కంపెనీలో పని చేస్తుండడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. శిరీష బండ్ల ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జన్మించారు. ఆమెకు నాలుగేళ్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులు అమెరికా వెళ్లి, స్థిరపడ్డారు. శిరీష హ్యూస్టన్‌లో పెరిగారు. భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ గతంలో అంతరిక్ష యాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ ఇప్పటిదాకా అంతరిక్షంలోకి వెళ్లిన ఏకైక భారతీయుడిగా రికార్డుకెక్కారు. -
నాసా స్పేస్ క్రాఫ్ట్‌కు భారత వ్యోమగామి పేరు!
వాషింగ్టన్: దివంగత నాసా వ్యోమగామి కల్పనా చావ్లాకు నివాళి అర్పించేందుకు అమెరికన్ వాణిజ్య కార్గో అంతరిక్ష నౌకకు ఆమె పేరును పెట్టింది. మానవ అంతరిక్ష ప్రయాణానికి ఆమె చేసిన కృషికి గాను ఈ విధంగా నివాళులు అర్పించారు. భారతదేశం నుంచి అంతరిక్షంలోకి ప్రవేశించిన మొదటి మహిళ కల్పనా చావ్లా. అమెరికన్ గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ నార్త్రోప్ గ్రుమ్మన్ దాని తదుపరి సిగ్నస్ క్యాప్సూల్‌కు ‘ఎస్ఎస్ కల్పనా చావ్లా’ అని పేరు పెట్టనున్నట్లు ప్రకటన చేసింది. 2003లో ఆరుగురు సభ్యులతో ప్రయాణిస్తున్న కొలంబియా అనేక నౌక కుప్పకూలడంతో కల్పనా చావ్లా మరణించింది. "నాసాలో పనిచేస్తూ భారత సంతతికి చెందిన మొదటి మహిళా వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన కల్పనా చావ్లాను ఈ రోజు మనం గౌరవిస్తున్నాం. మానవ అంతరిక్ష ప్రయాణానికి ఆమె చేసిన కృషి శాశ్వత ప్రభావాన్ని చూపింది" అని కంపెనీ బుధవారం ట్వీట్లో తెలిపింది. కొలంబియాలో ఆన్‌బోర్డ్‌లో ఆమె చేసిన చివరి పరిశోధన అంతరిక్ష ప్రయాణ సమయంలో వ్యోమగామి ఆరోగ్యం, భద్రతను అర్థం చేసుకోవడానికి మాకు సహాయపడింది. కల్పన చావ్లా జీవితాన్ని, అంతరిక్షంలో ప్రయాణించాలనే ఆమె కలని నార్త్రోప్ గ్రుమ్మన్ ఈ సందర్భంగా జరుపుకోవడం మాకు గర్వంగా వుంది’ అని ఈ సంస్థ తెలిపింది. చదవండి: నాసా, స్పేస్ ఎక్స్ మరో అద్భుత విజయం -
చంద్రునిపై కూలిపోయిన స్పేస్‌క్రాఫ్ట్
జెరుసలెం: ఇజ్రాయిల్‌కు చెందిన స్పేస్ క్రాఫ్ట్ చంద్రునిపై కూలిపోయింది. చంద్రునిపై స్పేస్‌క్రాఫ్ట్‌ను ల్యాండ్ చేయాలనే ఉద్దేశంతో ఇజ్రాయోల్ ‘స్మాల్ కంట్రీ బిగ్ డ్రీమ్స్’ పేరిట ఈ ప్రయోగాన్ని చేపట్టింది. గురువారం స్పేస్‌క్రాఫ్ట్ చంద్రునిపై ల్యాండ్ అవ్వాల్సి ఉంది. దీంతో ఈ ప్రయోగానికి సంబంధించిన దృశ్యాలను ఇజ్రాయిల్ టీవీతో పాటు సోషల్ మీడియాలో కూడా ప్రసారం చేశారు. అయితే చివరి నిమిషంలో ఈ ప్రయోగం విఫలమైంది. చంద్రునికి అత్యంత దగ్గరి కక్షలోకి వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్ మరికాసేట్లో ల్యాండ్ అవుతుందనగా ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో కూలిపోయింది. దీనిపై ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ జీఎం ఓపెర్ డోరాన్ మాట్లాడుతూ.. తాము అనుకున్నట్టుగా ప్రయోగం విజయవంతం కాలేదని తెలిపారు. దీంతో నిరాశకు గురికావద్దని ఈ మిషన్ కోసం పనిచేసిన వారికి సూచించారు. అయినా ఇది ఒక్క గొప్ప విజయమేనని వ్యాఖ్యానించారు. కాగా, ఫ్లోరిడాలోని కేఫ్ కానవెరాల్ నుంచి ఫిబ్రవరి 21వ తేదీన ఇజ్రాయెల్‌కు చెందిన తొలి మూన్ లాండర్‌ను విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. 585 కిలోల బరువున్న ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా పంపించారు. ఇప్పటివరకు రష్యా, అమెరికా, చైనాకు చెందిన స్పేస్‌క్రాఫ్టులు మాత్రమే చంద్రునిపై అడుగుపెట్టాయి. మొత్తంగా ఏడు దేశాలు చంద్రునిపై స్పేస్‌క్రాఫ్ట్ ల్యాండ్ చేయడానికి ప్రయత్నించగా మూడు మాత్రమే విజయం సాధించాయి. -
‘గగన్‌యాన్’ సాధ్యమే!
చెన్నై: 2022 నాటికి అంతరిక్షంలోకి భారత వ్యోమగామిని పంపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) చైర్మన్ కె. శివన్ వెల్లడించారు. జీఎస్ఎల్వీ మార్క్–3 వాహకనౌక ద్వారా చేపట్టబోయే ఈ ప్రయోగం ద్వారా వారం రోజుల పాటు మానవుడిని అంతరిక్షంలో ఉంచుతామని చెప్పారు. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టుకు రూ.10వేల కోట్లకంటే తక్కువ వ్యయమే అవుతుందని తెలిపారు. ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోదీ మానవ సహిత యాత్ర ‘గగన్‌యాన్’ గురించి ప్రకటన చేసిన నేపథ్యంలో శివన్ మీడియాతో మాట్లాడారు. ‘‘జీఎస్ఎల్వి మార్క్–3 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. భూమి నుంచి 300– 400 కిలోమీటర్ల ఎత్తు వరకు రాకెట్ ప్రయాణిస్తుంది. ఈ ప్రయోగానికి ముందు రెండు మానవ రహిత స్పేస్ క్రాప్ట్‌లను పంపుతాం. రూ.10వేల కోట్ల కన్నా తక్కువ వ్యయంతోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ప్రమాద సమయంలో వ్యోమగాములను సురక్షితంగా నేలకు దించే క్రూ మోడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్‌లను ఇది వరకే పరీక్షించాం. వ్యోమగామికి లైఫ్ సపోర్ట్ సిస్టమ్, స్పేస్ సూట్ లాంటి వాటిని తయారుచేసే దశలో ఉన్నాం. అంతరిక్షంలోకి పంపే వ్యోమగామిని వాయుసేన ఎంపిక చేస్తుంది’ అని అన్నారు. -
భవిష్యత్తు ప్రమాదం నుంచి భూమిని కాపాడిన నాసా
భూమిని ఏదో ఒకరోజు ఢీ కొట్టే అవకాశం ఉన్న ఓ ఉల్కను నాసా పేల్చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ రోబోటిక్ హంటర్ ను కార్నివల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి గురువారం ప్రయోగించింది. ఈ ఉల్క పేరును బెన్నుగా తెలిపిన నాసా.. ముక్కలైన బెన్నుపై జీవిజాడల కోసం అన్వేషణ చేపట్టినట్లు తెలిపింది. ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి బెన్ను భూమికి చేరువగా వస్తుందని పేర్కొంది. ఈ ప్రక్రియలో వచ్చే 150 ఏళ్లలో బెన్ను భూమికి అతి చేరువగా వచ్చి ఢీ కొట్టే అవకాశం ఉందని తెలిపింది. ఈ కారణంగానే ఒసిరిస్-రెక్స్ అంతరిక్ష నౌకని ప్రయోగించి ఉల్కను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. బెన్ను భూమిని ఢీ కొట్టకపోయినా.. మానవజాతికి హాని తలపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పింది. బెన్నుతో పాటు పెద్ద సంఖ్యలో ఉల్కలు భూమికి చేరువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. బెన్నుని ధ్వంసం చేయడం వల్ల వాటిపై కూడా పరిశోధనలు చేసే అవకాశం ఏర్పడిందని తెలిపింది. -
అంతరిక్ష కార్యక్రమ పితామహుడు?
1. భారతదేశ తొలి రాకెట్‌ను ఎక్కడి నుంచి, ఎప్పుడు ప్రయోగించారు? తుంబ ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్, నవంబరు 21, 1963 2. పీఎస్ఎల్వీ ఎన్ని దశల అంతరిక్ష నౌక? నాలుగు దశలు 3. పీఎస్ఎల్వీ-సీ19 ద్వారా ప్రయోగించిన భారీ ఉపగ్రహం? రీశాట్ 4. ఇస్రో శాటిలైట్ సెంటర్ ఎక్కడ ఉంది? బెంగళూరు 5. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు? విక్రం సారాభాయి 6. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఎన్ని రాకెట్ లాంచింగ్ ప్యాడ్లు ఉన్నాయి? రెండు 7. ఇస్రో ఇటీవల నౌకా దళం కోసం ప్రత్యేకంగా ప్రయోగించిన ఉపగ్రహం? జీశాట్ 7 8. పౌర విమానయాన నావిగేషన్ కోసం ఇస్రో ప్రయోగించిన నావిగేషన్ వ్యవస్థ? గగన్ (జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటేటెడ్ నావిగేషన్) 9. ఏ దేశం క్వాసీజెనిత్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టంను అభివృద్ధి చేస్తోంది? జపాన్ 10. విక్రం సారాభాయి అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది? బెంగళూరు 11. యూత్‌శాట్ అనే ఉపగ్రహాన్ని ఇస్రో ఏ దేశం సహకారంతో అభివృద్ధి చేసింది? రష్యా 12. అంగారకుడిపై మార్స ఆర్బిటార్ మిషన్ (మంగళయాన్)ను ప్రయోగించిన నౌక? పీఎస్ఎల్వీ- సీ25 13. ఇస్రో పీఎస్ఎల్వీ - సీ21 ద్వారా ప్రయోగించిన స్పాట్-6 అనే ఉపగ్రహం ఏ దేశానికి చెందింది? ఫ్రాన్స 14. ఏ నౌక ప్రయోగం ద్వారా ఇస్రో విజయవంతంగా క్రయోజనిక్ దశను ప్రయోగించింది? జీఎస్ఎల్వీ - డీ5 15. నేషనల్ అట్మాస్ఫెరిక్ రీసెర్చ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది? గాదంకి (తిరుపతి) 16. దేశీయ క్రయోజనిక్ దశను అభివృద్ధి చేసిన కేంద్రం? లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టం సెంటర్ 17. ఇప్పటివరకూ ఇస్రో ఎన్ని పీఎస్ఎల్వీ నౌకలను ప్రయోగించింది? ఇరవై ఐదు 18. ఇప్పటివరకూ ఇస్రో ఎన్ని పీఎస్ఎల్వీ నౌకలను విజయవంతంగా ప్రయోగించింది? ఇరవై నాలుగు 19. ఇప్పటివరకూ ఇస్రో ఎన్ని జీఎస్ఎల్వీ నౌకలను ప్రయోగించింది. అందులో ఎన్ని విజయం సాధించాయి? ఎనిమిది, ఐదు 20. ఇప్పటివరకూ పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించిన అత్యంత భారీ ఉపగ్రహాలు? రీశాట్1 (1858 కిలోలు) 21. చంద్రయాన్-1ను ఇస్రో ఎప్పుడు ప్రయోగించింది? అక్టోబరు 22, 2008 22. ఇండియన్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ ఎక్కడుంది? బెంగళూరు 23. ఆసియాలోనే తొలిసారిగా ఏర్పాటైన అంతరిక్ష విశ్వవిద్యాలయం? తిరువనంతపురంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స అండ్ టెక్నాలజీ 24. 4500-5000 కిలోల బరువున్న కమ్యూనికేషన్ ఉపగ్రహాలను సైతం అంతరిక్షంలోకి మోసుకెళ్లే అత్యాధునిక భారత అంతరిక్ష నౌక? జీఎస్ఎల్వీ మార్క-3 25. స్పేస్ అప్లికేషన్స సెంటర్ ఎక్కడుంది? అహ్మదాబాద్ 26. త్వరలో పీఎస్ఎల్వీ ద్వారా ఇస్రో ప్రయోగించనున్న నావిగేషన్ ఉపగ్రహం? ఐఆర్ఎన్ఎస్ఎస్-1బి 27. రష్యాకు చెందిన జీపీఎస్ వ్యవస్థ? GLONASS 28. గెలీలియో అనే జీపీఎస్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది? యూరోపియన్ యూనియన్ 29. సౌర వ్యవస్థ అంచులు దాటి వెళ్లిన నాసా ఉపగ్రహాలు? వాయేజర్ 1, 2 30. అమెరికా జీపీఎస్ వ్యవస్థలో మొత్తం ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి? ఇరవై నాలుగు 31. భారత జీపీఎస్ వ్యవస్థ ఐఆర్ఎన్ఎస్ఎస్ (ఇండియన్ రీజినల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్)లో ఎన్ని ఉపగ్రహాలు ఉంటాయి? ఏడు 32. భారత్ త్వరలో ప్రయోగించనున్న ఖగోళశాస్త్ర ఉపగ్రహం ఏదీ? ఆస్ట్రోశాట్ 33. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఎక్కడ ఉంది? డెహ్రాడూన్ 34. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ 35. ఒకేసారి పది ఉపగ్రహాలను ప్రయోగించిన ఇస్రో నౌక? పీఎస్ఎల్వీ-సీ9 36. ఏ దేశంతో కలిసి ఇస్రో మేఘట్రాపిక్స్ ఉపగ్రహాన్ని నిర్మించింది? ఫ్రాన్స 37. సరళ్ ఉపగ్రహాన్ని ఇస్రో పీఎస్ఎల్వీ- సీ-20 ద్వారా ఎప్పుడు ప్రయోగించింది? ఫిబ్రవరి 25, 2013 38. ఐఆర్ఎన్ఎస్ఎస్-ఐఅ ఉపగ్రహాన్ని ఇస్రో ఎప్పుడు ప్రయోగించింది? జూలై 1, 2013 (పీఎస్ఎల్వీ-సీ22 ద్వారా) 39. చంద్రయాన్-1లోని అమెరికాకు చెందిన ఏ పరికరం తొలిసారిగా చంద్రుడిపై నీటిజాడలు కనుగొన్నది? మూన్ మినరాలజికల్ మ్యాపర్ (క3) 40. చంద్రునిపై చంద్రయాన్-1ను చేర్చిన భారత పరికరం? మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ (ఇది భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది) 41. నార్త ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎన్ఈఎస్ఏసీ) ఎక్కడుంది? యుమియం (మేఘాలయ) 42. ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్ ఎక్కడ ఉంది? తిరువనంతపురం 43. రష్యాకు చెందిన ఏ సంస్థ నుంచి ఇస్రో క్రయోజనిక్ ఇంజిన్లను పొందింది? గ్లావ్‌కాస్మోస్ 44. ఇస్రో వాణిజ్య విభాగం ఆన్ట్రిక్స్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బెంగళూరు 45. ఫిజికల్ రీసెర్చ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది? అహ్మదాబాద్ 46. అంగారకుడి లాంటి నిర్జీవ గ్రహంపై మానవ చర్యల ద్వారా జీవుల నివాసయోగ్యంగా మార్చే ప్రక్రియ? టెర్రా ఫార్మింగ్ 47. చంద్రునిపై కగుయా అంతరిక్ష కార్యక్రమాన్ని నిర్వహించిన దేశం? జపాన్ 48. ఇస్రో ప్రయోగించిన ఎక్స్-శాట్ అనే ఉపగ్రహం ఏ దేశానికి చెందింది? సింగపూర్ 49. జెట్ ప్రొపల్షన్ ల్యాబోరేటరీ ఏ అంతరిక్ష సంస్థకు చెందింది? నాసా 50. మంగళయాన్‌లో ఇస్రో మొత్తం ఎన్ని అంగారక అన్వేషణ పరికరాలను ప్రయోగించింది? ఐదు 51. మార్స ఆర్బిటార్ మిషన్ (మంగళయాన్) ఉపగ్రహం బరువు? 1337 కిలోలు 52. మొదటి పీఎస్ఎల్వీ ప్రయోగాన్ని ఎప్పుడు నిర్వహించారు? సెప్టెంబరు 20, 1993 53. ఇప్పటివరకు వివిధ అంతరిక్ష సంస్థలు నిర్వహించిన 51 అంగారక ప్రయోగాల్లో విజయవంతమైనవి ఎన్ని? ఇరవై ఒకటి 54. అంగారకుడి ఉపగ్రహం ఫోబోస్ పైకి ఏ దేశం ప్రయోగించిన ఫోబోస్ గ్రాంట్ మిషన్ విఫలమైంది? రష్యా 55. వాయేజర్ - 1, వాయేజర్ - 2 ఉపగ్రహాలను నాసా ఎప్పుడు ప్రయోగించింది? 1977 56. జీఎస్ఎల్వీలోని క్రయోజనిక్ ఇంజిన్‌లో వాడే ఇంధనం? ద్రవ హైడ్రోజన్ 57. టెలిమెడిసిన్ కార్యక్రమాన్ని పెలైట్ ప్రాజెక్ట్‌గా ఇస్రో ఎప్పడు ప్రారంభించింది? 2001 58. ఇస్రో టెలిమెట్రి ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క (ఐఎస్టీఆర్ఏసీ) ఎక్కడుంది? బెంగళూరు 59. సుదూర రోదసిలోకి ప్రయోగించిన చంద్రయాన్-1, మంగళయాన్ లాంటి ఉపగ్రహాల నుంచి సమాచారాన్ని అందుకునే లక్ష్యంతో భారీ యాంటెన్నాల సముదాయం, డీప్ స్పేస్ నెట్వర్క (డీఎస్ఎన్) ను ఇస్రో ఎక్కడ ఏర్పాటు చేసింది? బెంగళూరు సమీపంలోని బైలాలు గ్రామంలో 60. అంతరిక్ష సంఘం, అంతరిక్ష విభాగం ఎప్పుడు ఏర్పాటయ్యాయి? 1972 61. దేశంలో ఎక్కడెక్కడ ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ సేవా కేంద్రాలను ఇస్రో ఏర్పాటు చేసింది? డెహ్రాడూన్, జోధ్‌పూర్, నాగ్‌పూర్, ఖరగ్‌పూర్, బెంగళూరు 62. డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్స యూనిట్ ఎక్కడుంది? అహ్మదాబాద్ 63. 1962లో అంతరిక్ష పరిశోధన కోసం తొలిసారిగా ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ (ఐఎన్సీఓఎస్పీఏఆర్) ఏ విభాగంలో ఏర్పాటైంది? అణుశక్తి విభాగం 64. అంతరిక్ష విభాగం ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? నేరుగా ప్రధాన మంత్రి ఆధ్వర్యంలో 65. జీఎస్ఎల్వీ-డీ5 ద్వారా జీశాట్-14 ఉపగ్రహాన్ని ఇస్రో ఎప్పుడు విజయవంతంగా ప్రయోగించింది? జనవరి 5, 2014 66. జీశాట్-14 బరువు? 1982 కిలోలు 67. జీఎస్ఎల్వీ మొదటి ప్రయోగం ఎప్పుడు నిర్వహించారు. ఏప్రిల్ 18, 2001 (జీఎస్ఎల్వీ - డీ1) 68. నావిగేషనల్ శాటిలైట్ సిస్టంలో భాగంగా ఇస్రో ప్రయోగించిన మొదటి ఉపగ్రహం? ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎ (బరువు 1425 కిలోలు) 69. జుగ్ను ఉపగ్రహాన్ని ఏ ఐఐటీ నిర్మించింది? ఐఐటీ కాన్పూర్ 70. ఇస్రో ప్రయోగించిన టెక్సర్ ఉపగ్రహం ఏ దేశానికి చెందింది? ఇజ్రాయిల్ 71. ఇస్రో 2007లో నిర్వహించిన మొదటి రీ ఎంట్రీ ఉపగ్రహ ప్రయోగం? స్పేస్ రికవరీ ఎక్స్పెరిమెంట్-1 (ఎస్ఆర్ఈ-1) 72. ఏ దేశ సహకారంతో ఇస్రో సరళ్ (శాటిలైట్ ఫర్ ఆర్గోస్-3 అండ్ అల్టికా) రూపొందించింది? ఫ్రాన్స 73. ఐఆర్ఎస్-పీ5 అని ఏ ఉపగ్రహాన్ని పిలుస్తారు? కార్టోశాట్-1 74. టెలికమ్యూనికేషన్స ఉపగ్రహాల్లోని ప్రధాన ఎలక్ట్రానిక్ పరికరాలు? ట్రాన్‌సపాండర్లు 75. బీడో నావిగేషనల్ శాటిలైట్ సిస్టంను అభివృద్ధి చేస్తున్న దేశం? చైనా 76. భారత భూభాగం నుంచి అన్ని వైపులా ఎన్ని కిలోమీటర్ల దూరం వరకు ఐఆర్ఎన్ఎస్ఎస్ వ్యవస్థ పనిచేస్తుంది? 1500 కి.మీ.