photo credit: BBC
పిట్స్‌బర్గ్: అమెరికాకు చెందిన ఆస్ట్రోబోటిక్స్ కంపెనీ పంపిన పెరిగ్రైన్ వ్యోమనౌక చంద్రునిపై సాధారణ ల్యాండింగ్(సాఫ్ట్ ల్యాండ్) అయ్యే అవకాశాలు దాదాపు లేనట్లేనని తేలిపోయింది. ఈ విషయాన్ని ఆస్ట్రోబోటిక్స్ కంపెనీ మంగళవారం ప్రకటించింది. నింగిలోకి ఎగిరిన కొద్ది గంటలకే వ్యోమనౌకకు చెందిన ప్రొపెల్లెంట్‌లోని ఇంధనం లీక్ అవడమే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది.
ఫ్లోరిడాలోని కేప్ కెనరావల్ అంతరిక్ష కేంద్రం నుంచి సోమవారం పెరిగ్రైన్‌ను నింగిలోకి పంపారు. నింగిలోకి పంపినపుడు తొలుత వ్యోమనౌక ప్రయాణం బాగానే జరిగినప్పటికీ తర్వాత దాని సోలార్ ప్యానెళ్లు సూర్యునికి సరైన కోణంలోకి రాకపోవడం వల్ల బ్యాటరీల్లోని ఇంధనం ఒక్కసారిగా ఖాళీ అయింది.దీంతో అది నియంత్రణను కోల్పోయింది.అయితే అందులో మరో 40 గంటల ఇంధనం మిగిలి ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. అన్నీ సజావుగా జరిగితే ఫిబ్రవరిలో పెరిగ్రైన్ చంద్రునిపై ల్యాండ్ అవ్వాల్సి ఉంది.
ప్రఖ్యాత ఏవియేషన్ కంపెనీలు బోయింగ్, లాక్‌హిడ్ మార్టిన్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన వల్కన్ రాకెట్ ద్వారా పెరిగ్రైన్ ల్యాండర్‌ను చంద్రునిపైకి పంపారు. మరోవైపు చంద్రునిపైకి నాసా తలబెట్టిన ఆర్టెమిస్ మిషన్ కూడా వాయిదా పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మిషన్‌కు అవసరమైన కొన్ని పరికరాల సరఫరా ఆలస్యమవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.
ఇదీచదవండి.. మాల్దీవుల వివాదం..భారత్‌పై చైనా మీడియా సంచలన కథనాలు
Comments
Please login to add a commentAdd a comment