succeed Rocket
-
ఖండాంతర క్షిపణిని పరీక్షించిన చైనా
బీజింగ్: అమెరికాలోని నగరాలను తాకేంతగా సుదూరాలకు వెళ్లగల సామర్థ్యమున్న ఖండాంతర క్షిపణి(ఐసీబీఎం)ను చైనా విజయవంతంగా పరీక్షించింది. వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలను ప్రపంచానికి చాటే ఉద్దేశంతోనే చైనా ఈ పరీక్ష జరిపిందని అంతర్జాతీయ రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్ర జలాల్లో బుధవారం ఉదయం 8.44 గంటలకు జరిపిన ఈ పరీక్ష తమ ఆయుధ పనితీరు, సైన్యం శిక్షణా సామర్థ్యాలను ప్రదర్శించి నిర్దేశిత లక్ష్యాన్ని చేధించిందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పొరుగు దేశాలు ఆందోళన చెందకుండా ముందే రాకెట్ ప్రయోగించే దిశ, గమ్యం తదితర వివరాలను వారితో చైనా పంచుకుంది. దశాబ్దాల కాలంలో చైనా బహిరంగంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడం ఇదే తొలిసారని చైనా అధికారిక ‘చైనా డైలీ’ వార్తాసంస్థ పేర్కొంది. ఈ క్షిపణి ఎంత దూరం వెళ్తుందో చైనా చెప్పలేదు. ఇది పలు అమెరికా నగరాలనూ తాకగలదని హాంకాంగ్ కేంద్రంగా నడిచే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. -
చైనా కార్గో వ్యోమనౌక ప్రయోగం విజయవంతం
బీజింగ్: చైనా తాను సొంతంగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రానికి అవసరమయ్యే సామాగ్రిని పంపడం కోసం ప్రయోగించిన కార్గో వ్యోమనౌక టియాన్జూ–5 విజయవంతంగా నింగిలోకి దూసుకుపోయింది. హైనన్ దీవుల్లోని వెన్చాంగ్ స్పేస్‌క్రాఫ్ట్ లాంచ్ సైట్ నుంచి ప్రయోగించిన ఈ వ్యోహనౌక నిర్దేశిత కక్ష్యలో ప్రవేశించిందని జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. అంతరిక్ష కేంద్రంలోని డాకింగ్, ఫాస్ట్ ఆటోమేటెడ్ రెండెజవస్ నిర్వహించనుంది. ఈ ఏడాది చివరి నాటికి అంతరిక్ష కేంద్రం నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో చైనా ముందడుగు వేస్తోంది. -
జీ శాట్-16 ప్రయోగం విజయవంతం
బెంగుళూరు : భారత కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-16 ప్రయోగం ఎట్టకేలకు దిగ్విజయంగా జరిగింది. ప్రతికూల వాతావరణం కారణంగా గత రెండు రోజులుగా ఈ ప్రయోగం వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక 2.10 గంటలకు ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్-5 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరిగింది.