అంతరిక్ష కార్యక్రమ పితామహుడు? | The spacecraft program? | Sakshi
Sakshi News home page

అంతరిక్ష కార్యక్రమ పితామహుడు?

Published Sat, Mar 15 2014 11:00 PM | Last Updated on Sat, Sep 2 2017 4:45 AM

The spacecraft program?

1.    భారతదేశ తొలి రాకెట్‌ను ఎక్కడి నుంచి, ఎప్పుడు ప్రయోగించారు?
     తుంబ ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్, నవంబరు 21, 1963

 2.    పీఎస్‌ఎల్‌వీ ఎన్ని దశల అంతరిక్ష నౌక?
     నాలుగు దశలు

 3.    పీఎస్‌ఎల్‌వీ-సీ19 ద్వారా ప్రయోగించిన భారీ ఉపగ్రహం?
     రీశాట్

 4.    ఇస్రో శాటిలైట్ సెంటర్ ఎక్కడ ఉంది?
     బెంగళూరు

 5.    భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు?
     విక్రం సారాభాయి

 6.    సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఎన్ని రాకెట్ లాంచింగ్ ప్యాడ్‌లు ఉన్నాయి?
     రెండు

 7.    ఇస్రో ఇటీవల నౌకా దళం కోసం ప్రత్యేకంగా ప్రయోగించిన ఉపగ్రహం?
     జీశాట్ 7

 8.    పౌర విమానయాన నావిగేషన్ కోసం ఇస్రో ప్రయోగించిన నావిగేషన్ వ్యవస్థ?
     గగన్ (జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటేటెడ్ నావిగేషన్)

 9.    ఏ దేశం క్వాసీజెనిత్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టంను అభివృద్ధి చేస్తోంది?
     జపాన్

 10.    విక్రం సారాభాయి అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది?
     బెంగళూరు

 11.    యూత్‌శాట్ అనే ఉపగ్రహాన్ని ఇస్రో ఏ దేశం సహకారంతో అభివృద్ధి చేసింది?
     రష్యా

 12.    అంగారకుడిపై మార్‌‌స ఆర్బిటార్ మిషన్ (మంగళయాన్)ను ప్రయోగించిన నౌక?
     పీఎస్‌ఎల్‌వీ- సీ25

 13.    ఇస్రో పీఎస్‌ఎల్‌వీ - సీ21 ద్వారా ప్రయోగించిన స్పాట్-6 అనే ఉపగ్రహం ఏ దేశానికి చెందింది?
     ఫ్రాన్‌‌స

 14.    ఏ నౌక ప్రయోగం ద్వారా ఇస్రో విజయవంతంగా క్రయోజనిక్ దశను ప్రయోగించింది?
     జీఎస్‌ఎల్‌వీ - డీ5

 15.    నేషనల్ అట్మాస్ఫెరిక్ రీసెర్‌‌చ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది?
     గాదంకి (తిరుపతి)

 16.    దేశీయ క్రయోజనిక్ దశను అభివృద్ధి చేసిన కేంద్రం?
     లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టం సెంటర్

 17.    ఇప్పటివరకూ ఇస్రో ఎన్ని పీఎస్‌ఎల్‌వీ నౌకలను ప్రయోగించింది?
     ఇరవై ఐదు

 18.    ఇప్పటివరకూ ఇస్రో ఎన్ని పీఎస్‌ఎల్‌వీ నౌకలను విజయవంతంగా ప్రయోగించింది?
     ఇరవై నాలుగు

 19.    ఇప్పటివరకూ ఇస్రో ఎన్ని జీఎస్‌ఎల్‌వీ నౌకలను ప్రయోగించింది. అందులో ఎన్ని విజయం సాధించాయి?
     ఎనిమిది, ఐదు

 20.    ఇప్పటివరకూ పీఎస్‌ఎల్‌వీ ద్వారా ప్రయోగించిన అత్యంత భారీ ఉపగ్రహాలు?
     రీశాట్1 (1858 కిలోలు)

 21.    చంద్రయాన్-1ను ఇస్రో ఎప్పుడు ప్రయోగించింది?
     అక్టోబరు 22, 2008

 22.    ఇండియన్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ ఎక్కడుంది?
     బెంగళూరు

 23.    ఆసియాలోనే తొలిసారిగా ఏర్పాటైన అంతరిక్ష విశ్వవిద్యాలయం?
     తిరువనంతపురంలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్‌‌స అండ్ టెక్నాలజీ

 24.    4500-5000 కిలోల బరువున్న కమ్యూనికేషన్ ఉపగ్రహాలను సైతం అంతరిక్షంలోకి మోసుకెళ్లే అత్యాధునిక భారత అంతరిక్ష నౌక?
     జీఎస్‌ఎల్‌వీ మార్‌‌క-3

 25.    స్పేస్ అప్లికేషన్‌‌స సెంటర్ ఎక్కడుంది?
     అహ్మదాబాద్

 26.    త్వరలో పీఎస్‌ఎల్‌వీ ద్వారా ఇస్రో ప్రయోగించనున్న నావిగేషన్ ఉపగ్రహం?
     ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బి

 27.    రష్యాకు చెందిన జీపీఎస్ వ్యవస్థ?
     GLONASS

 28.    గెలీలియో అనే జీపీఎస్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది?
     యూరోపియన్ యూనియన్

 29.    సౌర వ్యవస్థ అంచులు దాటి వెళ్లిన నాసా ఉపగ్రహాలు?
     వాయేజర్ 1, 2

 30.    అమెరికా జీపీఎస్ వ్యవస్థలో మొత్తం ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి?
     ఇరవై నాలుగు

 31.    భారత జీపీఎస్ వ్యవస్థ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ (ఇండియన్ రీజినల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్)లో ఎన్ని ఉపగ్రహాలు ఉంటాయి?
     ఏడు

 32.    భారత్ త్వరలో ప్రయోగించనున్న ఖగోళశాస్త్ర ఉపగ్రహం ఏదీ?
     ఆస్ట్రోశాట్

 33.    ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఎక్కడ ఉంది?
     డెహ్రాడూన్

 34.    నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎక్కడ ఉంది?
     హైదరాబాద్

 35.    ఒకేసారి పది ఉపగ్రహాలను ప్రయోగించిన ఇస్రో నౌక?
     పీఎస్‌ఎల్‌వీ-సీ9

 36.    ఏ దేశంతో కలిసి ఇస్రో మేఘట్రాపిక్స్ ఉపగ్రహాన్ని నిర్మించింది?
     ఫ్రాన్‌‌స

 37.    సరళ్ ఉపగ్రహాన్ని ఇస్రో పీఎస్‌ఎల్‌వీ- సీ-20 ద్వారా ఎప్పుడు ప్రయోగించింది?
     ఫిబ్రవరి 25, 2013

 38.    ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-ఐఅ ఉపగ్రహాన్ని ఇస్రో ఎప్పుడు ప్రయోగించింది?
     జూలై 1, 2013 (పీఎస్‌ఎల్‌వీ-సీ22 ద్వారా)

 39.    చంద్రయాన్-1లోని అమెరికాకు చెందిన ఏ పరికరం తొలిసారిగా చంద్రుడిపై నీటిజాడలు కనుగొన్నది?
     మూన్ మినరాలజికల్ మ్యాపర్ (క3)

 40.    చంద్రునిపై చంద్రయాన్-1ను చేర్చిన భారత పరికరం?
     మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ (ఇది భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది)

 41.    నార్‌‌త ఈస్ట్ స్పేస్ అప్లికేషన్  సెంటర్ (ఎన్‌ఈఎస్‌ఏసీ) ఎక్కడుంది?
     యుమియం (మేఘాలయ)

 42.    ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్ ఎక్కడ ఉంది?
     తిరువనంతపురం

 43.    రష్యాకు చెందిన ఏ సంస్థ నుంచి ఇస్రో క్రయోజనిక్ ఇంజిన్లను పొందింది?
     గ్లావ్‌కాస్మోస్

 44.    ఇస్రో వాణిజ్య విభాగం ఆన్‌ట్రిక్స్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
     బెంగళూరు

 45.    ఫిజికల్ రీసెర్‌‌చ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది?
     అహ్మదాబాద్

 46.    అంగారకుడి లాంటి నిర్జీవ గ్రహంపై మానవ చర్యల ద్వారా జీవుల నివాసయోగ్యంగా మార్చే ప్రక్రియ?
     టెర్రా ఫార్మింగ్

 47.    చంద్రునిపై కగుయా అంతరిక్ష కార్యక్రమాన్ని  నిర్వహించిన దేశం?
     జపాన్

 48.    ఇస్రో ప్రయోగించిన ఎక్స్-శాట్ అనే ఉపగ్రహం ఏ దేశానికి చెందింది?
     సింగపూర్

 49.    జెట్ ప్రొపల్షన్ ల్యాబోరేటరీ ఏ అంతరిక్ష సంస్థకు చెందింది?
     నాసా
 50.    మంగళయాన్‌లో ఇస్రో మొత్తం ఎన్ని అంగారక అన్వేషణ పరికరాలను ప్రయోగించింది?
     ఐదు

 51.    మార్‌‌స ఆర్బిటార్ మిషన్ (మంగళయాన్) ఉపగ్రహం బరువు?
     1337 కిలోలు

 52.    మొదటి పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాన్ని ఎప్పుడు నిర్వహించారు?
     సెప్టెంబరు 20, 1993

 53.    ఇప్పటివరకు వివిధ అంతరిక్ష సంస్థలు నిర్వహించిన 51 అంగారక ప్రయోగాల్లో విజయవంతమైనవి ఎన్ని?
     ఇరవై ఒకటి

 54.    అంగారకుడి ఉపగ్రహం ఫోబోస్ పైకి ఏ దేశం ప్రయోగించిన ఫోబోస్ గ్రాంట్ మిషన్ విఫలమైంది?
     రష్యా

 55.    వాయేజర్ - 1, వాయేజర్ - 2 ఉపగ్రహాలను నాసా ఎప్పుడు ప్రయోగించింది?
     1977

 56.    జీఎస్‌ఎల్‌వీలోని క్రయోజనిక్ ఇంజిన్‌లో వాడే ఇంధనం?
     ద్రవ హైడ్రోజన్

 57.    టెలిమెడిసిన్ కార్యక్రమాన్ని పెలైట్ ప్రాజెక్ట్‌గా ఇస్రో ఎప్పడు ప్రారంభించింది?
     2001

 58.    ఇస్రో టెలిమెట్రి ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్‌‌క (ఐఎస్‌టీఆర్‌ఏసీ) ఎక్కడుంది?
     బెంగళూరు

 59.    సుదూర రోదసిలోకి ప్రయోగించిన చంద్రయాన్-1, మంగళయాన్ లాంటి ఉపగ్రహాల నుంచి సమాచారాన్ని అందుకునే లక్ష్యంతో భారీ యాంటెన్నాల సముదాయం, డీప్ స్పేస్ నెట్‌వర్‌‌క (డీఎస్‌ఎన్) ను ఇస్రో ఎక్కడ ఏర్పాటు చేసింది?
     బెంగళూరు సమీపంలోని బైలాలు గ్రామంలో

 60.    అంతరిక్ష సంఘం, అంతరిక్ష విభాగం ఎప్పుడు ఏర్పాటయ్యాయి?
     1972

 61.    దేశంలో ఎక్కడెక్కడ ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ సేవా కేంద్రాలను ఇస్రో ఏర్పాటు చేసింది?
     డెహ్రాడూన్, జోధ్‌పూర్, నాగ్‌పూర్, ఖరగ్‌పూర్, బెంగళూరు

 62.    డెవలప్‌మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్‌‌స యూనిట్ ఎక్కడుంది?
     అహ్మదాబాద్
 63.    1962లో అంతరిక్ష పరిశోధన కోసం తొలిసారిగా ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్‌‌చ (ఐఎన్‌సీఓఎస్‌పీఏఆర్) ఏ విభాగంలో ఏర్పాటైంది?
     అణుశక్తి విభాగం

 64.    అంతరిక్ష విభాగం ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది?
     నేరుగా ప్రధాన మంత్రి ఆధ్వర్యంలో

 65.    జీఎస్‌ఎల్‌వీ-డీ5 ద్వారా జీశాట్-14 ఉపగ్రహాన్ని ఇస్రో ఎప్పుడు విజయవంతంగా ప్రయోగించింది?
     జనవరి 5, 2014

 66.    జీశాట్-14 బరువు?
     1982 కిలోలు

 67.    జీఎస్‌ఎల్‌వీ మొదటి ప్రయోగం ఎప్పుడు నిర్వహించారు.
     ఏప్రిల్ 18, 2001 (జీఎస్‌ఎల్‌వీ - డీ1)

 68.    నావిగేషనల్ శాటిలైట్ సిస్టంలో భాగంగా ఇస్రో ప్రయోగించిన మొదటి ఉపగ్రహం?
     ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ (బరువు 1425 కిలోలు)

 69.    జుగ్ను ఉపగ్రహాన్ని ఏ ఐఐటీ నిర్మించింది?
     ఐఐటీ కాన్పూర్

 70.    ఇస్రో ప్రయోగించిన టెక్సర్ ఉపగ్రహం ఏ దేశానికి చెందింది?
     ఇజ్రాయిల్

 71.    ఇస్రో 2007లో నిర్వహించిన మొదటి రీ ఎంట్రీ ఉపగ్రహ ప్రయోగం?
     స్పేస్ రికవరీ ఎక్స్‌పెరిమెంట్-1 (ఎస్‌ఆర్‌ఈ-1)

 72.    ఏ దేశ సహకారంతో ఇస్రో సరళ్ (శాటిలైట్ ఫర్ ఆర్గోస్-3 అండ్ అల్టికా) రూపొందించింది?
     ఫ్రాన్‌‌స

 73.    ఐఆర్‌ఎస్-పీ5 అని ఏ ఉపగ్రహాన్ని పిలుస్తారు?
     కార్టోశాట్-1

 74.    టెలికమ్యూనికేషన్‌‌స ఉపగ్రహాల్లోని ప్రధాన ఎలక్ట్రానిక్ పరికరాలు?
     ట్రాన్‌‌సపాండర్లు

 75.    బీడో నావిగేషనల్ శాటిలైట్ సిస్టంను అభివృద్ధి చేస్తున్న దేశం?
     చైనా

 76.    భారత భూభాగం నుంచి అన్ని వైపులా ఎన్ని కిలోమీటర్ల దూరం వరకు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ వ్యవస్థ పనిచేస్తుంది?
     1500 కి.మీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement