కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బంకుర జిల్లా ఇందాస్‌లో టీఎంసీ ఆదివారం నిర్వహించిన ర్యాలీలో విషాదం చోటుచేసుకుంది. ర్యాలీ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న చెట్టుపై పిడుగు పడింది. దీంతో దాని కింద ఉన్న ఓ కార్యకర్త అక్కడికక్కడే కుప్పకూలాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
వర్షం పడుతుండటంతో సభ పక్కనే ఉన్న ఈ చెట్టుకిందకు వెళ్లి కార్యకర్తలు తలదాచుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు పిడుగుపడి చెట్టుకూలిపోవడంతో దాని కింద ఉన్న 25 మంది గాయపడ్డారు. వీరందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
(చదవండి: కేంద్రం కీలక నిర్ణయం: పాక్ నుంచి మెసేజ్‌లు.. ఆ 14 యాప్స్ బ్లాక్)
కాగా.. ఈ ఘటనపై టీఎంసీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చనిపోయిన కార్యకర్త కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపింది. తప్పకుండా సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. గాడపడినవారికి మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పింది. ఈమేరకు ట్వీట్ చేసింది.
ఈ ర్యాలీకి సీఎం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీఎంసీ యుత్ లీడర్ దేవాన్షు భట్టాచార్య ప్రసంగిస్తుండగా పిడుగు ఘటన జరిగింది. దీంతో వేదికపైనే ఉన్న అభిషేక్.. క్షతగాత్రులకు సాయం చేయాలని ఇతర కార్యకర్తలను కోరారు.
చదవండి: మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, వడగళ్ల వానలు: వాతావరణ శాఖ
Comments
Please login to add a commentAdd a comment