చైనా కార్గో వ్యోమనౌక ప్రయోగం విజయవంతం | China launches the Tianzhou-5 cargo spacecraft | Sakshi
Sakshi News home page

చైనా కార్గో వ్యోమనౌక ప్రయోగం విజయవంతం

Published Sun, Nov 13 2022 5:59 AM | Last Updated on Sun, Nov 13 2022 5:59 AM

China launches the Tianzhou-5 cargo spacecraft - Sakshi

బీజింగ్‌: చైనా తాను సొంతంగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రానికి అవసరమయ్యే సామాగ్రిని పంపడం కోసం ప్రయోగించిన కార్గో వ్యోమనౌక టియాన్‌జూ–5 విజయవంతంగా నింగిలోకి దూసుకుపోయింది.

హైనన్‌ దీవుల్లోని వెన్‌చాంగ్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ లాంచ్‌ సైట్‌ నుంచి ప్రయోగించిన ఈ వ్యోహనౌక నిర్దేశిత కక్ష్యలో ప్రవేశించిందని జిన్‌హువా న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. అంతరిక్ష కేంద్రంలోని డాకింగ్, ఫాస్ట్‌ ఆటోమేటెడ్‌ రెండెజవస్‌ నిర్వహించనుంది. ఈ ఏడాది చివరి నాటికి అంతరిక్ష కేంద్రం నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో చైనా ముందడుగు వేస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement