లక్నో: కేంద్రమంత్రి సుభాష్ సర్కార్‌కు సొంత ఇలాకా అయిన బంకురా జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. జిల్లా రాజకీయాల్లో నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం పార్టీ కార్యకర్తలే ఆయన్ను బీజేపీ కార్యాలయంలో బంధించారు. ఆ గదికి తాళం కూడా వేశారు. కాగా పశ్చిమబెంగాల్‌లోని బంకుర లోక్‌సభ ఎంపీ ఆయన సుభాష్ ప్రస్తుతం ప్రధాని మోదీ కేబినెట్‌లో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బంకురాలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం సుభాష్ అధ్యక్షతన మీటింగ్ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో కొందరు బీజేపీ కార్యకర్తలు పెద్దగా నినాదాలు చేస్తూ పార్టీ కార్యాలయంలోకి చొరబడ్డారు. కేంద్ర మంత్రిని గదిలో బంధించి వేసి తాళం వేశారు. విషయం తెలసుకున్న ఆయన మద్దతుదారులు వెంటనే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు భారీగా అక్కడకు చేరుకొని కేంద్రమంత్రిని బయటకు తీసుకొచ్చారు.
నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ కార్యకర్త మోహిత్ శర్మ మాట్లాడుతూ.. సుభాష్ సర్కార్ కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. తనకు దగ్గరున్న వారికే జిల్లా కమిటీలో సభ్యులుగా నియమిస్తున్నారని తెలిపారు. దీనిని వ్యతిరేకించిన కొందరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చారని, పార్టీని రక్షించేందుకు నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు. ఆయన అసమర్థత వల్ల ఈసారి బంకుర మున్సిపాలిటీ లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదని తెలిపారు. ఇంతకుముందు రెండు వార్డులను బీజేపీ సొంతం చేసుకుందన్నారు. అలాగే పంచాయతీ ఎన్నికల్లో చాలా స్థానాల్లో కనీసం అభ్యర్థులను నిలబెట్టలేకపోయారని, ఇది సిగ్గుచేటని ఆరోపించారు.
ఇక ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సమీక్ భట్టాచార్య స్పందిస్తూ.. క్రమశిక్షణకు మారుపేరైన బీజేపీలో ఇలాంటి ఘటనలు ఆమోదయోగ్యం కాదని అన్నారు. దీనికి పాల్పడిన పార్టీ కార్యకర్తలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటివి ఏవైనా ఫిర్యాదులు ఉంటే.. వాటిని లేవనెత్తడానికి ఓ వేదిక ఉంది. ఈ ఘటనపై విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని’ తెలిపారు. అంతేగాక జిల్లా స్థాయి పార్టీ కార్యకలాపాల్లో సుభాష్ సర్కార్ ప్రమేయం లేదని చెప్పారు. అపార్థాలతో మంత్రిపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి ఇంతవరకు స్పందించలేదు.
చదవండి: హర్ష గొయెంకా ట్వీట్.. హాట్ టాపిక్‌గా ఇస్రో చైర్మన్ జీతం..
With each passing day, @BJP4Bengal is crumbling as infighting is reaching its peak!
In Bankura, vehement clashes erupted, & BJP workers locked Union Minister Subhas Sarkar in the party office.
While unity within the party is a myth, BJP is truly a shining example of a weak… pic.twitter.com/Tu90BpQSZ7
— All India Trinamool Congress (@AITCofficial) September 12, 2023
Comments
Please login to add a commentAdd a comment