భవిష్యత్తు ప్రమాదం నుంచి భూమిని కాపాడిన నాసా | Spacecraft sent to asteroid to try and stop armageddon | Sakshi
Sakshi News home page

భవిష్యత్తు ప్రమాదం నుంచి భూమిని కాపాడిన నాసా

Published Sat, Sep 10 2016 5:14 PM | Last Updated on Wed, Apr 3 2019 3:55 PM

భవిష్యత్తు ప్రమాదం నుంచి భూమిని కాపాడిన నాసా - Sakshi

భవిష్యత్తు ప్రమాదం నుంచి భూమిని కాపాడిన నాసా

భూమిని ఏదో ఒకరోజు ఢీ కొట్టే అవకాశం ఉన్న ఓ ఉల్కను నాసా పేల్చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ రోబోటిక్ హంటర్ ను కార్నివల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి గురువారం ప్రయోగించింది. ఈ ఉల్క పేరును బెన్నుగా తెలిపిన నాసా.. ముక్కలైన బెన్నుపై జీవిజాడల కోసం అన్వేషణ చేపట్టినట్లు తెలిపింది. ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి బెన్ను భూమికి చేరువగా వస్తుందని పేర్కొంది.

ఈ ప్రక్రియలో వచ్చే 150 ఏళ్లలో బెన్ను భూమికి అతి చేరువగా వచ్చి ఢీ కొట్టే అవకాశం ఉందని తెలిపింది. ఈ కారణంగానే ఒసిరిస్-రెక్స్ అంతరిక్ష నౌకని ప్రయోగించి ఉల్కను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. బెన్ను భూమిని ఢీ కొట్టకపోయినా.. మానవజాతికి హాని తలపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పింది. బెన్నుతో పాటు పెద్ద సంఖ్యలో ఉల్కలు భూమికి చేరువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. బెన్నుని ధ్వంసం చేయడం వల్ల వాటిపై కూడా పరిశోధనలు చేసే అవకాశం ఏర్పడిందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement