Bankura district
-
మాజీ ఎంపీ బాసుదేవ్ ఆచార్య కన్నుమూత: సీఎం మమత సంతాపం
Veteran CPI(M) leader Basudeb Acharia ప్రముఖ సీపీఎం నేత, పశ్చిమ బెంగాల్‌లోని బంకురా నుంచి తొమ్మిది సార్లు ఎంపీగా ఎన్నికైన బాసుదేవ్ ఆచార్య (81) కన్ను మూశారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. దీంతో రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంత కాలంగా ఆయన వృద్ధాప్య కారణాలతో బాధపడుతున్నట్టు సమాచారం. బాసుదేవ్ మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎండీ సెలీమ్ నివాళులర్పించారు. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా లోక్‌సభ నియోజకవర్గానికి 9 సార్లు ఎంపికూ బాసుదేవ్ ఆచార్య బంకురాకు పర్యాయపదంగా నిలిచారు. 1980 నుంచి 2014 వరకు దాదాపు 34 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మున్మున్ సేన్ చేతిలో ఓడిపోయారు. 1942 జూలై 11 న పురూలియాలో జన్మించారు బాసుదేవ్. విద్యార్థి జీవితం నుండి చురుగ్గా ఉంటూ విద్యార్థి నాయకుడిగా, తరువాత కార్మిక నాయకుడిగా ఎదిగారు. అక్కడి గ్రామీణ గిరిజన సంఘం ఉద్యమంలో కీలకభూమికను పోషించారు. పశ్చిమ బెంగాల్ రైల్వే కాంట్రాక్టర్ లేబర్ యూనియన్, LIC ఏజెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, DVC కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ , ఇతరులకు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అనేక పార్లమెంటరీ కమిటీలకు పనిచేసిన ఆచార్య 25 ఏళ్లపాటు రైల్వే స్టాండింగ్ కమిటీలో ఉన్నారు. Saddened at the demise of the veteran Left leader and former MP Basudeb Acharia. He was a trade union leader and Parliamentarian of formidable strength and his departure will cause significant loss in public life. Condolences to his family, friends and colleagues. — Mamata Banerjee (@MamataOfficial) November 13, 2023 -
కేంద్రమంత్రిని గదిలో బంధించిన బీజేపీ కార్యకర్తలు
లక్నో: కేంద్రమంత్రి సుభాష్ సర్కార్‌కు సొంత ఇలాకా అయిన బంకురా జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. జిల్లా రాజకీయాల్లో నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం పార్టీ కార్యకర్తలే ఆయన్ను బీజేపీ కార్యాలయంలో బంధించారు. ఆ గదికి తాళం కూడా వేశారు. కాగా పశ్చిమబెంగాల్లోని బంకుర లోక్‌సభ ఎంపీ ఆయన సుభాష్ ప్రస్తుతం ప్రధాని మోదీ కేబినెట్లో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బంకురాలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం సుభాష్ అధ్యక్షతన మీటింగ్ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో కొందరు బీజేపీ కార్యకర్తలు పెద్దగా నినాదాలు చేస్తూ పార్టీ కార్యాలయంలోకి చొరబడ్డారు. కేంద్ర మంత్రిని గదిలో బంధించి వేసి తాళం వేశారు. విషయం తెలసుకున్న ఆయన మద్దతుదారులు వెంటనే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు భారీగా అక్కడకు చేరుకొని కేంద్రమంత్రిని బయటకు తీసుకొచ్చారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ కార్యకర్త మోహిత్ శర్మ మాట్లాడుతూ.. సుభాష్ సర్కార్ కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. తనకు దగ్గరున్న వారికే జిల్లా కమిటీలో సభ్యులుగా నియమిస్తున్నారని తెలిపారు. దీనిని వ్యతిరేకించిన కొందరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చారని, పార్టీని రక్షించేందుకు నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు. ఆయన అసమర్థత వల్ల ఈసారి బంకుర మున్సిపాలిటీ లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదని తెలిపారు. ఇంతకుముందు రెండు వార్డులను బీజేపీ సొంతం చేసుకుందన్నారు. అలాగే పంచాయతీ ఎన్నికల్లో చాలా స్థానాల్లో కనీసం అభ్యర్థులను నిలబెట్టలేకపోయారని, ఇది సిగ్గుచేటని ఆరోపించారు. ఇక ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సమీక్ భట్టాచార్య స్పందిస్తూ.. క్రమశిక్షణకు మారుపేరైన బీజేపీలో ఇలాంటి ఘటనలు ఆమోదయోగ్యం కాదని అన్నారు. దీనికి పాల్పడిన పార్టీ కార్యకర్తలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటివి ఏవైనా ఫిర్యాదులు ఉంటే.. వాటిని లేవనెత్తడానికి ఓ వేదిక ఉంది. ఈ ఘటనపై విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని’ తెలిపారు. అంతేగాక జిల్లా స్థాయి పార్టీ కార్యకలాపాల్లో సుభాష్ సర్కార్ ప్రమేయం లేదని చెప్పారు. అపార్థాలతో మంత్రిపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి ఇంతవరకు స్పందించలేదు. చదవండి: హర్ష గొయెంకా ట్వీట్.. హాట్ టాపిక్‌గా ఇస్రో చైర్మన్ జీతం.. With each passing day, @BJP4Bengal is crumbling as infighting is reaching its peak! In Bankura, vehement clashes erupted, & BJP workers locked Union Minister Subhas Sarkar in the party office. While unity within the party is a myth, BJP is truly a shining example of a weak… pic.twitter.com/Tu90BpQSZ7 — All India Trinamool Congress (@AITCofficial) September 12, 2023 -
టీఎంసీ ర్యాలీపై పిడుగు.. కార్యకర్త మృతి.. 25 మందికి గాయాలు..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బంకుర జిల్లా ఇందాస్లో టీఎంసీ ఆదివారం నిర్వహించిన ర్యాలీలో విషాదం చోటుచేసుకుంది. ర్యాలీ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న చెట్టుపై పిడుగు పడింది. దీంతో దాని కింద ఉన్న ఓ కార్యకర్త అక్కడికక్కడే కుప్పకూలాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. వర్షం పడుతుండటంతో సభ పక్కనే ఉన్న ఈ చెట్టుకిందకు వెళ్లి కార్యకర్తలు తలదాచుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు పిడుగుపడి చెట్టుకూలిపోవడంతో దాని కింద ఉన్న 25 మంది గాయపడ్డారు. వీరందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. (చదవండి: కేంద్రం కీలక నిర్ణయం: పాక్ నుంచి మెసేజ్‌లు.. ఆ 14 యాప్స్ బ్లాక్) కాగా.. ఈ ఘటనపై టీఎంసీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చనిపోయిన కార్యకర్త కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపింది. తప్పకుండా సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. గాడపడినవారికి మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పింది. ఈమేరకు ట్వీట్ చేసింది. ఈ ర్యాలీకి సీఎం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీఎంసీ యుత్ లీడర్ దేవాన్షు భట్టాచార్య ప్రసంగిస్తుండగా పిడుగు ఘటన జరిగింది. దీంతో వేదికపైనే ఉన్న అభిషేక్.. క్షతగాత్రులకు సాయం చేయాలని ఇతర కార్యకర్తలను కోరారు. చదవండి: మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, వడగళ్ల వానలు: వాతావరణ శాఖ -
మీకోసం ప్రార్థిస్తా.. మరీ ఆ తల్లుల బాధేంటి.. దీదీ?
కోల్కత్తా: పశ్చిమబెంగాల్లో ఎన్నికల వాతావరణం వేడివేడిగా ఉంది. ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై దాడి జరిగిందనే ఘటనతో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ప్రస్తుతం ఆ దాడి చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. మమతా బెనర్జీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జయినా వీల్ చైర్లోనే ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే తొలిసారి మమతపై జరిగిన దాడిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ‘మీ కోలుకోవాలని ప్రార్థిస్తా.. మరీ మావాళ్ల వారి సంగతి ఏంటి?’ అని అమిత్ షా ప్రశ్నించారు. దాడి జరిగిందనే మమతా ఆరోపణలపై అమిత్‌షా గతంలో తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయని వాటిని గుర్తుచేశారు. పశ్చిమ బెంగాల్‌లోని బంకూరలో సోమవారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో అమిత్‌షా మాట్లాడారు. ఎన్నికల సంఘం కూడా చెప్పింది మీపై దాడి జరగలేదని చెప్పారు. మీ కాలి గాయంపై మాకు బాధ ఉంది. కానీ మా 130 మంది కార్యకర్తల తల్లుల బాధ మీకు లేదా అని అమిత్ షా ప్రశ్నించారు. రాజకీయ దాడుల్లో తమ కార్యకర్తలను కోల్పోయామని.. వారి తల్లుల బాధ కనిపించదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఒక స్టంట్ చేస్తున్నారని తృణమూల్ పార్టీపై అమిత్ షా మండిపడ్డారు. కాగా పశ్చిమ బెంగాల్లో 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ మార్చి 27వ తేదీన జరగనుంది. మొత్తం ఫలితాలు మే 2వ తేదీన వెల్లడి కానున్నాయి. -
బంకురలోని డ్యూలీలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
-
బెంగాల్లో యువతులపై యాసిడ్ దాడి
-
వృద్ధుడిని తొక్కి చంపిన ఏనుగులు
కోల్ కతా: ఏనుగులు వృద్ధుడిని తొక్కి చంపిన ఘటన పశ్చిమబెంగాల్ లోని బాంకురా జిల్లా గోకుల్ మాథురా గ్రామంలో జరిగింది. అటవీ ప్రాంతానికి సమీపంలో వెదురు పొద కింద నిద్రిస్తున్న బిశ్వనాథ్ సొరేన్(65) పై 11 ఏనుగులు దాడి చేసి తొక్కి చంపాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. బాజ్రోరా ఫారెస్ట్ రేంజ్ లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదే జిల్లాలో పాంచెట్ అటవీ ప్రాంతంలో గతనెలలో ఫారెస్ట్ గార్డ్ పై ఏనుగులు దాడి చేసి చంపాయి. జాల్ పాయ్ గురి జిల్లాలో ఆదివారం జరిగిన మరొక ఘటనలో ఏనుగు దాడిలో అటవీశాఖ అధికారికి గాయాలయ్యాయి. -
ఏనుగు పైనుంచి వెళ్లిన రైలు
కోల్‌కతా: ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా వన్యమృగ్యాలను మృత్యువు వెంటాడుతూనే ఉంది. తాజాగా పశ్చిమబెంగాల్ లోని బాంకురా జిల్లాలో రైలు ఢీకొని ఓ ఏనుగు మృతి చెందింది. బిష్ణుపూర్ అటవీ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఏనుగు తలపై నుంచి రైలు వెళ్లడంతో అది చనిపోయిందని వెల్లడించారు. ఉత్తర బెంగాల్ లో ఏనుగులు రైళ్ల కింద పడిపోవడం తరచుగా జరుగుతున్నాయి. 2004 నుంచి ఇప్పటివరకు 50పైగా ఏనుగులు ఈవిధంగా మృత్యువాత పడ్డాయి. దక్షిణ బెంగాల్ లో ఇటీవల కాలంలో జరిగిన మొదటి ఘటన ఇదని అధికారులు తెలిపారు.